కక్షసాధింపు చర్యలు మానుకోవాలి
గాజువాక, పెన్ పవర్
రాష్ట్రంలో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే వారిని వేధించి,వారిపట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతోందనే చెప్పాలి నిన్నమొన్నటివరకు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై గొంతెత్తిన తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమకేసులు బనాయించి వేధింపులకు పాల్పడ్డారు.ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తూ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నివారణలో ప్రభుత్వ వైఫల్యాలను నిర్భయంగా బయటపెట్టిన వైద్యుడిని సస్పెండ్ చేయటం రాష్ట్రంలో నిరంకుశ పాలనకు అద్దం పడుతోంది. రాజ్యాంగం కల్పించిన బావప్రకటనా స్వేచ్ఛను సైతం హరించేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.ఇప్పటికే ప్రభుత్వపు నిర్లక్ష్యపు వైఖరి కారణంగా రోగులకు సేవలందిస్తున్న వైద్యులకు కరోనా వైరస్ సోకిన దురదృష్ట సంఘటన నెల్లూరులో జరిగింది.ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ వైద్యుడు బయటపెట్టిన లోపాలను సరిదిద్దాలి కానీ ఈ ప్రభుత్వం అలా చేయకుండా ప్రాణాలకు తెగించి మరీ కరోనా వైరస్ బాధితులకు ఆయన చేసిన సేవలకు గాను
దళిత వర్గానికి చెందిన ఆ వైద్యునికి సస్పెన్షన్ ను బహుమతిగా ఇచ్చారు.అధికారం ఉంది కదా అని జరుగుతున్న తప్పులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురి చేయటం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.డాక్టర్ సస్పెన్షన్ విషయంలో ప్రభుత్వ తీరును తెలుగుదేశం పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం గాజువాక ప్రాంతంలో నెలకొన్న భయానక పరిస్థితులు ప్రభుత్వ పెద్దలు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్ధంగా మారింది..విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచుతున్నాం..వాలంటీర్ల ద్వారా సంపూర్ణ సమాచారాన్ని సేకరిస్తున్నాం అంటూ పదేపదే చెపుతున్న నాయకులు గాజువాకలో పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఎలా విడిచిపెట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.అప్పటికే ఆలస్యంగా ఈ నెల రెండవ తేదీన బాధితుడికి పరీక్షలు నిర్వహించిన అనంతరం అధికారులు సదరు బాధితుడిని కనీసం క్వారంటైన్ లో ఉంచకుండా బయటకు వదిలిపెట్టడంలో అధికారుల ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి..! ఆ వ్యక్తి బయట తిరగటం ద్వారా వైరస్ మరింత మందికి సోకే అవకాశం ఉండటంతో గాజువాక ప్రాంత ప్రజలంతా బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. అధికారం చేపట్టిన నాటి నుండి పారదర్శకత లేని పాలనతో ప్రజలను అయోమయానికి గురి చేసిన వైసిపి ప్రభుత్వం ఇప్పుడు వైరస్ నియంత్రణలోనూ అదే వైఖరిని అవలంబిస్తుంది దాని పర్యావసానంగానే కర్నూలులో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు. నిదర్శనం అని అన్నారు.
కేవలం చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేయటమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న అధికార పార్టీ నాయకులు మెడ్ టెక్ జోన్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని గుండెలు బాదుకున్నారు.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అవే మెడ్ టెక్ జోన్లు దేశానికే తలమానికంగా నిలిచాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో వాటి నుంచే మనకు అవసరమైన మాస్కులు వెంటిలేటర్లు వస్తున్న పరిస్థితి నెలకొంది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజన్ ఉన్న నాయకుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు ముందుచూపుతో విభిన్న తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఆ మెడ్ టెక్ జోన్లు. ఆయన ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలపై అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు తొమ్మిది నెలలపాటు నిర్లక్ష్యం చేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు వాటిమీద దృష్టి పెట్టి తామేదో అంతా సాధించినట్లు మీడియా ముందు గొప్పలు మాట్లాడుతూ పబ్లిసిటీ పాలన సాగిస్తున్నారు.నాడు 1998 లో చంద్రబాబు హయాంలో ఏర్పడిన హైటెక్ సిటీ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్శిస్తే ఇప్పుడు ఆయన జీవం పోసిన మెడ్ టెక్ జోన్ల వైపు దేశమంతా చూస్తోంది అది గౌరవ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి పరిపాలనా దక్షత. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిపై నిరాదార ఆరోపణలు,పసలేని విమర్శలు చేయడం మాని ఆయన ఆలోచనలకు ప్రతిరూపమైన మెడ్ టెక్ జోన్ల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలి.