Followers

సచివాలయం సిబ్బందికి గ్రామ ప్రజలకు మాస్కుల అందజేత





సచివాలయం సిబ్బందికి గ్రామ ప్రజలకు మాస్కుల అందజేత

 

గోకవరం పెన్ పవర్

 

గోకవరం మండలం గుమ్మల్ల దొడ్డి గ్రామంలో శ్రీ లలిత మెమోరియల్ ఫౌండేషన్ మరియు కోరుకొండ గొకవరం ఏజెన్సీ మండలాల పి.యం.పి అసోసియేషన్ ఆధ్వర్యంలో  బడుగు ప్రసాద్  ఆర్థిక సహాయం తో గుమ్మళ్ళదొడి గ్రామ సచివాలయం ఉద్యోగుల సమక్షంలో సచివాలయం సిబ్బందికి గ్రామ ప్రజలకు మాస్కుల అందచేశారు సచివాలయం ఉద్యోగులు శ్రీ లలిత మెమోరియల్ ఫౌండేషన్ మరియు పి.యం.పి అసోసియేషన్ అధ్యక్షులు పి చిన్ని ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి జి.వెంకటేష్ ఉపాధ్యక్షులు టి.వెంకటేష్ జాయింట్ సెక్రెటరీ బి.శ్రీనివాసు  సభ్యులు జాజుల శివాజీ, యమ్. బాపిరాజు గ్రామ నాయకులు పెనికేటి అబ్బాయి , పి.యం.పి అసోసియేషన్ కార్యదర్శి ఎం. నాగేశ్వరరావు ఉపాధ్యక్షులు వై .పవన్ కుమార్,  వై. ప్రేమ్ కుమార్, పి.కృష్ణ, బి సేతు , డి. దుర్గాప్రసాద్  మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


 

 



 

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు

 

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు

 

గోకవరం, పెన్ పవర్

 

గోకవరం సొసైటీ  కార్యాలయం వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభత్వం వారు   ఏర్పాటు చేసినట్లు సొసైటీ చైర్మన్ మంగరౌతు దుర్గా శ్రీనివాసరావు  మరియు సంఘ సి.యి. ఒ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రియల్7వ తేదీ నుండి ఈ సౌకర్యం అందబాటులోకి వస్తుందని కాబట్టి మండలంలోని రైతులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.రైతులందరూ వివరాలు కొరకు గోకవరం సొసైటీ లోని ఈ నెంబర్స్  యన్.రమాదేవి 8331846488 , యస్. దుర్గారావు9989123507  సంప్రదించాలని కోరారు.

నిత్యావసరాలు పంపిణీ





 

 

సీతానగరం పెన్ పవర్.

 

 ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దానితో ఉపాధి అవకాశాలు కోల్పోయిన సింగవరం బీసీ , ఎస్సీ , ఎస్టీ మైనార్టీల ఆరువందల కుటుంబాలకు సంగన. చిన్న పోశియ్య 70 వేల రూపాయల వ్యయంతో బియ్యం, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దొండకాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంగన.చిన్న పోశియ్య మాట్లాడుతూ కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడుతున్న పోలీసువారికి, వైద్య, పారిశుద్ధ్య కార్మికులకు రుణపడి ఉంటామన్నారు. ప్రజలందరూ లాక్ డౌన్ కి సహకరిస్తూ కోవిడ్-19 కట్టడికి స్వీయ సంరక్షణ పాటించాలని పిలుపునిచ్చారు. మన గ్రామానికి ఆర్థిక సాయం చేద్దాం - మన గ్రామాన్ని మనమే కాపాడుకుందాం అనే నినాదంతో నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో జరిగిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినప్పుడు తమ వంతు పలువురు సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెందుర్తి అచ్యుత రామారావు పాల్గొన్నారు. సహకారంగా జ్ఞానం పోసియ్య, మర్రే.కృష్ణమూర్తి, ముత్యం రామారావు, ముత్యం వెంకన్న, గంగిశెట్టి సూర్య భాస్కర్ రావు, దయానంద్ పాల్గొన్నారు.


 

 



 

ప్రజా సేవ లో "ప్రధమం"గా ముందుకు పోతున్న  ఏఎంజి వెల్ఫేర్ సొసైటీ.


ప్రజా సేవ లో "ప్రధమం"గా ముందుకు పోతున్న  ఏఎంజి వెల్ఫేర్ సొసైటీ.

 

అరిలోవ. పెన్ పవర్.

 

 

విశాఖపట్నంలో లో ఏఎంజి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో లో బాధితుల సహాయార్థం మరియు  తమ నిస్వార్థ సేవలందిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, ఏఎంజి వెల్ఫేర్ సొసైటీ, తరఫున రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేసే వరకు రోజు ప్రతి రోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ పి ఆర్ ఓ కిరణ్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా నగరంలో 1,2,3,4,5, స్టేషన్లు మరియు గోపాలపట్నం.పెందుర్తి.అరిలోవ. వారిలో స్టేషన్లకు సుమారు రెండు వేల మాస్కులు.సుమారు 200 లు హ్యాండ్ సనిటైజర్ బాటిల్స్. ఒ అర్ స్.మరియు వాటర్ బాటిల్స్. స్వయంగా ఆయా స్టేషన్ ల లో అందజేశారు. కార్యక్రమంలో ఎంజి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు విజయ్ కుమార్ పాల్గొన్నారు.

కరోనా సాయం, నియంత్రణలో  సక్సెస్ 


కరోనా సాయం, నియంత్రణలో  సక్సెస్ 

 

-- విస్తృత సేవల్లో అనకాపల్లి వైసిపి నాయకులు  

 

-- ఎమ్మెల్యే సహా పలువురి ప్రశంసలు 

 

అనకాపల్లి , పెన్ పవర్  

 

అనకాపల్లిలో కరోనా  సాయం నియంత్రణ అంశాల్లో వైసిపి నాయకులు ముందంజలో ఉన్నారంటే అతిశయోక్తి లేదు. కరోనా  నేపథ్యంలో విదించిన లాక్డౌన్ అమలులో వైసీపీ నాయకుల  పాత్రను కొట్టిపారేయలేం. ముఖ్యమంత్రి తమ పార్టీ అధినేత జగన్మోహన్  రెడ్డి  ఇచ్చిన పిలుపును ఎమ్మెల్యే అమరనాథ్ ఆదేశాలను పక్కాగా అమలు చేయడంలో సక్సెస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది.  అనకాపల్లిలో  ఇప్పటి వరకు కరోనా సమస్య కూడా తలెత్తకపోవడం దీనికి అదనపు బలంగా చెప్పుకోవచ్చు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోందనెది అందరికీ తెలిసిందే. ఇటు రాష్ట్రం జిల్లాల్లో  సమస్య అక్కడక్కడ ఆందోళనకు గురి చేసేలా చేస్తుంది.  అనకాపల్లిలో అలాంటి ప్రభావం కానరాకపోవడం చెప్పుకోదగినదిగా కొందరు కితాబిస్తున్నారు. వ్యాధి సోకకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అమలుచేయడంలో పోలీసులదే కీలకపాత్ర. అటు వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు  చేస్తున్న సేవలు వర్ణనాతీతం.  ఎవరెన్ని చేసినా క్షేత్రస్థాయిలో అనుకున్న ఫలితం కనిపించకపోతే అటు ప్రభుత్వం పార్టీపైనే ముద్ర పడుతుందన్నది వాస్తవం. దీనిలో  భాగంగానే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ పార్టీ నేతలకు జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 

        అధినేత పిలుపు మేరకు ఎమ్మెల్యే అమర్నాథ్ ఇచ్చిన ఆదేశాలను  క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో వైసిపి నేతలు సఫలమయ్యారనే చెప్పొచ్చు. రెేషన్ డిపోల వద్ద లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సొంత నిధులతో సౌకర్యాలను ఏర్పాటు చేయడం ఇందులో ఒకటి. ప్రధానంగా సామాజిక దూరాన్ని పాటించేలా ప్రజల్లోనే ఉంటూ అవగాహన కల్పించడం చెప్పుకోదగినది. పనులు లేక ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలను ఆదుకోవడంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.   ఆహారం కాయగూరలు వంటివి పంపిణీ చేస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ కు మంచి పేరు తీసుకొస్తున్నారు. పట్టణ అధ్యక్షులుగా మందపాటి జానకిరామరాజు చేస్తున్న సేవలు ఎక్కువే. అటు పలకా రవి, జాజుల రమేష్ ,కాండ్రేగుల భాస్కర్,  పీలా  రాంబాబులు, గొర్లె సూరిబాబు  తమతమ స్థాయిలో పేదలను ఆదుకోవడంలో ముందుంటున్నారు. వీరికి తోడు అనేకమంది నాయకులు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాసంఘాల నాయకులు  విస్తృత సేవలు అందిస్తుండటంతో ఇప్పటికైతే కరోనా సమస్య ఇక్కడ కానరాకపోవడం గమనార్హం. 
 

 


 


పేదలకు  సహాయపడాలి 





పేదలకు  సహాయపడాలి 

-ఎమ్మెల్సీ జగదీష్ 

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

 

కసింకోట మండలం జమాధులపాలెం గ్రామంలో ఒమ్మి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో 1000 ప్యాకెట్లు కాయకూరలును  ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీష్ చేతులమీదుగా పంపిణీ చేశారు. కరోనా  వైరస్ మూలంగా  లాక్ డౌన్ విధించడం వల్ల పనులకు వెళ్ళలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజల ఇబ్బందులను గుర్తించి సేవా దృక్పథంతో తమకు తోచిన సహాయం చేయాలని ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి కూరగాయలును పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఇటువంటి విపత్కర సమయములో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఒమ్మి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిన రమణమూర్తి, కనకరాజు ,మొల్లి  రమణ మొల్లి శివ ,వియ్యపు రమణ తదితరులు  పాల్గొన్నారు.


 

 



 

ఎమ్మెల్యే  అమర్ నాథ్  చేయూత 


ఎమ్మెల్యే  అమర్ నాథ్  చేయూత 


 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ జర్నలిస్టులకు చేయూతనందించారు. లాక్డౌన్ నేపధ్యంలో ఆర్థిక ఇబ్బందులును ఎదుర్కొంటున్న  జర్నలిస్టులకు  సోమవారం సహాయం అందించారు. బియ్యం పప్పులు వంటి సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు ఆదుకోవడంలో ముందుంటారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు లాక్ డౌన్ లో ఎవరు ఇబ్బందులు పడకూడదన్నదే తమ ప్రయత్నంగా చెప్పారు.  కరోనా  నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా ప్రతినిధులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తాను సాయం చేయాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పట్టణ అధ్యక్షులు మందపాటి జానకీ రామరాజు, మండల అధ్యక్షులు గొర్లె సూరిబాబు,   యువజన రాష్ట్ర కార్యదర్శి పలకా రవి ,యువజన కార్యదర్శి జాజుల రమేష్, దంతులూరి దిలీప్ కుమార్, మళ్ల బుల్లిబాబు, బీశెట్టి జగన్ , కొణతాల మురళీ తదితరులు పాల్గొన్నారు. 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...