Followers

పేదలకు అండగా  శ్రీరామ్ 


పేదలకు అండగా  శ్రీరామ్ 


అనకాపల్లి , పెన్ పవర్ 


 


 కరోనా వ్యాధి నియంత్రణలో  ప్రజలందరూ భాగస్వామ్యం తీసుకుని భౌతిక దూరాన్ని పాటించాలని  సీనియర్ వైకాపా నాయకులు కాండ్రేగుల శ్రీరామ్ పేర్కొన్నారు. లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఆసరాగా మంగళవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అనకాపల్లి వైస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ , వైస్సార్సీపీ యువ నాయకులు  దాడి జయవీర్  సూచనల మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు . కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణకై రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  విధించిన లాక్ డౌన్ ను విజయవంతం చేయాలన్నారు.  పట్టణంలో నివసిస్తున్న  అనేకమంది పేద ప్రజల ఆకలి దృష్ట్యా కొంత మందికైనా ఎంతో కొంత సహాయపడాలనే ఉద్దేశ్యంతో తాను ఈ కార్యక్రమం చేపటినట్లు తెలిపారు . తనకు సహకరించిన  కాండ్రేగుల జోషి, దాడి ఈశ్వరరావు, కొణతాల భాస్కరరావు,పీలా రాంబాబు,కాండ్రేగుల సుబ్బు లు కు కృతజ్ఞతలు తెలిపారు.  భీమునిగుమ్మం, రెల్లి వీధులలో నివసిస్తున్న సుమారు 400  మంది నిరుపేద కుటుంబాలకు కాయకూరలు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో స్థానిక వైస్సార్సీపీ నాయకులు జాజుల రమేష్ ,కటారి దేముడు,కె.ఎమ్.నాయుడు, భీశెట్టి సందీప్, ఆడారి నాయుడు, పీలా ఉమా,ఆళ్ల శివగణేష్,సూరిశెట్టి గిరి,బుద్ధ గంగాధర్,పొలమరశెట్టి యుగంధర్,కావెల రవి, విల్లూరి సంతోష్,కర్రి భరత్,చంటి,మధు దాడి మిత్రబృందం పాల్గొన్నారు.


పెద్ద నంది పల్లె యువకునికి నోటీస్ జారీ.


పెద్ద నంది పల్లె యువకునికి నోటీస్ జారీ.


పెన్ పవర్.. దేవరాపల్లి..



   పెద నందిపల్లి  యువకునికి  వైద్యాధికారి నోటీసు జారీ చేశారు. దేవరపల్లి మండలం  పెదనందిపాడు గ్రామానికి చెందిన  యువకుడు  4 రోజుల క్రితం  గుజరాత్ నుండి  వచ్చినట్లు  సమాచారం అందడంతో వ్యచలం  పి హెచ్ సి  వైద్యాధికారి  బి. హారిక  మంగళవారం ఉదయం  పేద నంది పల్లి  యువకుని ఇంటికి వెళ్లే  కరోనా వైరస్  ప్రభావం కారణంగా  ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని  వారికి  ఎటువంటి సమస్యలు తలెత్తకుండా  స్వీయ  గృహనిర్బంధంలో  ఇరవై ఎనిమిది రోజులపాటు   ఉండాలని  వైద్య అధికారిని  యువకునికి సూచించారు.  తరచు వైద్య సిబ్బంది వచ్చి తనిఖీ చేస్తారని  తమకు సహకరించాలని  కోరుతూ  యువకునికి  నోటీసు జారీ చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో  గృహనిర్బంధంలో ఉండకపోతే  అధికారికంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని  డాక్టర్ హారిక  హెచ్చరించారు.


ఐసొలేషన్ రూమ్స్ కి బెడ్స్ అందచేత : గొల్లవిల్లి 


ఐసొలేషన్ రూమ్స్ కి బెడ్స్ ని తాహశీ ల్దార్ కి  అందచేస్తున్న గొల్లవిల్లి 
 వి.మాడుగుల, పెన్ పవర్


    ప్రభుత్వ విప్ మాడుగుల శాసన సభ్యులు అయిన బూ డి ముత్యాల నాయుడు ఆదేశాలు మేరకు కరోనా వైరస్ రోగులు కొరకు గొల్ల విల్లీ సంజీవరావు ఆర్థిక సహాయముతో రెండు బెడ్స్.ఐస్సొలేషన్రో రూమ్స్ లోకి రోగుల కొరకు తహశీల్దారు రామశేషు కిమంగలవారం అందచేయడం జరిగింది ఈ కార్యకరమానికి డెప్యూటీ తహశీల్దార్ నాగమ్మ m. కోడూరు గ్రామశాఖ అధ్యక్షుడు పడాల అప్పల నరసయ్య.గొల్లవిల్లి సత్యారావు. ఎంపీటీసీ అభ్యర్థి ముమ్మిన రమణ బాబు. కో ఆపరేటివ్ డైరెక్టర్స్ పడాల వెంకటరాజు పోతీన జగదీష్.రాయపు రెడ్డి కొండలరావు. స్కూల్ కమిటీ చైర్మన్ ఖాతా చిరంజీవి కోనా అప్పలనాయుడు. కలిమి గోపాల్ గంగీరే డ్ల లింగన్న. గేదల జగన్నాథం రావాల మోహన్ రావాలనానాజీ. గుమ్మాల నర్సింగరావు తదితర లు పాల్గొన్నారు


 ఆహార పొట్లాల పంపిణీ


 ఆహార పొట్లాల పంపిణీ



          పాయకరావుపేట,పెన్ పవర్



 ప్రభుత్వవారి నిబందనలు పాటించి  కరోన ను తరిమికొడదాం.లాక్ డౌన్ ను ప్రతీ ఒక్కరు పాటించి దేశ ప్రజలను రశించుకోవాలని  స్థానిక ఇండియన్ గ్యాస్ ప్రొపైృటర్ గారా ప్రసాద్ అన్నారు.స్థానిక కన్ టోన్ మెంట్ కు చెందిన మహిళలు ప్రసాద్ ఆద్వర్యంలో  500ఆహార పొట్లాల పంపిణి కార్యక్రమంను నిర్వహించారు.ఆయన గృహంనందు ఈ కార్యక్రమంను ఏర్పాటుచేసారు.అనంతరం యూత్ సభ్యులు ఆహారపొట్లాలను వీది వీదినా బిచ్పగాళ్ళకు,పేదలకు పంచారు.ఈ కార్యక్రమంలో  వైసీపి సీనియర్ నాయకులు గూటూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


 తోట నగేష్ ఆద్వర్యంలో  అన్నదానం

 



 తోట నగేష్ ఆద్వర్యంలో  అన్నదానం



         పాయకరావుపేట,పెన్ పవర్



లాక్ డౌన్ దృష్ట్యా సీనియరర్ బిజేపి నాయకులు,మాజీ గ్రంధాలయ చైర్మెను తోట నగేష్ ఆద్వర్యంలో  ట్రైనీ డిఎస్ పి.కిషోర్ కుమార్  మహంతి సహకారంతో  మంగళవారం  అన్నదాన కార్యక్రమం జరిగింది.విదులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి ,హైవే వాహన దారులకు ,పట్టణంలో వున్న బిచ్చగాళ్ళకు,పాద చారులకు ఆహార పొట్లాలను,మజ్జిగ,వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేసారు.ఈకార్యక్రమంలో రవి రాజు,రవి వర్మ,జగతా శ్రీధర్ జగతా రమణ,ఇంజరపు సూరిబాబు,పెంకే శ్రీను తదితరులు పాల్గొన్నారు.


పరవాడ గ్రామంలో  లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు. 




పరవాడ గ్రామంలో  లాక్ డౌన్ నిబంధనలు బేఖాతరు



 నిత్యవసరాల కోసం ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వచ్చిన గ్రామస్తులు


 


పరవాడ, పెన్ పవర్ 



 పరవాడ  గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను పరవాడ గ్రామస్తులు భేఖాతరు చేస్తున్నారు.144 సెక్షన్ అమలులో ఉండగా మంగళవారం ఉదయం వారపు సంతలా వందల సంఖ్య జనాలతో కళ కళ లాడింది.నిత్య అవసరాల కోసం ఇష్టారాజ్యంగా పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. గాజువాకకు చెందిన చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి పరవాడ మసీదులో వారం రోజుల పాటు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ మేరకు తనతో సన్నిహితంగా మెలిగిన కొంతమంది ముస్లిం సోదరులను అధికారులు హోమ్ క్వారంటైన్  చేసిన విషయం తెలిసిందే.అధికారులు,నాయకులు   కూడా ఏదన్నా జరిగినప్పుడు హడావిడి చేస్తున్నారు తప్ప మిగిలిన సమయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు అని గ్రామస్థులు వాపోతున్నారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు రోడ్లపైకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రోడ్లపైకి వచ్చిన ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడం, కొంతమంది మాస్కు ధరించకపోవడం మరింత ఆందోళనకరమైన విషయం. పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు రావడంతో వారిని నియంత్రించ లేని పరిస్థితి ఏర్పడింది.ఇదే పద్ధతిలో ప్రజలు ప్రవర్తిస్తే పరవాడలో భయంకర పరిస్తులు వచ్చే రోజు ఎంతో దూరం లేదు అని గ్రామ ప్రజలు భయపడుతున్నారు.ఇప్పటికైనా పోలీసు శాఖ అధికారులు  కఠినమైన నిర్ణయాలతో చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


వలస కార్మికులకు భోజన వసతి ఏర్పాట్లు : సిఐటియు


వలస కార్మికులకు భోజన వసతి ఏర్పాటు చేసిన సిఐటియు


            పరవాడ పెన్ పవర్



పరవాడ:కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు భోజన వసతి అరు రోజులుగా కల్పిస్తున్న జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యన్నారాయణ.ఈ బోనంగి బ్యాంక్ కాలనిలో నివసిస్తున్న 200 వందల మందికి పరవాడ ముఠా కారకులు ఆర్ధిక సహాయం తో బిర్యానీ ని పంపిణీ చేశారు.ఆరు రోజులుగా రోజుకు ఒకరు చొప్పున దాతలు వలస కార్మికులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు అని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని గనిశెట్టి అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గెధుల అప్పారావు,సిపిఎం నాయకురాలు పి మాణిక్యం,కొల్లి అప్పారావు,ఎల్ సన్యాసి తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...