Followers

గ్యాస్ వినియోగదారులను మోసగిస్తే చర్యలు


 


 గ్యాస్ వినియోగదారులను మోసగిస్తే చర్యలు

--- ఆర్డిఓ సీతారామారావు

 

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

గ్యాస్ వినియోగదారులను ఉద్దేశపూర్వకంగా గ్యాస్ కొరత చూపించి మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ డివిజన్ అధికారి సీతారామారావు హెచ్చరించారు. గ్యాస్ సమస్యలపై పలు ఫిర్యాదులు వచ్చిన ఈ నేపథ్యంలో ఏజెన్సీలను గురువారం ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడే ఉన్న గ్యాస్ వినియోగదారులు తో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏజెన్సీల నిర్వాహకులు తో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా గ్యాస్ కొరతను చూపించిన అలసత్వాన్ని ప్రదర్శించిన నిర్దేశించిన కన్నా ఎక్కువ రుసుము వసూలు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ నమోదులు కూడా పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఎప్పటికప్పుడు సరఫర చేయాలన్నారు. పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షలు విరాళం : మెట్రో కేమ్ ఫార్మా




కరోనా నివారణ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షలు విరాళం ఇచ్చిన  మెట్రో కేమ్ ఫార్మా అధినేత డాక్టర్ ఎన్.వి.రావు
 

             పరవాడ పెన్ పవర్

పరవాడ మండలం:జవహర్ లాల్ నెహ్రు ఫార్మా సిటీ లోని మెట్రో కేమ్ ప్రవేట్ లిమిటెడ్ ఫార్మా అధినేత డాక్టర్ ఎన్.వి.రావు రాష్ట్రం కోవిడ్-19(కరోనా)వలన వచ్చిన అత్యవసర పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం చేస్తున్న కరోనా నివారణా కార్యక్రమాల కు తనవంతు సాయంగా 10 లక్షల రూపాయల చెక్ ను ముఖ్యమంత్రి సహాయక నిధికి జిల్లా కలెక్టర్ వినయ్ చెంద్ కి ఆ సవస్థ ప్రతినిధులు గంగిరెడ్డి,దుగ్గరావు గురువారం అందజేశారు.ఈ సవస్థ ఇప్పటికే 50 లక్షల రూపాయల విలువ చేసే శానిటైజర్స్ ప్రజా వినియోగార్థం ప్రజా ప్రతినిధులకు అందచేసిన విషయం విదితమే.


 

 



 

వలస కూలీలకు భోజన వసతి కల్పించిన సిఐటియు






             పరవాడ పెన్ పవర్

 

పరవాడ మండలం లోని ఈ బోనoగి శివారు బ్యాంక్ కాలనీ వద్ద నివసిస్తున్న ఇతర రాష్టాల వలస కూలీలకు కరోనా కారణంగా గత తొమ్మిది రోజుల నుండి పద్నాలు గవ తారీకు వరకు రోజుకు ఒక దాత తో సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో భోజన వసతిని కల్పిస్తున్న విషయం విదితమే.గురువారం లoకేలపాలెం లోని దుర్గ మాంబ యువజన సంఘం సభ్యుల ఆర్ధిక సహాయంతో బిర్యాని పేకెట్లు ఆoది చినట్లు గనిశెట్టి తెలిపారు.ఈ కార్యక్రమంలో యెస్ యెస్ రాజు తదితరులు పాల్గొన్నారు.


 

 



 

సీఎం కు కృతజ్ఞతలు తెలుపిన అర్చక సంఘం.


 

 

     స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)

 

 

 ఆదాయం లేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు మేరకు దేవాదాయశాఖ ద్వారా 5000రూపాయలు ఆర్ధిక సహాయం ఇవ్వనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించటం పట్ల, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణా సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి,వైసిపి నాయకులు  వడ్డాది ఉదయకుమార్ గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న అర్చకులను ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్, దేవాదాయమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణులకు, ఆ ప్రకటనలో ఉదయకుమార్ కృతజ్ఞతలు తెలియచేసారు.
 

 


నాటు సారా బట్టీలు పై ఎక్సైజ్ అధికారులు దాడులు



   5000 లీటర్ల బెల్లం ధ్వంసం

  స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్) 


 


జిల్లాలో  ఎక్సైజ్  అధికారులు    నాటు సారా తయారీ కేంద్రాలపై ముమ్మరంగా  దాడులు నిర్వహిస్తున్నారు. పొదల్లో తోటల్లో  రహస్యంగా  సారా బట్టీలు నిర్వహిస్తున్నట్లు  సమాచారం అందడంతో   ఎక్సైజ్ అధికారులు  ఆయా ప్రదేశాల పై   దాడులు చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా  మద్యం షాపులు  మూసివేయడంతో  నాటు సారా తయారీ అమ్మకాలు  జోరందుకున్నాయి. నాటుసారా  నియంత్రణలో భాగంగా  ఎక్సైజ్ అధికారులు  దాడులు  నిర్వహిస్తున్నారు. మాడుగుల  ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల జగదీశ్వరరావు  గురువారం  స్టేషన్ పరిధిలో  పలుచోట్ల  దాడులు చేపట్టారు  ఈ దాడుల్లో  సుమారు 5000 లీటర్ల  బెల్లం పులుపు  ధ్వంసం చేశారు. పొంగలిపాక  జాలం పల్లి   గదబూరు  పొన్నవొలు  గురు వాడ తదితర గ్రామాల్లో నాటు సారా తయారీ కి  ఉపయోగించే  బెల్లం పులుపు  ధ్వంసం చేశారు. గ్రామ వాలంటీర్ల సహకారంతో నాటుసారా నిర్మూలనకు  ఎక్సైజ్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అక్రమంగా నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ జగదీశ్వర రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శ్రావణి సిబ్బంది పాల్గొన్నారు.


సచివాలయ సిబ్బందికి 200 మాస్కుల  వితరణ


 





పెన్ పవర్;జమ్మలమడుగు

 

కడప జిల్లా యర్రగుంట్ల పట్టణంలోని రైల్వే గేటు దగ్గర గల 2&3 వ వీధుల్లో ఉన్న  సచివాలయంలో   ప్రజా సేవ కోసం,నిరంతరం ప్రజల లో తిరుగుతున్న వాలంటీర్లకు,పంచాయతీ అధికారులకు కరోనా వైరస్ భారిన పడకుండా   వైసీపీ యువ నాయకులు అయిన  కరుణ,రఘు రాముడు నిర్వహించిన కార్యక్రమంలో  రాష్రకార్యదర్శి & మున్సిపల్ ఇంచార్జ్ మూలె.హర్షవర్ధన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన సచివాలయ సిబ్బందికి మాస్కులను  అందచేశారు.  ఈ కార్యక్రమంలో మల్లు గోపాల్ రెడ్డి,జయరామ కృష్ణా రెడ్డి గారు,తుంగా. వెంకట రామి రెడ్డి గారు ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


 

 



 

మానవత్వంలొ రారాజు రామచంద్ర రాజు



 


 

ఎన్ పవర్... ఎస్‌. రాయవరం.

 

కరోనా లాక్ డౌన్ వల్ల అవస్దలు ఎదుర్కొంటున్న  జర్నలిస్టులు, గ్రామస్తులకు నిత్యావసర సరుకులు,కూరగాయలు పంపిణీ చేసి రామ చంద్ర రాజు మానవత్వం చాటుకున్నారు. కోరుప్రోలుకి చెందిన సాధారణ రైతు రామ చంద్ర రాజు గురువారం ప్రజలు విలేకరుల కు బియ్యం పప్పులు కూరగాయలు అందచేశారు. ఎస్ రాాాయవరం మండలం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కు10 కేజీల బియ్యం, 4 రకాల పప్పు దినుసులు,పామాయిల్ నూని,చింతపండు,బెల్లం తదితర సరుకులు పంపిణీ చేశారు.

అంతకు ముందు గ్రామంలో  టన్ను కూరగాయలు పంపిణీ చేశారు.గ్రామంలో నివసిస్తున్న అన్ని కుటుంబాలకు ఈ కూరగాయలు అందే టట్లు ఏర్పాట్లు చేశారు.ప్రతీ ఇంటికి 5 కేజీల కూరగాయలు అందజేశారు.ఈ పంపిణీ చేసేందుకు గ్రామంలో నున్న యువకులు స్వచ్చందంగా వచ్చారు.ఈ యువకుల సాయంతో 10 ఆటోలలో ఈ కూరగాయలను ప్రతి వార్డు, అయితే రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకూడదని పోలీసులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అందరికీ సామాజిక దూరం పాటించాలని రామ చంద్ర రాజు తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...