అడ్డతీగల, పెన్ పవర్
మానవ సేవే మాధవ సేవ మార్గంగా పవనగిరి క్షేత్రం సేవలు అందిస్తుందని ఆలయ వ్యవస్థాపకులు తణుకు వెంకటరామయ్య తెలిపారు. స్థానిక పవనగిరి ఆలయం వద్ద బుధవారం నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సానిటైజర్ తో వారి చేతులని,శుభ్రం చేయించి , కూరగాయలు, అరటిపళ్ళు, మాస్కులు పంపిణీ చేశారు. సుమారు 50 కుటుంబాల తోలుబొమ్మలాట కళాకారులకు నేడు బియ్యం పంపిణీ చేస్తామని వెంకటరామయ్య తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న సమయంలో దాతలు ముందుకువచ్చి ఇలా సేవలందించాలని, పవనగిరి సేవలని అభినందించారు . ఎస్సై బాబురావు, కమిటీ మెంబర్లు శ్రీను, మాన్ శ్రీను, సత్యవేణి ,బేబీ, ఆదినారాయణ,పి ఈ టీ లు నాగమణి , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.