Followers

అన్నవరం గ్రామంలో నిత్యవసర సరుకులు పంపిణీ


అన్నవరం గ్రామంలో నిత్యవసర సరుకులు పంపిణీ


భీమిలి, పెన్ పవర్


 


భీమిలీ నియోజకవర్గంలోని అన్నవరం గ్రామంలో దివిస్ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పోలీస్ కమిషనర్ ఆర్కే మినా, దివిస్ మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొని.. ఏడు వెల మందికి , 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు పలు రకాల వస్తువులను స్థానిక ప్రజలకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందించారు. మత్యకారులను ఆడుకుంటున్న ఏకైక  ప్రభుత్వం  వైస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని..మంత్రి వర్యులు తెలిపారు. దివిస్ వల్ల నష్టం పోయిన గ్రామాలకు దత్తత తీసుకొని న్యాయం చేయాలని మంత్రి వర్యులు చెప్పారు.


విశాఖ మన్యంలో  భారీగా వడగళ్ల వాన


విశాఖ మన్యంలో  భారీగా వడగళ్ల వాన.



 స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)  


 


విశాఖ ఏజెన్సీలో  పలుచోట్ల  భారీగా వడగళ్ల వాన  కురిసింది. మంగళవారం  మధ్యాహ్నం  ఉరుములు మెరుపులతో  భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు  వడగళ్ళు  కుండపోతగా  కురిసాయి. పాడేరు   జి.మాడుగుల  అరకు  ప్రాంతాల్లో  వడగండ్ల వర్షం  విస్తారంగా కురిసింది. ఎండ తీవ్రత  ఉన్న సమయంలో  అకస్మాత్తుగా  భారీ  వడగళ్ల వాన  కురవడం  విస్మయం కలిగిస్తుంది. కరోనా లాక్ డాన్స్ సందర్భంగా  జన సంచారం అంతగా లేనప్పటికీ  వడగళ్ల వాన తీవ్రత  ఆందోళన  కలిగించింది. పూత  నేలరాలిన ట్లు  వడగళ్ళు  గుట్టలు గుట్టలుగా   నేలపై   కురవడం  వినోదం కలిగించింది.


హత్య కేసులో ముద్దాయి అరెస్ట్


హత్య కేసులో ముద్దాయి అరెస్ట్


మహిళ హత్య కేసులో ముద్దాయి ని అరెస్టు చేసిన జగ్గంపేట పోలీసులు ...


జగ్గంపేట, పెన్ పవర్


 


మార్చి 28 వ తేదీన మహిళను హత్య చేసిన కేసులో నిందితుడును సోమవారం పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ వై రాంబాబు మాట్లాడుతూ  జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలోని అత్తులూరి శ్రీనివాసరావు కు చెందిన జీడి మామిడి తోటలో  కాపలా దారులుగా పనిచేస్తున్న రంపచోడవరం మండలం సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేశులు, రంపచోడవరం మండలం సిరికిందలపాడు గ్రామానికి చెందిన నేషం లక్ష్మి అను వీరిద్దరూ ఆ తోటలో కాపలాదారులు గా ఉంటూ సహజీవనం చేస్తున్నారు. అయితే మార్చి నెల 28వ తేదీ శనివారం నాడు  వెంకటేశులు కోడిని తీసుకువచ్చి కూర ఉండాలని చెప్పడంతో అందుకు లక్ష్మి  అంగీకరించకపోవడంతో వెంకటేశులు ఒక్కసారిగా కోపోద్రిక్తుడై కర్రతో విచక్షణారహితంగా కొట్టడం జరిగింది దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె 29వ తేదీ నాడు మృతి చెందినట్లుగా గుర్తించిన  అతడు ఆమె మృతదేహాన్ని వారి స్వగ్రామం రంపచోడవరం మండలం సిరికింతలపాడు తీసుకుని వెళ్లగా మృతురాలి కుమారుడు దీనిని గ్రహించి జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన జగ్గంపేట సి ఐ వై రాంబాబు, ఎస్ ఐ టి రామకృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని,శవ పంచనామా నిర్వహించారు అయితే పరారీలో ఉన్న ముద్దాయిని ఈ నెల 6వ తేదీ ఆదివారం జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ విఆర్వో ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు దీనిపై ముద్దాయిని అరెస్టు చేసి  రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు కావడం జరిగిందని సిఐ రాంబాబు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మంది సాక్షులను విచారించి,పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చార్జిషీట్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే ఈ కేసులో నిందితుడు గత 20 సంవత్సరాలుగా భార్యను విడిచి దూరంగా ఉండటంతో సిరికింతల పాడు గ్రామానికి చెందిన లక్ష్మి 40.అనే మహిళకు భర్త చనిపోవడంతో ఆమెతో పరిచయం ఏర్పర్చుకొని నిందితుడు వెంకటేశులు లక్ష్మి కలిసి సహజీవనం చేస్తున్న తరుణంలో ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఈ సమావేశంలో జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణ గండేపల్లి మండలం ఎస్సైై తిరుపతి రావు పోలీసు సిబ్బంది ఉన్నారు.


విపత్కర పరిస్థితుల్లోనూ పంటలకు గిట్టుబాటు ధరలు: మంత్రి


విపత్కర పరిస్థితుల్లోనూ పంటలకు గిట్టుబాటు ధరలు: మంత్రి



 విజయనగరం / పార్వతీపురం, పెన్ పవర్


విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రబీ పంటల కొనుగోలుకు కేంద్రాలను ప్రారంభిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు పండించిన 3.64 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నల కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధరతో ఎవరైనా మొక్క జొన్నలను కొంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్వతీపురంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం డిప్యుటీ సిఎం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ... కరోనా వైరస్, లాక్ డౌన్ సమస్యల కారణంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లభించకుండాపోయే ప్రమాదం ఉందని గుర్తించిన ప్రభుత్వం రబీలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలను ప్రకటిచడంతో పాటుగా పంటలను కొనుగోలు చేయడానికి చర్యలను చేపట్టిందని వివరించారు. 
రాష్ట్రంలో మొక్కజొన్న క్వింటాల్ కు రూ.1760 మద్దతు ధరగా నిర్ణయించి, ఆ ధరలోనే ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3.64 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయనుందని పుష్ప శ్రీవాణి తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని, అందుకే ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతు ఇబ్బంది పడకూడదని మద్దతు ధరలతో పంటల కొనుగోళ్లకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసారని కితాబిచ్చారు. రైతులు తమ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో ఉండే అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్ల వద్ద తాము పండిస్తున్న పంటలను నమోదు చేసుకుంటే ప్రభుత్వం వాటికి మద్దతు ధరలను ఇచ్చి కొనుగోలు చేస్తుందని చెప్పారు. వైయస్సార్ రైతు భరోసా పథకం, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్లవేళలా రైతన్నలకు అండగా ఉంటుందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ లాక్డౌన్ సమయంలోనూ వ్యవసాయ పనులకు ఇబందులు వాటిల్లకుండా, రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి ఇబ్బందిపడకుండా ప్రభుత్వం అన్ని చర్యలనూ తీసుకుందని పుష్ప శ్రీవాణి వివరించారు. జిల్లాలోని అధికార యంత్రాంగం, ప్రజలు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషి కారణంగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, మరికొన్ని రోజులు అందరూ ఇలాగే కృషి చేసి జిల్లాను కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగారావుతో పాటుగా వైసీపీ స్థానిక నాయకులుకొండపల్లి బాలకృష్ణ,  ,బెలగాం జయప్రకాష్ నారాయణ,మంత్రి రవి కుమార్ ,మజ్జి నాగమణి   తదితరులు పాల్గొన్నారు.


క్వారంటైన్ వ్యతిరేకంగా అప్పుఘర్ ప్రజలు ఆందోళన.

 



క్వారంటైన్ వ్యతిరేకంగా అప్పుఘర్ ప్రజలు ఆందోళన.



 స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్)


 జనావాసాల  మధ్య క్వారంటైన్  ఏర్పాటుని వ్యతిరేకిస్తూ అప్పు ఘర్  ప్రజలు   సోమవారం రాత్రి రోడ్డుపై  ఆందోళన చేపట్టారు. నగరంలో  పెరుగుతున్న కరోనా వైరస్  పాజిటివ్ కేసుల దృష్ట్యా  ఎంవిపి లో ఉన్న ఏపీ టూరిజం మరియు  హరిత హోటల్ ను క్వారంటైన్ కు  కేటాయిస్తూ   విశాఖ జాయింట్ కలెక్టర్  శివ శంకర్   ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు  అక్కడ ఏర్పాటు చేస్తుండగా  అప్పు ఘర్  ప్రజలు  వ్యతిరేకించారు. ప్రజలు  తిరిగే ప్రదేశాల్లో క్వారంటైన్  ఏర్పాటు చేయడం వల్ల   తమకు ఇబ్బందికరంగా ఉంటుందని  అడ్డుతగిలారు. అధికారుల వినిపించుకోలేదని  రోడ్డుపైకి వచ్చి  ఆందోళన చేపట్టారు. పోలీసులు  రంగ ప్రవేశం చేసి  పరిస్థితి చక్కదిద్దారు.


మెడికల్ షాప్ పై ఆకస్మిక తనిఖీలు


మెడికల్ షాప్ పై ఆకస్మిక తనిఖీలు


వైద్య డ్రగ్స్ అధికారుల బృందం


పెన్ పవర్ న్యూస్:చిత్తూరు, సత్యవేడు డివిజన్,


వరదయ్య పాళెం మండల కేంద్రం లోని మెడికల్ షాప్ ల పై విజిలెన్స్ అధికారులు మంగళవారం  ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రస్తుతం వున్నా కష్టకాలంలో ప్రజలు వైద్యశాలకు వస్తే రోగుల వద్ద నుండి నిలువు దోపిడీ చేస్తున్నారంటూ పలు ఆరోపణలు రావడంతో ఈ తనిఖీ నిర్వహించామని ఆమె తెలిపారు. వైద్య విజిలెన్స్ అధికారి సీఐ టీ. అబ్బన్న మాట్లాడుతూ కరోనా మహమ్మారి తరిమికొట్టాలనే ఉదేశంతో ఇంటివద్దనే వున్నా సమయం లో ప్రవైట్ వైద్య అధికారులు ఎటువంటి ధ్రువీకరణ పత్రలు లేకుండా మెడికల్ షాపులు నిర్వహింస్తున్నారని,  మాస్కులు,శానిటర్లు, అధిక ధరలు విక్రయిచడం తో గౌస్ మెడికల్ షాప్ పై కేసు నమోదు చేసారని వైద్య అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం లో టీ. అబ్బన్న, రెడ్డి శేఖర్ రెడ్డి, ప్రశాంతి పాల్గొన్నారు.


మరో వారం రోజుల లాక్ డౌన్ అత్యంత కీలకం


మరో వారం రోజుల లాక్ డౌన్ అత్యంత కీలకం


మంత్రి బొత్స సత్యనారాయణ..


విజయనగరం,  పెన్ పవర్
మరో వారం రోజుల లాక్ డౌన్ అత్యంత కీలకం..ఇప్పటి వరకు కన్నా రెండింతలు అధికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈనెల 5 వరకు 104 సాంపిల్స్ పంపించగా 64 నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది.. కేంద్ర ఆదేశాలు ప్రకారం విదేశీ, ఢిల్లీ, ఇతరప్రాంతాల నుంచి వారివి, వారి కాంటాక్ట్ సాంపిల్స్ తీసి పంపించాము. జిల్లాలోని కి ఇతర ప్రాంతాల నుంచి రాకుండా నాలుగు సరిహద్దుల్లో మూసి వేశాం క్వరంటైన్ లో ఉన్న వారిని సర్వీ లైన్స్ చేస్తున్నాం.. 345 మందికి జలుబు, దగ్గు ఉన్న వారిని గుర్తించి స్థానిక పిహెచ్ సీలకి తరలిస్తున్నాం క్వరంటైన్ కేంద్రాల్లో 4500 బెడ్ లు ఏర్పాటు చేసాం క్వరంటైన్ లో ఉన్న వారికి ఫుడ్, వసతి అందిస్తున్నారు.. జే ఎన్ టీయూ  లో 113 మంది ఉన్నారు.. వారిని మరో వారం రోజుల్లో పూర్తి పరీక్షలు చేసి ఇళ్లకు పంపిస్తాం. రాష్ట్రంలో వ్యాధి లక్షణాలు వస్తాయేమోనని దశల వారీ చర్యలు చేపట్టాం..ఎలాంటి పరిస్తుతులు ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ సలహాలు, సూచనలు ప్రజలు పాటించాలని విజ్ఞప్తి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించారు దాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. సోషల్ డిస్టెన్స్ లో ప్రజలు ఉండాలి. రైతు బజార్లు విస్తరించాం. కార్పొరేషన్ లలో మొబైల్ మర్కెట్స్ పెట్టాం..ఆర్టీసీ బస్సుల్లో కూడా మొబైల్ మార్కెట్స్ పెట్టాలని యోచిస్తున్నాం. జిల్లాలో ఇంకా 30 వేల మందికి వెయ్యి రూపాయల కరోనా విపత్తు సాయం అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఇస్తున్న సాయం అందరికీ అందుతుంది. ఇందులో రాజకీయాలకి తావులేదు. నిత్యా వసర ధరలపై నియంత్రణ ఉంది. ఎక్కువ ధరలకు విక్రయించే వారిపై చర్యలు ఉంటాయి. ఏడు అంశాల పై ఒక్కో నోడల్ అధికారిని నియమించాం..ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉండి పోయిన విద్యార్థులు, తీర్ధ యాత్రికులు, వలస కార్మికులు, భిక్ష గాళ్ళు, అనాధుల కి 34 కేంద్రాల్లో 3500 మందికి భోజనం, వసతి కల్పిస్తున్నాం. ఈ కేంద్రాల్లో 18 వరకు ప్రయివేటు కేంద్రాలు కూడా ఉన్నాయి. ప్రతి కుటుంబం ఆరోగ్యం కాపాడడమే ప్రభుత్వ లక్ష్యం.. జిల్లా, నియోజక వర్గాలలో టాక్స్ ఫోర్స్ లు ఏర్పాటు చేసాం..వాటి నివేదిక లపై నిరంతరం పర్య వేక్షిస్తున్నాం. ఎవరూ ఆందోళన కి గురి కావొద్దు.. కరోనాకి ఒకటే మందు సోషల్ డిస్టెన్స్ పాటించడమే. రేషన్ కార్డు ఉండి డేటా లేకపోయిన వారికి కూడా వెయ్యి రూపాయలు అందిస్తారు..ఇది ప్రభుత్వ ఆదేశాలు తప్పక అమలు చేయాల్సిందే. సర్వే లైన్స్ కి వెళ్లే ప్రతి వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకి మాస్క్ లు, శాని టైజర్ తప్ప ని సరిగా ఇవ్వాల్సిందే..


పీపీఈ కిట్లు సరిపడా ఉన్నాయి.


ఎన్నికల కమిషన్ ఏ ఆదేశాలు ఇచ్చారో నాకు తెలియదు కానీ, ఎమ్మెల్యే గా గెలిచిన వారికి, పార్టీ నాయకుడు, కార్యకర్త కు ప్రజలకు సాయం అందించడం, సహకరించడం తప్పా.. దానిపై విమర్శలు చేసేవారి విజ్ఞతకే వదిలేస్తున్నాం.  ఈ నెల 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తి వేయా లని ఒక మంత్రిగా కాకుండా సామాన్యుడిగా కోరుకుంటున్నాను.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...