Followers
ఇంటింటికి నిత్యావసర వస్తువుల పంపిణీ
తెదేపా నాయకులు కామేష్ చేయూత
మండలంలో కొండకొప్పాక గ్రామంలో తెదేపా నాయకులు 84 వ వార్డ్ ఇంచార్జ్ అరీపు కామేష్ ఆద్యర్యం లో శుక్రవారం పేదలకు సహాయం చేశారు. సుమారు 800 మంది పేదలకు కాయగూరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగాా ఆయ మాట్లాడుతూ కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రపంచం అల్లకల్లోలంగాా అవుతుందన్నారు . ప్రతి ఒక్కరు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీీ. వైస్ ప్రెసిడెంట్ బోయిన మురళి మోహన్ రావు, గోపాలరావు, పాపారావు ,గిరి, హరి, సకలారమణ టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జగన్ ప్రభుత్వంపై ఆర్థికభారం
జగన్ ప్రభుత్వంపై ఆర్థికభారం
-- పరిపాలనలో కరోనా తెచ్చిన అడ్డంకులు
-- అయినా ఆగని సంక్షేమ పథకాలు
-- కష్టకాలంలో ప్రతిపక్షాల విమర్శల రాజకీయాలు
--- భవిష్యత్ పాలన ఎలా ఉంటాది అనేది ఆసక్తి
అనకాపల్లి, పెన్ పవర్ : సాయి రామ్
ముఖ్యమంత్రి జగన్ పరిపాలనపై ఆర్థిక భారం పడింది అంటే ఆశ్చర్యం లేదు. సంక్షేమ పథకాల పెంపు అనే తపనకు కరోనా రూపంలో బ్రేక్ పడింది అనేది వాస్తవం. అయినా ప్రకటించిన సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికైతే కొనసాగిస్తూనే ఉన్నారు. కాని భవిష్యత్తులో ఎలా నెట్టుకువస్తారన్నదె ఇప్పుడు ప్రశ్న. ఇదే సమయంలో ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుడటం కూడా పరిపాలన నిర్వహణ పై ఎలాంటి ప్రభావం చూపుతుందినెది తేలాల్సి ఉంది. నిజానికి జగన్ అధికారం చేపట్టిన అప్పటినుంచి ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అమ్మబడి ,రైతు భరోసా వంటి అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అనతికాలంలోనే ప్రజలకు నగదును అందజేశారు. 8 నెలల పాలనతో గాడిన పడుతున్న సమయంలో జగన్ పరిపాలనా ఆలోచనలకు కరోనా వ్యాధి రూపంలో పెద్ద అవాంతరమే ఏర్పడిందనెది చెప్పొచ్చు.
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఎక్కడెకక్కడ పరిపాలన ఆగిపోయింది. ఎగుమతులు దిగుమతులు లేవు. రవాణా ఎక్కడిది అక్కడే నిలిచిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం లేనే లేదు. ఇది పక్కన పెడితే అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది పెను భారమే అన్నది విశ్లేషకుల మాట. పైగా ప్రస్తుతం పరిపాలన అంతా కరోనా పైనే దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అవసరం కావడంతో నిధులన్నీ దీని నివారణకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కారణంతో అధికారులు ,పరిపాలన విభాగం, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ దీనిపైనే దృష్టి పెట్టారు. మరో ఆలోచనకు అవకాశం లేనంతగా భయాందోళన మధ్య అంతా కొనసాగుతుంది. కేంద్రం దీనికోసమే అంటూ ప్రత్యేకంగా ఇచ్చిన నిధులు ఖర్చయిపోతునే ఉన్నాయి. గ్రామాలు తదితర అభివృద్ధి నిధులు రాష్ట్రానికి రావాల్సిన ఉన్న భవిష్యత్తులో కేంద్రం ఇస్తాదో లేదో తెలియని పరిస్థితి. దీంతో భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి పై ఎలాంటి ప్రభావం పడుతుందో జగన్ దీనిని ఎలా అధిగమిస్తారో చూడాల్సిందే అన్న అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రపంచం అంతా వణికిపోతుంటే ఇక్కడ ప్రతిపక్షాలు రాజకీయాలకు తెర లేపుతుండటం ఇబ్బందికర పరిణామమే. వాళ్లు పెంచే వత్తిడితో ప్రభుత్వం లక్ష్యానికి బదులు పక్కదారి పడితే ప్రజల్లో ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్లు అవుతాది. కరోనా ను ఎదుర్కోవడంలో రాష్ట్రం పై స్థాయిలో నిలిచింది అన్నది గణనీయమైనది. దీనిని అధిగమించి భవిష్యత్తులో రాష్ట్ర ప్రగతిని ఏ మేరకు తీసుకెళ్తారనెది ఆసక్తి కలిగిస్తుంది.
విశాఖకు రైల్ పక్షి వలస
పట్టా ఫౌండేషన్ సేవ కార్యక్రమాలు
పోలీసులకు వెయ్యి మాస్కులను పంపిణీ
కరోనా కట్టడకి అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు 1000 మాస్కులను ఉచితంగా ఇచ్చిన
ఉక్కు ఉద్యోగి ఉదారత పలువురికి అదర్శం
ఉక్కు ఉద్యోగి ఉదారత పలువురికి అదర్శం
సేవాభావంతో ముందుకు వెళుతున్న గాజువాక యువత
విపత్కర పరిస్దితుల్లో నేను సైతం అంటున్న పెన్‌పవర్ టీం
స్వచ్చందకార్యక్రమాల నిర్వహణకు ప్రముఖు ప్రశంస
సేవాకార్యక్రమాకు ముందుకు వస్తూన్న పలు సంస్దలు
గాజువాక , పెన్ పవర్: బి. శ్రీనివాస్
ఉక్కు కర్మాగారంలో విధులు నిర్వహిస్తూన్న కూరెళ్ళ శ్రీనివాసరావు తన ఉదారాతను చాటుకున్నారు. విపత్కర పరిస్దితుల్లో తన వంతు సహాయార్దం ముందుకు రావడం పలువురికి అదర్శప్రాయంగా నిలిచింది.పారిశ్రామికప్రాంతంలో గాజువాక పెన్‌పవర్ టీం. స్దానిక విలేఖర్లు. యువత పలు స్వచ్చంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారు. నేడు యువత చేస్తూన్న కార్యక్రమాలకు పలువురు తమ అభినందనలు తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సౌజన్యంతో పలువార్డుల్లో నివాసితులకు , శానిటరీ సిబ్బందికి వాటర్‌బాటిల్స్,పండ్లు, బన్ లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెన్‌పవర్ టీం సభ్యులు బి.శ్రీనివాస్, ఫిరోజ్ . అమరపిన్ని నానీ ,సాయి, మణికంఠ, యువత , స్దానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...