Followers

వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ


పవర్ గ్రిడ్ వారి ఆర్థిక సహాయం తో వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ



              పరవాడ పెన్ పవర్



పరవాడ మండలం లో కంపెనీలలో పనిచేయడానికి వచ్చిన వలస కార్మికులకు కరోనా వైరస్ వాక్యాప్తిని అరికట్టేందు ప్రభుత్వాలు విధించిన స్వీయ నిర్బంధం వలన కూలీలు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో ఇలా ఇబ్బందులు పడుతున్న కూలీలకు స్టీల్ ప్లాంట్ పవర్ గ్రిడ్ వారి ఆర్ధిక సహాయం తో 2 లీ వoటనూనె,1 కేజీ ఉప్పు,1కేజీ చింతపండు,1 కేజీ పంచదార,200 గ్రా కారం,2 సబ్బులు చొప్పున 800 కుటుంబాలకు తహశీల్దార్ గంగాధర్ చేతులమీదుగా అందించారు.ఈ కార్యక్రమంలో పవర్ గ్రిడ్ సీనియర్ జనరల్ మేనేజర్ ఏవిఎల్ నరసింహారావు,మాధవ్ ఆనంద్,పవర్ గ్రిడ్ సిబ్బంది,రెవెన్యూ సిబ్బంది, వలస కూలీలు పాల్గొన్నారు.


ఆమ్ ఆద్మీ ఆధ్వర్యంలో బిర్యాని పంపిణీ





ఆమ్ ఆద్మీ ఆధ్వర్యంలో బిర్యాని పంపిణీ

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

అనకాపల్లి పరిసర ప్రాంతంలో  నిరుపేదలకు  ఆమ్  ఆద్మీ   ఆధ్వర్యంలో  బిర్యాని ప్యాకెట్లు పంపిణీ  చేశారు . కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొణతాల హరినాద్ బాబు, హీరా ప్రసాద్, బొగ్గరపు రమణాజి,  బిళ్ళ పాటి,గణేష్, టి. రవి, లలిత , పి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.  ఉచిత వెజిటబుల్ బిర్యాని పొట్లాలను పేదలకు పంపిణీ చేశారు.

 

 



 

ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా కోవిడ్..19 రిలీఫ్ మెజర్స్ అందజేత


ప్రగతి భారత్ ఫౌండేషన్..
కోవిడ్..19 రిలీఫ్ మెజర్స్


మేనేజంగ్ ట్రస్టీ, ఎంపీ పి విజయ సాయి రెడ్డి చేతుల మీదుగా విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయితీ ల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్ లు, శాని టైజర్, గ్రాసరీ వస్తువులను అందచేశారు. మంగళవారం సాయంత్రం ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..ప్రగతి భారతీ ట్రస్ట్ తరుపున కరోనా నియంత్రణ లో సేవలు అందిస్తున్న వారికి తమ వంతు సాయం అందిస్తున్నారు. జిల్లా లో 1400 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఈ గ్రాసరీ కిట్ లను అంద చేయడం సంతోషం గా ఉంది. ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన సోషల్ దూరంను ప్రజలు పాటించాలని కోరుతున్నాం..ప్రభుత్వ నిర్దేశించిన ప్రకారం యంత్రాంగం శ్రమిస్తోంది. పైడితల్లి అమ్మ వారి దయ వల్ల జిల్లాలో పాజిటివ్ కేస్ లు రాకపోవడం జిల్లా ప్రజల అదృష్టం.  ఇదే సమన్వయం తో లాక్ డౌన్ నిబంధనలు, సోషల్ డిస్టెన్స్ పాటించి వచ్చే వారం రోజులు అత్యంత జాగ్రత్త గా ఉండాలని మనవి చేస్తున్నాం..ఎంతటి విపత్కర పతిస్థితులను ఎదుర్కొనడానికి ప్రభుత్వం దశల వారీ చర్యలు తీసుకుంది. ప్రజలు అపోహలు, పుకార్లను నమ్మ వద్దు.. ప్రజల క్షేమం కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాం..ప్రగతి ఫౌండేసన్ ద్వారా విజయ సాయి రెడ్డి అందిస్తున్న సాయం అభినందనీయం..జిల్లాలో 700 వరకు హోమ్ గార్డులు ఉన్నారు..వారికి కూడా సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఎంపీ విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ,
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేస్ కూడా రాకుండా అహర్నిశలు శ్రమించిన మంత్రులు, అధికారులు, వైద్యులు, పారిశుద్య కార్మికులు, సచివాలయ ఉద్యోగులు కి అభిననందలు తెలిపారు. కరోనా అంటు వ్యాధి అని తెలిసి కూడా ప్రాణాలకు తెగించి ప్రజల ముంగిటకు వెళ్లి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విదేశాల కన్నా భారత్ లో పారిశుద్ధ్యం సమస్య ఎక్కువ..మన ఇమ్యూనిటీ కూడా ఎక్కువ.. అయినా ఇక్కడ సమష్టిగా అందించే సేవలు వల్లే మనం కరోనా తీవ్రత నుంచి బయట పడ్డాం. పారిశుద్ధ్య కార్మికులు ఈ కిట్లు అంద చేస్తున్నాం..పోలీస్ శాఖ వారికి కూడా ఈ కిట్ లు అంద చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోలగట్ల వీర భద్ర స్వామి, బడుకొండ అప్పల నాయుడు, జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ రాజకుమారి, వైసీపీ జిల్లా సమన్వయ కర్త మజ్జి శ్రీని వాసురావు, మున్సిపల్ కమీషనర్ వర్మ, ప్రగతి భారత్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.


రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు 


రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు 



- రాజానగరం ఎమ్మెల్యే  జక్కంపూడి రాజా



కోరుకొండ, పెన్ పవర్



కరోనా విపత్కర పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని
రాజానగరం ఎమ్మెల్యే  జక్కంపూడి రాజా అన్నారు. మంగళవారం కోరుకొండ పీఏసీఎస్ వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని  రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో నాలుగు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు  చేయడం జరిగిందన్నారు. రైతులకు వెసులుబాటు కల్గించే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.
 రైతులను ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  రైతు పక్షపాతి అని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పంటల కొనుగోలుకు కేంద్రాలను ప్రారంభిస్తోందని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.
 కోరుకొండ గ్రామపంచాయతీ ప్రజలకు త్రాగునీరు సరఫరా చేసే నూతన విద్యుత్ మోటార్ ను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు.
 ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల శెట్టి సత్యనారాయణ, కోరుకొండ మండల వైసిపి కన్వీనర్ ఉల్లి బుజ్జి బాబు, కోరుకొండ సొసైటీ చైర్మన్  అరుబోలు రామలింగేశ్వరరావు (చినబాబు), కోరుకొండ సొసైటీ కార్యదర్శి జి వి ఎస్ వర్మ, సొసైటీ  మెంబర్స్ ఉల్లి శేషగిరిరావు,  అడబాల గొల్ల బాబు, కోరుకొండ వ్యవసాయ శాఖ ఏడిఏ బి కే మల్లికార్జున రావు, కోరుకొండ వ్యవసాయ శాఖ అధికారి  గౌరీదేవి తదితరులు పాల్గొన్నారు.


హెల్ప్ ది నీడి కు అన్యుహ స్పందన


హెల్ప్ ది నీడి కు అన్యుహ స్పందన


నెల్లూరు, పెన్ పవర్


నిరాశ్రయులకు అండగా నిలిచిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం తరపున  లాక్ డౌన్ సమయం లో నిరుపేదలకు చేయూత అందించటానికి చేపట్టిన హెల్ప్ ది నీడి (Help The Needy) కార్యక్రమమునకు మంచి  స్పందన వచ్చిందని రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణారెడ్డి గారు అన్నారు. మంగళవారం పెన్నానది వడ్డున నివసిస్తున్న 25 కుటుంబాలకు , ఒక్కొక్క కుటుంబానికి 10కేజీలు బియ్యం , 7 రకాల నిత్యావసర సరుకులు  మరియు 4 కేజీల వివిద రకాల కూరగాయలు అందించారు.  తదనంతరం కొండాయపాలెం, నవాబ్ పేట,  ఏ సీ నగర్  మరియు పొదలకూరు రోడ్ లో ఉంటున్న నిరుపేదలకు వస్తుసామాగ్రి అందించారు. ఈ సందర్భముగా డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ   ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారి సూచనల మేరకు  రేషన్ కార్డు లేని నిరుపేదలకు విశ్వవిద్యాలయ  ఎన్. ఎస్.ఎస్. ఇటువంటి మంచి కార్యక్రమము చేపట్టటం ఎంతోసంతోషకరమని అన్నారు.  పనితీరును అలాగే కోవిడ్-19 నివారణకు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ విపత్కర సమయంలో ప్రభుత్వాధికారులందరు ప్రభుత్వానికి సహకరిస్తూ అత్యవసర పరిస్తుతులలో తమవంతు బాధ్యతను నెరవేర్చాలని అన్నారు. విశ్వవిద్యాలయ  ఎన్. ఎస్.ఎస్. ప్రతి రోజు 60 మంది నిరాశ్రయులకు మరియు వృద్దులకు గడచిన 13 రోజుల నుంచి రాత్రిపూట భోజనమును ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అలాగే   విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధన విద్యార్థులు, వివిధ కళాశాలల యాజమాన్యం,ఎన్. ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారులు, ఎన్. ఎస్.ఎస్ స్టూడెంట్స్ స్వచ్చందంగా ముందుకు వచ్చి సుమారు 75,000/- (డెబ్భై ఐదు వేలు) రూపాయలు దాకా విరాళాలిచ్చారని. ఆ వచ్చిన విరాళాలతో 110 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను అందించామని అన్నారు.    ఎన్. ఎస్.ఎస్  రాష్ట్రాధికారి డా. రమేష్ రెడ్డి రాష్ట్రములో ఇతర ఏ విశ్వవిద్యాలయం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టలేదని, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన  ఎన్. ఎస్.ఎస్   సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం  ను అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజానాయర్  మాట్లాడుతూ తమకు సహకరించి స్వచ్చందంగా ముందుకు వచ్చిన ప్రతిఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థల డీన్  బి. సుధారాణి గారు మాట్లాడుతూ NSS మరియు NCC విద్యార్థులు ఎంతో కష్టపడి తమవంతు బాధ్యతగా ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలను చేపట్టటం వలన సమాజాభివృద్ధిలో భాగస్వాములైనట్లేనని అన్నారు. ఈ కార్యక్రమములో పాల్గొనటం తనకు అదృష్టంగా భావిస్తున్నాన్నారు. ఈ కార్యక్రమములో NSS  సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, సోషల్ వర్క్ అధ్యాపకుడు డా. బి వి సుబ్బారెడ్డి, NSS  ప్రోగ్రాం అధికారి డా. చెంచయ్య  కృష్ణ చైతన్య విద్యాసంస్థల డీన్ బి. సుధారాణి గారు, ప్రిన్సిపాల్ రాజేష్ గారు, NSS ప్రోగ్రాం అధికారి విజయ్ కుమార్ గారు  ఎన్. ఎస్.ఎస్  వాలంటీర్లు పార్ధసారధి, రాజేష్, అఖిల్, చైతన్య  మరియు  శివ తేజ పాల్గొన్నారు.


చికెన్ బిర్యానీ పంపిణీ


చికెన్ బిర్యానీ పంపిణీ


విజయనగరం, పెన్ పవర్



             కరోనా కష్టాల కొనసాగుతున్న దశలో విజయనగరంలోని వైసిపి నాయకులు సరికొత్త పంపిణీకి శ్రీకారం చుట్టారు. పలు పత్రికల ఏజెంట్ , వైసిపి నాయకుడు సుంకరి నారాయణరావు సారధ్యంలో సుంకర వీధికి చెందిన పలువురు నాయకులు చికెన్ దమ్ము బిర్యానీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ వైసిపి నేత పిల్లా విజయకుమార్ మూడులాంతర్ల కూడలి దగ్గర ప్రారంభించారు. విధి నిర్వహణలో నిద్రహారాలకు దూరంగా ఉంటున్న జర్నలిస్టులకు, పోలీసులకు, పారిశుధ్య సిబ్బందికి పంపిణీ చేశారు. అలాగే మూడు లాంతర్లు కూడలి సమీపంలో ఉన్న ఆసుపత్రుల్లో రోగుల బంధువులు, ఫుట్ పాత్ లపై జీవనం సాగించే నిరుపేదలతో పాటు, గంటస్థంబం, రైల్వేస్టేషన్, కలెక్టరేట్ కూడల్లలో ఉన్న పేదలకు మొత్తం 700 మందికి ఈ సహకారం అందించారు. దీంతో పలువురు నిరాశ్రయులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.


వందలాదిమందికి అన్నదానం


వందలాదిమందికి అన్నదానం


బిట్రగుంట, పెన్ పవర్


 చిత్తూరు జిల్లా బిట్రగుంట నియోజకవర్గ పరిధిలోని  బోగోలు బృందావన వీధికి చెందిన  పెనుగుల ప్రకాశం  వర్ధంతి సందర్భంగా వారి  కుటుంబ సభ్యులు, కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న విశ్వనాధరావు పేట పంచాయతీ గిరిజనులకు,బిట్రగుంట రైల్వే పనులపై వచ్చి ఇక్కడే చిక్కుకుపోయిన వలసకూలీల కుటుంబాలకు భోజనం పంపిణి చేశారు, ఈ కార్యక్రమంలో పి. ప్రకాశం కుటుంబసభ్యులు, లాయర్ సునీల్, ఏ కే సుందర్ రాజ్, లేళ్ళపల్లి మధుసూధనరావు ,బత్తల రవి, నిర్మల కుమార్, దివ్య తదితరులు పాల్గొన్నారు


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...