Followers

మొల్లి హేమలత ఆధ్వర్యంలో ప్రజలఅందరికీ కూరగాయలు పంపిణీ....


జీవీఎంసీ 5 వార్డులో టిడిపి నాయకురాలు మొల్లి హేమలత ఆధ్వర్యంలో ప్రజలఅందరికీ కూరగాయలు పంపిణీ....


మధురవాడ, పెన్ పవర్


 


మధురవాడ: జీవీఎంసీ మధురవాడ 5 వార్డు టిడిపి సీనియర్ నాయకుడు మొల్లి లక్ష్మణరావు  కుమార్తె 5వ వార్డు అభ్యర్థి మొల్లి హేమలత, ఆధ్వర్యంలో కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ సందర్భంగా నిత్యావసరాలు కొనుగోలు కు సతమతమవుతున్న 5 వార్డు ప్రజలందరికీ తనవంతు సహాయంగా  కూరగాయలు పంపిణీ కార్యక్రమ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిల్లా,నరసింహారావు, పిల్లా, వెంకట్రావు హాజరయ్యారు, వారి చేతుల మీదుగా  ప్రజలకు కూరగాయల ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లా నర్సింగరావు మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయమని,వార్డ్ ప్రజలందరికీ ఇటువంటి సందర్భాల్లో  సేవాదృక్పథంతో ముందుకు వచ్చి నటువంటి మొల్లి హేమలత ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలనిఅభినందించారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, ప్రభుత్వాలు, పోలీసులు ఇస్తున్న సూచనల ప్రకారం గుంపులు గుంపులుగా వీధుల్లో తిరగవద్దుఅని, నిత్యావసరాలకు ఒక ఇంట్లో నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలని, ఉదయం తొమ్మిది గంటల తర్వాత బయటకు ఎవరు రావద్దని చేయి,చేయి కలిపి లాక్ డౌన్ ను విజయవంతం చేద్దామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మొల్లి లక్ష్మణరావు, వి.అప్పలరాజు, మల్యాల సోంబాబు, నమ్మి శ్రీను, ఈగల రవి, వార్డ్ అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ (జపాన్), నాగోతి శివాజీ, నాయుడుసూరిబాబు, వి. బాబులు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.


హెండ్స్2హెల్ప్ ఆధ్వర్యంలో ఆహారం పొట్లాలు పంపిణీ


 


 


విశాఖపట్నం/మధురవాడ, పెన్ పవర్


"కరోనా" మహామ్మారి నివారణలో భాగంగా కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కారణంగా పనులు లేక ఇబ్బందులుపడుతున్న  నిరుపేదకార్మికులకు,వృద్ధులకు, జనసంచారం లేకపోవడంతో  భీక్షాటన చేసుకునేవారి ఆకలి తీర్చడానికి మరియు విధినిర్వహాణలో  సమయానికి  భోజనం లేక ఇబ్బందులు పడుతున్న  పోలీస్ సిబ్బందికి, జి.వి.యం.సి సిబ్బందికి   తమ వంతు సామాజిక భాధ్యతగా హెండ్స్2హెల్ప్(9000064322) ద్వారా వరుసగా 14వ రోజు కొంమ్మాది వాస్తవ్యులు పిళ్ల  రామారావు గారి కుమారులు పిళ్ల  అప్పలరాజు ,పిళ్ల  బంగార్రాజు గారి  ఆర్ధిక సహకారంతో సుమారు 200 మందికి భోజనం మరియు మంచినీరు  ఏర్పాటు చేయడం  జరిగింది. కార్యక్రమంలో   హ్యండ్స్2హెల్ప్ వ్యవస్థాపకుడు  చిన్ని వెంకట్,బైపిల్లి వరప్రసాద్,  పిల్ల అప్పలరాజు ,పిల్ల  బంగార్రాజు ,దినేష్, ప్రతాప్,సంపత్,  రాజగిరి రామోజీ,సత్యాల కార్తీక్ ,బేవర రాజ్ కుమార్,బెవర నవీన్ కుమార్, ఆర్డివి బాబు,పోతిన  అనిల్,కోర్రాయి శ్రీనువాసు, కొర్రాయి జయేంద్ర ,దుక్క సతీష్,పోతిన అనురాధ,పోతిన వెంకటేష్,   హ్యాండ్స్2హెల్ప్ సభ్యులు పాల్గొన్నారు.వారికి,వారి కుటుంబ సభ్యులకు హెండ్స్2హెల్ప్,వుయ్ కేర్ యు తరుపున ప్రత్యేక ధన్యవాదాలు......


లాక్ డౌన్ సమయం లో అందరూ పేదలకు సహాయం చేయాలి

 


లాక్ డౌన్ సమయం లో అందరూ పేదలకు సహాయం చేయాలి


 


అడ్డతీగెల, పెన్ పవర్ 


 


లాక్ డౌన్ సమయంలో ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకొని అందరూ తమ వంతున పేదలకు సహాయం చేస్తున్నారు. స్థానిక జుడిష్యల్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు  బుధవారం  పేదలకు సరుకులను పంపిణీ చేశారు.  ప్రతిఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ , సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కోర్టు లాయర్లు శ్రీధర్, రమణ , ఎస్సైలు నాగేశ్వరరావు,బాబురావు  పోలీసు సిబ్బంది , గ్రామస్థులు పాల్గొన్నారు


పవనగిరి క్షేత్రంలో నిత్యావసర సరుకులు ఉచిత పంపిణీ


 


అడ్డతీగల, పెన్ పవర్ 


 


మానవ సేవే మాధవ సేవ మార్గంగా పవనగిరి క్షేత్రం సేవలు అందిస్తుందని ఆలయ వ్యవస్థాపకులు తణుకు వెంకటరామయ్య తెలిపారు. స్థానిక పవనగిరి ఆలయం వద్ద బుధవారం నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి  ఎస్ఐ నాగేశ్వరరావు ముఖ్య  అతిథిగా పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సానిటైజర్ తో వారి చేతులని,శుభ్రం చేయించి , కూరగాయలు, అరటిపళ్ళు, మాస్కులు పంపిణీ చేశారు. సుమారు 50 కుటుంబాల తోలుబొమ్మలాట కళాకారులకు నేడు బియ్యం పంపిణీ చేస్తామని వెంకటరామయ్య తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న సమయంలో దాతలు ముందుకువచ్చి ఇలా సేవలందించాలని, పవనగిరి సేవలని అభినందించారు . ఎస్సై బాబురావు, కమిటీ మెంబర్లు శ్రీను, మాన్ శ్రీను,  సత్యవేణి ,బేబీ, ఆదినారాయణ,పి ఈ టీ లు నాగమణి , శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.


అక్రమంగా నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు






అక్రమంగా నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎస్ఐ 

 

 

 

పెన్ పవర్,  గోపాలపురం

 

నాటు సారా తయారు చేసే వారిపై విక్రయా దారులపై కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వి.సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. బుధవారం మండలంలోని లాక్ డౌన్  కారణంగా స్థానిక ఎస్సై  మరియు పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కరిచర్లగూడెం శివారు మాతంగఅమ్మ గుడి వద్దకు వచ్చేసరికి ఏజెన్సీ ప్రాంతము నుండి ఒక మోటార్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న  15 లీటర్ల నాటు సారాను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్దనున్న మోటార్ బైక్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


 

 



 



సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు మాస్క్ ల పంపిణీ



ఎటపాక, పెన్  పవర్


 


 సీపీఎం పార్టీ గుండాల శాఖ ఆధ్వర్యంలో 300 మాస్క్ లను ఉపాధి హామీ కూలీలకు, వ్యవసాయ కూలీలకు అందజేశారు.కరోన పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని,వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటిస్తూ పనులు చేసుకోవాలని పార్టీ నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో  ఐ వి, గంపల హరనాధ్, ఇరపా అజయ్, ఇరపా సత్యం, నూతలపాటి సుధాకర్, యడ్ల శ్రీను, తోట శ్రీను, గంపల సత్యవతి, తోట వెంకట రమణ , ఫీల్డ్ అసిస్టెంట్ ఐ. పద్మ పాల్గొన్నారు.


సచివాలయ సిబ్బంది కి పారిశుద్ధ్య కార్మికులకు బొమ్మరెడ్డి గంగాధర్ రెడ్డి శానిటేషన్ మా స్కూలు అందజేత.


సచివాలయ సిబ్బంది కి పారిశుద్ధ్య కార్మికులకు బొమ్మరెడ్డి గంగాధర్ రెడ్డి శానిటేషన్ మా స్కూలు అందజేత.

 

 

 

 

పెన్ పవర్,  గోపాలపురం

 

 

 

 పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో  కరోనా వైరస్ నియంత్రించేందుకు నిరంతరం సేవలు అందిస్తున్న అధికారులు అనధికారులు శ్రమ వెలకట్టలేనిదని డాక్టర్ బొమ్మ రెడ్డి గంగాధర్ రెడ్డి ( సుబ్బారెడ్డి) కొనియాడారు. బుధవారం గంగాధర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాధి ద్వారా ప్రపంచ దేశాలలో అనేక వేలమంది మృత్యువాత పడుతున్నారు. అదేవిధంగా మన దేశంలో కరోనా వైరస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 14వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించింది.ప్రజలు ప్రతి ఒక్కరూ ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది అని తెలిసిన ప్రభుత్వ యంత్రాంగం వైద్య సిబ్బంది డాక్టర్ నుండి ఆశ వర్కర్ వరకు ,పోలీస్ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది ,పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది, రెవెన్యూ యంత్రాంగం, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, పాత్రికేయులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సేవలు మరువలేనివి అని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, విలేఖర్లకు సుమారు 100 మందికి వీరి సేవలను గుర్తించి తన వంతు సహాయంగా చేతికి గ్లౌజులు ,శానిటేషన్ కిట్లు అందించారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...