హెల్ప్ ది నీడి కు అన్యుహ స్పందన
నెల్లూరు, పెన్ పవర్
నిరాశ్రయులకు అండగా నిలిచిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం తరపున లాక్ డౌన్ సమయం లో నిరుపేదలకు చేయూత అందించటానికి చేపట్టిన హెల్ప్ ది నీడి (Help The Needy) కార్యక్రమమునకు మంచి స్పందన వచ్చిందని రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణారెడ్డి గారు అన్నారు. మంగళవారం పెన్నానది వడ్డున నివసిస్తున్న 25 కుటుంబాలకు , ఒక్కొక్క కుటుంబానికి 10కేజీలు బియ్యం , 7 రకాల నిత్యావసర సరుకులు మరియు 4 కేజీల వివిద రకాల కూరగాయలు అందించారు. తదనంతరం కొండాయపాలెం, నవాబ్ పేట, ఏ సీ నగర్ మరియు పొదలకూరు రోడ్ లో ఉంటున్న నిరుపేదలకు వస్తుసామాగ్రి అందించారు. ఈ సందర్భముగా డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారి సూచనల మేరకు రేషన్ కార్డు లేని నిరుపేదలకు విశ్వవిద్యాలయ ఎన్. ఎస్.ఎస్. ఇటువంటి మంచి కార్యక్రమము చేపట్టటం ఎంతోసంతోషకరమని అన్నారు. పనితీరును అలాగే కోవిడ్-19 నివారణకు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ విపత్కర సమయంలో ప్రభుత్వాధికారులందరు ప్రభుత్వానికి సహకరిస్తూ అత్యవసర పరిస్తుతులలో తమవంతు బాధ్యతను నెరవేర్చాలని అన్నారు. విశ్వవిద్యాలయ ఎన్. ఎస్.ఎస్. ప్రతి రోజు 60 మంది నిరాశ్రయులకు మరియు వృద్దులకు గడచిన 13 రోజుల నుంచి రాత్రిపూట భోజనమును ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అలాగే విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధన విద్యార్థులు, వివిధ కళాశాలల యాజమాన్యం,ఎన్. ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారులు, ఎన్. ఎస్.ఎస్ స్టూడెంట్స్ స్వచ్చందంగా ముందుకు వచ్చి సుమారు 75,000/- (డెబ్భై ఐదు వేలు) రూపాయలు దాకా విరాళాలిచ్చారని. ఆ వచ్చిన విరాళాలతో 110 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను అందించామని అన్నారు. ఎన్. ఎస్.ఎస్ రాష్ట్రాధికారి డా. రమేష్ రెడ్డి రాష్ట్రములో ఇతర ఏ విశ్వవిద్యాలయం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టలేదని, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఎన్. ఎస్.ఎస్ సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం ను అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజానాయర్ మాట్లాడుతూ తమకు సహకరించి స్వచ్చందంగా ముందుకు వచ్చిన ప్రతిఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థల డీన్ బి. సుధారాణి గారు మాట్లాడుతూ NSS మరియు NCC విద్యార్థులు ఎంతో కష్టపడి తమవంతు బాధ్యతగా ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలను చేపట్టటం వలన సమాజాభివృద్ధిలో భాగస్వాములైనట్లేనని అన్నారు. ఈ కార్యక్రమములో పాల్గొనటం తనకు అదృష్టంగా భావిస్తున్నాన్నారు. ఈ కార్యక్రమములో NSS సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, సోషల్ వర్క్ అధ్యాపకుడు డా. బి వి సుబ్బారెడ్డి, NSS ప్రోగ్రాం అధికారి డా. చెంచయ్య కృష్ణ చైతన్య విద్యాసంస్థల డీన్ బి. సుధారాణి గారు, ప్రిన్సిపాల్ రాజేష్ గారు, NSS ప్రోగ్రాం అధికారి విజయ్ కుమార్ గారు ఎన్. ఎస్.ఎస్ వాలంటీర్లు పార్ధసారధి, రాజేష్, అఖిల్, చైతన్య మరియు శివ తేజ పాల్గొన్నారు.