Followers

కంటోన్మెంట్ జోన్లలో  పటిష్టమైన చర్యలు.


కంటోన్మెంట్ జోన్లలో  పటిష్టమైన చర్యలు.



జిల్లా కలెక్టర్  వినయ్ చంద్

స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్) 


జిల్లాలోని  కంటోన్మెంట్   జోన్లలో  పటిష్టమైన చర్యలు  చేపట్టామని  జిల్లా కలెక్టర్  వినయ్ చంద్  తెలిపారు.  జిల్లాలో  తీసుకుంటున్న  ప్రత్యేక చర్యల పై  గురువారం ప్రకటన విడుదల చేశారు. పట్టణంలో 6 గ్రామీణ ప్రాంతంలో ఒకటి మొత్తం జిల్లాలో 7 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయన్నారు. ఇంటింటి సర్వే చేపట్టామని కరోనా వైరస్ అనుమానితులను కోరం టైన్   హోమ్ తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. నగరంలో తాటి చెట్ల పాలెం అక్కయ్యపాలెం అల్లిపురం ప్రాంతాలు రెడ్ జోన్లుగా  ప్రకటించి  కట్టుదిట్టమైన  చర్యలు తీసుకుంటున్నామని  తెలిపారు. రెడ్ జోన్ అమలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు  ఇల్లు విడిచి వెళ్లకుండా  ఇతరులు రాకుండా రహదారులను మూసి వేశామని తెలిపారు. కోవిడ్19పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సహని  బుధవారం సాయంత్రం  టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారని   ఆమె సూచనలు మేరకే   కంటోన్మెంట్ జోన్లలో  సర్వేలు జరుగుతున్నాయని అన్నారు. కరోనా ని జయించిన నలుగురు  నగరంలో డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్19 పూర్తిస్థాయిలో నిర్మూలన అయిన  ముగ్గురు  బుధవారం డిస్చార్జ్ అయ్యి  ఇళ్లకు వెళ్లారు. మరో కేసు  వారం క్రితమే  వెళ్లారని  వీరు  పద్మనాభం మండలం  రేవడి  గ్రామం  ఒకే కుటుంబానికి చెందిన  ఇద్దరు.  అల్లిపురంకి  చెందిన ఇద్దరు  డిశ్చార్జి కాగా 16 కేసులు   నెగటివ్  రావాల్సి ఉందన్నారు. కరోనా మహమ్మారి  రెండో  స్టేజి లో  ఉందని  ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని  కలెక్టర్ వినయ్ చంద్  కోరారు.


 

అరిపు కామేష్ సొంత నిధులతో స్ప్రే 


 


అరిపు కామేష్ సొంత నిధులతో స్ప్రే 

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

జీవీఎంసీ 84 వ వార్డ్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కామేష్ ఆధ్వర్యంలో గురువారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో  ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చేయూతను అందించారు. గొల్ల వీధి తదితర ప్రాంతాల్లో కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం పలు చోట్ల సోడియం హైడ్రో  ఫ్లోరైడ్ కెమికల్ ను పిచికారి చేయించి పారిశుద్ధ్య మెరుగుదలకు కృషి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని చెప్పారు.  జయంతుడు వ్యక్తిగత పరిసర ప్రాంతాల శుభ్రతను మెరుగు పరచుకోవాలి అన్నారు. ఎమ్మెల్సీ జగదీష్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆదేశాలతో తాను ప్రజల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. వార్డు నాయకులు కార్పొరేట్ అభ్యర్థిని లలిత తదితరులు పాల్గొన్నారు. స్వయంగా స్ప్రే ను పైపులతో వారే కొట్టడం పై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 

నాటు పడవ బోల్తా పడి  గిరిజన మహిళ మృతి.


 


నాటు పడవ బోల్తా పడి  గిరిజన మహిళ మృతి.



   ఈదుకుంటూ  ఒడ్డుకు చేరిన భర్త  కుమారుడు .



       స్టాప్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)



జిల్లాలోని  చీడికాడ మండలం  కోణం  జలాశయంలో  నాటు పడవ  బోల్తా పడి  గిరిజన మహిళ   మృతి చెందింది.  చీడికాడ పోలీసులు  అందించిన సమాచారం మేరకు  గురువారం ఉదయం  కోనం గ్రామానికి చెందిన  దారపర్తి  కొండలరావు  భార్య  దేవుడమ్మ  కుమారుడు  శ్రీరామ్  కలిసి   నాటు పడవ పై కోనాం  జలాశయం  అవతల వైపుకు  వెళ్లారు.  ఇల్లు  నేతకు  ఉపయోగించే  తాటి కమ్మ   నాటు పడవలో  వేసుకొని  తిరిగి  గ్రామానికి వస్తుండగా  జలాశయం మధ్యలో   నాటు పడవ  బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  దేవుడమ్మ  జలాశయంలో మునిగి పోయింది. భర్త  కొండలరావు  కుమారుడు శ్రీరామ్   అతి కష్టం మీద ఈదుకుంటూ  ఒడ్డుకు చేరారు. కేకలు వేయడంతో  గ్రామస్తులు వచ్చి  గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రయత్నంలో  దేవుడమ్మ  శవ మై నీటి పై తేలింది. శవాన్ని  ఒడ్డుకు చేర్చి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని  చీడికాడ పోలీసులు  శవ పంచనామా జరిపించి  శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు . కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.


కరోనా నియంత్రణకు 15 లక్షల రూపాయలను సహాయం చేసిన రక్షిత్ ఫార్మా




కరోనా నియంత్రణకు 15 లక్షల రూపాయలను సహాయం చేసిన రక్షిత్ ఫార్మా


 

             పరవాడ పెన్ పవర్

 

కరోనా నియoత్రణకు జవహర్ లాల్ నెహ్రు ఫార్మా సిటీలోని కంపెనీల యజమానులు ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చి వారి సామాజిక బాధ్యతతో ఉదారతను చాటుకుంటున్నారు.గురువారం రక్షిత్ ఫార్మా యాజమాన్యం కరోనా నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల చెక్ ను జిల్లా లో కరోనా నివారణ చర్యల కోసం 5 లక్షల రూపాయల చెక్ ను జిల్లా కలెక్టర్ వినయ్ చెంద్ కు ఆ సవస్థల ఛైర్మన్ సిహెచ్.ఏ.పి రామేశ్వరరావు,సంవస్థ స్థానిక ప్రతినిధి పాపయ్య దొర అందజేశారు.ఇదే కాకుండా సవస్థ ఇప్పటికే స్థానిక గ్రామాల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావకాన్ని పిచికారి చేయించినట్లు తెలిపారు.


 

 



 

గ్యాస్ వినియోగదారులను మోసగిస్తే చర్యలు


 


 గ్యాస్ వినియోగదారులను మోసగిస్తే చర్యలు

--- ఆర్డిఓ సీతారామారావు

 

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

గ్యాస్ వినియోగదారులను ఉద్దేశపూర్వకంగా గ్యాస్ కొరత చూపించి మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ డివిజన్ అధికారి సీతారామారావు హెచ్చరించారు. గ్యాస్ సమస్యలపై పలు ఫిర్యాదులు వచ్చిన ఈ నేపథ్యంలో ఏజెన్సీలను గురువారం ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడే ఉన్న గ్యాస్ వినియోగదారులు తో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏజెన్సీల నిర్వాహకులు తో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా గ్యాస్ కొరతను చూపించిన అలసత్వాన్ని ప్రదర్శించిన నిర్దేశించిన కన్నా ఎక్కువ రుసుము వసూలు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ నమోదులు కూడా పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఎప్పటికప్పుడు సరఫర చేయాలన్నారు. పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షలు విరాళం : మెట్రో కేమ్ ఫార్మా




కరోనా నివారణ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షలు విరాళం ఇచ్చిన  మెట్రో కేమ్ ఫార్మా అధినేత డాక్టర్ ఎన్.వి.రావు
 

             పరవాడ పెన్ పవర్

పరవాడ మండలం:జవహర్ లాల్ నెహ్రు ఫార్మా సిటీ లోని మెట్రో కేమ్ ప్రవేట్ లిమిటెడ్ ఫార్మా అధినేత డాక్టర్ ఎన్.వి.రావు రాష్ట్రం కోవిడ్-19(కరోనా)వలన వచ్చిన అత్యవసర పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం చేస్తున్న కరోనా నివారణా కార్యక్రమాల కు తనవంతు సాయంగా 10 లక్షల రూపాయల చెక్ ను ముఖ్యమంత్రి సహాయక నిధికి జిల్లా కలెక్టర్ వినయ్ చెంద్ కి ఆ సవస్థ ప్రతినిధులు గంగిరెడ్డి,దుగ్గరావు గురువారం అందజేశారు.ఈ సవస్థ ఇప్పటికే 50 లక్షల రూపాయల విలువ చేసే శానిటైజర్స్ ప్రజా వినియోగార్థం ప్రజా ప్రతినిధులకు అందచేసిన విషయం విదితమే.


 

 



 

వలస కూలీలకు భోజన వసతి కల్పించిన సిఐటియు






             పరవాడ పెన్ పవర్

 

పరవాడ మండలం లోని ఈ బోనoగి శివారు బ్యాంక్ కాలనీ వద్ద నివసిస్తున్న ఇతర రాష్టాల వలస కూలీలకు కరోనా కారణంగా గత తొమ్మిది రోజుల నుండి పద్నాలు గవ తారీకు వరకు రోజుకు ఒక దాత తో సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో భోజన వసతిని కల్పిస్తున్న విషయం విదితమే.గురువారం లoకేలపాలెం లోని దుర్గ మాంబ యువజన సంఘం సభ్యుల ఆర్ధిక సహాయంతో బిర్యాని పేకెట్లు ఆoది చినట్లు గనిశెట్టి తెలిపారు.ఈ కార్యక్రమంలో యెస్ యెస్ రాజు తదితరులు పాల్గొన్నారు.


 

 



 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...