విజయనగరం, పెన్ పవర్
విజయనగరం జిల్లా ఎక్సైజ్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం నాటుసారా లపై ఉక్కుపాదం మోపుతున్నారు, ఎక్కడికక్కడ నాటు సారా బట్టీలను ధ్వంసం చేయడంతో పాటు ప్రభుత్వ మద్యం షాపుల్లో ఉన్న కూడా దృష్టిపెట్టారు. ఎక్కడైనా స్టాక్ వివరాల్లో అవకతవకలు జరిగినట్లు అయితే కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ఉన్న మద్యం స్టాక్ వివరాలపై ఆరా తీశారు. వి టి అగ్రహారం జంక్షన్లోని ఉన్న రెండు ప్రభుత్వ మద్యం షాపుల్లో కూడా ఎక్సైజ్ అధికారులు. తనిఖీలు చేపట్టారు షాపుల్లో ఉన్న మద్యం స్టాక్ను పరిశీలించి ఏమైనా జరిగే దానిపై. దృష్టిపెట్టారు. అయితే తనిఖీల్లో వీటి అగ్రహారం . వార్డు నెంబర్-35. వై జంక్షన్ లో ఉన్న రెండు ప్రభుత్వ మద్యం షాపులు కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదని అధికారులు తెలిపారు. రెండు మద్యం షాపులకు కూడా మరల సీల్ వేశారు.