Followers

బంగ్లా లాకౌట్...


బంగ్లా లాకౌట్...


పత్తాలేని ప్రతిపక్షం... -విస్తుపోతున్న జనం


విపత్తు సమయంలో వింత వైఖరి


కరోనాపై సాయానికి మొహంచాటు


ఇదీ జిల్లాలో టిడిపి తీరు


బ్యూరో విజయనగరం, పెన్‌పవర్


 


 దేశం అంతా లాకౌడౌన్... మాబంగ్లాకు లాకౌ ట్... అన్న సూత్రాన్ని జిల్లా టిడిపి అనుసరిస్తోందని అంతా ఆరోపిస్తున్నారు. విపత్తు సమయంలో జనా లకు అవగాహన కల్పించడంతోపాటు అభాగ్యులకు. ఆన్నార్తులను ఆదుకోవాల్సిన తరుణంలో ప్రతిపక్షనా యకులు పత్తాలేకుండా పోయారని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రజాసంక్షేమమే మాధ్యే యమంటూ బల్ల గుద్ద నాయకులంతా ఇలా మొ హంచాటేయడం విమర్శలకు తావునిస్తోంది. కరోనా మహ్మమారి అంతా అతలాకుతలం చేస్తుంటే ఎన్నో స్వచ్చంధ సంస్థలు, పలువురు మానవతా మూర్తులు ఎందరో అభాగ్యులను ఆదుకుంటూ వారికి తోచిన రీతిలో ఏదో రూపంలో సాయంచేస్తే మూడు పూట లా ఇంత అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తుంటే జిల్లా లో టిడిపి నాయకులు మాత్రం జనంతో మాకే సం బంధం లేదన్నట్టుగానే వ్యవహారిస్తున్నారని పలు వురు అభిప్రాయపడుతున్నారు. కరోనా పై ప్రధాని లాక్ డౌన్ ప్రకటించినప్పటినుంచి బంగ్లాకు అదే . (జిల్లా టిడిపి కార్యాలయం గేటుకు తాళం వేసారు.) అయితే బంగ్లాలో జిల్లా టిడిపికి పెద్దదిక్కు అశోక్ గజపతిరాజు నివాసం కూడా ఉండడంతో ఇలా లాకౌడౌన్ ఉన్నంతకాలం ఎవ్వరిని బంగ్లాకు రావ ద్దని ఆదేశాలు జారీ అయ్యినట్టు గుసగుసలు వినిపి స్తున్నాయి. దీంతో ఆరోజు నుంచి బంగ్లా కు లాకౌట్ ప్రకటించేశారని పార్టీ  వర్గాలే చెబుతున్నాయి. అయితే స్థానిక ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు మాత్రం వారి వారి ప్రాంతాల్లో చేతి చమురు వదిలించుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. అధికారపార్టీకి అన్నివిధాల జనానికి దగ్గరవుతుండడంతో చేసేదిలేక బరిలో ఉన్న అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. నిత్యం జనం కోసం పరితపించే ప్రతిపక్ష నాయకులు విపత్కర సమయంలో జాడలేకపోవడంతో అంతా విస్మయానికి గురవుతున్నారు. ఇకనైనా అభాగ్యులకు తమవంతుసాయం చేయా లని పలువురు కోరుతున్నారు. లేదంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వాసులు ఒక్క స్థానం కూడా గెలిపించకుండా చేశారని ఇలా మొహం చాటేస్తున్నారా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపధ్యంలో భవిష్యత్తు సాయం ఎలా ఉంటుందో చూడాలి మరి. 


హోంగార్డులకు నిత్యావసర సరుకులు పంపిణీ: ఎస్పీ. నయీమ్ అస్మి


హోంగార్డులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి


 తూర్పుగోదావరి/ జగ్గంపేట, పెన్ పవర్


తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో గురువారం రాత్రి జిల్లా ఎస్పి సర్కిల్ పరిధిలోని హోంగార్డులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావంవల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం విధితమే. జగ్గంపేట లోని సర్కిల్ పరిధిలో ఉన్న జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండల పరిధి పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న హోంగార్డులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఎంతో   ఆనందంగా ఉందని ఎస్పీ అన్నారు.  ప్రజల శ్రేయస్సుకోసం అహోరాత్రులు కష్టపడుతున్న హోంగార్డులకు జగ్గంపేట సిఐ వై రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిత్యావసర సరుకులు ఎస్పీ నయీమ్ అస్మి చేతుల మీదుగా అందజేశారు. ప్రజలు పోలీసులకు కోపరేట్ చేయాలని ఆయన అన్నారు. కరోనా  వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన అన్నారు. ఇంటికి పరిమితమవుతూ అవసరమైనప్పుడే బయటకు రావాలని ఆయన సూచించారు. తప్పనిసరిగా మాస్కూల్ వాడాలని గుంపులు గుంపులుగా ఉండకూడదని, దూరం పాటించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఆకుల సత్యనారాయణతో పాటు జగ్గంపేట సీఎం వై రాంబాబు, ఎస్ఐ టి.రామకృష్ణ, గండేపల్లి ఎస్సై తిరుపతి రావు, కిర్లంపూడి ఎస్సై మూడు మండలాల పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మద్యం నిల్వలపై కమ్ముకుంటున్న నీలి నీడలు



జనతా  కర్ఫ్యూ తో  మూతపడ్డ మద్యం షాపులు. సర్కారు దుకాణాల్లో ఓబిల పై అనుమానాలు.?

(స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం, పెన్ పవర్  మజ్జి శ్రీనివాస మూర్తి )


సర్కారు మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలపై నీలి నీడలు  కమ్ముకుంటున్నాయి. దుకాణాల్లో మద్యం  స్టాక్ లు    యధావిధిగా  ఉన్నాయా?  లేక గోల్ మాల్ ఏమైనా జరిగాయా? అన్న అనుమానాలు  రేకెత్తిస్తున్నాయి.  అక్కడ అక్కడ  వెలుగు చూస్తున్న  సంఘటనలే  బలం చేకూరుస్తున్నాయి. జిల్లాలో   300 వరకు  ప్రభుత్వ మద్యం దుకాణాలు  నడుస్తున్నాయి. కరోనా మహమ్మారి  నియంత్రణలో భాగంగా  మార్చి 22న  ప్రభుత్వం  జనతా   కర్ఫ్యూని  విధించారు. ఆ మరుసటి  రోజు నుంచి  లాక్ డౌన్  ప్రకటించారు. ఈ నేపథ్యంలో  ప్రభుత్వ మద్యం దుకాణాలు  మార్చి 21  సాయంత్రం   మంచి  మద్యం షాపులు  మూతపడ్డాయి. ఆ రోజుకి  దుకాణాల్లో  ఉన్న  స్టాకులు   మరలా షాపులు తెరుచుకునే  వరకు  నిల్వలు  ఉండితీరాలి. కానీ  దుకాణాల్లో  ఆ మెరా  మద్యం స్టాకులు  ఉన్నాయా?   అన్నది  అధికారుల కె ఎరుక.  కర్ఫ్యూ కారణంగా  మందు  దొరక్క  మందుబాబులు  అల్లాడిపోతున్నారు. కిక్కు కోసం  ఎంత ధరైనా చెల్లించి  మత్తు ని కొనుక్కోవాలని  చూస్తున్నారు. మద్యానికి బానిసైన  మందు బాబులు  మద్యం ధరలను చూడటం లేదు. ఈ పరిస్థితుల్లో  మద్యం   మాయం  అవుతుందని  ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మద్యం షాపులు  సేల్స్ మెన్లు సూపర్వైజర్లు ఆధీనంలో  ఉన్నట్లు సమాచారం.
రాజమండ్రి  ప్రాంతంలో మద్యం షాపులో  మద్యం మాయం అయిందని  ఒక  కానిస్టేబుల్ను  సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
విజయనగరం  సుంకర పేట  మద్యం షాపు లో  అర్ధరాత్రి దొంగలు పడి  10 కేసుల మద్యం  తస్కరించి న  విషయం విధితమే. ఇలా   మద్యం మాయమవుతున్న  సంఘటనలు  పునరావృతం అవుతున్నాయి.  జిల్లాలోని   గ్రామీణ ప్రాంతాల్లో  నడుస్తున్న  ప్రభుత్వ మద్యం దుకాణాల  మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు సైతం  షాపుల వైపు  పట్టించుకున్న దాఖలాలు లేవు. షాపుల నిర్వాహకులు   ఆయా ప్రాంతాలకు చెందిన వారు  కావడం గమనార్హం. అక్కడక్కడ  మందుబాబులు   గొంతు   తడుపు కుంటున్న సంఘటనలు లేకపోలేదు. ప్రభుత్వ మద్యం దుకాణాలపై  ప్రత్యేక  నిఘా  ఉంచాల్సిన అవసరం  ఎంతైనా ఉంది.  జిల్లాలో  మద్యం దుకాణాల్లో  స్టాకుల వ్యవహారం పై విశాఖ ఎక్సైజ్ సూపరిండెంట్ ను  ఫోను ద్వారా వివరణ కోరేందుకు  ప్రయత్నించగా  ఆయన అందుబాటులో లేరు.


 

ఎమ్మెల్యే అమర్ చేతుల మీదుగా చేయూత


 


ఎమ్మెల్యే అమర్ చేతుల మీదుగా చేయూత

 

కసింకోట, పెన్ పవర్ 

 

కసింకోటలో సుమారు 1000 మంది నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే  గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా గురువారం  నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి  పది కేజీల బియ్యం , కేజీ కంది పప్పు  ,లీటర్ నూనె  పంపిణీ చేశారు. జిల్లా అధికార ప్రతినిధి మళ్ళ బుల్లిబాబు ఆధ్వర్యంలో  కార్యక్రమం  జరిగింది. లాక్ డౌన్ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు గత రెండు రోజులుగా  ఓఆర్ఎస్ లు , భిస్కెట్  ప్యాకెట్లు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆదేశాల మేరకు పంపిణీ చేసారు. పోలీసులకు మాస్కులు, గ్లౌసులు కూడా పంపిణీ చేసారు. విధి నిర్వహణలో ఉన్న వాలంటీర్లకు ఉదయం పూట టిఫిన్ పంపిణీ చేసారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లవిల్లి శ్రీను, దంతులూరి శ్రీధర్ రాజు, మలసాల కిషోర్, ఎం .డి .ఓ, ఆర్. డి .ఓ తదితరులు పాల్గొన్నారు.


కక్షసాధింపు చర్యలు మానుకోవాలి


కక్షసాధింపు చర్యలు మానుకోవాలి


గాజువాక, పెన్ పవర్ 


రాష్ట్రంలో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే వారిని వేధించి,వారిపట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతోందనే చెప్పాలి నిన్నమొన్నటివరకు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై గొంతెత్తిన తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమకేసులు బనాయించి వేధింపులకు పాల్పడ్డారు.ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తూ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నివారణలో ప్రభుత్వ వైఫల్యాలను నిర్భయంగా బయటపెట్టిన వైద్యుడిని సస్పెండ్ చేయటం రాష్ట్రంలో నిరంకుశ పాలనకు అద్దం పడుతోంది. రాజ్యాంగం కల్పించిన బావప్రకటనా స్వేచ్ఛను సైతం హరించేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.ఇప్పటికే ప్రభుత్వపు నిర్లక్ష్యపు వైఖరి కారణంగా రోగులకు సేవలందిస్తున్న వైద్యులకు కరోనా వైరస్ సోకిన దురదృష్ట సంఘటన నెల్లూరులో జరిగింది.ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ వైద్యుడు బయటపెట్టిన లోపాలను సరిదిద్దాలి కానీ ఈ ప్రభుత్వం అలా చేయకుండా  ప్రాణాలకు తెగించి మరీ కరోనా వైరస్ బాధితులకు ఆయన చేసిన సేవలకు గాను 
దళిత వర్గానికి చెందిన ఆ వైద్యునికి సస్పెన్షన్ ను బహుమతిగా ఇచ్చారు.అధికారం ఉంది కదా అని జరుగుతున్న తప్పులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురి చేయటం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.డాక్టర్ సస్పెన్షన్ విషయంలో ప్రభుత్వ తీరును తెలుగుదేశం పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.  ప్రస్తుతం గాజువాక ప్రాంతంలో నెలకొన్న భయానక పరిస్థితులు ప్రభుత్వ పెద్దలు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్ధంగా మారింది..విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచుతున్నాం..వాలంటీర్ల ద్వారా సంపూర్ణ సమాచారాన్ని సేకరిస్తున్నాం అంటూ పదేపదే చెపుతున్న నాయకులు గాజువాకలో పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఎలా విడిచిపెట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.అప్పటికే ఆలస్యంగా ఈ నెల రెండవ తేదీన బాధితుడికి పరీక్షలు నిర్వహించిన అనంతరం అధికారులు సదరు బాధితుడిని కనీసం క్వారంటైన్  లో ఉంచకుండా బయటకు వదిలిపెట్టడంలో అధికారుల ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి..! ఆ వ్యక్తి బయట తిరగటం ద్వారా వైరస్ మరింత మందికి సోకే అవకాశం ఉండటంతో గాజువాక ప్రాంత ప్రజలంతా బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. అధికారం చేపట్టిన నాటి నుండి పారదర్శకత లేని పాలనతో ప్రజలను అయోమయానికి గురి చేసిన వైసిపి ప్రభుత్వం ఇప్పుడు వైరస్ నియంత్రణలోనూ అదే వైఖరిని అవలంబిస్తుంది దాని పర్యావసానంగానే కర్నూలులో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు. నిదర్శనం అని అన్నారు.
కేవలం చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయటమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న అధికార పార్టీ నాయకులు మెడ్ టెక్ జోన్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని గుండెలు బాదుకున్నారు.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అవే మెడ్ టెక్ జోన్లు దేశానికే తలమానికంగా నిలిచాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో వాటి నుంచే మనకు అవసరమైన మాస్కులు వెంటిలేటర్లు వస్తున్న పరిస్థితి నెలకొంది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజన్ ఉన్న నాయకుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు ముందుచూపుతో విభిన్న తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఆ మెడ్ టెక్ జోన్లు. ఆయన ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలపై అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు తొమ్మిది నెలలపాటు నిర్లక్ష్యం చేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు వాటిమీద దృష్టి పెట్టి తామేదో అంతా సాధించినట్లు మీడియా ముందు గొప్పలు మాట్లాడుతూ పబ్లిసిటీ పాలన సాగిస్తున్నారు.నాడు 1998 లో చంద్రబాబు హయాంలో ఏర్పడిన హైటెక్ సిటీ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్శిస్తే ఇప్పుడు ఆయన జీవం పోసిన మెడ్ టెక్ జోన్ల వైపు దేశమంతా చూస్తోంది అది గౌరవ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి పరిపాలనా దక్షత. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిపై నిరాదార ఆరోపణలు,పసలేని విమర్శలు చేయడం మాని ఆయన ఆలోచనలకు ప్రతిరూపమైన మెడ్ టెక్ జోన్ల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలి.


ప్రజా సంక్షేమమే పరమావధిగా మెలగాలి





ప్రజా సంక్షేమమే పరమావధిగా మెలగాలి

-- ఎమ్మెల్యే అమర్నాథ్

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని దానికి అనుగుణంగా అందరూ సహకరించాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కోరారు. కరోనా నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించడం భాగంగా రైతు బజార్లలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఏర్పాటుచేసిన సోడియం హైడ్రో ఫ్లోరైడ్ కెమికల్ టన్నెల్ ను గురువారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరు మార్కెట్లోకి ప్రవేశించే ముందు టన్నెల్ నుంచే వెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక ధోరణి తప్పక పాటించాలనారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రజల కోసం ఏర్పాటుచేసిన కూరగాయల మార్కెట్ ను పరిశీలించి కూరగాయలు అమ్మకపు దారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించిన మేరకు ప్రభుత్వ ధరలకు అమ్ముతున్నారో లేదో విక్రయదారులుని అడిగి తెలుసుకున్నారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామనారు. మాస్కులు లేనివారికి ఎమ్మెల్యే  పంపిణి చేశారు.  ప్రభుత్వం  మీకు అండగా ఉంటుందని ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా ఉంటాను అన్నారు.  కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు , జాజుల రమేష్, పలకా రవి, దంతులూరి దిలీప్ కుమార్,  పీలా రాంబాబు, కొణతాల భాస్కరరావు, మలసాల కిషోర్, జోనల్ కమిషనర్ శ్రీరామ్ మూర్తి, ఆర్ డి ఓ సీతారాం తదితరులు పాల్గొన్నారు


 

 



 

ఆర్థిక ఇబ్బందులతో రైతులు ఇక్కట్లు


 


సమస్యలపై రైతులతో మాట్లాడిన ఎమ్మెల్సీ జగదీష్


 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు పడుతున్న ఇబ్బందులను తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ పరిశీలించారు. గురువారం చెర్లోపల్లి ఖండం ప్రాంతాన్ని పర్యటించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి గురించి నిర్వహించిన సమీక్షలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర పారిశ్రామిక తిరోగమనానికి నిదర్శనమనారు. పారిశ్రామిక ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక రాయితీలు ఇన్సెంటివ్స్ ప్రకటించిందని దాని ప్రకారం ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలకు సుమారు 4, 800 కోట్లు బకాయిలు పడిందని నేటికీ చెల్లించలేదని మోసపూరిత వాగ్దానాలు తో పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది అని ఆరోపించారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద పరిశ్రమ చక్కెర ఫ్యాక్టరీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూతపడింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018లో 30 కోట్ల 59 లక్షలు గ్రాంట్ గా మంజూరు చేసిందని అందులో 16.07 కోట్లు ఇచ్చామన్నారు. 2018-2019 సీజన్లో ఫ్యాక్టరీ కి చెరుకు సరఫరా చేసిన రైతులకు 1800 మందికి నేటికి ఒక పైసా చెల్లింపులు చేయలేదని ఆర్థిక ఇబ్బందులతో రైతులు ఇక్కట్లు పడుతున్నారు. రైతు బకాయిలు ఉద్యోగులు ఫ్యాక్టరీకి యంత్ర పరికరాలు సరఫరా చేసిన వారికి కలిపి ప్రభుత్వం 10 కోట్లు విడుదల చేసినట్లు జీవో ఇచ్చారు కాని పేమెంట్  మాత్రం జరగలేదన్నారు. దీనివలన రైతులు ఉద్యోగులు వ్యాపారులు మోసపోయారనారు. జిల్లాలో మిగతా ఫ్యాక్టరీకి ఇదేవిధంగా నిధులు మంజూరు చేసి రైతులకు చెల్లింపులు లేక జిల్లా లో  అన్ని ఫ్యాక్టరీలకు చెరుకు సరఫరా చేసిన రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు పడుతూ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అన్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను బ్యాంకులో నాలుగు కోట్లు డిపాజిట్ ఉన్న సొమ్ముని వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...