కరోనా అంతానికి అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి భోజన సదుపాయం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే అధీప్ రాజు
Followers
పోలీసు సిబ్బందికి భోజన ఏర్పాట్లు : ఎమ్మెల్యే అధీప్ రాజు
ఇంటింటికి వెయ్యి రూ నగదును పంపిణీ చేసిన ఎమ్మెల్యే అధీప్ రాజు
కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటికి వెయ్యి రూపాయల నగదును పంపిణీ చేసిన ఎమ్మెల్యే అధీప్ రాజు
బొద్ధపు వాని పాలెం లో 350 కుటుంబాలకు కురాగాయలు వితరణ
బొద్ధపు వాని పాలెం లో 350 కుటుంబాలకు కురాగాయలు వితరణ చేసిన అట్టా సన్యాసి అప్పారావు,బొద్ధపు శ్రీను
పోలీసు సిబ్బందికి ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన పి ఎస్ రాజు
పోలీసు సిబ్బందికి ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన పి ఎస్ రాజు
బహుముఖ వ్యూహంతో ముందడుగు
పటిష్ట చర్యలతో సురక్షితంగా ఉన్న జిల్లా
కరోనాను అదుపు చేయడమే ప్రధాన లక్ష్యం
34 మండలాల్లో 4587 పడకలతో క్వారంటైన్ కేంద్రాలు
పరీక్షల్లో 23 మందికి నెగిటివ్, 43 మందికి పెండింగ్
సంక్షేమ ఫధకాల అమల్లోనూ ముందంజ
విజయనగరం, పెన్ పవర్
కరోనాకు మందులేదు, నివారణే ఏకైక మార్గం. దీనిని దృష్టిలో పెట్టుకొని, ఈ మహమ్మారిని అదుపు చేయడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం అలుపెరగని కృషి చేస్తోంది. ఇతర రాష్ట్రాలనుంచి, జిల్లాల నుంచి రాకపోకలను పూర్తిగా నియంత్రించడంతో పాటు లాక్‌డౌన్‌ను కట్టుధిట్టంగా అమలు చేస్తోంది. బహుముఖ వ్యూహంతో అధికార యంత్రాంగం చేపట్టిన చర్యల ఫలితంగా ఇప్పటివరకూ విజయనగరం జిల్లా సురక్షితంగా ఉంది.
బహుముఖవ్యూహంఅమలు
రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలూ కరోనా కేసులతో వణికిపోతుండగా, విజయనగరం జిల్లా ప్రజలు మాత్రం ఈ రోజు వరకూ ధీమాగా ఉన్నారు. వారికి అధికార యంత్రాంగం ఇస్తున్న భరోసాయే దీనికి కారణం. కరోనాను ఎదుర్కొనడానికి ప్రభుత్వ యంత్రాంగం వివిధ స్థాయిల్లో, అన్ని విధాలుగా సన్నద్దంగా ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మార్గనిర్ధేశకత్వంలో పటిష్టమై ప్రణాళిక, బహుముఖ వ్యూహంతో అధికారులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. మందుల్లేని కరోనా వ్యాధికి నివారణే మాత్రమే ఏకైక మార్గమన్నది దృష్టిలో పెట్టుకొని, దానికి తగ్గట్టుగానే పటిష్టమైన ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరు వ్యూహాలను రూపొందించి అమలు చేస్తున్నారు. ముందుగా కరోనా నియంత్రణలో నిమగ్నమైన అన్ని శాఖల, అన్ని స్థాయిల్లోని అధికారులకూ సమగ్రంగా అవగాహన కల్పించడం, నిత్యం పర్యవేక్షణ, నిఘాను ఏర్పాటు చేయడం ద్వారా పరిస్థితిని పూర్తిగా తమ అదుపులో ఉంచారు. జిల్లాలో పారిశుద్ద్యం మెరుగు పర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ప్రత్యేకనిఘావ్యవస్థ
హైరిస్క్ ఉన్న వృద్దులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను గుర్తించడం, వారి బాగోగులను తెలుసుకోవడం జరుగుతోంది. అలాగే ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాలనుంచి జిల్లాకు వచ్చిన వారిపై ప్రత్యేక నిఘాను పెట్టి, నిరంతరం వారి ఆరోగ్యాన్ని వాకబు చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. దీని కోసం ఎఎన్ఎం, ఆశా వర్కర్, అంగన్‌వాడీ, వలంటీర్ తదితర వ్యవస్థలద్వారా సమాచారాన్ని తెలుసుకోవడంతోపాటు, వైద్యాధికారులతో సైతం మరోసారి తనిఖీలు చేయించడం ద్వారా వారి ఆరోగ్యపరిస్థితిపై ఖచ్చితమైన నిర్ధారణకు వస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలు కనిపించిన వెంటనే వారిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించడం, వ్యాధి నిర్ధారణా పరీక్షలు నిర్వహించడం చేస్తున్నారు. ఏ లక్షణాలు లేనప్పటికీ కూడా విదేశాలనుంచి వచ్చినవారిని, ఢిల్లీ తదితర ప్రాంతాలనుంచి వచ్చిన వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 66 మందికి వ్యాధి నిర్ధారణా పరీక్షలు చేయగా, 23 మందికి నెగిటివ్ వచ్చింది. మరో 43 మంది ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
మూడు స్థాయిల్లో ఆసుపత్రుల వ్యవస్థ
మూడు దశల్లో ఆసుపత్రుల వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉంది. కరోనా వ్యాధి నిర్ధారణ అయినట్లయితే, చికిత్సను అందించేందుకు నెల్లిమర్లలోని మిమ్స్ వైద్య కళాశాలను కోవిడ్-19 ఆసుపత్రిగా సిద్దం చేశారు. ఇక్కడ అవసరమైన పరికరాలను, సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జిల్లా కేంద్రాసుపత్రిని కరోనా ప్రాధమిక నిర్ధారణకోసం సిద్దం చేసి, ఇక్కడికి వచ్చిన రోగులను ముందుగా పరీక్షించడం జరుగుతోంది. అలాగే విదేశాలనుంచి, ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారిని, అనుమానితులను ఉంచేందుకు జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాల్లో 4587 క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముందుగా ఇక్కడ 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఉండటానికి అన్నిరకాల వసతులను అందుబాటులో ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పటివరకూ దాదాపు 500 మందిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచి పరీక్షించారు. అదేవిధంగా విజయనగరంలో ఆరు ప్రయివేటు ఆసుపత్రులను సైతం కూడా కోవిడ్ ఆసుపత్రులుగా సిద్దం చేశారు.
నిత్యావసరాలపై నిఘా
లాక్‌డౌన్ కారణంగా ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలను తీసుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కంట్రోలు రూమును ఏర్పాటు చేయడంతోపాటు, నిరంతరం వివిధ స్థాయిల్లోని అధికారులు, వివిధ శాఖలు తనిఖీలు చేయడం ద్వారా ధరలను నియంత్రిస్తూ, సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా చర్యలు చేపట్టారు. అదేవిధంగా సుమారు 15 సంస్థలకు నిత్యావసరాలను డోర్ డెలివరీ చేసేందుకు అనుమతినిచ్చారు. జిల్లాలోని 7 రైతు బజార్లను 18 రైతు బజార్లుగా వికేంద్రీకరించడంతోపాటు, వార్డుల్లో సంచార వాహనాలకు కూడా అనుమతించడం జరిగిందని చెప్పారు. అలాగే జిల్లా కేంద్రంలోని చేపల్ మార్కెట్‌ను వేరే ప్రాంతానికి తరలించారు. ముఖ్యంగా రైతు బజారువద్దగానీ, ఇతర మార్కెట్ల వద్ద గానీ వ్యక్తులమధ్య దూరాన్ని పాటించడానికి ప్రత్యేకంగా మార్కింగ్లు ఏర్పాటు చేశారు.
పటిష్టంగా లాక్‌డౌన్ అమలు
కరోనా నియంత్రణలో వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరాన్ని పాటించడమే ఏకైక మార్గం. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్‌పి బి.రాజకుమారి నేతృత్వంలో పోలీసు వ్యవస్థ జిల్లాలో లాక్‌డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తోంది. రాష్ట్ర సరిహద్దులు, జిల్లా సరిహద్దులను మూసివేసి, అత్యవసరమైతే తప్ప జిల్లాలోకి ఎవరీని అనుమతించడం లేదు. జనం ఇష్టానుసారం తిరగకుండా నిరంతరం పహారా కాస్తున్నారు. పోలీసులు సాధ్యమైనంతవరకూ ప్రజలకు సామరస్య పూర్వకంగా నచ్చజెబుతూ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.
సహాయ కేంద్రాలు ఏర్పాటు
లాక్ డౌన్ కారణంగా పేదలు, వలస కూలీలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో వీరికోసం సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా వీరికి భోజన సదుపాయం కల్పించారు. ఎస్‌కోట, బొబ్బిలి, విజయనగరం తదితర కొన్నిచోట్ల ఇతర రాష్ట్రాలకు చెందిన వలస తెగలు తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. వీరికి అవసరమైన ఆహార పదార్ధాలను సైతం అందజేస్తున్నారు.
సంక్షేమ పథకాలు అమలు
జిల్లాలో వలంటీర్ వ్యవస్థ భేషుగ్గా పనిచేస్తోంది. క్షేత్ర స్థాయిలో వీరు అందిస్తున్న సేవలకు అన్ని వర్గాలనుంచీ ప్రశంసలు అందుతున్నాయి. వీరి ద్వారా ఈ కష్టకాలంలో సైతం సంక్షేమ ఫలాలను సకాలంలో, సక్రమంగా పేదలకు అందజేయగలుగుతున్నారు. మొత్తం యంత్రాంగం కృషి ఫలితంగా కరోనా సాయాన్ని కేవలం రెండు రోజుల్లోనే ప్రజలదరికీ అందజేసి, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది జిల్లా యంత్రాంగం. అలాగే ఉచిత రేషన్ సరఫరాలో కూడా విజయనగరం జిల్లా తన ప్రత్యేకతను నిలిపుకుంటూ రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. ఈనెల 1వ తేదీనే సుమారు 93 శాతం మందికి అంటే దాదాపు 3 లక్షల మందికి తొలిరోజే సామాజిక పింఛన్లను పంపిణీ చేసింది. ఇలా ప్రభుత్వం ప్రకటిస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేయడంలో జిల్లా ముందంజలో నిలుస్తోంది.
మరికొద్ది రోజులు సహకరించాలి ః జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్‌లాల్
కరోనాను కట్టడి చేయడంలో మన జిల్లా ఇప్పటికే దాదాపు విజయం సాధించింది. మరికొద్దిరోజులపాటు ప్రజలు ఇదే స్థాయిలో సహకరించాలి. రానున్న పది రోజులూ అత్యంత కీలకం. ఈ సమయంలో ప్రజలు బయటకు రావద్దు. అత్యవసర పరిస్థితిలో వచ్చినట్లయితే వ్యక్తుల మధ్య భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. ముఖానికి మాస్కులు ధరించాలి. తరచూ సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండటంతోపాటు, సమీపంలోని వైద్యులను గానీ, ఆరోగ్య కార్యకర్తలను గానీ సంప్రదించాలి. కరోనాకు మందులేదు. దానిని నివారించడమే ఏకైక మార్గమన్నది ప్రతీఒక్కరూ గుర్తించుకోవాలి. అందుకని ప్రజలంతా కలిసికట్టుగా నడిచి, ప్రభుత్వం చెబుతున్న నిబంధనలన్నిటినీ తూచ తప్పకుండా పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
నిత్యవసర వస్తువులు వితరణ
నిత్యవసర వస్తువులు వితరణ
పేదలకు అహారపోట్లాలు పంపిణి
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...