బాధితులకు సేవలందిస్తున్న మార్టూరు కుటుంబీకులకు అభినందనలు
---- రూరల్ సి.ఐ నరసింహరావు
అనకాపల్లి , పెన్ పవర్
లాక్ డౌన్ నేపథ్యంలో బాధితులైన పేద వర్గాలను ఆదుకునేందుకు చేస్తున్న మార్టూరు కుటుంబికుల సేవలు అభినందనీయమని రూరల్ సి.ఐ నరసింహరావు పేర్కొన్నారు. మండలంలో రేబాక, కాపుశెట్టివానిపాలెం, గురజాడనగర్ గ్రామాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అతిథులుగా పాల్గొన్న రూరల్ సి.ఐ నర్సింహారావు, ఎస్సై రామకృష్ణ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన లాక్ డౌన్ ను ప్రజలందరూ పాటించాలన్నారు. ఇండ్లకే పరిమితమైన గ్రామస్తుల కుటుంబ పోషణకు నిత్యావసర సరుకులు పంపిణీనిని మార్టూరు కుటుంబీకులు పెద్ద ఎత్తున చేపట్టడం అభినందనీయమనారు. రేబాక గ్రామానికి చెందిన మార్టూరు లక్ష్మణ్ కుమార్, వెంకటసాయిలు మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలబడటం తాము ఎప్పటి నుంచో చేస్తున్న కార్యక్రమాలుగా చెప్పారు. 30 గుడ్డులు, ఒక్కొక్క కేజీ చొప్పున కందిపప్పు, పంచదార, ఉప్పు, లీటర్ నూనె ఆయా గ్రామాల్లో సుమారు వెయ్యి కుటుంబాలకు అందించారు. భౌతిక దూరం పాటిస్తూ స్వయంగా ఇండ్లకే వెళ్లి కుటుంబ సభ్యులు మార్టూరు సన్యాసమ్మ, రమేష్ బాబు, భాస్కరరావు, కోన నాయుడు, మంత్రి అప్పలనాయుడు, కాపుశెట్టి అర్జునరావు గ్రామస్తులు అందిస్తున్నారు. ఈ గ్రామాల్లో తొమ్మిది వందల ఇండ్లకు 4.50 లక్షల ఖర్చు చేసి అండగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇలాంటి సేవలు చేయడంపై పలువురు హర్షిస్తున్నారు.