Followers

హిజ్రాల ఆధ్వర్యంలో ఆహార పంపిణీ


హిజ్రాల ఆధ్వర్యంలో ఆహార పంపిణీ

 

 అనకాపల్లి, పెన్ పవర్ 

 

 పరిసర ప్రాంతాల్లో పేదవాళ్లకు,  విధులు నిర్వహిస్తున్న అధికారి సిబ్బందికి హిజ్రాలు చేయూతనందించారు . జీవీఎంసీ కార్మికులకు,  పోలీస్ అధికారులకు, అన్నా క్యాంటీన్ లో నివసిస్తున్న బిక్ష వాళ్లకు, కటిక పేదవాళ్లకు, రోడ్డు పక్కన నివసిస్తున్న నిరుపేదలకు సత్యనారాయణపురంలో  నివసిస్తున్న నిరుపేదలకు సోమవారం ఆహారాన్ని పంపిణీ చేసారు . దుర్గ, అనిత , రజిని ఆధ్వర్యంలో 500  మందికి భోజనాలు సమకూర్చారు. కార్యక్రమంలో రంజిత, నందిని, మనీషా, కీర్తి, సంజన, చంటి, మధు తదితరులు పాల్గొన్నారు.

కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజలు సహకరించాలి


 




కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజలు సహకరించాలి


ఎంపీ విజయసాయిరెడ్డి.

స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)

 

కరోనా వైరస్ నిర్మూలనకు  నగర ప్రజలు   సహకరించాలని  ఎంపీ విజయ్ సాయి రెడ్డి అన్నారు. సోమవారం  బుచ్చి రాజుపాలెం లో  ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు  నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా  మహమ్మారి  నగరంలో  పెరుగుతుందని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  కోరారు. ప్రభుత్వం కరోనా పై  కఠినమైన చర్యలు  చేపట్టిందని  ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ  ప్రజలు  సామాజిక భద్రత  వ్యక్తిగత దూరం  పాటించాలని కోరారు. అవసరాల నిమిత్తం వెసలుబాటు కల్పించిన  సమయాన్ని  కొందరు దుర్వినియోగం చేస్తున్నారని  అందువల్ల  వైరస్ పెరిగే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగా  జిల్లాలో  పాజిటివ్ కేసులు  20కి చేరుకున్నాయని  వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా వైద్యాధికారులను సంప్రదించాలని  సూచించారు. కరోనా వైరస్  పరీక్ష కేంద్రాన్ని  కేజీహెచ్లో  ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.  ప్రగతి సెక్స్ భారతి పౌండేషన్ తరఫున  పారిశుద్ధ్య కార్మికులు ఇతర వర్కర్లకు సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అరబిందో ఫార్మసీ 10 వేల లీటర్లు  ఫార్మా కంపెనీ 2000 లెటర్లు  హ్యాండ్ వాషర్స ఇచ్చారని  హ్యాండ్ వాషర్స్ ని  పారిశుధ్య కార్మికులు  సిబ్బందికి అందజేస్తామన్నారు. ప్రగతి భారతి పౌండేషన్  సేవలను  విజయనగరం శ్రీకాకుళం  జిల్లాలకు‌  విస్తరిస్తామని  విజయ్ సాయి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  ముత్తం శెట్టి శ్రీనివాస్   ప్రగతి భారతి ఫౌండేషన్   ప్రతినిధులు  పాల్గొన్నారు.

 

 



 

మానవసేవయే మాధవ సేవ స్ఫూర్తి తో ఎంవి.పీ యంగ్ స్టార్స్ యూత్









 

 

ఏం.వీ.పీ .కాలనీ, పెన్ పవర్ 

 

 

మానవసేవయే మాధవ సేవ స్ఫూర్తి తో ఎంవి.పీ యంగ్ స్టార్స్ యూత్  సెక్టర్ సిక్స్  వారు పేదలకు , నిరాశ్రయులకు, మధ్యతరగతి కుటుంబాలకు, రోడ్లపై ఉన్న యాచకులకు మీకు మేమున్నాము అని ముందు కొచ్చి 1 - 4 - 20 నుండి 14- 4- 20 20 వరకు  పేదలకు బ్రేడ్స్ ఆహారం మంచినీళ్ల ప్యాకెట్లు వారి సొంత ఖర్చులతో పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది  వారి కార్యక్రమమునకు చేదోడుగా విశాఖ పోర్ట్ డాగ్ ఎంప్లాయిస్ అండ్  రెసిడెన్షియల్ సెక్టర్ సిక్స్ వారు మూడురోజుల భోజన సామగ్రిని యూత్ కి అందజేశారు ఇటువంటి సేవా కార్యక్రమం చేయుటలో యువకులను అభినందించటంతో పాటు మీకు ఎల్లప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియచేయటం జరిగింది కాలనీ వాసులు కూడా వారియెక్క సహాయ కార్యక్రమమును అభినందించి ప్రోత్సహాన్ని ఇవ్వటం జరిగింది వారు పేదలకు చేసే సహాయాన్ని గుర్తించి బిజెపి నాయకురాలు డి అరుణ కుమారి 5000 నగదును వారికి అందచేయటం  జరిగింది ఆమె మాట్లాడుతూ ఇటువంటి సేవ కార్యక్రములు చేయటం వల్ల భగవంతుడు  ఆశీస్సులు మీకు వెళ్ళ వేళలా ఉంటాయని కొనియాడారు అలాగే విశాఖ పోర్ట్ డాగ్ ఎంప్లాయిస్ అండ్ రెసిడెన్షియల్ సెక్టార్ సిక్స్ వారు కాలనీలోని ప్రతి నివాసితుల వద్దకు వెళ్లి కరోన పై అవగాహన కల్పిస్తూ మనిషి మనిషి కి మద్య దూరర్ని పాటించాలని ప్రతి ఒక్కరు మాస్కు లను దరించాలి అని అందరికీ ఉచిత మాస్కులు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పరుశురాం, రాము,, లక్ష్మణ్ రావు, పి. అప్పలరాజు, సత్యం, నరసింహారావు, రజినీకాంత్, ధనరాజ్, అల్లా బక్షు, కాలనీ యువకులు పాల్గొనడం జరిగింది


 

 



 







 




దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండండి 


దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండండి 

 

నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి

 

పెన్ పవర్ ;జమ్మలమడుగు

 

కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని ప్రజలు కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రయత్నం చేయాలని మాజీమంత్రి బిజెపి నేత ఆది నారాయణ రెడ్డి పిలుపు నిచ్చారు.సోమవారం మండల పరిధిలోని ధర్మాపురం ,శేషారెడ్డి పల్లె ,గొరిగెనూరు ,దానవుల పాడు లోని 650 కుటుంబాలకు 1000 రూపాయల విలువ గల సరుకులను 

గోనా పురుషోత్తం రెడ్డి ఆర్థిక సహయం తో మాజీమంత్రి బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు, అనంతరం బిజెపి నేత మాజీమంత్రి ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ ను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా చర్యలు తీసుకుంటుందని ,అలాగే ప్రతి రైతు కుటుంబాలకు ముందు చెప్పిన విధంగా ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తుంది, అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కరోనా వైరస్ ను నివారించేందుకు అనేక రకాలుగా కృషి చేస్తున్నారని ,అలాగే జిల్లాలో, నియోజకవర్గంలో కానీ కరోనా వైరస్ నివారించేందుకు పోలీసులు పకడ్బందీగా కృషి చేస్తున్నారని అలాగే ప్రజలు రోడ్ల పై తిరగకుండా లాక్ డౌన్ ఏర్పాటు చేశారాని ఈ విషయం ప్రజలు గుర్తించుకుని ప్రవర్తించాలని ,ఈ లాక్ డౌన్ ను ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యవసర సరుకులు కొనుగోలు కోసం బయటకు రావాలని ,అలాగే అందరూ శుభ్రత పరిశుభ్రత పాటించితే ఈ కరోనా వైరస్ ను నివారించేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పారు, ఈ కార్యక్రమంలో గోనా పురుషోత్తం రెడ్డి, నర్సింహ ఛారి ,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

కరోనా వైరస్ మహమ్మారి ని తరిమికొట్టాలి





కరోనా వైరస్ మహమ్మారి ని తరిమికొట్టాలి


 


ప్రజల కోసం వైసీపీ పార్టీ నిరంతరం పని చేస్తోంది


 


రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నాము.


 


కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి


 


నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ కి అని చర్యలు పూర్తి.


 

పెన్ పవర్ ;జమ్మలమడుగు

 

కరోనా వైరస్ మహమ్మారి ని తరిమికొట్టేందుకు అధికారులకు ప్రజలు సహకరించాలని స్థానిక శాసనసభ సభ్యులు డా.మూలే సూధీర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కరోనా వైరస్,లాక్ డౌన్ ,స్టే ఎట్ హోమ్ చిత్రాలను గాంధీ బొమ్మ సర్కిల్ చూట్టు  రోడ్డు పై ప్రజలకు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అవగాహన కల్పించేలా చిత్రీకరణ చేశారు. అనంతరం స్థానిక శాసనసభ సభ్యులు డా.మూలే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరులకు టీ షర్ట్, మాస్కులను పంపిణీ చేశారు,అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన జమ్మలమడుగు నియోజకవర్గంలో కరోనా వైరస్ ను నివారించేందుకు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది, విలేకరులు తీవ్రంగా క్రృషి చేస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ను ధిక్కరించకుండా ప్రజలు కూడా సహకరించాలని కోరారు, లాక్ డౌన్ ను ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు మాత్రమే ప్రజలు నిత్యవసర సరుకులు కొనుగోలు చేసుకుని ఇంటికి వెళ్లి అధికారులకు సహకరించాలని అన్నారు, పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అని రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలను గ్రామ వాలంటీరుల ద్వారా చొప్పున చెల్లిస్తున్నారు, అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా  ఉన్న వారికి కూడా వెయ్యి రూపాయలను వాలంటీరులు చెల్లిస్తున్నారని చెప్పారు, నియోజకవర్గం లో కరోనా వైరస్ కేసులు నమోదు కాకపోవడం మన అద్రృష్టం అని అలాగే ప్రతి ఒక్కరూ శుభ్రత పరిశుభ్రత పాటించాలని అలాగే నిత్యావసర సరుకుల కు వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని శుభ్రత పాటించాలని కోరారు, అలాగే 20 నిముషాలకు ఒక సారి శానిటైజర్ తో చేతులు శుభ్రపరుచుకుని ఇంట్లో అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర రెడ్డి ,వైఎస్సార్సీపి యువ నాయకులు రామకృష్ణ, ఎస్సైలు రవికుమార్, రంగా రావు ,పోలీసులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


 

 



 

నాయకులు ప్రజలకు మంచి చేస్తున్నారా...  చెడు చేస్తున్నారా..

నిత్యావసర వితరణ పేరుతో నాయకులు ప్రజలకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా



   ఒక సామాన్య మానవుడి మనో వేదన



          విశాఖపట్నం/ పరవాడ, పెన్ పవర్



కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా గడగడ లాడుతూ స్వీయ నిర్బంధం లోకి వెళ్లి పోతే రాష్టం  లో నాయకులు కరోనా ని వ్యాప్తి చేయడానికి రోడ్లెక్కారా అని సామాన్య మానవుడు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వo కరోనా నియంత్రణకు విధించిన స్వీయ నిర్బంధం(సెల్ఫ్ క్వారంటైన్) న్ని విధించి 17 రోజులు అయ్యింది. ప్రతిరోజు రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్యులు, వారు ప్రభుత్వ నిర్ణయాల్ని గౌరవించి స్వీయ నిర్బంధం లో ఉండి అనేక సమస్యల తో సతమతమవుతున్నారు. ఒక ప్రక్క నిత్యావసర సరుకులకు దైర్యంగా వెళ్లలేని పరిస్థితి, ఒక వేళ వెళితే పోలీసులు ఎక్కడ కొడతారో అనే భయం ఎటుచూసినా సమస్యల సుడిగుండంలో చిక్కుకు పోయినా...  సాయంకోసం చేతులు సాచి ఎదురు చూడవలిసిన పరిస్థితి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సామాన్య ప్రజలను మానవత్వం తో అదుకోవలిసిన పరిస్థితి ప్రభుత్వం మీద ఎంతో ఉంది. ప్రజలు స్వీయ నిర్బంధం లో ఉండి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న కారణంగాను కొన్ని ప్రాంతాల   ప్రజాప్రతినిధులు రాజకీయలబ్ది కోసమో  లేక మానవత్వం తోనో  ప్రభుత్వాల తో పాటు వారుకూడా తమ వ్యక్తిగత నిధులు వెచ్చించి స్థానికం గా ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకుల ను వితరణ చేయడo తో ప్రజలు ఆ నాయకుల పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ నాయకులు ప్రజల అవసరాలకు సరుకులు ఇచ్చే తరుణంలో కరోనాని కానుకగా ఇచ్చే దిశగా వ్యవహరించడం విచారకరం అని సర్వతా సామాన్య జనులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకే కానీ నాయకులకు కరోనా నివారణకు సంభందించిన జాగ్రత్తలు వర్తించవా అనేది సామాన్యుడు వాదన.    నిత్యావసర సరుకుల పేరుతో...  పార్టీ ప్రచారాలకు వెళ్లినట్లు అధిక సంఖ్యలో జనాలను వేసుకు వెళ్లడం,  సామాజిక దూరం పాటించక పోవడం, ఒకరిని ఒకరు అంటుకు ఉండేలా గ్రామాల్లో పర్యటించడం, కొందరు నాయకులు ప్రభుత్వ సహాయాన్ని అందించే కార్యక్రమాలను గుంపులుగా చేయడం లాంటివి చేస్తుంటే...  సామాజిక బాధ్యత సమాన్యులకే కానీ వీరికి లేదా అని చెవులు కోరుక్కుoటున్నారు. మానవత్వం తో సహాయం చేయడం ఎంత అవసరమో అది సామాజిక భాద్యత వహించి  స్పుహతో తగిన జాగ్రత్తలు పాటించి చేయడం కూడా అంత అవసరమే అనేది సామాన్య ప్రజలు నాయకులకు చేసుకుంటున్న విన్నపం. ఒక విపత్కర పరిస్థిని  ఎదుక్కోవాలి అంటే అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే దానినుంచి విముక్తి పొందడం సాధ్యం. అలా కాదని  కొందరు మాకేంటి అని బరితెగిస్తే అది వారిని వారి కుటుంబాన్ని సమాజాన్ని నాశనం చేయడానికి దోహదం చేస్తుంది అని గుర్తేరిగీ సత్ప్రవర్తనతో  ప్రవర్తించడం సమాజ శ్రేయస్కరం. 


కేవీపల్లి మండలం లో దారుణం.. 


కేవీపల్లి మండలం లో దారుణం.. 


చిత్తూరు, పెన్ పవర్


ఓ వ్యక్తిపై వాలంటీర్ కత్తితో దాడి


 కేవీపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. కోవిడ్-19 బాధితుల కోసం ప్రభుత్వం పంపిణీ చేపట్టిన వెయ్యి రూపాయలలో జరుగుతున్న అసమానతలకు పాల్పడుతున్న వాలంటీర్‌ను.. ఓ వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో తననే ప్రశ్నిస్తావా..? అని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన వాలంటీర్.. ఆ వ్యక్తిపై కత్తితో దాడికి దిగాడు. 
పూర్తి వివరాల్లోకెళితే.. కేవీ పల్లి మండలం బండ వడ్డిపల్లి వాలంటీర్ శ్రీనివాసులు రూ.1000 పంపిణీలో అసమానతలు పాటిస్తున్నాడు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నావ్..? ప్రభుత్వం మీకు ఇలా చేయమని చెప్పిందా..? అని ఆ గ్రామానికి చెందిన విశ్వనాధ రాజు ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఇరువురి మధ్య గొడవలు కూడా జరిగాయి. దీంతో వాలంటీరు తీవ్ర ఆగ్రహంతో ఆ వ్యక్తిపై కత్తితో మెడను నరికి కడుపు పైన రెండు కత్తిపోట్లు పొడిచి తీవ్రంగా గాయపరచాడు. అప్రమత్తమైన కుటుంబీకులు, స్థానికులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...