Followers
హిజ్రాల ఆధ్వర్యంలో ఆహార పంపిణీ
కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజలు సహకరించాలి
ఎంపీ విజయసాయిరెడ్డి.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
మానవసేవయే మాధవ సేవ స్ఫూర్తి తో ఎంవి.పీ యంగ్ స్టార్స్ యూత్
దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండండి
కరోనా వైరస్ మహమ్మారి ని తరిమికొట్టాలి
కరోనా వైరస్ మహమ్మారి ని తరిమికొట్టాలి
ప్రజల కోసం వైసీపీ పార్టీ నిరంతరం పని చేస్తోంది
రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నాము.
కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ కి అని చర్యలు పూర్తి.
నాయకులు ప్రజలకు మంచి చేస్తున్నారా... చెడు చేస్తున్నారా..
నిత్యావసర వితరణ పేరుతో నాయకులు ప్రజలకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా
ఒక సామాన్య మానవుడి మనో వేదన
విశాఖపట్నం/ పరవాడ, పెన్ పవర్
కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా గడగడ లాడుతూ స్వీయ నిర్బంధం లోకి వెళ్లి పోతే రాష్టం లో నాయకులు కరోనా ని వ్యాప్తి చేయడానికి రోడ్లెక్కారా అని సామాన్య మానవుడు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వo కరోనా నియంత్రణకు విధించిన స్వీయ నిర్బంధం(సెల్ఫ్ క్వారంటైన్) న్ని విధించి 17 రోజులు అయ్యింది. ప్రతిరోజు రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్యులు, వారు ప్రభుత్వ నిర్ణయాల్ని గౌరవించి స్వీయ నిర్బంధం లో ఉండి అనేక సమస్యల తో సతమతమవుతున్నారు. ఒక ప్రక్క నిత్యావసర సరుకులకు దైర్యంగా వెళ్లలేని పరిస్థితి, ఒక వేళ వెళితే పోలీసులు ఎక్కడ కొడతారో అనే భయం ఎటుచూసినా సమస్యల సుడిగుండంలో చిక్కుకు పోయినా... సాయంకోసం చేతులు సాచి ఎదురు చూడవలిసిన పరిస్థితి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సామాన్య ప్రజలను మానవత్వం తో అదుకోవలిసిన పరిస్థితి ప్రభుత్వం మీద ఎంతో ఉంది. ప్రజలు స్వీయ నిర్బంధం లో ఉండి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న కారణంగాను కొన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులు రాజకీయలబ్ది కోసమో లేక మానవత్వం తోనో ప్రభుత్వాల తో పాటు వారుకూడా తమ వ్యక్తిగత నిధులు వెచ్చించి స్థానికం గా ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకుల ను వితరణ చేయడo తో ప్రజలు ఆ నాయకుల పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ నాయకులు ప్రజల అవసరాలకు సరుకులు ఇచ్చే తరుణంలో కరోనాని కానుకగా ఇచ్చే దిశగా వ్యవహరించడం విచారకరం అని సర్వతా సామాన్య జనులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకే కానీ నాయకులకు కరోనా నివారణకు సంభందించిన జాగ్రత్తలు వర్తించవా అనేది సామాన్యుడు వాదన. నిత్యావసర సరుకుల పేరుతో... పార్టీ ప్రచారాలకు వెళ్లినట్లు అధిక సంఖ్యలో జనాలను వేసుకు వెళ్లడం, సామాజిక దూరం పాటించక పోవడం, ఒకరిని ఒకరు అంటుకు ఉండేలా గ్రామాల్లో పర్యటించడం, కొందరు నాయకులు ప్రభుత్వ సహాయాన్ని అందించే కార్యక్రమాలను గుంపులుగా చేయడం లాంటివి చేస్తుంటే... సామాజిక బాధ్యత సమాన్యులకే కానీ వీరికి లేదా అని చెవులు కోరుక్కుoటున్నారు. మానవత్వం తో సహాయం చేయడం ఎంత అవసరమో అది సామాజిక భాద్యత వహించి స్పుహతో తగిన జాగ్రత్తలు పాటించి చేయడం కూడా అంత అవసరమే అనేది సామాన్య ప్రజలు నాయకులకు చేసుకుంటున్న విన్నపం. ఒక విపత్కర పరిస్థిని ఎదుక్కోవాలి అంటే అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే దానినుంచి విముక్తి పొందడం సాధ్యం. అలా కాదని కొందరు మాకేంటి అని బరితెగిస్తే అది వారిని వారి కుటుంబాన్ని సమాజాన్ని నాశనం చేయడానికి దోహదం చేస్తుంది అని గుర్తేరిగీ సత్ప్రవర్తనతో ప్రవర్తించడం సమాజ శ్రేయస్కరం.
కేవీపల్లి మండలం లో దారుణం..
కేవీపల్లి మండలం లో దారుణం..
చిత్తూరు, పెన్ పవర్
ఓ వ్యక్తిపై వాలంటీర్ కత్తితో దాడి
కేవీపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. కోవిడ్-19 బాధితుల కోసం ప్రభుత్వం పంపిణీ చేపట్టిన వెయ్యి రూపాయలలో జరుగుతున్న అసమానతలకు పాల్పడుతున్న వాలంటీర్ను.. ఓ వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో తననే ప్రశ్నిస్తావా..? అని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన వాలంటీర్.. ఆ వ్యక్తిపై కత్తితో దాడికి దిగాడు.
పూర్తి వివరాల్లోకెళితే.. కేవీ పల్లి మండలం బండ వడ్డిపల్లి వాలంటీర్ శ్రీనివాసులు రూ.1000 పంపిణీలో అసమానతలు పాటిస్తున్నాడు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నావ్..? ప్రభుత్వం మీకు ఇలా చేయమని చెప్పిందా..? అని ఆ గ్రామానికి చెందిన విశ్వనాధ రాజు ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఇరువురి మధ్య గొడవలు కూడా జరిగాయి. దీంతో వాలంటీరు తీవ్ర ఆగ్రహంతో ఆ వ్యక్తిపై కత్తితో మెడను నరికి కడుపు పైన రెండు కత్తిపోట్లు పొడిచి తీవ్రంగా గాయపరచాడు. అప్రమత్తమైన కుటుంబీకులు, స్థానికులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...