Followers

ఇంటి అవసరాలకు బయటకు వెళ్లేవారు   ఆధార్ తప్పనిసరి


ఇంటి అవసరాలకు బయటకు వెళ్లేవారు   ఆధార్ తప్పనిసరి.   కమిషనర్ ఆర్కె మీనా


 


స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం( పెన్ పవర్)  


 


ఇంటి అవసరాలకు  రోడ్ల పైకి వచ్చే వారు  తప్పకుండా  ఆధార్  కార్డు కలిగి ఉండాలని  విశాఖ నగర పోలీస్ కమిషనర్  ఆర్కె మీనా  అన్నారు. బుధవారం  నగరంలో  భద్రతా చర్యల పై  ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య ప్రజలు  ఏంటి అవసరాలకు  రోడ్లపైకి  వచ్చే వెసులుబాటు  కల్పించారు.  ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా వైరస్ ప్రభావం నియంత్రణలో భాగంగా నగరంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశామన్నారు. మూడు గంటల పాటు  ఇంటి అవసరాలు తీర్చుకునే నిమిత్తం  రోడ్ల పైకి వచ్చే  ప్రజలు  తప్పక నిబంధనలు పాటించాలని  కోరారు. చక్ర వాహనం పై ఒకరు  ఫోర్ వీలర్ పై ఇద్దరు మాత్రమే   తిరగ వచ్చని  అన్నారు. నివాస గృహాలకు  2 నుంచి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న దుకాణాలలో మాత్రమే  ఉపయోగించుకోవాలని సూచించారు. ఏ ఒక్కరూ పరిమితి దాటిన  చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్ల పైకి వచ్చే ప్రతి ఒక్కరు   ఆధార్ కలిగి ఉండాలని  లేనిపక్షంలో   కేసులు తప్పవు అని ఆర్కె మీనా   తెలిపారు.


కోదండ‌రామునికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణ.


కోదండ‌రామునికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణ.



               కడప జిల్లా, పెన్ పవర్


 ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి  శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా  రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ  అసిస్టెంట్ కమిషనర్ శ్రీ శంకర్ బాలాజి  స్వామి వారికి పట్టువస్త్రాలు , ముత్యాల తలంబ్రాలు  సమర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ లోకనాథం, అర్చకస్వాములు, పాల్గొన్నారు...


ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ ల‌క్ష్యం 30వేల ట‌న్నులు


ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ ల‌క్ష్యం 30వేల ట‌న్నులు
జిల్లా వ్యాప్తంగా 40 కొనుగోలు కేంద్రాలు
ఈ నెలాఖ‌రుక‌ల్లా మిల్ల‌ర్లు సిఎంఆర్‌ను అప్ప‌గించాలి
జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్‌కుమార్‌


 


విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్ 


ర‌బీలో సుమారు 30వేల ట‌న్నుల ధాన్యం సేక‌ర‌ణ‌కు సిద్దం కావాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్‌కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. ర‌బీ ధాన్యం సేక‌ర‌ణ‌పై సంబంధిత అధికారులు, రైస్ మిల్ల‌ర్ల‌తో త‌న ఛాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా జెసి కిశోర్ మాట్లాడుతూ ర‌బీలో జిల్లాలో సుమారుగా 6,469 హెక్టార్ల‌లో వ‌రిపంట సాగ‌య్యింద‌న్నారు. దీనిద్వారా దాదాపు 32,409 మెట్రిక్ ట‌న్నుల ధాన్యం దిగుబ‌డి వ‌స్తుంద‌ని అంచ‌నా వేసిన‌ట్లు చెప్పారు. దీనిలో 30వేల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని సేక‌రించ‌డానికి ప్ర‌ణాళిక రూపొందించాల‌ని సూచించారు. దీనికోసం ధాన్యం పండిన ప్రాంతాల్లోనే 40 వ‌ర‌కూ కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని, ఈనెలాఖ‌రును వీటిని ప్రారంభించేందుకు సిద్దం చేయాల‌ని సూచించారు. ఖ‌రీఫ్ లో సేక‌రించిన ధాన్యానికి సంబంధించి ఇంకా 25శాతం వ‌ర‌కూ మిల్ల‌ర్ల‌నుంచి సిఎంఆర్ రావాల్సి ఉంద‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎఫ్‌సిఐకి 78వేల మెట్రిక్ ట‌న్నులు, సివిల్ స‌ప్ల‌యిస్ కార్పొరేష‌న్‌కు 60వేల ట‌న్నుల బియ్యాన్ని ఇచ్చార‌ని తెలిపారు. ఇంకా రావాల్సిన సుమారు 44వేల మెట్రిక్ ట‌న్నుల బియ్యాన్నీ,  ఈనెలాఖ‌రులోగా అంద‌జేయాల‌ని రైస్ మిల్ల‌ర్ల‌ను ఆదేశించారు. త‌మ‌కు రావాల్సిన బ‌కాయిల‌ను ఇప్పించాల‌ని ఈ సంద‌ర్భంగా మిల్ల‌ర్లు జెసికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ స‌మావేశంలో వ్య‌వ‌సాయ‌శాఖ జెడి ఎం.ఆశాదేవి, సివిల్ స‌ప్ల‌యిస్ జిల్లా మేనేజ‌ర్ వ‌ర‌కుమార్‌, డిఎస్ఓ ఏ.పాపారావు, డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు, మార్కెటింగ్ ఏడి శ్యామ్‌కుమార్‌, స‌హ‌కార అధికారి నారాయ‌ణ‌రావు, రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ జిల్లా అధ్య‌క్షులు కొండ‌పల్లి కొండ‌ల‌రావు, వ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.


ప్రభుత్వ డాక్టర్ ఆరోపణల వెనుక మాజీ మంత్రి అయ్యన్న హస్తం

 


 



 


ప్రభుత్వ డాక్టర్ ఆరోపణల వెనుక మాజీ మంత్రి అయ్యన్న హస్తం


నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్


నర్సీపట్నం, పెన్ పవర్ 


కరోనా వైరస్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని, అధికారుల ప్రతిష్టను దిగజార్చే విధంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రభుత్వ డాక్టర్ సుధాకర్ ని ఒక పావుల వాడుకున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్ ఆరోపించారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము నిర్వహిస్తున్న సమీక్ష సమావేశానికి ముందు ప్రభుత్వ డాక్టర్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి దాదాపు గంటన్నరసేపు ఆయనతో మంతనాలు సాగించారని ఆయన చెప్పిన స్క్రిప్టు ప్రకారం డాక్టర్ సుధాకర్ తన పాత్ర పోషించారని తెలిపారు. దానికి ఉదాహరణగా అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద పార్కింగ్ ప్లేస్ లో డాక్టర్ సుధాకర్ కారు దిగి మరల కారు ఎక్కి వెళుతున్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పాత్రికేయులకు చూపించారు. ఏరియా ఆసుపత్రిలో మాస్క్లులు, శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డాక్టర్ తీరుపై ప్రభుత్వానికి చర్యల కోసం సిఫార్సు చేయడం జరిగిందని, ఈ డాక్టర్ పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని లేఖ రాసినట్లు చెప్పారు.


రైతు మిత్ర ఏజెన్సీస్ ప్రో"రంబాల. కార్తీక్ ఆధ్వర్యంలో ఆదివాసులకు నిత్యవసర వస్తువులు అందజేత.


రైతు మిత్ర ఏజెన్సీస్ ప్రో"రంబాల. కార్తీక్ ఆధ్వర్యంలో ఆదివాసులకు నిత్యవసర వస్తువులు అందజేత.

ఎటపాక, పెన్ పవర్ 


ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజలకు ఏర్పడిన విపత్కర పరిస్థితులను బట్టి  ఎటపాక మండల పరిధిలోని లక్ష్మీపురం పంచాయతీలో గల మద్దిమడుగు,చింతలపాడు, పూసుగూడెం గ్రామాల్లోని ఆదివాసీలకు  ప్రస్తుత పరిస్థితుల్లో పనులు లేకపోవడంతో రైతు మిత్ర ఏజెన్సీస్ ప్రో " రంబాల .కార్తీక్, నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివాసీలకు నిత్యవసర వస్తువులైన కూరగాయలను వాళ్ల గ్రామాలకు వెళ్ళి రంబాల.కార్తీక్ చేతుల మీదుగా పంపిణి చేశారు .ఈ కార్యక్రమంలో రంబాల. కార్తీక్, గల్లా.శివ ,బద్దెపూడి.జాన్,డాక్టర్. శ్రీను ,రంబాల.రాహుల్,కట్ట.కార్తీక్ ,బొప్పని.  నరేష్ ,గ్రామ వాలంటరీ నాగేశ్వరరావు పాల్గొన్నారు .


స‌మాజ సేవ‌కు వైద్యులు ముందుకు రావాలి


స‌మాజ సేవ‌కు వైద్యులు ముందుకు రావాలి



ఇదొక సామాజిక బాధ్య‌త‌గా గుర్తించండి



జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌



 


విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్ 


ఈ క్లిష్ట స‌మ‌యంలో స‌మాజానికి సేవ‌చేసే బాధ్య‌త  ప్ర‌తీ డాక్ట‌ర్ పైనా ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌యివేటు వైద్యులంతా స్వ‌చ్ఛందంగా ముందుకు రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగ‌స్వాముల‌ను చేసేందుకు ప్ర‌యివేటు న‌ర్సింగ్  హోమ్ అసోసియేష‌న్‌, ఐఎంఏ ప్ర‌తినిధుల‌తో క‌లెక్ట‌రేట్‌లో మంగ‌ళ‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ క‌ట్టుధిట్ట‌మైన నియంత్ర‌ణా చ‌ర్య‌ల కార‌ణంగా ఇంత‌వర‌కూ మ‌న జిల్లా సుర‌క్షితంగా ఉంద‌న్నారు. గ్రామీణ ప్రాంతాల‌కు, ప‌ట్ట‌ణ ప్రాంతాలకూ వేర్వేరు వ్యూహాల‌ను అనుస‌రిస్తూ క‌రోనా క‌ట్ట‌డికి కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌ధానంగా  విజ‌య‌న‌గ‌రం లాంటి ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కొన్ని ర‌కాల ఇబ్బందులు  ఎదుర‌వుతున్నాయ‌ని, ఇలాంటి చోట వైద్యుల సేవ‌లు చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. అందువ‌ల్ల జిల్లా కేంద్రంలో ప్ర‌తీ డివిజ‌న్‌లో సేవ‌లందించేందుకు డాక్ట‌ర్లు ముందుకు వ‌చ్చి జాబితాను ఇవ్వాల‌ని కోరారు. వార్డు స‌హాయ‌కులు, వార్డు ఆరోగ్య కార్య‌క‌ర్త‌, శానిట‌రీ సిబ్బంది ప్ర‌తీరోజూ వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిస్థితిని వాక‌బు చేస్తున్నార‌ని చెప్పారు. వీరి స‌ర్వేలో ఎవ‌రికైనా జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించినవారికి, హైరిస్క్ వారికి త‌గిన ప‌రీక్షలు నిర్వ‌హించి అవ‌స‌ర‌మైత చికిత్స‌ను అందించేందుకు, ప్ర‌తీవార్డుకూ వైద్యులతో కూడిన బృందాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. దీనికి ప‌లువురు వైద్యులు అంగీకారం తెలిపి, బుధ‌వారం నాటికి జాబితాను అంద‌జేస్తామ‌ని చెప్పారు. ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్‌కుమార్‌, జెసి-2 ఆర్‌.కూర్మ‌నాధ్‌, డిఆర్ఓ జె.వెంక‌ట‌రావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్ వ‌ర్మ‌, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, కోవిడ్‌-19 ఆసుప‌త్రి వైద్యాధికారి సుబ్ర‌మ‌ణ్య హ‌రి కిష‌న్‌, ఐఎంఏ జిల్లా అధ్య‌క్షులు డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు, ఇంకా ప్ర‌ముఖ  వైద్యులు వెంక‌టేశ్వ‌ర్రావు, చిట్టిరామారావు, జెఎస్ నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.


రక్తదానం చేసిన జిల్లా కలెక్టర్ నివాస్


రక్తదానం చేసిన జిల్లా కలెక్టర్ నివాస్

 

శ్రీకాకుళం, పెన్ పవర్ 

 

జిల్లాలో రక్త యూనిట్ల నిల్వలు తగ్గిపోతున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో రక్త నిల్వలు తగ్గిపోవడం కొంత ఆందోళన కలిగించే విషయమం. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి ఛాయలు కనిపించకపోవడం సంతోషించదగిన విషయమే అయినప్పటికి ఎటువంటి పరిస్ధితినైనా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రక్త నిల్వలపై కూడా దృష్టి సారించారు జిల్లా కలెక్టర్ జె నివాస్. జిల్లాలో ప్రస్తుతం కేవలం 38 యూనిట్ల రక్త నిల్వలు ఉండటం వలన అత్యవసర పరిస్ధితిలో సరఫరా లేక ఇబ్బందులు ఎదురు అవుతాయని నేను సైతం అంటూ స్వయంగా రంగంలోకి దిగి రక్తదానానికి ముందుకు వచ్చారు నివాస్. కరోనా వ్యాప్తి నివారణ కార్యక్రమంలో ప్రణాళికలు సిద్ధం చేయడంలో తలమునకలై ఉన్నప్పటికి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కర్తవ్య నిర్వహణకు పూనుకున్నారు.  మంగళ వారం సాయంత్రం రెడ్ క్రాస్ రక్త సేకరణ కేంద్రానికి నేరుగా వచ్చి రక్త దానం నిర్వహించి ఆదర్శప్రాయంగా నిలిచారు. జిల్లాలో రక్త నిల్వలు తగ్గుముఖం పట్టడం జరుగుతోందని కలెక్టర్ నివాస్ అన్నారు. రక్త నిల్వలు పెంచాలని పిలుపునిచ్చారు. రోజు వారీ వైద్య చికిత్సల కార్యక్రమానికి కూడా కొరత ఏర్పడటం వలన ప్రాణాలు కాపాడుకోలేని అవకాశం ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో భాగంగా రక్త నిల్వలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ప్రతి రోజు ఉద్యోగులు రక్త దానం చేయుటకు చర్యలు చేపడతామని అన్నారు. ఈ మేరకు అన్ని శాఖలకు సూచనలు ఇస్తామని పేర్కొన్నారు. 

మేము సైతం :  జిల్లా కలెక్టర్ స్వయంగా రక్తదానం చేయడంతో మేము సైతం అంటూ జర్నలిస్టుల తరపున జెకెసి సీనియర్ పాత్రికేయులు ఎం.వి.ఎస్.ఎస్.శాస్త్రి రక్తదానం చేసి ఆదర్శప్రాయంగా నిలిచారు.  గుడ్ ఫ్రైడే ఇంటి వద్దనే : గుడ్ ఫ్రైడ్ ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని జిల్లాకలెక్టర్ పిలుపునిచ్చారు. చర్చిలకు వెళ్ళ వద్దని, ర్యాలీలు నిర్వహించరాదని ఆయన కోరారు. ఇటీవల ఉగాది, శ్రీరామ నవమి అందరూ ఇళ్ళ వద్దనే నిర్వహించుకున్నారని అదేవిధంగా గుడ్ ఫ్రైడేను నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ ఉందని, 144వ సెక్షన్ అమలులో ఉందని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ఇళ్ళలోనే ఉండాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన అన్నారు. 

అనంతరం పేదలకు రెడ్ క్రాస్ సంస్ధ తరపున నిత్యావసర సరుకులను జిల్లా కలెక్టర్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన రావు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, తహశీల్దారు దిలీప్ చక్రవర్తి, రెడ్ క్రాస్ సభ్యులు గీతా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...