Followers

విలేకరులకు నిత్యావసర వస్తువుల పంపిణీ..


 





ఆర్.ఎమ్.ఎమ్.ఎ ఆధ్వర్యంలో  విలేకరులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

 

 రూ 72,500  విలువైన నిత్యవసర వస్తువులు పంపిణీ

 

దాతల సహాయం అభినందనీయం - సిఐ వి.కృష్ణ

 

రావులపాలెం, పెన్ పవర్

 

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలు చేస్తుండడంతో రావులపాలెం మండల మీడియా అసోసియేషన్ (ఆర్.ఎం.ఎం.ఏ) ఆధ్వర్యంలో విలేకరులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మంగళవారం రావులపాలెం లోని అసోసియేషన్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సి.ఐ వి.కృష్ణ, మండల అభివృద్ధి అధికారి, జి రాజేంద్రప్రసాద్, తహసీల్దారు యూసుఫ్ జిలానీ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా 22  మంది  విలేకరులకు ఒక్కొక్కరికి 50 కేజీల బియ్యం,ఆయిల్ 3లీటర్లు, ఒక కేజీ పంచదార, ఒక కేజీ కందిపప్పు,  ఒక కేజీ గోధుమ పిండి, ఒక కేజీ బెల్లం, ఒక కేజీ చింతపండు ఐదు కేజీల ఉల్లిపాయలు, ఒక కెజి కరాచీ నూక చొప్పున  అందజేశారు.  ఈ సందర్బంగా సిఐ కృష్ణ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందడంతో ప్రభుత్వం విధించిన  లాక్ డౌన్ కారణంగా సమాజంలో ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న  విలేకరులు తీవ్ర ఇబ్బందులకు గురికావడంతో వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో  గ్రామస్థులు స్వచ్ఛందంగా  సహాయం అందించటం  అభినందనీయమన్నారు. ఈ సంధర్భంగా రూ. 72,500 తో  నిత్యవసర వస్తువులు సమకూర్చిన దాతలు స్వగృహ కనస్ట్రక్షన్స్ అధినేత కర్రి వీర్రెడ్డి, వాడపల్లి దేవస్థానం చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, మాజీ ఎంపిటీసి కుడిపూడి శ్రీనివాస్ , టింబర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతంశెట్టి కనికిరెడ్డి మాజీ ఉప సర్పంచ్ అధికారి నాగేశ్వరరావు, రాచకొండ శ్రీనివాస్, ఎమ్.ఎస్, కొవ్వూరి అప్పారెడ్డి, 

భాస్కర స్వీట్స్ గొలుగూరి సోమిరెడ్డి , మన్యం సుబ్రహ్మణ్యం, కర్రి సుబ్బారెడ్డి, యస్. రామకృష్ణంరాజు, కోట చెల్లయ్య, భమిడిపాటి శ్రీనివాసరావులకు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చెల్లుబోయిన ఉమామహేశ్వరరావు, కొండేటి గంగాధర్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ జగజ్జీవన్ రావ్ గౌరవ అధ్యక్షులు కోటిపల్లి రామారావు, వైస్ ప్రెసిడెంట్ చిర్రా నాగరాజు, సంయుక్త కార్యదర్శి ఉందుర్తి సురేష్, కోశాధికారి దొండపాటి మూర్తి , కార్యవర్గ సభ్యులు గుత్తుల శ్రీనివాస్, కోనాల వెంకట్రావు, వెంకటేశ్వరరావు, మండపాటి గంగాధర్, ఆనంద్, చిట్టూరి నాగరాజు,   జాలాది సహదేవుడు, ఎల్.ఐ.సి నాగరాజు, గండ్రోతు సురేష్ తదితరులు పాల్గొన్నారు.


 

 



 

61 రోజుల పాటు సముద్ర చేపల వేట నిషేధం


 


61 రోజుల పాటు సముద్ర చేపల వేట నిషేధం


మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత


విజయనగరం, పెన్ పవర్ 


  సముద్రంలో చేపల వేటను ఈనెల 15 నుండి జూన్ 14వ తేది వరకు 61 రోజులపాటు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ (జిఓఆర్టి నెం .80, పశు సంవర్దక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ, తేది 26.3.2020) జారీచేసిందని మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత తెలిపారు.  సాంప్రదాయ బోటులకు (ఇంజను లేని పడవలకు)  ఈ నిషేద కాలము వర్తించదన్నారు. 


        చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలములో తల్లి చేపలు, రొయ్యలను సంరంక్షించుట, వాటి ఉత్పత్తిని పెంచుట తద్వారా మత్స్య సంపద అభివృద్ది సాధించుట ముఖ్య ఉద్దేశ్యంగా  ప్రతి సంవత్సరం ఈ వేట నిషేద కాలాన్ని పాటించడం జరుగుతుందన్నారు.  ఈ నిషేధ ఉత్తర్వులను అనుసరించి మెకనైజడ్, మోటరైజడ్ బోట్లు వినియోగించి సముద్ర జలాలలో చేపల వేట చేయరాదన్నారు.  వేట నిషేద ఉత్తర్వులు ఉల్లంఘించిన బోటు యజమానులపై ఎపిఎంఎఫ్ఆర్ చట్టం 1994 ప్రకారం చర్య తీసుకోబడుతుందన్నారు.  బోటు యజమానులందరూ ఈ నిషేద ఉత్తర్వులు పాటించాలని ఆమె కోరారు.


కొత్తవారు ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వండి : జిల్లా కలెక్టర్


 


 


విజయనగరం, పెన్ పవర్ 


 


గ్రామాలు, పట్టణాల్లోకి ఇతర ప్రాంతాల నుండి కొత్తవారు ఎవరైనా వచ్చినట్లయితే సంబంధిత సమాచారాన్ని గ్రామ సచివాలయానికి అందజేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.  కరోనా నిరోధించడంలో అందరి సహకారం అవసరమని, ఈ సమాచారం యంత్రాంగానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన వారి వివరాలు దాచి ఉంచకుండా తెలియజేస్తే వారికి ఆరోగ్య తనిఖీలు నిర్వహించి వారి కారణంగా  వారి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారికి కరోనా ముప్పు లేకుండా చూసేందుకే ఈ విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. 


సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా రసాయనాలు జోడిస్తున్న జివిఎంసి పారిశుద్ధ్య అధికారులు,


 


 


 సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా రసాయనాలు జోడిస్తున్న జివిఎంసి పారిశుద్ధ్య అధికారులు,


 


విశాఖపట్నం, పెన్ పవర్ 


 


 కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు గుర్తించిన వారి నివాసం ఉండే ప్రాంతాల నుండి 5 కి.మీ పరిధి వరకు కంటికి రెప్పలా పారిశుద్ధ్య  పనులు, రసాయనాలు చల్లడం వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని కమిషనర్ డా.జి.సృజన ముఖ్యవైద్య ఆరోగ్యశాఖాధికారి, బయాలజిస్టును మరియు అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లును ఆదేశించారు. ప్రస్తుతం చాలా కఠినమైన గడియలు నడుస్తున్నందువలన, ప్రజలు కరోనా బారీ నుండి రక్షించుకొనే నిమిత్తం, జివిఎంసి తరపున తగినంత సేవచేయాలని, నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు పారిశుద్ధ్య కార్మికుడు నుండి పై స్థాయి ఆరోగ్య అధికారులు వరకు సమస్యాత్మక ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు మరింత కష్టపడి పనిచేయాలని కోరారు. కమిషనర్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా, కరోనా సమస్యాత్మక ప్రాంతాలైన నాలుగవ జోన్‌లోని తాటి చెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో, గాజువాకలోని ఉడాకాలనీ, కుంచమాంబకాలనీ పరిసర ప్రాంతాల్లో, రెండవజోన్లోని అక్కయ్యపాలెం మెయిన్ రోడ్ పరిసర ప్రాంతాల్లోను వాహాన యంత్రాల ద్వారా రసాయనాలు జివిఎంసి బయాలజిస్టు, ఆయా జోన్ల అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు ఆధ్వర్యంలో విస్తృతంగా జల్లించారు. రసాయనాలు విరివిగా జల్లించడం పై ఆయా ప్రాంతాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.


వేకాటాపరం గ్రామంలో సోడియం హైపో క్లోరైడ్ పిచికారీ


 


వేకాటాపరం గ్రామంలో సోడియం హైపో క్లోరైడ్ పిచికారీ చేసిన  వైసిపి నాయకులు


          మునగపాక పెన్ పవర్

 

మునగపాక మండలం:వెంకటాపురం గ్రామంలో బుధవారం నాడు స్థానిక వైసీపీ నాయకులు సుందరపు తాతాజీ,బొమ్మిరెడ్డి పల్లి వీర భద్దర్రావు ల పర్యవేక్షణ లో ఆర్ హెచ్ ఐ క్లాసిల్ కంపెనీ వారు అందించిన 50 లీటర్ల సోడియం హైపో క్లోరైడ్ ద్రావకాన్ని గ్రామంలో విధుల్లో,ఎస్సీ కాలని వీధుల్లో పిచికారీ చేసినట్లు సుందరపు తాతాజీ తెలియ జేశారు.

లాక్ డౌన్  అమల్లో పోలీసుల పనితీరు బాగుంది


లాక్ డౌన్  అమల్లో పోలీసుల పనితీరు బాగుంది

 

-- అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

లాక్ డౌన్ ను పోలీసులు పక్కాగా అమలు చేయడం లో సక్సెస్ అయ్యారని అడిషనల్ డిజిపి పి.వి సునీల్ కుమార్ పేర్కొన్నారు. వారికి ప్రజల నుంచి కూడా చక్కని సహకారం అందించడం తోనే అది సాధ్యపడింది అన్నారు. బుధవారం అనకాపల్లి లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వ్యాధి నివారణకు లాక్ డౌన్ లోడ్ పక్కాగా అమలు చేయడంతనే ఎదుర్కోగలం అని సూసూచించారు. ప్రజల ప్రాణాల కోసమే ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుందని దీన్ని అందరు సమైక్యంగా దీనిని మరింత పకడ్బందీగా పాటించి ఈ వ్యాధిని తరిమి కొట్టాలన్నారు.  కరోనా వైరస్ నియంత్రణ లాక్  డౌన్ అమలు మూడు జిల్లాలలో  బావుందన్నారు. అనకాపల్లి  మండలం కన్నూరు పాలెం వద్ద కొత్తగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనకాపల్లి  డి.ఎస్.పి  ఆధ్వర్యంలో ఈ చెక్ పోస్ట్ పనిచేస్తుందనారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి తమకు బాగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. 

మూడు జిల్లాల పోలీసుల పని తీరుపై ఎటువంటి ఫిర్యాదులు లేవనారు. ఆకతాయిలు రోడ్డుపైకి అనవసరంగా వస్తే కేసులు నమోదు తప్పదన్నారు. ప్రజల ప్రయోజనాల కోసమే అంటువ్యాధుల చట్టం ప్రకారం కేసు నమోదు ఉంటాయన్నారు. 188 ఐ పి సీ  , 269ఐ పి సీ, 270 ఐ పి సీ,  తదితర చట్టాలను అమలు చేస్తున్నామనారు. సమావేశంలో డిఎస్పీ శ్రావణి, సి.ఐలు భాస్కరరావు, నరసింహారావు, ఎస్. ఐ లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విలేకరులకు నిత్యావసర సరుకుల ను పంపిణీ


విలేకరులకు నిత్యావసర సరుకుల ను పంపిణీ చేసిన జనసేన సైనికులు


           పరవాడ పెన్ పవర్

 

 

పరవాడ మండలం 79 వ వార్డ్ కార్పొరేటర్ జనసేన అభ్యర్థి అయిన కింతాడా ఈశ్వరరావు సొంత నిధులతో మండలం లోని ప్రిన్ట్ మరియు ఎలక్ట్రానిక్ విలేకరులకు నిత్యావసర సరుకులు,కూరగాయలను పంపిణీ చేశారు.బుధవారం సాయంత్రం జివిఎంసి పరిధిలోని లంకెలపాలెం లో జరిగిన కార్యక్రమంలో ఈశ్వరరావు విలేకరులకు నిత్యావసర వస్తువుల ను అందించి న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతు.ప్రపంచ మంతా కరోనా మహమ్మారి విజ్రంభిస్తున్న తరుణంలో సామాన్యులకు కూడా ప్రపంచంలో ని దేశం లోని కరోనా విషయాలు ఎప్పటి కప్పుడు తెలియ చేస్తూ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకునేలా చేతన్య వంతులను చేసే గురుతర భాద్యతను నిర్వహిస్తోంది మాత్రం మీడియానే అని అన్నారు.    దేశం లో లాక్ డవున్ ఉన్న పరిస్థితుల్లో   వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ,పారిశుద్ధ్య కార్మికులు లతో పాటు మీడియా చేస్తున్న కృషి ప్రశంసనీయం అని అన్నారు.ప్రజలను ఎప్పటి కప్పుడు అప్రమత్తం చేస్తూ కరోనా బారిన పడకుండా తీసుకోవలిసిన జాగ్రత్తలు తమ వార్తల ద్వారా చెపుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో వుండే ఒకే ఒక వ్యవస్థ మిడియానే అని ప్రశoశించారు.మీడియా మిత్రులు ఈ విపత్కర పరిస్థితుల్లో చాలా కష్ట పడుతున్నారు అని వారి సేవలను రాజకీయ ప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎప్పటికి మర్చి పోలేరు అని ఆయన అన్నారు.లాక్ డవున్ వల్ల 

ఉపాధి కోల్పోయిన నిరుపేదల తో పాటు మీడియా వారికి తాను చేయగలిన దానిలో సాయంగా నిత్యావసర సరుకుల ను అందిచడం జరిగింది అన్నారు.79 వవార్డు అగనంపూడి,లంకెలపాలెం, దేశాపాత్రుని పాలెం లో ప్రతి ఇంటికి జనసేన సైనికులు తమ వంతు బాధ్యతగా వారి వ్యక్తిగత నిధులు వెచ్చించి కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది అని తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో సర్వసిద్ధ సన్యాసి రాజు,పిల్లి శివకృష్ణ,నక్క శ్రీనివాస్,రాయి రమణ,గంటల రామారావు,కాంతారావు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...