ఎటపాక.పెన్ పవర్
పెన్ పవర్, కూనవరం
ప్రకృతిని ఆరాధ్య దైవంగా భావించి గుట్టలపైనే ఆవాసాలు ఏర్పరుచుకుని జీవించే కొండరెడ్లు కరోనా వైరస్ మహమ్మారి ఎక్కడ సోకుతుందెమొనని గుట్టపై నుండి క్రిందకు రాకుండా ఆవాసాలకే పరిమితం అయ్యారు. నిత్యావసర వస్తువులు లేక ఇబ్బందులకు గురవుతుండం గమనించిన కూనవరం మీడియా ఆధ్వర్యంలో మంగళవారం నాడు ముఖ్యఅతిథిగా చింతూరు పిఓ ఆకుల వెంకటరమణను ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా 150 కుటుంబాలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీడియా మిత్రులు ముందుకు వచ్చి తమ వంతుగా కొండరెడ్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ వంతుగా పేదవారికి సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన బ్లాక్ డౌన్ కార్యక్రమని ప్రతి ఒక్కరూ తమంతట తాముగా స్వీయ నిర్బంధం పాటించినట్లయితే కోవిడ్ 19ని మనదేశం నుండి మన పట్టణం నుండి మన గ్రామం నుండి తడిమివేయడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్తవారు వచ్చినట్లయితే గ్రామ వాలంటరీలకు వెంటనే సమాచారం తెలియపరచాలని, ఎవరైనా జలుబు, దగ్గు, ఆయాసం, తుమ్ములు వచ్చినట్లయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సంప్రదించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చేతులను 20సెకన్ల పాటు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి, బయటి నుంచి ఇంటికి వచ్చినట్లయితే ముందుగా కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని లోపలికి వెళ్లాలని తెలిపారు. వి.ఆర్.పురం సాక్షి రిపోర్టర్ అశోక్ స్వచ్ఛందంగా కొండరెడ్లకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ కె వి ఎల్ నారాయణ, ఎంపీడీవో సత్యనారాయణమూర్తి, ఎస్సై గుణశేఖర్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ చారి, మీడియా మిత్రులు సాక్షి రిపోర్టర్ కోట బాబురావు, ఏబీఎన్ సత్యనారాయణ, విజన్ యండి భాష,ఆంధ్రభూమి బెల్లంకొండ లోకేష్, పెన్ పవర్ వేమన సతీష్, విశాలాంధ్ర నెల్లూరు రమేష్, కోస్తా సమయం గడ్డ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
61 రోజుల పాటు సముద్ర చేపల వేట నిషేధం
మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత
విజయనగరం, పెన్ పవర్
సముద్రంలో చేపల వేటను ఈనెల 15 నుండి జూన్ 14వ తేది వరకు 61 రోజులపాటు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ (జిఓఆర్టి నెం .80, పశు సంవర్దక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ, తేది 26.3.2020) జారీచేసిందని మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత తెలిపారు. సాంప్రదాయ బోటులకు (ఇంజను లేని పడవలకు) ఈ నిషేద కాలము వర్తించదన్నారు.
చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలములో తల్లి చేపలు, రొయ్యలను సంరంక్షించుట, వాటి ఉత్పత్తిని పెంచుట తద్వారా మత్స్య సంపద అభివృద్ది సాధించుట ముఖ్య ఉద్దేశ్యంగా ప్రతి సంవత్సరం ఈ వేట నిషేద కాలాన్ని పాటించడం జరుగుతుందన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను అనుసరించి మెకనైజడ్, మోటరైజడ్ బోట్లు వినియోగించి సముద్ర జలాలలో చేపల వేట చేయరాదన్నారు. వేట నిషేద ఉత్తర్వులు ఉల్లంఘించిన బోటు యజమానులపై ఎపిఎంఎఫ్ఆర్ చట్టం 1994 ప్రకారం చర్య తీసుకోబడుతుందన్నారు. బోటు యజమానులందరూ ఈ నిషేద ఉత్తర్వులు పాటించాలని ఆమె కోరారు.
విజయనగరం, పెన్ పవర్
గ్రామాలు, పట్టణాల్లోకి ఇతర ప్రాంతాల నుండి కొత్తవారు ఎవరైనా వచ్చినట్లయితే సంబంధిత సమాచారాన్ని గ్రామ సచివాలయానికి అందజేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కరోనా నిరోధించడంలో అందరి సహకారం అవసరమని, ఈ సమాచారం యంత్రాంగానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన వారి వివరాలు దాచి ఉంచకుండా తెలియజేస్తే వారికి ఆరోగ్య తనిఖీలు నిర్వహించి వారి కారణంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారికి కరోనా ముప్పు లేకుండా చూసేందుకే ఈ విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా రసాయనాలు జోడిస్తున్న జివిఎంసి పారిశుద్ధ్య అధికారులు,
విశాఖపట్నం, పెన్ పవర్
కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు గుర్తించిన వారి నివాసం ఉండే ప్రాంతాల నుండి 5 కి.మీ పరిధి వరకు కంటికి రెప్పలా పారిశుద్ధ్య పనులు, రసాయనాలు చల్లడం వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని కమిషనర్ డా.జి.సృజన ముఖ్యవైద్య ఆరోగ్యశాఖాధికారి, బయాలజిస్టును మరియు అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లును ఆదేశించారు. ప్రస్తుతం చాలా కఠినమైన గడియలు నడుస్తున్నందువలన, ప్రజలు కరోనా బారీ నుండి రక్షించుకొనే నిమిత్తం, జివిఎంసి తరపున తగినంత సేవచేయాలని, నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు పారిశుద్ధ్య కార్మికుడు నుండి పై స్థాయి ఆరోగ్య అధికారులు వరకు సమస్యాత్మక ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు మరింత కష్టపడి పనిచేయాలని కోరారు. కమిషనర్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా, కరోనా సమస్యాత్మక ప్రాంతాలైన నాలుగవ జోన్లోని తాటి చెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో, గాజువాకలోని ఉడాకాలనీ, కుంచమాంబకాలనీ పరిసర ప్రాంతాల్లో, రెండవజోన్లోని అక్కయ్యపాలెం మెయిన్ రోడ్ పరిసర ప్రాంతాల్లోను వాహాన యంత్రాల ద్వారా రసాయనాలు జివిఎంసి బయాలజిస్టు, ఆయా జోన్ల అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు ఆధ్వర్యంలో విస్తృతంగా జల్లించారు. రసాయనాలు విరివిగా జల్లించడం పై ఆయా ప్రాంతాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...