Followers

బురఖా ఉంటే నో వైద్యం


గడ్డం, టోపి ఉంటే ఆ రోగి గేటు బయటే
నిన్న గిరిజన మహిళకు - నేడు మైనార్టీ మహిళకు ఘోర అవమానం 
తీరు మార్చుకోని మార్కాపురం వైద్య సిబ్బంది
నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్న జిల్లా యంత్రాంగం



(పెన్‌పవర్‌, మార్కాపురం ఆర్‌సి ఇన్‌ఛార్జి)



ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే కుల , మతాలకు అతీతంగా చేతులెత్తి మొక్కేది ప్రధానంగా వైద్యుడినే. కానీ ఆ వైద్యుడు మాత్రం తన నరనరాల్లో కులాన్ని ఎక్కించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్నా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా ఢల్లీ జమాతేకు వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. దీంతో ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ఏరియా వైద్యశాలలో వైద్యులు  తాము వైద్యులమని మరచి కులాల పేరుతో రోగులకు నరకం చూపిస్తున్నారు. కేవాలం  బురఖా వేసుకుని వచ్చారన్న సాకుతో తొమ్మిది నెలల గర్భిణీ అని కూడా చూడకుండా గెంటేసిన వైనం ఆలస్యంగా మెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే వెనుకబడి ఉన్న పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని 12 మండలాలకు ఉపయోగపడేలా డివిజన్‌ కేంద్రమైన మార్కాపురంలో ఏరియా వైద్యశాలను నిర్మించారు. ఇటీవలనే ఈ వైద్యశాలను జిల్లా వైద్యశాలగా అప్‌గ్రేడ్‌ చేశారు. రోజుకు అయిదు వందలకు పైగా ఓపి ఉండే ఈ వైద్యశాలలో పూర్తి స్థాయి వైద్యులు  లేకపోగా, ఉన్న కొద్ది మంది వైద్యులు  వృత్తికి తగ్గ సేవను కొనసాగించకపోవడంతో ఈ వైద్యశాల  నిత్యం పత్రికలలో కెక్కుతూ ఇక్కడి వైద్యుల  పనితనం పై రకరకాల వార్త కధనాలతో ఔరా అనిపిస్తున్నారు. ఈ మధ్యనే ఈ ఆసుపత్రిలో ఓ వైద్యుడు విధులు  సక్రమంగా నిర్వర్తించకపోవడంతో జిల్లా కలెక్టర్‌ వేగంగా చర్యలు  చేపట్టి సస్పెండ్‌ చేశారు.  కాని ఓ నిండు గర్భిణీ గెంటేసిన వారిపై మాత్రం ఇంత వరకు ఏ చర్యలు  తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కల్గించకమానదు. ఈ వైద్యశాలలో పని చేసే వైద్యులు, సిబ్బందికి వృత్తి పట్ల నిబద్దత లేకపోవడం వైద్యశాలకు శాపంగా మారింది.  వైద్యో నారాయణో హరి అన్నారు.  వైద్యుడు దేవుడితో సమానమని అంటారు.  అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్నా ఈ వైద్యశాలలోని డాక్టర్లు  రోగులపట్ల చిన్నచూపు, వ్యక్తులపట్ల వివక్ష, గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం వచ్చిన వారి పట్ల చీదరింపు, అమ్మ, అయ్యా అని ప్రాథేయపడితే గెంటివేతల లాంటివి చేస్తుండడంతో రోగులు  అవమానాను ఎదుర్కోంటు ఇబ్బందు పడుతున్నారు. ఇటీవల వైద్యం కోసం వచ్చిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ సుగాలి తాండాకు చెందిన తల్లి, కూతూళ్లను ఓ వైద్యుడు బండబూతులు  తిట్టి చేయి చేసుకొని గెంటి వేశారు. ఈ సంఘటన జరిగిన పక్షం రోజుల లోనే యంఆర్‌పియస్‌ రాష్ట్ర ప్రదానకార్యదర్శి చాట్ల డానియేులు  బంధువు అయిన 68 సంవత్సరాల వృద్థురాలిని ఇన్‌ పేషెంట్‌ హాలు  నుంచి బయటికి నేట్టి, ఇది మీ అత్తగార్లిు అనుకుంటున్నావా ఇంకెన్ని రోజు ఉంటావంటూ దుర్భాషాలాడుతూ అవమానించారు. ఈ సంఘటన కూడా పత్రికలలో ప్రచురితమై రచ్చ జరిగింది. రెండు వారా క్రిందట ఓ ముస్లిం మహిళ పట్ల వైద్యు ఇలానే అనాలోచితంగా ప్రవర్తించి హేళనగా మాట్లాడగా భర్త వైద్యశాల ఆవరణలో బైఠాయించి ఆందోళన చేయడంతో ఖంగుతిన్న సిబ్బంది కొందరి ద్వారా రోగిని బుజ్జగింపజేసి సద్దు మనిగేలా చేశారు.  కాగా శుక్రవారం వైద్యశాల సూపరింటెండెంట్‌  ఓ ముస్లిం జంట పై వివక్షపూరిత వ్యాఖ్యాలు  చేసి అవమానపరచారు. పరీక్ష నిమిత్తం వచ్చిన నిండు గర్భవతిని నానా దుర్భాషలాడి వైద్యం నిరాకరించి తిరిగి పంపించడం పట్ల మరో మారు వైద్యుల  వ్యవహారం మార్కాపురంలో తీవ్ర చర్చకు దారితీసింది. పట్టణంలోని పూలసుబ్బయ్య కాలనీకి చెందిన పఠాన్‌ అజ్మతుల్లా  కార్పెంటర్‌ వృత్తి చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. నిండు గర్బిణి అయిన తన భార్య రమిజాను వైద్య పరీక్ష నిమిత్తం వైద్యశాలకు తీసుకెళ్ళాడు. సాంప్రదాయ పరంగా బురఖాలో ఉన్నా రమిజాను చూసిన వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన వైద్యుడు అసహనంతో నోరు జారడంతో పాటు గడ్డంతో ఉన్న భర్తను గేటు బయట ఉండమని ఆదేశించాడు. తొలి కాన్పు ఎక్కడా చేయించుకున్నావో, అక్కడే రెండో కాన్పు చేయించుకోవచ్చు కదా ! ఇక్కడికెందుకొచ్చావు ! గడ్డంతో ఉన్నా నీ భర్త ఢల్లీ కి వెళ్ళాడా, నిజం చెప్పు, మీ లాంటి వారికి వైద్యం చేస్తే మేము కాటికి వేళ్ళాల్సి వస్తుంది. అంటూ పలువురి ముందు మనోభావం దెబ్బతీనేలా మాట్లాడి వైద్యం చేయకుండా ఎలాంటి పరీక్షలు  నిర్వహించకుండా వైద్యశాల నుంచి తిరిగి పంపించడంతో వారు చేసేదేమిలేక కొందరి సహాయంతో స్ధానిక కందుల ఓబులరెడ్డి వైద్యశాలలో కాన్పు కోసం చేరారు.


 



 శాఖపరమైన చర్యు తీసుకోవాలి 



యంపిజె డిమాండ్‌  



వైద్య పరీక్షల కోసం వెళ్లిన ముస్లిం జంట పట్ల వివక్ష ధోరణితో వ్యవహరించిన మార్కాపురం జిల్లా వైద్యశాల వైద్యులు, సిబ్బంది పై శాఖ పరమైన చర్యలు  తీసుకోవాని మూవ్‌మెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టీస్‌ జిల్లా ప్రదాన కార్యదర్శి షేక్‌ అబ్ధుల్‌ రజాక్‌ డిమాండ్‌ చేశారు  . రాజ్యాంగానికి విరుద్దంగా వైద్యులు  రోగుల పట్ల వ్యవహరించడం సహించరానిదని, ఈ విషయాన్ని జిల్లా అధికారులతో పాటు మానవహక్కుల సంఘం దృష్టికి తీసుకెల్లనున్నట్లు తెలిపారు. వైద్యశాల తీరు మారేలా చర్యలు  తీసుకోవాని డిమాండ్‌ తో కూడిన వినతి పత్రాన్ని శనివారం యంపిజె నాయకులు  వైద్యశాల  సూపరింటెండెంట్‌ కు అందజేశారు.


రాష్ట్ర ఎన్నికల కమిషనర్  రమేశ్ కుమార్ కు కన్నా లేఖ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్  రమేశ్ కుమార్ కు కన్నా లేఖ


అమరావతి, పెన్ పవర్ 



కరోనా లాక్ డౌన్ కారణంగా  ఏపీలో 1000 రూపాయల చొప్పున పంపిణీ చేసిన సంగతి తెలసిందే. దీనిపై ఏపీ బీజేపీ అగ్రనేత కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు లేఖ రాశారు. 
పేదలకు ప్రకటించిన వెయ్యి రూపాయల ఆర్థికసాయాన్ని వైసీపీ అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారని తన లేఖలో ఆరోపించారు.
ఆ డబ్బును వైసీపీ పంపిణీ చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వైసీపీ అభ్యర్థులపై అనర్హత వేటు వేసి జైలు శిక్ష విధించాలని కోరారు.
 ఇలాంటి సంక్షోభ సమయంలో స్వార్థ రాజకీయాలు తగవని వైసీపీకి హితవు పలికారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.


పేదలకు సహాయం 





పేదలకు సహాయం 

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

పట్టణంలో పాత్రుడు కాలనీ  శ్రీ సంపత్ వినాయక ఆలయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం  పేదలకు, పోలీసులకు ఆహారాన్ని పంపిణీ చేశారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు  లాక్ డౌన్ విధించిన   నేపథ్యంలో  పూట గడవని పరిస్థితి లో ఉన్న నిరుపేదలకు , విధుల్లో  శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి ఈ ఆహారాన్ని పంపిణీ చేశారు.   కార్యక్రమంలో పీలా బాబు ' కొణతాల మహాలక్ష్మి నాయుడు,   చుక్కా సత్యనారాయణ ,  దొడ్డి సత్యనారాయణ , దొండా కన్నయ్య దొర , కంఠం రెడ్డి రాజశేఖర్ , కొణతాల ఆదిలక్ష్మి,   పెంటకోట సతీష్ కుమార్ , పి. వంశీకృష్ణ, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.


 

 



 

గాజువాక జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా విలేకరులకు నిత్యావసరాల పంపిణీ

 


 


 


 



 


గాజువాక, పెన్ పవర్


లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టు కుటుంబాలను ఆదుకునేందుకు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని జర్నలిస్టుల సంఘం ముందుకు వచ్చింది. దాతల నుండి  విరాళాలను సేకరించి నిత్యావసరాలను సమకూర్చింది. ఆదివారం గాజువాక వుడా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతులమీదుగా విలేకరులకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జర్నలిస్టులు పితాని సూర్యప్రసాద్, కె రాము,  పరశురాం, గిరిబాబు, శేషు, శశి, గుప్తా, కృష్ణ, ఆధ్వర్యంలో దాతల నుండి విరాళాలు సేకరించడంలో కృషి చేశారు.  ఈ కార్యక్రమంలో  తిప్పల వంశీ రెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి, దాతలు వర్మ, వారణాసి దినేష్ రాజ్, లక్కరాజు సోంబాబు, లేళ్ల కోటేశ్వర రావు, గంధం శ్రీనివాస్, మురళి దేవి, ట్వింకిల్ శ్యామ్ తదితరులు నిత్యావసరాలను అందజేశారు. సీనియర్ జర్నలిస్టులు కృష్ణ, కృష్ణ శ్రీ, కుప్పిలి సూర్యప్రసాద్, మోడేకురు సత్యనారాయణ, హెచ్ రాజశేఖర్ లకు తొలుత అందిజేశారు. సుమారు 150 మంది జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ చేశారు.


 


ప‌రీక్ష‌ల‌కు ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చేలా చైత‌న్య‌ప‌ర‌చాలి


ప‌రీక్ష‌ల‌కు ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చేలా చైత‌న్య‌ప‌ర‌చాలి


క‌మాండ్ కంట్రోల్ రూమును ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్‌



విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్


 క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో కోవిడ్‌-19పై ఏర్పాటు చేసిన జిల్లా క‌మాండ్ కంట్రోల్ రూమ్‌ను క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌, ఎస్‌పి బి.రాజ‌కుమారితో క‌లిసి ఆదివారం ప‌రిశీలించారు. అక్క‌డినుంచి నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌ను, ఏర్పాటు చేసిన విభాగాల‌ను, వాటి విధుల‌ను అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ కేత‌న్ గార్గ్ వారికి వివ‌రించారు. క్యూఐసి, క్వారంటైన్‌, స‌ర్వైలెన్స్‌, హూమ‌న్ రీసోర్స్‌, డాటా అన‌లైజింగ్ త‌దిత‌ర విభాగాల‌ను ఏర్పాటు చేశామ‌ని గార్గ్ చెప్పారు.




     ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ మాట్లాడుతూ జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, ఊపిరి పీల్చుకోవ‌డంలో ఇబ్బంది త‌దిత‌ర క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్ప‌డు ప‌రీక్ష‌లు చేయించుకొనేందుకు ప్ర‌జ‌లంతా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చేలా వారిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. ఈ మేర‌కు వారికి దైర్యం, న‌మ్మ‌కం క‌ల్పించేలా క‌మాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది ప‌నిచేయాల‌ని కోరారు. వ్య‌క్తుల మ‌ధ్య భౌతిక‌ దూరాన్ని పాటించ‌డమే క‌రోనా మ‌హమ్మారిని నియంత్రించ‌డంలో కీల‌క పాత్ర అని స్ప‌ష్టం చేశారు. ఈ అంశాన్ని మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని, అదేవిధంగా త‌ర‌చూ చేతుల‌ను స‌బ్బుతో క‌డుకొనేలా చైత‌న్య ప‌ర‌చాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. క‌లెక్ట‌ర్ వెంట డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు త‌దిత‌రులు ఉన్నారు.


ఔదార్యం చాటుకుంటున్న గాజువాక యువత : పెన్ పవర్ టీమ్ 


 


 కరోనా మహామ్మారిని నుండి రక్షణ చర్యల్లో భాగంగా విధులు  
 ప్రభుత్వ సిబ్బందికి సహాకరిస్తున్న పారిశ్రామికవాసులు 
 సేవాకార్యక్రమాలకు ముందుకు వస్తున్న పలు సంస్దలు



గాజువాక , పెన్‌ పవర్‌ 



 కరోనా మహామ్మారి నుండి యావత్‌ భారత దేశ ప్రజను కాపాడటానికి దేశప్రధాని నరేంద్ర మోడీ  తీసుకున్న లాక్‌డౌన్‌ను విధిగా అందరు పాటిస్తూ దేశ జౌన్యత్యాన్ని చాటిచెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసు సిబ్బంది, పారిశుధ్య కార్మికులు , జర్నలిస్టులు  తమ భాద్యతను నేరవేర్చడానికి శాయశక్తుల  కృషి చేస్తూన్నారు. కుటుంబసభ్యుల  యోగక్షేమాలను సైతం లెక్కచేయకుండా ప్రజాక్షేమం కోరకు తమ కర్తవ్యదీక్షను నెరవేరుస్తూన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా విధులను  నిర్వహిస్తూన్న  సిబ్బందికి తమ వంతు తోడ్పాటుగా డిలిశ్యాస్  కెటరింగ్‌, కావ్యఎంటర్‌ప్రైజస్‌ సౌజన్యంతో గాజువాక పెన్‌పవర్‌ టీం,  స్దానిక యువత వాటర్‌ బాటిల్స్‌,మజ్జిగ ప్యాకెట్లు , పండ్లు  అందజేసీ తమ సేవా నిరతిని చాటుకున్నారు.  కార్యక్రమంలో పెన్ పవర్ గాజువాక  పెన్ పవర్ విలేఖర్లు బి.శ్రీనివాస్‌, ఫిరోజ్‌,నానీ, సాయి, మణికంఠ, శ్రీనివాస్‌,స్దానిక యువత తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్రంలోనే మొట్టమొదటి కారోనా వ్యాధినిరోధక ద్వారం ఏర్పాటు


విజయనగరం,  పెన్ పవర్


 


రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా విజయనగరం పట్టణంలో కరోనా వ్యాధినిరోధక ద్వారం ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆదివారం నాడు ఉదయం పట్టణంలోని రాజీవ్ క్రీడా ప్రాంగణంలో బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం ఏర్పాటుచేసిన కరోనా వ్యాధినిరోధక ద్వారాన్ని ఎమ్మెల్యే కోలగట్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ ను కట్టడి చేస్తున్న ఈ పరిస్థితులలో జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ ప్రకటించి, సామాజిక దూరంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారన్నారు. విజయనగరం జిల్లా అధికారులు పట్టుదలతో వైరస్ ను కట్టడి చేయడానికి అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు చేపడుతున్నారు అని అన్నారు. విజయనగరం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ నిరోధానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. ఇటీవల తమిళనాడులో జన సమూహం ఉన్న ప్రాంతాలలో చేతులు శుభ్రం చేసుకునే పరిస్థితిని మాధ్యమాల ద్వారా చూసి, ప్రస్తుత పరిస్థితులలో విజయనగరం ప్రజలకు తమ వంతు సహాయంగా కరోనా వైరస్ నిరోధానికి ద్వారాన్ని ఏర్పాటు చేస్తామని యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు. మున్సిపల్ అధికారులు కూడా తగిన ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో కొత్తతరం ముందుకురావడం, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల కోసం ఆలోచన చేయడం అభినందనీయమన్నారు. విజయనగరం పట్టణంలో జన సమూహాలు ఉన్న ప్రాంతాలలో కరోనా వైరస్ నిరోధక ద్వారాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీనిద్వారా చేతులు శుభ్రంగా ఉండడం, కరోనా ను కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. అసోసియేషన్ ప్రతినిధి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ కరోనా నిరోధక ద్వారానికి తన సొంత నిధులను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నగరపాలక కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ కరోనా కట్టడికి యువత కూడా భాగస్వామ్యం అవ్వడం, ప్రజల వ్యక్తిగత పరిశుభ్రత దృష్టిలో ఉంచుకుని ద్వారాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం ప్రతినిధి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ పుట్టిన ఊరికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం గా ఏర్పడి గత సంవత్సర కాలంగా పలు ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో టీవీ మాధ్యమాలలో చూసిన పరిశుభ్రత ద్వారాలను విజయనగరం ప్రజలకు చేరువ చేయాలని, రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా విజయనగరం కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి సూచనలతో జన సందోహం ఉన్న ప్రాంతాలలో ఈ ద్వారాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ ప్రసాదరావు, ఏఎంసీ చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరపాలక అధ్యక్షులు ఆసాపు వేణు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సంఘం రెడ్డి బంగారు నాయుడు, నియోజకవర్గ అ యువజన విభాగం అధ్యక్షులు అల్లు చాణక్య, బిజినెస్ ఆఫ్ యూత్ విజయనగరం ప్రతినిధులు అభినాష్ గాంధీ, బాలాజీ, హరికృష్ణ, చిన్ని ప్రదీప్, కాళ్ల సునీల్, రమేష్, యస్ యస్ కంప్యూటర్స్ కిరణ్, దుర్గ, వై గేర్ ప్రసాద్, అబ్దుల్ తదితరులు ఉన్నారు...


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...