Followers

నగరంలో పలు చోట్ల  లీగల్ మెట్రాలజీ  అధికారుల తనిఖీలు


నగరంలో పలు చోట్ల  లీగల్ మెట్రాలజీ  అధికారులు తనిఖీలు



  స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్)


 నగరంలో  పలు దుకాణాల్లో  మంగళవారం   లీగల్ మెట్రాలజీ అధికారులు   తనిఖీలు నిర్వహించారు. లీగల్ మెట్రాలజీ   డిప్యూటీ  కంట్రోలర్ మధుసూదన్ ఇన్స్పెక్టర్  రామారావు ల ఆధ్వర్యంలో   ఆయా షాపులను  తనిఖీలు చేశారు.  షాపుల్లో  ఉన్నా సరుకుల  రేట్లు  నాణ్యత  ఎక్స్ పేరి  తేదీలను  క్షుణ్నంగా పరిశీలించారు. మోర్  తదితర డిపార్ట్మెంట్ స్టోర్స్ కిరాణా షాపులు  తనిఖీలు చేసి  వివరాలు సేకరించారు. కరొనా లాక్ డౌన్ కారణంగా  ప్రజలు ఇబ్బంది పడకుండా  కొన్ని దుకాణాలు తెచ్చు కోవటానికి  ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని  ఏ ఒక్కరూ  అవినీతికి పాల్పడితే  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  డిప్యూటీ కంట్రోలర్  హెచ్చరించారు. ఫిర్యాదులు అందితే  షాపుల పై  కేసు నమోదు చేయడం జరుగుతుందని  తెలిపారు


కోళ్లు పంచిన టీడీపీ నేత


కోళ్లు పంచిన టీడీపీ నేత


విజయనగరం, పెన్ పవర్


మండల టీడీపీ అధ్యక్షుడు బొద్దల నరసింగ రావు కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ లో ఉన్న తమ గ్రామ ప్రజలకు కోళ్లు, కూరగాయలు వినూత్నంగా పంపిణీ చేశారు. మంగళ వారం ద్వారపూడి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో నరసింగ రావు మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ వల్ల తన గ్రామ ప్రజలు పట్టణ ప్రాంతానికి దూరంగా ఉండడం వల్ల, కూరగాయలు, చికెన్ వంటి వాటికి దూరమయ్యారని తెలిపారు. అయితే తమ గ్రామ ప్రజల కనీస అవసరాన్ని గుర్తించి ఇంటికో కోడి చొప్పున 1200 కోళ్లు, ఇంటికి ఆరు చొప్పున 6 వేల కోడి గుడ్లు , నాలుగు రకాల కూరగాయలు పంపినీ చేశామన్నారు. అదేవిధంగా గ్రామంలో ఇప్పటికి తన సొంత ఖర్చులతో రెండు సార్లు శానిటేషన్ కార్యక్రమం నిర్వహించి రసాయనాలు స్ప్రే చేయించినట్టు తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు నందుకొని మండలంలోని ప్రతి గ్రామానికి ఆది వారం రాత్రి కొవ్వొత్తులు పంచి పెట్టి వెలిగించినట్టు తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయిస్తూ, స్ప్రే చేయించామన్నారు. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఈ కష్ట కాలంలో వారికి అవసరమైన, తమకి తోచిన సాయం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో ని యువకులంతా తమ సహాయ సహకారాలు అందించినట్టు తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కోడి, కూరగాయలు, గుడ్లు ప్రజలకి అంద చేశారు. ఈ కార్యక్రమంలో బొద్దల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


పేదలకు అండగా ఉంటాం.


పేదలకు అండగా ఉంటాం



విశాఖ జిల్లా/ మాకవరపాలెం, పెన్ పవర్


 


మాకవరపాలెం మండలం చామంతిపురం పంచాయతీ  టీడీపీ నాయకులు పోతల అప్పలరాజు ఆధ్వర్యంలో  గ్రామంలో ని 200 కుటుంబాలకు సుమారు 40 వేలు రూపాయలు వెచ్చించి 10 రకాల కూరగాయలను అందించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఇళ్లకే పరిమితమైన ప్రజలు చాలా    ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకునేందుకు ఎల్లప్పుడు తమ వంతు సహకారం అందివ్వడం జరుగుతుంది అని వారు తెలిపారు, అలాగే గ్రామంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలను పాటించాలని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో దుంగల లోవ వంటాకుల అప్పలనాయుడు, బొడ్డు గంగరాజు,లాలం శ్రీనివాసరావు, మర్రి బెన్నయ్యనాయుడు,తదితరులు పాల్గొన్నారు,


ఫోన్ చేస్తే మీ వద్దకే భోజనం అందిస్తాం  


ఫోన్ చేస్తే మీ వద్దకే భోజనం అందిస్తాం  


 
 - గాదరాడ ఓం శివ శక్తి పీఠం ఆలయ ధర్మకర్త బత్తుల బలరామ కృష్ణ



కోరుకొండ, పెన్ పవర్



 కరోనా ప్రభావంతో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, సచివాలయ సిబ్బందికి, వాలంటరీలకు, రాజానగరం మండలం, కోరుకొండ  మండల్లలోని పేదలకు, అనాథలకు, లారీ డ్రైవర్లకు గాదరాడ ఓం శివ పీఠం ఆలయ ధర్మకర్త బత్తుల బలరామ కృష్ణ, జక్కంపూడి ఫౌండేషన్, 
 ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా కోరుకొండ మండలం గాదరాడ ఓం శివ శక్తి పీఠం ఆలయ ధర్మకర్త బత్తుల బలరామ కృష్ణ మాట్లాడుతూ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదేశాల మేరకు ప్రతిరోజు
  వెయ్యి మందికి సమీప గ్రామాలకు వెళ్లి భోజన ప్యాకెట్లు అందజేస్తున్నామని అన్నారు. లాక్ డౌన్ అమలుచేస్తున్న నేపథ్యంలోనే గత నెల 31 నుండి రాజానగరం, కోరుకొండ మండలాల్లో నిత్యం భోజన సదుపాయం కల్పిస్తున్నమని అన్నారు. అదే విధంగా సామాజిక మాధ్యమాలు ద్వారా శివ శక్తి పీఠం చరవాని నంబర్లను అందరికీ తెలియజేసి, ఆకలితో ఉన్న వారి వివరాలు తెలియజేస్తే, క్షణాల వ్యవధిలో భోజన ప్యాకెట్లు అందిస్తున్నామని అన్నారు.
ఏదేమైనా కరోనా వ్యాప్తి తో  ఇళ్లకే పరిమితం అయి, ఆకలితో ఇబ్బంది పడుతున్న వారికి, ఇతర రాష్ట్రాల నుండి వివిధ  పనుల నిమిత్తం రాజానగరం పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న వాహనదారులకు గాదరాడ శివ శక్తి పీఠం ఆకలి తీరుస్తుంది అని అన్నారు. గాదరాడ ఓం శివశక్తి పీఠం సేవలను నియోజకవర్గంలోని ప్రజలు కొనియాడుతున్నారు.


చిన్నారి  దాతృత్వం


"" చిన్నారి  దాతృత్వం ""


విజయనగరం, పెన్ పవర్
   


 మనవసేవే... మాధవ సేవ...స్ఫూర్తి తో  విజయనగరానికి చెందిన  "పైల నీతూ " అనే చిన్నారి కరోనా  మహమ్మారి  కారణంగా..  తన  కిడ్డీ  బ్యాంకు  లో  దాచుకున్న  2, 500/- తో     "కేసలి  స్వచ్ఛంద  సేవా సంస్థ  " ఆధ్వర్యంలో   విజయనగరం  లొ ఉన్న    చిన్నారుల కు.. విధి  నిర్వహణలో  ఉన్న  పోలీస్ అధికారులు / పోలీస్  సిబ్బంది కి..  రైల్వే సిబ్బంది.. పారిశుధ్య కార్మికులు కు.. పాదాచారులు కి. సెక్యూరిటీ సిబ్బంది కి.. చిరు  వర్తకులు కు.  నిరాశ్రుయులు కు.. భిక్షాటన  చేయు వారికి.. మతి  స్తిమితము  లేని  వారికి 


 " ఫ్రూటీలు .. గ్లూకోజ్  బాటిల్స్.. మజ్జిక పాకెట్స్ "


పంపిణీ చేశారు


ప్రజలను కాపాడేందుకు పార్వతీ పరమేశ్వరులు, ధన్వంతరీ ఆశీస్సులు


విజయనగరం, పెన్ పవర్


 


కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు, ధన్వంతరీ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అభిలషించారు. మంగళవారం నాడు పట్టణంలోని కొత్తగ్రహారం లో వేంచేసి ఉన్న శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన చండీయాగం లో ఎమ్మెల్యే కోలగట్ల పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమగుండంలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో కూడిన వస్తువులను ఎమ్మెల్యే కోలగట్ల చేతుల మీదుగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఋత్విక్కులు జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా అతలాకుతలమై ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అని అన్నారు. కనపడే క్రిములు, కనపడని క్రిములు కూడా నాశనం చేసే శక్తి మంత్రానికి ఉందని మన పురాణాలు చెబుతున్నాయి అన్నారు. పార్వతీ పరమేశ్వరుల సన్నిధికి ఎదురుగా చండీ హోమం చేయడం వల్ల ప్రజలకు అంతా మంచే జరుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మరియు ప్రముఖ న్యాయవాది టీవీ శ్రీనివాస రావు దంపతులు చండీ హోమం కర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపార వేత్తలు ఉడతా కాశీ విశ్వనాథం, బలభద్రుని నానాజీ, కుమ్మరిగుంట శ్రీనివాసరావు, ఆలయ ఈవో కె.వి.రమణ, ఋత్విక్కులు భమిడిపాటి రామ్ కుమార్ శర్మ, భమిడిపాటి రమేష్, కప్పగంతుల ప్రసాద్ తదితరులు ఉన్నారు...


నిండు గర్భిణికిి ఆదుకున్న ఫ్రెండ్లీ పోలీస్


నిండు గర్భిణికిి ఆదుకున్న ఫ్రెండ్లీ పోలీస్


మాడుగుల, పెన్ పవర్



అర్ధరాత్రి వేళ పురిటి నొప్పులతో అవస్థలు పడుతున్న ఓ నిండు గర్భిణికిి ఆదుకుని, మాడుగుల హాస్పిటల్ కు తరలించి, ప్రజల పట్ల పోలీసులు చూపించే ఆప్యాయతను మరో మారు రుజువు చేసి..  ఫ్రెండ్లీ పోలీస్ అనిపించుకున్నారు. 
వివరాల్లోకి వెలితే...
మాడుగుల మండలం సాగరం కాలనీకి చెందిన ఉండా భాను అనే నిండు గర్భిణీ, ఈ నెల 6వ తేది సోమవారం రాత్రి 12గంటల సమయంలో పురిటి నొప్పులతో అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో, 108 వాహనం అందుబాటులో లేక, బాధిత కుటుంబ సభ్యులకు ఏమి చెయ్యాలో అర్ధం కాక ఏఎన్ఎం ని ఆశ్రయించారు. వేరే మార్గం లేక ఏ ఎన్ ఎం వెంటనే మాడుగుల ఎస్సై పి రామారావుకు సమాచారం అందించారు. స్పందించిన ఆయన 7వ తేది మంగళవారం తెల్లవారి 2 గంటలకు  హుటాహుటిన సిబ్బందితో గ్రామానికి చేరుకుని, పురిటి నొప్పులతో బాధపడుతున్న ఉండా భాను ని మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీస్ వాహనంపై తరలించారు.  ప్రస్తుతం ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. గర్భిణీ ఆరోగ్యం బాగానే ఉందని, మధ్యాహ్నం 2, 3 గంటలకు ప్రసవం అయ్యే అవకాశాలు ఉందని డాక్టర్ సుజాత తెలిపారు. పోలీసులు చేసిన సేవలను ఆ గ్రామస్తులు అభినందించారు..


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...