Followers
84 వ వార్డు లో స్టానికులకు కూరగాయల పంపిణీ చేసిన వైసిపి నాయకులు
నగర పరిధిలో గృహము క్షేత్ర పరిశీన నిరంతర ప్రక్రియగా చేపట్టాలి
నగర పరిధిలో గృహము క్షేత్ర పరిశీన నిరంతర ప్రక్రియగా చేపట్టాలి
` జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన
విశాఖపట్నం, పెన్ పవర్
కరోనా వైరస్ నియంత్రణ చేయుటలో అతిముఖ్యమైనవిధిగా రోజువారి గృహముల తనిఖీని క్షేత్రస్ధాయిలో ఏర్పాటు చేసిన బృందాలు తప్పనిసరిగా చేపట్టాని కమిషనర్ డా.జి.సృజన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అందరి జోనల్ కమిషనర్లను, జోనల్ ప్రత్యేకాధికారులను, వార్డు ప్రత్యేకాధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారు సూచిస్తున్న, సర్వే కాని, గృహామును వెంటనే సర్వే చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సర్వే గూర్చి నిర్దేశించిన యాప్ నందు వివరాలు నమోదు చేయాలని, దీనివలన, ఏదైనా గృహాములో కరోనా వ్తాధిలక్షణాలు కలిగినట్లు కనిపెట్టినచో వీటిని సంబంధిత ఏరియాలో గల ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలలోగాని, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రాధమిక పరీక్షలు నిర్వహించుటకు అవకాశము ఉంటుందన్నారు. కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులను ఆర్.ఆర్.టి బృందానికి అప్పజెప్పాలని వారు ఆ వ్యక్తిని వాహానం ద్వారా నగరంలో నిర్దేశించిన ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తీసుకువెళ్తారని వివరించారు. గృహములలో చేస్తున్న క్షేత్రస్ధాయి సర్వేను నిరంతర ప్రక్రియగా కొనసాగించాని, కరోనా వైరస్ నియంత్రణకు ఇది ముఖ్యసాధనంగా ప్రభుత్వం గుర్తించినందున, ఎటువంటి పరిస్ధితుల్లో సర్వేని ఆపివేయరాదని సూచించారు.
నగర పరిధిలోని ప్రజులు , గృహముల వద్దకు వచ్చిన క్షేత్రస్ధాయి సర్వే బృందాల కు ఎటువంటి దాపరికం లేకుండా వివరాలందించాని, ప్రభుత్వానికి సహకరించాలని, ముందుగానే తెలుసుకోవడం వలన, కరోనా కట్టడికి సాధ్యం అవుతుందని, కావున ప్రజులు జివిఎంసి అధికారులకు, సిబ్బందికి, వైద్యులకు సహకరించి నిజమైన వివరాలను తెలపాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
జివిఎంసి పరిధిలో తెలుపు లేదా బియ్యం కార్డుదారుకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1000/` రు ఆర్దిక సహాయాన్ని ఇంకా మిగిలియున్న వారికి త్వరితగతిన అందించాని అందరు జోనల్ కమిషనర్లను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్సులో జివిఎంసి అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, జివిఎంసి ముఖ్యవైద్యఆరోగ్యశాఖాధికారి కె.ఎస్.ఎన్.ఎల్.జి.శాస్త్రి, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా.తిరుపతిరావు, ఎఫ్.ఎస్.టి బృందసభ్యులు, ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రం మరియు ప్రాధమిక ఆరోగ్య కేంద్రపు డాక్టర్లు, అందరు జోనల్ కమిషనర్లు, జోనల్ ప్రత్యేకాధికాయి, వార్డు ప్రత్యేకా అధికారులు తదితరులు పాల్గోన్నారు.
పేదల ఆకలి తీరుస్తున్న తొగటవీరక్షత్రియిలు
పేదల ఆకలి తీరుస్తున్న తొగటవీరక్షత్రియిలు
పెన్ పవర్;జమ్మలమడుగు
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం మొత్తం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ నేపథ్యంలో రోజు కూలి పనులకు వెళ్లే వ్రృద్దులకు ఈ లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి విషమంగా ఉండటంతో తినడానికి కూడా తిండి దొరకని వారికి,అనాధలకు ,వికలాంగులకు జమ్మలమడుగు లోని తొగటవీరక్షత్రియసంఘం మరియు శ్రీ చౌడేశ్వరి దేవాలయం వారి ఆద్వర్యంలో పట్టణం లోని BC కాలని,చౌడమ్మ గుడి,మోరగుడి,గూడుమస్తాన్ దర్గా ,నారాపురం దేవాలయం పరిసరాల్లో ఉన్న పేదవారికి అన్నం,పప్పు,రసం,మంచి నీరు ప్యాకేట్ల పంపిణీ చేశారు, ఈ అన్నదానం ఏప్రిల్ 1నుండి లాక్ డౌన్ చివరి తేదీ అయిన ఏప్రిల్ 14 వరకు ప్రతి రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ అన్నదానం కి సహకరిస్తున్న దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఈ కార్యక్రమంలో బి. పాండులు,భాస్కర్ ,కవలా రామయ్య,పుణ్యమూర్తి,చంద్రగోవిందు, సీ జే పాండు, సీ జే కొండయ్య, గంజికుంట తిరుమలదాసు ,గొరిగె జ్యోతి ప్రసాద్, మోరగుడి గ్రామ వాలంటీరులు పాల్గొన్నారు.
జ్యోతి వెలుగులతో ఐక్యతను చాటిన భారతీయం
జ్యోతి వెలుగులతో ఐక్యతను చాటిన భారతీయం
కరోనా పై దీప కాంతులతో పోరాటం
పెన్ పవర్ ;జమ్మలమడుగు
జమ్మలమడుగు పట్టణంలో ప్రధాని మోడీ పిలుపుమేరకు రాత్రి 9:00 నుండి 9:30 వరకు దీప కాంతులతో కరోనా పై పోరాటం చేశారు ఎటువంటి సందేహం ,ఆందోళన వ్యక్తం చేయకుండా ప్రజలంతా స్వచ్ఛందంగా ప్రతి ఇంటిలో విద్యుద్దీపాలను ఆర్పివేసి భారతదేశం అంతా ఒకే మాటపై నిలబడతారని ప్రపంచానికి చాటి చెప్పారు ఇప్పటికే కరోనా ను కట్టడి చేయడంలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందడుగు లో ఉందని ప్రపంచమంతా చెప్పుకొస్తున్నారు ఈరోజు రాత్రి దీప కాంతులతో జమ్మలమడుగు లోని వీధులన్నింటిలో ప్రజలు ,పోలీసులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతు గా ఉంటారని ప్రజలు నిరూపించారు,మరొకసారి భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు భారతదేశం సాంప్రదాయక దేశమని సాంప్రదాయ పద్ధతులలో ముఖ్యమైనది దీపారాధన ఆ దీపారాధన ద్వారా కరోనా కట్టడికి పిలుపునిచ్చిన ప్రధాని మోడీ ఆశయాన్ని ప్రజలందరూ పాటించారని తెలుస్తుంది.
స్వచ్చందంగా రక్త దాన శిబిరం ఏర్పాటు
శ్రీకాకుళం/రాగోలు, పెన్ పవర్
శ్రీకాకుళం జిల్లా రాగోలు మండలం మరియు గ్రామమునకు చెందిన మేము సైతం అసోసియేషన్ ఆద్వర్యం లో కరోనా ప్రభావం చే ప్రభుత్వం లాక్ డౌన్ కొనసాగిస్తున్న కారణం చేత రక్తం కొరత వున్నదని పలు పత్రికల ద్వారా తెలుసుకొని రక్తం కొరత అధిగమించాలని స్వచ్చంగా దాతలను ప్రేరేపించి తేది ఆదివారం ఉదయం రాగోలు గ్రామం లో స్వచ్చందంగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేసి 15 మంది అసోసియేషన్ సభ్యులతో రక్త దానం చేయించినారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్ మోహన్ రావు మాటలాడుతూ కరోనా వ్యాప్తి చెందుచున్న కారణముగా ప్రతి వ్యక్తి కనీస దూరం పాటించ వలెనని, మరియు తుమ్ము, దగ్గు వచ్చినప్పడు రుమాలు అడ్డుపెట్టు కొనవలనని, కొన్ని సూచనలు, జాగ్రతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమములో మా సైతం సభ్యులు గి.చంద్ర శేఖర్, టి.లక్ష్మణ రావు, వై.రామకృష్ణ, పి.అప్ప రావు, పి.వి.ఎస్.యన్.మూర్తి మరియు రెడ్ క్రాస్ సిబ్బంది డాక్టర్ యం.చిట్టిబాబు, సూర్యప్రకాష్ రావు, బాబు రావు, ఉమాశంకర్, గఫూర్ పాల్గొన్నారు.
తెదేపా ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు
మేము సైతం ప్రజా సేవలో
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...