వేకాటాపరం గ్రామంలో సోడియం హైపో క్లోరైడ్ పిచికారీ చేసిన వైసిపి నాయకులు
వేకాటాపరం గ్రామంలో సోడియం హైపో క్లోరైడ్ పిచికారీ చేసిన వైసిపి నాయకులు
విలేకరులకు నిత్యావసర సరుకుల ను పంపిణీ చేసిన జనసేన సైనికులు
హైట్రో డ్రగ్స్ రసాయన ట్యాంకు లో ప్రమాదానికి గురైన ఇద్దరు ఉద్యోగులు..
ఒకరు మృతి మరొకరికి ఆసుపత్రిలో చికిత్స.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
హెటోరో ఔషధ పరిశ్రమలో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒక ఉద్యోగి మృతిచెందగా రెండో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. జిల్లాలోని నక్కపల్లి మండలంలోని హెటోరొ ఔషధ కర్మాగారంలో రసాయన ట్యాంకు శుద్ధి చేస్తుండగా జూనియర్ కెమిస్ట్రీ గాడి శ్రీను 29 షిఫ్టు ఇంచార్జ్ యు ఎన్ అప్పారావు నైట్రోజన్ ప్రభావం వల్ల అపస్మారక స్థితిలో ట్యాంకులో పడిపోయారు. వీరిని విశాఖ ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రీను మార్గమధ్యంలో మృతిచెందాడు. నక్కపల్లి ఎస్ ఐ శివరామకృష్ణ అందిన సమాచారం మేరకు తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం కెఏ మల్లవరం గ్రామానికి చెందిన గాడి శ్రీను హెటిరో డ్రగ్స్ కంపెనీలో జూనియర్ కెమిస్ట్రీ గా పని చేస్తున్నాడు. యధావిధిగా విధులకు హాజరైన శ్రీను యూనిట్ 3 హెచ్ బ్లాకులో రసాయన ట్యాంకు శుభ్రం చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంకు హెడ్ శుభ్రం చేసి ట్యాంకులో దిగిన శ్రీను నైట్రోజన్ ప్రభావానికి గురై ట్యాంకులో పడిపోయాడు. అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన షిఫ్ట్ ఇంచార్జ్ యు ఎం అప్పారావు కూడా ట్యాంకు లొ పడిపోయాడు. గమనించిన సీనియర్ కెమిస్ట్రీ సిబ్బంది సహాయంతో ఇద్దరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. శ్రీను మార్గమధ్యలో మృతిచెందగా అప్పారావు వైద్యం అందుకుంటున్నాడు. మృతుడు శ్రీనుకు రోలుగుంట మండలం లింగాపురం కు చెందిన రోహిణి కుమారితో డిసెంబర్ 11న వివాహమైంది. విధులు నిర్వహించే ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్నందున శ్రీను అత్తారింట్లో మకాం పెట్టాడు. పెళ్లై నాలుగు నెలలు గడవక ముందే తన భర్త కాన రాని లోకాలకు తరలి పోయాడు అని భార్య రోహిణి విలపించింది.
బైకును ఢీకొన్న లారీ. మహిళ మృతి
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
నగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. బిర్లా జంక్షన్ నుండి ఎన్ఏడి జంక్షన్ వైపు బైక్ పై భార్యాభర్తలు వెళ్తున్నారు. ఆ సమయంలో ఎన్ఏడి వైపునుంచి తౌడు లోడుతో నగరంలో కి వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో అప్పల నరసమ్మ 23 లారీ కింద పడి మృతి చెందింది. బైకు లారీ ఢీకొట్టడంతో ఆమె లారీ టైరు కింద పడిపోయింది. లారీ కొంత దూరం ఆమెను ఈడ్చుకు పోయింది. ఈ సంఘటనలో తల నుజ్జునుజ్జయింది. కళ్ళముందే కట్టుకున్న భార్య లారీ కింద పడి చనిపోయిన సంఘటన భర్త జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు బాదుకుని విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిబంధనలు అతిక్రమించిన వారిపై 1772 కేసులు నమోదు. ఎస్పి అట్టాడ బాబూజీ.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
జిల్లాలో నిబంధనలు అతిక్రమించిన వారిపై 1772 కేసులు నమోదు చేశామని జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అట్టాడ బాబూజీ తెలిపారు. కరోనా లాక్ డౌన్ సందర్భంగా కట్టు దిట్టమైన చర్యలు అమ్మలు జరుగుతుంటే కొందరు నిర్లక్ష్యంగా కోవిడ్ 19 నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారంగా రోడ్లపై సంచరిస్తున్నారు అని ఆయన విచారం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని దీనిని పాటించాల్సిన ప్రజలు అధికారులకు తలనొప్పిగా మారారని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను కట్టడి చేయటానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడమే కాకుండా 138 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. 19వాహనాలను స్వాధీనం చేసుకొని ఉంచమన్నారు. అపరాధ రుసుము ఎంత 11 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగిందని ఇకపై ఎవరు చట్టాన్ని ఉల్లంఘించిన సహించేది లేదని సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ బాబూజీ ఒక ప్రకటన విడుదల చేశారు
విశాఖ ఏజెన్సీలో మాటలకే పరిమితం అయిన గ్యాస్ హోమ్ డెలివరీ....
పాడేరు (పెన్ పవర్)
విశాఖ జిల్లా.పాడేరులో కరోనా.ప్రభావంతో ప్రతి ఇంటికి ఇంటికి గ్యాస్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు అమలు విషయంలో చోద్యం చూస్తున్నారు. ఐటిడిఎ గ్యాస్ సిబ్బంది ఇదే అవకాశంగా చేసుకొని గ్యాస్ బండ 800 రూపాయలుగా అంగట్లో అమ్ముకుంటున్నారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో 11 మండలాలో ప్రతి ఒక్క పౌరుడు బయటకు రావద్దని... అందరూ ఇంట్లోనే ఉండాలని ప్రతి ఇంటికి ఇంటికి గ్యాస్ సరఫరా చేస్తామని గతంలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి డి.కె.బాలాజీ ప్రకటన రూపంలో హామీ ఇచ్చారు. ఇప్పటివరకు గ్యాస్ సరఫరా కాదు కదా ఆ ప్రస్తావనే లేదు. ఏజెన్సీ ప్రాంతంలో పాలు నీళ్లు కూరగాయలు గ్యాస్ నిత్యవసర సరుకులు ప్రతి పేదవాడికి ఇంటికి చేరాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఇంటికి గ్యాస్ డోర్ డెలివరీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఏజెన్సీ వాసులు వినియోగదారులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రకటనలు హామీలు తప్ప అమలు చేయటం లేదని పాడేరు ప్రజలు అంటున్నారు. పాడేరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం6 గంటలు నుండి గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే డెలివరీ ఛార్జ్ పేరుతో 30 రూపాయలు అదనంగా వినియోగదారుల నుండి వసూలు చేస్తున్నారు. మొత్తంగా 800 రూపాయలు ముక్కుపిండి నిర్భయంగా వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు తెలిసే ఈవిధంగా జరుగుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...