Followers

విపత్కర పరిస్థితుల్లోనూ పంటలకు గిట్టుబాటు ధరలు: మంత్రి


విపత్కర పరిస్థితుల్లోనూ పంటలకు గిట్టుబాటు ధరలు: మంత్రి



 విజయనగరం / పార్వతీపురం, పెన్ పవర్


విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రబీ పంటల కొనుగోలుకు కేంద్రాలను ప్రారంభిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు పండించిన 3.64 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నల కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధరతో ఎవరైనా మొక్క జొన్నలను కొంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్వతీపురంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం డిప్యుటీ సిఎం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ... కరోనా వైరస్, లాక్ డౌన్ సమస్యల కారణంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లభించకుండాపోయే ప్రమాదం ఉందని గుర్తించిన ప్రభుత్వం రబీలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలను ప్రకటిచడంతో పాటుగా పంటలను కొనుగోలు చేయడానికి చర్యలను చేపట్టిందని వివరించారు. 
రాష్ట్రంలో మొక్కజొన్న క్వింటాల్ కు రూ.1760 మద్దతు ధరగా నిర్ణయించి, ఆ ధరలోనే ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3.64 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయనుందని పుష్ప శ్రీవాణి తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని, అందుకే ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతు ఇబ్బంది పడకూడదని మద్దతు ధరలతో పంటల కొనుగోళ్లకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసారని కితాబిచ్చారు. రైతులు తమ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో ఉండే అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్ల వద్ద తాము పండిస్తున్న పంటలను నమోదు చేసుకుంటే ప్రభుత్వం వాటికి మద్దతు ధరలను ఇచ్చి కొనుగోలు చేస్తుందని చెప్పారు. వైయస్సార్ రైతు భరోసా పథకం, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్లవేళలా రైతన్నలకు అండగా ఉంటుందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ లాక్డౌన్ సమయంలోనూ వ్యవసాయ పనులకు ఇబందులు వాటిల్లకుండా, రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి ఇబ్బందిపడకుండా ప్రభుత్వం అన్ని చర్యలనూ తీసుకుందని పుష్ప శ్రీవాణి వివరించారు. జిల్లాలోని అధికార యంత్రాంగం, ప్రజలు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషి కారణంగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, మరికొన్ని రోజులు అందరూ ఇలాగే కృషి చేసి జిల్లాను కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగారావుతో పాటుగా వైసీపీ స్థానిక నాయకులుకొండపల్లి బాలకృష్ణ,  ,బెలగాం జయప్రకాష్ నారాయణ,మంత్రి రవి కుమార్ ,మజ్జి నాగమణి   తదితరులు పాల్గొన్నారు.


క్వారంటైన్ వ్యతిరేకంగా అప్పుఘర్ ప్రజలు ఆందోళన.

 



క్వారంటైన్ వ్యతిరేకంగా అప్పుఘర్ ప్రజలు ఆందోళన.



 స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్)


 జనావాసాల  మధ్య క్వారంటైన్  ఏర్పాటుని వ్యతిరేకిస్తూ అప్పు ఘర్  ప్రజలు   సోమవారం రాత్రి రోడ్డుపై  ఆందోళన చేపట్టారు. నగరంలో  పెరుగుతున్న కరోనా వైరస్  పాజిటివ్ కేసుల దృష్ట్యా  ఎంవిపి లో ఉన్న ఏపీ టూరిజం మరియు  హరిత హోటల్ ను క్వారంటైన్ కు  కేటాయిస్తూ   విశాఖ జాయింట్ కలెక్టర్  శివ శంకర్   ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు  అక్కడ ఏర్పాటు చేస్తుండగా  అప్పు ఘర్  ప్రజలు  వ్యతిరేకించారు. ప్రజలు  తిరిగే ప్రదేశాల్లో క్వారంటైన్  ఏర్పాటు చేయడం వల్ల   తమకు ఇబ్బందికరంగా ఉంటుందని  అడ్డుతగిలారు. అధికారుల వినిపించుకోలేదని  రోడ్డుపైకి వచ్చి  ఆందోళన చేపట్టారు. పోలీసులు  రంగ ప్రవేశం చేసి  పరిస్థితి చక్కదిద్దారు.


మెడికల్ షాప్ పై ఆకస్మిక తనిఖీలు


మెడికల్ షాప్ పై ఆకస్మిక తనిఖీలు


వైద్య డ్రగ్స్ అధికారుల బృందం


పెన్ పవర్ న్యూస్:చిత్తూరు, సత్యవేడు డివిజన్,


వరదయ్య పాళెం మండల కేంద్రం లోని మెడికల్ షాప్ ల పై విజిలెన్స్ అధికారులు మంగళవారం  ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రస్తుతం వున్నా కష్టకాలంలో ప్రజలు వైద్యశాలకు వస్తే రోగుల వద్ద నుండి నిలువు దోపిడీ చేస్తున్నారంటూ పలు ఆరోపణలు రావడంతో ఈ తనిఖీ నిర్వహించామని ఆమె తెలిపారు. వైద్య విజిలెన్స్ అధికారి సీఐ టీ. అబ్బన్న మాట్లాడుతూ కరోనా మహమ్మారి తరిమికొట్టాలనే ఉదేశంతో ఇంటివద్దనే వున్నా సమయం లో ప్రవైట్ వైద్య అధికారులు ఎటువంటి ధ్రువీకరణ పత్రలు లేకుండా మెడికల్ షాపులు నిర్వహింస్తున్నారని,  మాస్కులు,శానిటర్లు, అధిక ధరలు విక్రయిచడం తో గౌస్ మెడికల్ షాప్ పై కేసు నమోదు చేసారని వైద్య అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం లో టీ. అబ్బన్న, రెడ్డి శేఖర్ రెడ్డి, ప్రశాంతి పాల్గొన్నారు.


మరో వారం రోజుల లాక్ డౌన్ అత్యంత కీలకం


మరో వారం రోజుల లాక్ డౌన్ అత్యంత కీలకం


మంత్రి బొత్స సత్యనారాయణ..


విజయనగరం,  పెన్ పవర్
మరో వారం రోజుల లాక్ డౌన్ అత్యంత కీలకం..ఇప్పటి వరకు కన్నా రెండింతలు అధికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈనెల 5 వరకు 104 సాంపిల్స్ పంపించగా 64 నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది.. కేంద్ర ఆదేశాలు ప్రకారం విదేశీ, ఢిల్లీ, ఇతరప్రాంతాల నుంచి వారివి, వారి కాంటాక్ట్ సాంపిల్స్ తీసి పంపించాము. జిల్లాలోని కి ఇతర ప్రాంతాల నుంచి రాకుండా నాలుగు సరిహద్దుల్లో మూసి వేశాం క్వరంటైన్ లో ఉన్న వారిని సర్వీ లైన్స్ చేస్తున్నాం.. 345 మందికి జలుబు, దగ్గు ఉన్న వారిని గుర్తించి స్థానిక పిహెచ్ సీలకి తరలిస్తున్నాం క్వరంటైన్ కేంద్రాల్లో 4500 బెడ్ లు ఏర్పాటు చేసాం క్వరంటైన్ లో ఉన్న వారికి ఫుడ్, వసతి అందిస్తున్నారు.. జే ఎన్ టీయూ  లో 113 మంది ఉన్నారు.. వారిని మరో వారం రోజుల్లో పూర్తి పరీక్షలు చేసి ఇళ్లకు పంపిస్తాం. రాష్ట్రంలో వ్యాధి లక్షణాలు వస్తాయేమోనని దశల వారీ చర్యలు చేపట్టాం..ఎలాంటి పరిస్తుతులు ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ సలహాలు, సూచనలు ప్రజలు పాటించాలని విజ్ఞప్తి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించారు దాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. సోషల్ డిస్టెన్స్ లో ప్రజలు ఉండాలి. రైతు బజార్లు విస్తరించాం. కార్పొరేషన్ లలో మొబైల్ మర్కెట్స్ పెట్టాం..ఆర్టీసీ బస్సుల్లో కూడా మొబైల్ మార్కెట్స్ పెట్టాలని యోచిస్తున్నాం. జిల్లాలో ఇంకా 30 వేల మందికి వెయ్యి రూపాయల కరోనా విపత్తు సాయం అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఇస్తున్న సాయం అందరికీ అందుతుంది. ఇందులో రాజకీయాలకి తావులేదు. నిత్యా వసర ధరలపై నియంత్రణ ఉంది. ఎక్కువ ధరలకు విక్రయించే వారిపై చర్యలు ఉంటాయి. ఏడు అంశాల పై ఒక్కో నోడల్ అధికారిని నియమించాం..ఇతర జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉండి పోయిన విద్యార్థులు, తీర్ధ యాత్రికులు, వలస కార్మికులు, భిక్ష గాళ్ళు, అనాధుల కి 34 కేంద్రాల్లో 3500 మందికి భోజనం, వసతి కల్పిస్తున్నాం. ఈ కేంద్రాల్లో 18 వరకు ప్రయివేటు కేంద్రాలు కూడా ఉన్నాయి. ప్రతి కుటుంబం ఆరోగ్యం కాపాడడమే ప్రభుత్వ లక్ష్యం.. జిల్లా, నియోజక వర్గాలలో టాక్స్ ఫోర్స్ లు ఏర్పాటు చేసాం..వాటి నివేదిక లపై నిరంతరం పర్య వేక్షిస్తున్నాం. ఎవరూ ఆందోళన కి గురి కావొద్దు.. కరోనాకి ఒకటే మందు సోషల్ డిస్టెన్స్ పాటించడమే. రేషన్ కార్డు ఉండి డేటా లేకపోయిన వారికి కూడా వెయ్యి రూపాయలు అందిస్తారు..ఇది ప్రభుత్వ ఆదేశాలు తప్పక అమలు చేయాల్సిందే. సర్వే లైన్స్ కి వెళ్లే ప్రతి వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకి మాస్క్ లు, శాని టైజర్ తప్ప ని సరిగా ఇవ్వాల్సిందే..


పీపీఈ కిట్లు సరిపడా ఉన్నాయి.


ఎన్నికల కమిషన్ ఏ ఆదేశాలు ఇచ్చారో నాకు తెలియదు కానీ, ఎమ్మెల్యే గా గెలిచిన వారికి, పార్టీ నాయకుడు, కార్యకర్త కు ప్రజలకు సాయం అందించడం, సహకరించడం తప్పా.. దానిపై విమర్శలు చేసేవారి విజ్ఞతకే వదిలేస్తున్నాం.  ఈ నెల 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తి వేయా లని ఒక మంత్రిగా కాకుండా సామాన్యుడిగా కోరుకుంటున్నాను.


నగరంలో పలు చోట్ల  లీగల్ మెట్రాలజీ  అధికారుల తనిఖీలు


నగరంలో పలు చోట్ల  లీగల్ మెట్రాలజీ  అధికారులు తనిఖీలు



  స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్)


 నగరంలో  పలు దుకాణాల్లో  మంగళవారం   లీగల్ మెట్రాలజీ అధికారులు   తనిఖీలు నిర్వహించారు. లీగల్ మెట్రాలజీ   డిప్యూటీ  కంట్రోలర్ మధుసూదన్ ఇన్స్పెక్టర్  రామారావు ల ఆధ్వర్యంలో   ఆయా షాపులను  తనిఖీలు చేశారు.  షాపుల్లో  ఉన్నా సరుకుల  రేట్లు  నాణ్యత  ఎక్స్ పేరి  తేదీలను  క్షుణ్నంగా పరిశీలించారు. మోర్  తదితర డిపార్ట్మెంట్ స్టోర్స్ కిరాణా షాపులు  తనిఖీలు చేసి  వివరాలు సేకరించారు. కరొనా లాక్ డౌన్ కారణంగా  ప్రజలు ఇబ్బంది పడకుండా  కొన్ని దుకాణాలు తెచ్చు కోవటానికి  ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని  ఏ ఒక్కరూ  అవినీతికి పాల్పడితే  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  డిప్యూటీ కంట్రోలర్  హెచ్చరించారు. ఫిర్యాదులు అందితే  షాపుల పై  కేసు నమోదు చేయడం జరుగుతుందని  తెలిపారు


కోళ్లు పంచిన టీడీపీ నేత


కోళ్లు పంచిన టీడీపీ నేత


విజయనగరం, పెన్ పవర్


మండల టీడీపీ అధ్యక్షుడు బొద్దల నరసింగ రావు కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ లో ఉన్న తమ గ్రామ ప్రజలకు కోళ్లు, కూరగాయలు వినూత్నంగా పంపిణీ చేశారు. మంగళ వారం ద్వారపూడి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో నరసింగ రావు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ వల్ల తన గ్రామ ప్రజలు పట్టణ ప్రాంతానికి దూరంగా ఉండడం వల్ల, కూరగాయలు, చికెన్ వంటి వాటికి దూరమయ్యారని తెలిపారు. అయితే తమ గ్రామ ప్రజల కనీస అవసరాన్ని గుర్తించి ఇంటికో కోడి చొప్పున 1200 కోళ్లు, ఇంటికి ఆరు చొప్పున 6 వేల కోడి గుడ్లు , నాలుగు రకాల కూరగాయలు పంపినీ చేశామన్నారు. అదేవిధంగా గ్రామంలో ఇప్పటికి తన సొంత ఖర్చులతో రెండు సార్లు శానిటేషన్ కార్యక్రమం నిర్వహించి రసాయనాలు స్ప్రే చేయించినట్టు తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు నందుకొని మండలంలోని ప్రతి గ్రామానికి ఆది వారం రాత్రి కొవ్వొత్తులు పంచి పెట్టి వెలిగించినట్టు తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయిస్తూ, స్ప్రే చేయించామన్నారు. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఈ కష్ట కాలంలో వారికి అవసరమైన, తమకి తోచిన సాయం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో ని యువకులంతా తమ సహాయ సహకారాలు అందించినట్టు తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కోడి, కూరగాయలు, గుడ్లు ప్రజలకి అంద చేశారు. ఈ కార్యక్రమంలో బొద్దల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


పేదలకు అండగా ఉంటాం.


పేదలకు అండగా ఉంటాం



విశాఖ జిల్లా/ మాకవరపాలెం, పెన్ పవర్


 


మాకవరపాలెం మండలం చామంతిపురం పంచాయతీ  టీడీపీ నాయకులు పోతల అప్పలరాజు ఆధ్వర్యంలో  గ్రామంలో ని 200 కుటుంబాలకు సుమారు 40 వేలు రూపాయలు వెచ్చించి 10 రకాల కూరగాయలను అందించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఇళ్లకే పరిమితమైన ప్రజలు చాలా    ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకునేందుకు ఎల్లప్పుడు తమ వంతు సహకారం అందివ్వడం జరుగుతుంది అని వారు తెలిపారు, అలాగే గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలను పాటించాలని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో దుంగల లోవ వంటాకుల అప్పలనాయుడు, బొడ్డు గంగరాజు,లాలం శ్రీనివాసరావు, మర్రి బెన్నయ్యనాయుడు,తదితరులు పాల్గొన్నారు,


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...