Followers

దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండండి 


దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండండి 

 

నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి

 

పెన్ పవర్ ;జమ్మలమడుగు

 

కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని ప్రజలు కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రయత్నం చేయాలని మాజీమంత్రి బిజెపి నేత ఆది నారాయణ రెడ్డి పిలుపు నిచ్చారు.సోమవారం మండల పరిధిలోని ధర్మాపురం ,శేషారెడ్డి పల్లె ,గొరిగెనూరు ,దానవుల పాడు లోని 650 కుటుంబాలకు 1000 రూపాయల విలువ గల సరుకులను 

గోనా పురుషోత్తం రెడ్డి ఆర్థిక సహయం తో మాజీమంత్రి బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు, అనంతరం బిజెపి నేత మాజీమంత్రి ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ ను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా చర్యలు తీసుకుంటుందని ,అలాగే ప్రతి రైతు కుటుంబాలకు ముందు చెప్పిన విధంగా ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తుంది, అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కరోనా వైరస్ ను నివారించేందుకు అనేక రకాలుగా కృషి చేస్తున్నారని ,అలాగే జిల్లాలో, నియోజకవర్గంలో కానీ కరోనా వైరస్ నివారించేందుకు పోలీసులు పకడ్బందీగా కృషి చేస్తున్నారని అలాగే ప్రజలు రోడ్ల పై తిరగకుండా లాక్ డౌన్ ఏర్పాటు చేశారాని ఈ విషయం ప్రజలు గుర్తించుకుని ప్రవర్తించాలని ,ఈ లాక్ డౌన్ ను ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యవసర సరుకులు కొనుగోలు కోసం బయటకు రావాలని ,అలాగే అందరూ శుభ్రత పరిశుభ్రత పాటించితే ఈ కరోనా వైరస్ ను నివారించేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పారు, ఈ కార్యక్రమంలో గోనా పురుషోత్తం రెడ్డి, నర్సింహ ఛారి ,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

కరోనా వైరస్ మహమ్మారి ని తరిమికొట్టాలి





కరోనా వైరస్ మహమ్మారి ని తరిమికొట్టాలి


 


ప్రజల కోసం వైసీపీ పార్టీ నిరంతరం పని చేస్తోంది


 


రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నాము.


 


కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి


 


నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ కి అని చర్యలు పూర్తి.


 

పెన్ పవర్ ;జమ్మలమడుగు

 

కరోనా వైరస్ మహమ్మారి ని తరిమికొట్టేందుకు అధికారులకు ప్రజలు సహకరించాలని స్థానిక శాసనసభ సభ్యులు డా.మూలే సూధీర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కరోనా వైరస్,లాక్ డౌన్ ,స్టే ఎట్ హోమ్ చిత్రాలను గాంధీ బొమ్మ సర్కిల్ చూట్టు  రోడ్డు పై ప్రజలకు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అవగాహన కల్పించేలా చిత్రీకరణ చేశారు. అనంతరం స్థానిక శాసనసభ సభ్యులు డా.మూలే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరులకు టీ షర్ట్, మాస్కులను పంపిణీ చేశారు,అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన జమ్మలమడుగు నియోజకవర్గంలో కరోనా వైరస్ ను నివారించేందుకు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది, విలేకరులు తీవ్రంగా క్రృషి చేస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ను ధిక్కరించకుండా ప్రజలు కూడా సహకరించాలని కోరారు, లాక్ డౌన్ ను ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యవసర సరుకులు కొనుగోలు చేసుకుని ఇంటికి వెళ్లి అధికారులకు సహకరించాలని అన్నారు, పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అని రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలను గ్రామ వాలంటీరుల ద్వారా చొప్పున చెల్లిస్తున్నారు, అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా  ఉన్న వారికి కూడా వెయ్యి రూపాయలను వాలంటీరులు చెల్లిస్తున్నారని చెప్పారు, నియోజకవర్గం లో కరోనా వైరస్ కేసులు నమోదు కాకపోవడం మన అద్రృష్టం అని అలాగే ప్రతి ఒక్కరూ శుభ్రత పరిశుభ్రత పాటించాలని అలాగే నిత్యావసర సరుకుల కు వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని శుభ్రత పాటించాలని కోరారు, అలాగే 20 నిముషాలకు ఒక సారి శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకుని ఇంట్లో అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర రెడ్డి ,వైఎస్సార్సీపి యువ నాయకులు రామకృష్ణ, ఎస్సైలు రవికుమార్, రంగా రావు ,పోలీసులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


 

 



 

నాయకులు ప్రజలకు మంచి చేస్తున్నారా...  చెడు చేస్తున్నారా..

నిత్యావసర వితరణ పేరుతో నాయకులు ప్రజలకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా



   ఒక సామాన్య మానవుడి మనో వేదన



          విశాఖపట్నం/ పరవాడ, పెన్ పవర్



కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా గడగడ లాడుతూ స్వీయ నిర్బంధం లోకి వెళ్లి పోతే రాష్టం  లో నాయకులు కరోనా ని వ్యాప్తి చేయడానికి రోడ్లెక్కారా అని సామాన్య మానవుడు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వo కరోనా నియంత్రణకు విధించిన స్వీయ నిర్బంధం(సెల్ఫ్ క్వారంటైన్) న్ని విధించి 17 రోజులు అయ్యింది. ప్రతిరోజు రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్యులు, వారు ప్రభుత్వ నిర్ణయాల్ని గౌరవించి స్వీయ నిర్బంధం లో ఉండి అనేక సమస్యల తో సతమతమవుతున్నారు. ఒక ప్రక్క నిత్యావసర సరుకులకు దైర్యంగా వెళ్లలేని పరిస్థితి, ఒక వేళ వెళితే పోలీసులు ఎక్కడ కొడతారో అనే భయం ఎటుచూసినా సమస్యల సుడిగుండంలో చిక్కుకు పోయినా...  సాయంకోసం చేతులు సాచి ఎదురు చూడవలిసిన పరిస్థితి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సామాన్య ప్రజలను మానవత్వం తో అదుకోవలిసిన పరిస్థితి ప్రభుత్వం మీద ఎంతో ఉంది. ప్రజలు స్వీయ నిర్బంధం లో ఉండి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న కారణంగాను కొన్ని ప్రాంతాల   ప్రజాప్రతినిధులు రాజకీయలబ్ది కోసమో  లేక మానవత్వం తోనో  ప్రభుత్వాల తో పాటు వారుకూడా తమ వ్యక్తిగత నిధులు వెచ్చించి స్థానికం గా ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకుల ను వితరణ చేయడo తో ప్రజలు ఆ నాయకుల పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ నాయకులు ప్రజల అవసరాలకు సరుకులు ఇచ్చే తరుణంలో కరోనాని కానుకగా ఇచ్చే దిశగా వ్యవహరించడం విచారకరం అని సర్వతా సామాన్య జనులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకే కానీ నాయకులకు కరోనా నివారణకు సంభందించిన జాగ్రత్తలు వర్తించవా అనేది సామాన్యుడు వాదన.    నిత్యావసర సరుకుల పేరుతో...  పార్టీ ప్రచారాలకు వెళ్లినట్లు అధిక సంఖ్యలో జనాలను వేసుకు వెళ్లడం,  సామాజిక దూరం పాటించక పోవడం, ఒకరిని ఒకరు అంటుకు ఉండేలా గ్రామాల్లో పర్యటించడం, కొందరు నాయకులు ప్రభుత్వ సహాయాన్ని అందించే కార్యక్రమాలను గుంపులుగా చేయడం లాంటివి చేస్తుంటే...  సామాజిక బాధ్యత సమాన్యులకే కానీ వీరికి లేదా అని చెవులు కోరుక్కుoటున్నారు. మానవత్వం తో సహాయం చేయడం ఎంత అవసరమో అది సామాజిక భాద్యత వహించి  స్పుహతో తగిన జాగ్రత్తలు పాటించి చేయడం కూడా అంత అవసరమే అనేది సామాన్య ప్రజలు నాయకులకు చేసుకుంటున్న విన్నపం. ఒక విపత్కర పరిస్థిని  ఎదుక్కోవాలి అంటే అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే దానినుంచి విముక్తి పొందడం సాధ్యం. అలా కాదని  కొందరు మాకేంటి అని బరితెగిస్తే అది వారిని వారి కుటుంబాన్ని సమాజాన్ని నాశనం చేయడానికి దోహదం చేస్తుంది అని గుర్తేరిగీ సత్ప్రవర్తనతో  ప్రవర్తించడం సమాజ శ్రేయస్కరం. 


కేవీపల్లి మండలం లో దారుణం.. 


కేవీపల్లి మండలం లో దారుణం.. 


చిత్తూరు, పెన్ పవర్


ఓ వ్యక్తిపై వాలంటీర్ కత్తితో దాడి


 కేవీపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. కోవిడ్-19 బాధితుల కోసం ప్రభుత్వం పంపిణీ చేపట్టిన వెయ్యి రూపాయలలో జరుగుతున్న అసమానతలకు పాల్పడుతున్న వాలంటీర్‌ను.. ఓ వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో తననే ప్రశ్నిస్తావా..? అని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన వాలంటీర్.. ఆ వ్యక్తిపై కత్తితో దాడికి దిగాడు. 
పూర్తి వివరాల్లోకెళితే.. కేవీ పల్లి మండలం బండ వడ్డిపల్లి వాలంటీర్ శ్రీనివాసులు రూ.1000 పంపిణీలో అసమానతలు పాటిస్తున్నాడు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నావ్..? ప్రభుత్వం మీకు ఇలా చేయమని చెప్పిందా..? అని ఆ గ్రామానికి చెందిన విశ్వనాధ రాజు ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఇరువురి మధ్య గొడవలు కూడా జరిగాయి. దీంతో వాలంటీరు తీవ్ర ఆగ్రహంతో ఆ వ్యక్తిపై కత్తితో మెడను నరికి కడుపు పైన రెండు కత్తిపోట్లు పొడిచి తీవ్రంగా గాయపరచాడు. అప్రమత్తమైన కుటుంబీకులు, స్థానికులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది.


84 వ వార్డు లో  స్టానికులకు కూరగాయల పంపిణీ చేసిన  వైసిపి నాయకులు 


 


హాజరు అయిన ఎమ్మెల్యే అధీప్ రాజు

 

            పరవాడ పెన్ పవర్

 

పరవాడ:జివిఎంసి పరిధిలోని 84 వ వార్డ్ సాలాపువాని పాలేం లో స్థానిక వైసిపి నాయకులు వార్డ్ లోని కుటుంబాలకు కూరగాయల పంపిణీ కార్యక్రమానికి పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధీప్ రాజు ముఖ్య అతిధిగా పాల్గొని పంపిణీ చేశారు.అనంతరం అధీప్ రాజు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాధిని అరికట్టేందు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.నిత్యావసర వస్తులకు బయటికి రాక తప్పని పరిస్తుల్లో వచ్చినప్పుడు ప్రజలు కూడా వారి వ్యక్తిగత బాధ్యతతో బౌతిక దూరం కనీసం వ్యక్తికి వ్యక్తికి 5 అడుగుల దూరం పాటించి ముఖానికి మాస్కు కానీ రుమాలు కానీ ధరించి ఎవరిని ముట్టుకోకుండా జాగ్రత్త పడుతూ  సరుకులు కానీ కూరగాయలు కానీ మాంసమ్ దుకాణాల దగ్గర కానీ ఖరీదు చేస్తే అందరికి శ్రేయస్సు కరం అని తెలియ చేశారు.కానీ ప్రజలు కొందరు ఆశ్రద్ధతో ఈ జాగ్రత్తలు పాటించడం లేదు అని అన్నారు.చాలా మంది రోజువారీ వేతన కార్మికులు స్వీయ నిర్బంధ వల్ల ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం ఇచ్చే సాయం తో పాటు స్థానిక నాయకులు కూడా వారికి తోచిన విధంగా ప్రజలను ఆదుకోవాలి అని పిలుపు నిచ్చారు.సోమవారం  స్థానిక వైసిపి నాయకులు సాలాపు నానాజీ,సాలాపు అప్పారావు,మరియు వైసిపి పార్టీ నాయకుల ఆర్ధిక సాయంతో కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహింస్తున్న నాయకులను అధీప్ రాజ్ అభినoదించారు.ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే టప్పుడు నాయకులు కూడా బాధ్యతతో వ్యవహరిస్తూ వ్యక్తులు మధ్య బహుతిక దూరం పాటించే విధంగా తగు చర్యలు తీసుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి దళాయి నదియా,సాలాపు నానాజీ,సాలాపు అప్పారావు,సాలాపు బాబురావు,మహాలక్ష్మి నాయుడు,కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

నగర పరిధిలో గృహము క్షేత్ర పరిశీన నిరంతర ప్రక్రియగా చేపట్టాలి


 


నగర పరిధిలో గృహము క్షేత్ర పరిశీన నిరంతర ప్రక్రియగా చేపట్టాలి

      ` జివిఎంసి కమిషనర్‌ డా.జి.సృజన



  విశాఖపట్నం, పెన్ పవర్ 


 కరోనా వైరస్‌ నియంత్రణ చేయుటలో అతిముఖ్యమైనవిధిగా రోజువారి గృహముల తనిఖీని క్షేత్రస్ధాయిలో ఏర్పాటు చేసిన బృందాలు తప్పనిసరిగా చేపట్టాని కమిషనర్‌ డా.జి.సృజన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా అందరి జోనల్‌ కమిషనర్లను, జోనల్‌ ప్రత్యేకాధికారులను, వార్డు ప్రత్యేకాధికారులను ఆదేశించారు.  జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారు సూచిస్తున్న, సర్వే కాని, గృహామును వెంటనే సర్వే చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  సర్వే గూర్చి నిర్దేశించిన యాప్‌ నందు వివరాలు నమోదు చేయాలని, దీనివలన, ఏదైనా గృహాములో కరోనా వ్తాధిలక్షణాలు కలిగినట్లు కనిపెట్టినచో వీటిని సంబంధిత ఏరియాలో గల  ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలలోగాని, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రాధమిక పరీక్షలు నిర్వహించుటకు అవకాశము ఉంటుందన్నారు.  కరోనా  లక్షణాలు  కలిగిన వ్యక్తులను ఆర్‌.ఆర్‌.టి బృందానికి అప్పజెప్పాలని వారు ఆ వ్యక్తిని వాహానం ద్వారా నగరంలో నిర్దేశించిన ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తీసుకువెళ్తారని వివరించారు. గృహములలో చేస్తున్న క్షేత్రస్ధాయి సర్వేను నిరంతర ప్రక్రియగా కొనసాగించాని, కరోనా వైరస్‌ నియంత్రణకు ఇది ముఖ్యసాధనంగా ప్రభుత్వం గుర్తించినందున, ఎటువంటి పరిస్ధితుల్లో సర్వేని ఆపివేయరాదని సూచించారు.
  నగర పరిధిలోని ప్రజులు , గృహముల వద్దకు వచ్చిన క్షేత్రస్ధాయి సర్వే బృందాల కు ఎటువంటి దాపరికం లేకుండా వివరాలందించాని, ప్రభుత్వానికి సహకరించాలని, ముందుగానే తెలుసుకోవడం వలన, కరోనా కట్టడికి సాధ్యం అవుతుందని, కావున ప్రజులు జివిఎంసి అధికారులకు, సిబ్బందికి, వైద్యులకు సహకరించి నిజమైన వివరాలను తెలపాలని  కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు.
  జివిఎంసి పరిధిలో తెలుపు లేదా  బియ్యం కార్డుదారుకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1000/` రు ఆర్దిక సహాయాన్ని ఇంకా మిగిలియున్న వారికి త్వరితగతిన అందించాని అందరు జోనల్‌ కమిషనర్లను ఆదేశించారు.
  వీడియో కాన్ఫరెన్సులో జివిఎంసి అదనపు కమిషనర్‌ ఆర్‌.సోమన్నారాయణ, జివిఎంసి ముఖ్యవైద్యఆరోగ్యశాఖాధికారి కె.ఎస్‌.ఎన్‌.ఎల్‌.జి.శాస్త్రి, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా.తిరుపతిరావు, ఎఫ్‌.ఎస్‌.టి బృందసభ్యులు, ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రం మరియు ప్రాధమిక ఆరోగ్య కేంద్రపు డాక్టర్లు, అందరు జోనల్‌ కమిషనర్లు, జోనల్‌ ప్రత్యేకాధికాయి, వార్డు ప్రత్యేకా అధికారులు  తదితరులు  పాల్గోన్నారు.


పేదల ఆకలి తీరుస్తున్న తొగటవీరక్షత్రియిలు


పేదల ఆకలి తీరుస్తున్న తొగటవీరక్షత్రియిలు



పెన్ పవర్;జమ్మలమడుగు



దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం మొత్తం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ నేపథ్యంలో రోజు కూలి పనులకు వెళ్లే వ్రృద్దులకు ఈ లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి విషమంగా ఉండటంతో తినడానికి కూడా తిండి దొరకని వారికి,అనాధలకు ,వికలాంగులకు జమ్మలమడుగు లోని తొగటవీరక్షత్రియసంఘం మరియు  శ్రీ చౌడేశ్వరి దేవాలయం వారి ఆద్వర్యంలో పట్టణం లోని BC కాలని,చౌడమ్మ గుడి,మోరగుడి,గూడుమస్తాన్ దర్గా ,నారాపురం దేవాలయం పరిసరాల్లో ఉన్న పేదవారికి  అన్నం,పప్పు,రసం,మంచి నీరు  ప్యాకేట్ల పంపిణీ చేశారు, ఈ అన్నదానం ఏప్రిల్ 1నుండి లాక్ డౌన్ చివరి తేదీ అయిన ఏప్రిల్ 14 వరకు  ప్రతి రోజు ఈ  కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ అన్నదానం కి  సహకరిస్తున్న దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఈ కార్యక్రమంలో బి. పాండులు,భాస్కర్ ,కవలా రామయ్య,పుణ్యమూర్తి,చంద్రగోవిందు,  సీ జే పాండు, సీ జే కొండయ్య,  గంజికుంట తిరుమలదాసు ,గొరిగె జ్యోతి ప్రసాద్, మోరగుడి గ్రామ వాలంటీరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...