Followers

కోవిడ్ ఆసుపత్రి వైద్యులు  సిద్ధంగా ఉండాలి

...


 


కోవిడ్ ఆసుపత్రి వైద్యులు  సిద్ధంగా ఉండాలి


కోవిడ్ ఆసుపత్రి సన్నద్దత పై కలెక్టర్ ఆదేశాలు                                                                                                                                                                


జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్ లాల్


విజయనగరం, పెన్ పవర్ 


 ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ ఆసుపత్రికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని , అన్ని రకాల వసతులు, వనరులను సమకూర్చుకోవాలని జిల్లా  కలెక్టర్ డా. హరి జవహర్ లాల్ వైద్యాధికారు లను ఆదేశించారు.  మంగళవారం కలెక్టర్ మిమ్స్ కోవిడ్ ఆసుపత్రి లోని ఏర్పాట్లను వార్డులలో పర్యటించి  తనిఖీ చేసారు.  కోవిడ్ ఆసుపత్రిలో అందుబాటు లోనున్న వైద్యులు,  స్పెషలిస్టులు, నర్సింగ్ స్టాఫ్, పారా మెడికల్స్  , సెక్యూరిటీ  తదితర  అంశాల పై ఆరా తీసారు.  ఆసుపత్రి లో ప్రస్తుతం  అందుబాటులోనున్న  వైద్య పరికరాలు, వైద్యులు వినియోగించే వ్యక్తిగత రక్షిత  పరికరాలు, మాస్క్ లు, మందులు, అత్యవసర  వైద్యానికి అవసరమైన ఆక్సిజన్, వెంటిలేటర్లు , ఐ.సి.యు సేవలు తదితర అంశాలను తనిఖీ చేసారు.  వెంటిలేటర్లను నిర్వహించడానికి అవసరమైన సాంకేతిక సిబ్బంది, పేషెంట్  కేస్ మేనేజ్మెంట్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉండాలని ఆసుపత్రుల సమన్వధికారి డా. నాగభూషణ రావు,  పల్మనాలజిస్ట్ డా. హరి కిషన్ కు ఆదేశించారు.  శాంపిల్ కలెక్షన్ టీం లను సిద్ధంగా ఉంచాలని, పేషెంట్ల తరలింపు కోసం అంబులెన్సు వాహనాలను , సెక్యూరిటీ, పారిశుధ్య సిబ్బందిని సన్నిద్దం చేయాలని , కేసులున్నా  లేకున్నా అందరూ  ప్రతి రోజు హాజరు కావాలని సూచించారు. మిమ్స్ వద్ద ఒక కోవిడ్ కంట్రోల్  రూమ్ ను ఏర్పాటు చేయాలని, అవుట్ పోస్ట్  సెక్యూరిటీ ని ఏర్పాటు చేయాలని , ప్రవేశ, బయట మార్గాలలో సి. సి. కెమెరా లను అమర్చాలని  సూచించారు.  ఎంత మంది వైద్యులు, సిబ్బంది అవసరం అవుతారో,  ఏమేమి ఇతర  అవసరాలున్నాయో వెంటనే తెలియజేయాలన్నారు.  కోవిడ్ ఆసుపత్రి వద్ద అవసరమైన ఏర్పాట్లన్నీ చూడాలని,  బ్లీచింగ్, పారిశుధ్యం, సెక్యూరిటీ తదితర అవసరాలను  ఏర్పాటు చేయడమే కాక, అను నిత్యం ఆసుపత్రి  అధికారులతో చర్చిస్తూ సమన్వం తో పని చేయాలని , ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని  నెల్లిమెర్ల  తహసిల్దార్ రాము, నగర పంచాయతి కమీషనర్ అప్పల నాయుడు కు ఆదేశించారు.     


      ఆసుపత్రిలోని ఏర్పాట్ల పై డి.సి.హెచ్.ఎస్  నాగభూషణ రావు, డా. హరి కిషన్ కలెక్టర్ కు వివరించారు. కోవిడ్ ఆసుపత్రి లో 3 అంబులెన్స్ వాహనాలతో పాటు  50 ఆక్సిజన్ బెడ్స్ , 11 వెంటిలేటర్ లు, 50 పి.పి.ఇ లు, 300  ఎన్-95  మాస్క్ లు, వెయ్యి సర్జికల్  మాస్క్ లు, సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 200 మంది వైద్యులు, 90 మంది నర్సింగ్ స్టాఫ్, 70 మంది సానిటరీ సిబ్బంది, 50 మంది ల్యాబ్  టెక్నీషియన్స్  3 బాచ్ లుగా విధులు నిర్వర్తిస్తున్నట్లు వివరించారు.  కరోనా మరణాలు సంభవిస్తే  వాటి కోసం జిప్ బాగ్ లు అవసరమౌతాయని   ప్రస్తుతానికి కోవిడ్ ఆసుపత్రి లో కేసులను ట్రీట్ చేయడానికి అవసరమైన సామాగ్రి అంతా సిద్ధంగా ఉందని తెలిపారు.  ఈ తనిఖీ లో మిమ్స్ చైర్మన్ అల్లూరి మూర్తి రాజు,  ప్రిన్సిపాల్ లక్ష్మి కుమార్, సూపరింటెండెంట్ డా. సి. రఘు రామ్,  రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డా. వర్మ రాజు,  వైద్యులు తదితరులు  పాల్గొన్నారు.


చేపలు తినాలా వద్దా...




చేపలు తినాలా వద్దా ?
- కరోనా శవాలు సముద్రంలో అంటూ వీడియో హల్చల్ 

- అధికారికంగా తేలే వరకు ఆందోళనెే అంటున్న  జనం 

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచం వణికిపోతుంది. ఈ అంటువ్యాధి ఏ విధంగా వస్తుందో అన్న భయాందోళనలో జనం కొట్టుమిట్టాడుతున్నారు. ఈ భయాన్ని మరింతగా పెంచేదిగా సోషల్ మీడియాలో  చిత్రాలు వీడియోలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి.  దీనిపై ప్రభుత్వాలు కఠినంగానే వ్యవహరిస్తున్నా కొత్త కొత్తవి షికార్లు కొడుతున్నాయి. ఇప్పుడు తాజాగా సముద్రంలో కరోనా  శవాలును  ఇతర దేశాలు పడేస్తున్నట్లు  సోషల్ మీడియాల్లో ప్రచారం జరుగుతుంది.   దీంతో ఒక్కసారిగా జనం ఉలిక్కి పడినట్లు అవుతుంది. నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో జనం మెదడులో ఓ విధమైన ఆందోళన నెలకొందంటే అతిశయోక్తి కాదు.  సముద్రం లో ఉత్పత్తులు అనేకం. చేపలు తదితర సముద్ర ఉత్పత్తులను చాలామంది తింటూనే ఉంటారు. ఈ నేపథ్యంలో హల్ చల్ చేస్తున్న వీడియోతో  ఒకింత డైలమాలో పడ్డారు. సముద్ర ఉత్పత్తుల ను    తినాలా వద్దా. కరోనా  శవాలను సముద్రం లొో పడేస్తున్నారనది ఏమేరకు వాస్తవమొ తెలియని పరిస్థితి.  అసలు ఈ వీడియో పాతదా నకిలీ దా అర్థంగాని పరిస్థితి. నమ్మకుండా ఉందామన్నా ప్రస్తుతం ప్రపంచంలో పరిణామాలు అనుమానాలు రేకెత్తించేలా ఉండడమే ఈ ఆందోళనకు  కారణం. చాలా దేశాల్లో కుప్పలు తెప్పలుగా  కరోనాతో మరణించిన వారి సంఖ్య తెలుస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో శవాలను సముద్రంలో పాడేస్తున్నారు అన్న సందేశంతో కూడిన ఈ వీడియోతో ఆందోళన నెలకొంది. ఇదిలా వుంటే దీనిపై అధికార ప్రకటన వెలువడే వరకు సముద్ర ఉత్పత్తులను తినకపోతే మేలన్న భావన క్షేత్ర స్థాయిలో వ్యక్తమవుతుంది.    


 

 



 

రోడ్డెక్కారు, భారీ మొత్తం  డబ్బులు చెల్లించారు



 





రోడ్డెక్కారు, భారీ మొత్తం  డబ్బులు చెల్లించారు.

 

పెన్ పవర్,  జమ్మలమడుగు

 

కడప జిల్లా జమ్మలమడుగు లో కరోనా వైరస్ నివారణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న ప్రజలు మాత్రం ఇవన్నీ  పట్టించుకోకుండా ద్విచక్ర వాహనాల పై ఆంక్షలు విధించిన ప్రదేశాల్లో రోడ్ల పై ఎక్కువ సంఖ్యలో రావడంతో ఆగ్రహించిన పోలీసులు భారీ మొత్తం ఛలానా రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు, ఈ కరోనా మహమ్మారి భారీన పడకూడదని మీరందరూ మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండమంటే మీరు ఇలా రోడ్ల పై ప్రయాణించడం మూలంగా చట్ట వ్యతిరేక చర్యలు తీసుకుంటామని పట్టణ ఎస్సై లు రంగారావు,రవి కుమార్ లు హెచ్చరించారు.


 

 



 

వైద్య సిబ్బంది కి  మంచి నీళ్ల బాటిళ్లు వితరణ


వైద్య సిబ్బంది కి  మంచి నీళ్ల బాటిళ్లు వితరణ

 

పెన్ పవర్, జమ్మలమడుగు

 

కడప జిల్లా జమ్మలమడుగు లో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మరియు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా వైరస్ భారిన పడకుండా ప్రజలకు ఇంటింటికి తిరిగి సలహాలు సూచనలు, జాగ్రత్తలు తెలియచేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న వైద్యులు,ఆశా కార్యకర్తలు‌,నర్సులకు జమ్మలమడుగు లోని రోటరీ క్లబ్ మరియు లాయర్ల సంఘం ఆధ్వర్యంలో మంచి నీళ్ల బాటిల్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ మధుసూదన్ రావు, రోటరీ క్లబ్ మెంబర్లు ,లాయర్ల సంఘం సభ్యులు మురళి ధర్ రెడ్డి, భూతమాపురం సుబ్బారావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

 


బాధితులకు సేవలందిస్తున్న మార్టూరు కుటుంబీకులకు అభినందనలు 


 


బాధితులకు సేవలందిస్తున్న మార్టూరు కుటుంబీకులకు అభినందనలు 



----  రూరల్ సి.ఐ నరసింహరావు



అనకాపల్లి , పెన్ పవర్ 



లాక్ డౌన్  నేపథ్యంలో బాధితులైన పేద వర్గాలను ఆదుకునేందుకు చేస్తున్న మార్టూరు కుటుంబికుల సేవలు అభినందనీయమని రూరల్ సి.ఐ నరసింహరావు పేర్కొన్నారు.  మండలంలో  రేబాక, కాపుశెట్టివానిపాలెం, గురజాడనగర్ గ్రామాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.  అతిథులుగా పాల్గొన్న రూరల్ సి.ఐ నర్సింహారావు, ఎస్సై రామకృష్ణ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కరోనా  వైరస్  నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  పెట్టిన  లాక్ డౌన్ ను ప్రజలందరూ  పాటించాలన్నారు. ఇండ్లకే  పరిమితమైన  గ్రామస్తుల కుటుంబ పోషణకు  నిత్యావసర  సరుకులు పంపిణీనిని  మార్టూరు కుటుంబీకులు పెద్ద ఎత్తున  చేపట్టడం అభినందనీయమనారు. రేబాక గ్రామానికి చెందిన మార్టూరు లక్ష్మణ్ కుమార్, వెంకటసాయిలు మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలబడటం తాము ఎప్పటి నుంచో చేస్తున్న కార్యక్రమాలుగా చెప్పారు.  30 గుడ్డులు,  ఒక్కొక్క  కేజీ చొప్పున కందిపప్పు,  పంచదార,   ఉప్పు,  లీటర్ నూనె ఆయా  గ్రామాల్లో  సుమారు  వెయ్యి  కుటుంబాలకు అందించారు. భౌతిక దూరం  పాటిస్తూ స్వయంగా  ఇండ్లకే వెళ్లి కుటుంబ సభ్యులు మార్టూరు సన్యాసమ్మ, రమేష్ బాబు,  భాస్కరరావు, కోన నాయుడు,  మంత్రి అప్పలనాయుడు, కాపుశెట్టి అర్జునరావు గ్రామస్తులు అందిస్తున్నారు. ఈ గ్రామాల్లో  తొమ్మిది  వందల  ఇండ్లకు 4.50 లక్షల ఖర్చు  చేసి అండగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో  ప్రజలకు  ఇలాంటి  సేవలు  చేయడంపై పలువురు హర్షిస్తున్నారు. 


భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనాను తరిమి కొట్టాలి 


భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనాను తరిమి కొట్టాలి 



---- పట్టణ అధ్యక్షులు మందపాటి 



అనకాపల్లి , పెన్ పవర్ 



ప్రతిఒక్కరు భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని వైకాపా పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు కోరారు. మంగళవారం పట్టణంలో 82 వ  వార్డు  విజయరామరాజుపేటలో  లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకుందన్నారు.  విపత్కర పరిస్థితిలో పేదలు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. యువత సాయంతో బాధితులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయ రామరాజు పేటలో, లెప్రసీకాలనీ  లో  నిరుపేదలకు  కూరగాయలు  పంపిణీ ని నిర్వహించారు. కార్యక్రమంలో  అప్పికొండ వెంకటరావు,  పలకా  వాసు,  ఉగ్గిన  శ్రీను , అల్లు త్రినాధ్,  దాడీ గణేష్,  శ్యామ్, మంగ రాజు , రాజన్న, శ్రీను , సూర్య,  మూల  ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


పేదలకు వైకాపా నాయకుల చేయూత 


పేదలకు వైకాపా నాయకుల చేయూత 


అనకాపల్లి, పెన్ పవర్ 


 మండలంలో రేబాక,  కాపుశెట్టివానిపాలెం, గురజాడనగర్  లో  వైస్సార్సీపీ  నాయకులు  బంటు ఏడుకొండలు,  కోట సత్తిబాబు, ఇల్లా సత్తిబాబు ఆధ్వర్యంలో  మంగళవారం కూరగాయలను పంపిణీ చేశారు. అనకాపల్లి  ఎమ్మెల్యే  గుడివాడ  అమర్నాధ్  ఆదేశాల  మేరకు గ్రామంలో ప్రతి ఇంటింటికి  850 గృహాలకు  కూరగాయలు  అందించారు. లాక్ డౌన్ కారణంగా  ప్రజల అందరూ   బయటకు  రాకుండా ప్రభుత్వం చేపడుతున్న జాగ్రత్తలు  తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో   మంత్రి నారాయణ మూర్తి,  కోట చిన్న,  బంటు  కృష్ణ,  వనమాల  భూషణ్ రావు,  కణికెళ్ల  లక్ష్మణ్  వైస్సార్సీపీ  కార్యకర్తలు  పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...