Followers

పవనగిరి క్షేత్రంలో నిత్యావసర సరుకులు ఉచిత పంపిణీ


 


అడ్డతీగల, పెన్ పవర్ 


 


మానవ సేవే మాధవ సేవ మార్గంగా పవనగిరి క్షేత్రం సేవలు అందిస్తుందని ఆలయ వ్యవస్థాపకులు తణుకు వెంకటరామయ్య తెలిపారు. స్థానిక పవనగిరి ఆలయం వద్ద బుధవారం నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి  ఎస్ఐ నాగేశ్వరరావు ముఖ్య  అతిథిగా పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సానిటైజర్ తో వారి చేతులని,శుభ్రం చేయించి , కూరగాయలు, అరటిపళ్ళు, మాస్కులు పంపిణీ చేశారు. సుమారు 50 కుటుంబాల తోలుబొమ్మలాట కళాకారులకు నేడు బియ్యం పంపిణీ చేస్తామని వెంకటరామయ్య తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న సమయంలో దాతలు ముందుకువచ్చి ఇలా సేవలందించాలని, పవనగిరి సేవలని అభినందించారు . ఎస్సై బాబురావు, కమిటీ మెంబర్లు శ్రీను, మాన్ శ్రీను,  సత్యవేణి ,బేబీ, ఆదినారాయణ,పి ఈ టీ లు నాగమణి , శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.


అక్రమంగా నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు






అక్రమంగా నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎస్ఐ 

 

 

 

పెన్ పవర్,  గోపాలపురం

 

నాటు సారా తయారు చేసే వారిపై విక్రయా దారులపై కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వి.సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. బుధవారం మండలంలోని లాక్ డౌన్  కారణంగా స్థానిక ఎస్సై  మరియు పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కరిచర్లగూడెం శివారు మాతంగఅమ్మ గుడి వద్దకు వచ్చేసరికి ఏజెన్సీ ప్రాంతము నుండి ఒక మోటార్ బైక్ పై ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న  15 లీటర్ల నాటు సారాను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్దనున్న మోటార్ బైక్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


 

 



 



సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు మాస్క్ ల పంపిణీ



ఎటపాక, పెన్  పవర్


 


 సీపీఎం పార్టీ గుండాల శాఖ ఆధ్వర్యంలో 300 మాస్క్ లను ఉపాధి హామీ కూలీలకు, వ్యవసాయ కూలీలకు అందజేశారు.కరోన పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని,వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటిస్తూ పనులు చేసుకోవాలని పార్టీ నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో  ఐ వి, గంపల హరనాధ్, ఇరపా అజయ్, ఇరపా సత్యం, నూతలపాటి సుధాకర్, యడ్ల శ్రీను, తోట శ్రీను, గంపల సత్యవతి, తోట వెంకట రమణ , ఫీల్డ్ అసిస్టెంట్ ఐ. పద్మ పాల్గొన్నారు.


సచివాలయ సిబ్బంది కి పారిశుద్ధ్య కార్మికులకు బొమ్మరెడ్డి గంగాధర్ రెడ్డి శానిటేషన్ మా స్కూలు అందజేత.


సచివాలయ సిబ్బంది కి పారిశుద్ధ్య కార్మికులకు బొమ్మరెడ్డి గంగాధర్ రెడ్డి శానిటేషన్ మా స్కూలు అందజేత.

 

 

 

 

పెన్ పవర్,  గోపాలపురం

 

 

 

 పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో  కరోనా వైరస్ నియంత్రించేందుకు నిరంతరం సేవలు అందిస్తున్న అధికారులు అనధికారులు శ్రమ వెలకట్టలేనిదని డాక్టర్ బొమ్మ రెడ్డి గంగాధర్ రెడ్డి ( సుబ్బారెడ్డి) కొనియాడారు. బుధవారం గంగాధర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాధి ద్వారా ప్రపంచ దేశాలలో అనేక వేలమంది మృత్యువాత పడుతున్నారు. అదేవిధంగా మన దేశంలో కరోనా వైరస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 14వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించింది.ప్రజలు ప్రతి ఒక్కరూ ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది అని తెలిసిన ప్రభుత్వ యంత్రాంగం వైద్య సిబ్బంది డాక్టర్ నుండి ఆశ వర్కర్ వరకు ,పోలీస్ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది ,పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది, రెవెన్యూ యంత్రాంగం, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, పాత్రికేయులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సేవలు మరువలేనివి అని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, విలేఖర్లకు సుమారు 100 మందికి వీరి సేవలను గుర్తించి తన వంతు సహాయంగా చేతికి గ్లౌజులు ,శానిటేషన్ కిట్లు అందించారు.

ఆటా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ



 




ఆటా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ


ఎటపాక.పెన్ పవర్

 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకుగానూ భారతదేశ ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడాన్ని బట్టి ఎటపాక మండల పరిధిలోని పిచ్చుకలపాడు గ్రామపంచాయతీ - గుండం గ్రామంలోని ఆదివాసీలకు ప్రస్తుత పరిస్థితుల్లో పనులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా నేపధ్యంలో ఆట ఆధ్వర్యంలో గ్రామంలోని ఆదివాసీలకు నిత్యవసర వస్తువులైన కూరగాయలను అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ...వైరస్ వ్యాధి గురించి, లక్షణాలు, వ్యాప్తి, మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు మాస్క్ వాడకం, హ్యాండ్ వాష్  - విధానం , భౌతిక దూరం ఆవశ్యకత గురించి  అవగాహన కల్పించడం జరిగింది. ఆట రాష్ట్ర నాయకులు పూసం శ్రీను, జిల్లా నాయకులు కణితి రామకృష్ణ, నూప అనిల్, ఆదివాసీ మెడికల్ మరియు హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా నాయకులు గుజ్జ సీతమ్మ, సీనియర్ సిస్టర్ పి. అన్నపూర్ణ, హెల్త్ అసిస్టెంట్ పెనుబల్లి గంగరాజు సమానవ్యకర్త మడివి నెహ్రూ, నాయకులు పోడియం హరిబాబు, పండా కిరణ్, పోడియం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

 

 



 

విపత్తు సమయం లో మీడియా మిత్రులకు, ప్రజలకు సహాయం చెయ్యడం అభినందనీయం



విపత్తు సమయం లో మీడియా మిత్రులకు, ప్రజలకు సహాయం చెయ్యడం అభినందనీయం

 

పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు

 

పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జ్, పెన్ పవర్ 

 

 కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఇళ్ల కే పరిమితమైన పోలవరం మండలం గూటాల గ్రామం లో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి నిత్యవసర వస్తువులైన కూరగాయలను వైసిపి సీనియర్ నాయకులు సుంకర వెంకటరెడ్డి  అందజేశారు. ఇటువంటి  విపత్తు సమయాలలో సహాయం చేయడం అభినందనీయమని  పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం పోలవరం మండలం గూటాల పంచాయతీలో సుమారు 1500 కుటుంబాలకు సేంద్రియ పద్దతిలో పండించిన కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన డీఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బయటకు ఎవరూ తిరగకూడని పరిస్థితుల్లో నేరుగా ఇంటింటికీ కాయగూరలను పంచడం అభినందనీయమని వైసీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ సుంకర వెంకటరెడ్డిని ప్రసంసించారు. ఈ కార్యక్రమంలో పత్రికా విలేఖరులకు,మీడియా ప్రతినిధులకు నిత్యావసరాలు బియ్యం , కిరాణా, కూరగాయలను గూటాల ఎస్  వి ఆర్ గ్యారేజ్ సభ్యులు, సుంకర వెంకటరెడ్డి, గూటాల సొసైటీ అధ్యక్షులు సుంకర అంజిబాబు  అందజేశారు . ఈ కార్యక్రమంలో పోలవరం సిఐ అల్లు నవీన్ నరసింహమూర్తి, ఎస్ఐ ఆర్ శ్రీను , ఎంపీడీవో జే మన్మధరావు, పట్టిసీమ పంచాయతీ సెక్రెటరీ దత్తు, గూటాల వీఆర్వో ప్రసాద్, వైసీపీ నాయకులు, సుంకర అంజిబాబు,సుంకర కొండబాబు ,పండు ,తదితరులు పాల్గొన్నారు.

కొండ పై నివసించే కొండరెడ్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ



 


పెన్ పవర్, కూనవరం


ప్రకృతిని ఆరాధ్య దైవంగా భావించి గుట్టలపైనే  ఆవాసాలు ఏర్పరుచుకుని జీవించే కొండరెడ్లు కరోనా వైరస్  మహమ్మారి ఎక్కడ సోకుతుందెమొనని గుట్టపై నుండి క్రిందకు రాకుండా ఆవాసాలకే పరిమితం అయ్యారు. నిత్యావసర వస్తువులు లేక ఇబ్బందులకు గురవుతుండం గమనించిన కూనవరం మీడియా  ఆధ్వర్యంలో  మంగళవారం నాడు ముఖ్యఅతిథిగా చింతూరు పిఓ ఆకుల వెంకటరమణను ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా 150 కుటుంబాలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీడియా మిత్రులు  ముందుకు వచ్చి  తమ వంతుగా కొండరెడ్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ వంతుగా పేదవారికి సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన బ్లాక్ డౌన్ కార్యక్రమని ప్రతి ఒక్కరూ తమంతట తాముగా స్వీయ నిర్బంధం  పాటించినట్లయితే కోవిడ్ 19ని మనదేశం నుండి మన పట్టణం నుండి మన గ్రామం నుండి తడిమివేయడంలో  భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్తవారు వచ్చినట్లయితే గ్రామ వాలంటరీలకు వెంటనే సమాచారం తెలియపరచాలని, ఎవరైనా జలుబు, దగ్గు, ఆయాసం,  తుమ్ములు వచ్చినట్లయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సంప్రదించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చేతులను 20సెకన్ల పాటు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి, బయటి నుంచి ఇంటికి వచ్చినట్లయితే ముందుగా కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని లోపలికి వెళ్లాలని తెలిపారు. వి.ఆర్.పురం సాక్షి రిపోర్టర్ అశోక్ స్వచ్ఛందంగా కొండరెడ్లకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ కె వి ఎల్ నారాయణ, ఎంపీడీవో సత్యనారాయణమూర్తి, ఎస్సై గుణశేఖర్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ చారి, మీడియా మిత్రులు సాక్షి రిపోర్టర్ కోట బాబురావు, ఏబీఎన్ సత్యనారాయణ, విజన్ యండి భాష,ఆంధ్రభూమి బెల్లంకొండ లోకేష్, పెన్ పవర్ వేమన సతీష్, విశాలాంధ్ర నెల్లూరు రమేష్, కోస్తా సమయం గడ్డ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...