Followers

జ్యోతి వెలుగులతో ఐక్యతను చాటిన భారతీయం


జ్యోతి వెలుగులతో ఐక్యతను చాటిన భారతీయం


కరోనా పై దీప కాంతులతో పోరాటం


పెన్ పవర్ ;జమ్మలమడుగు 



జమ్మలమడుగు పట్టణంలో ప్రధాని మోడీ పిలుపుమేరకు రాత్రి 9:00 నుండి 9:30 వరకు దీప కాంతులతో కరోనా పై పోరాటం చేశారు ఎటువంటి   సందేహం ,ఆందోళన వ్యక్తం చేయకుండా ప్రజలంతా స్వచ్ఛందంగా ప్రతి ఇంటిలో విద్యుద్దీపాలను ఆర్పివేసి  భారతదేశం అంతా ఒకే మాటపై నిలబడతారని ప్రపంచానికి చాటి చెప్పారు ఇప్పటికే కరోనా ను కట్టడి చేయడంలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందడుగు లో ఉందని ప్రపంచమంతా చెప్పుకొస్తున్నారు ఈరోజు రాత్రి దీప కాంతులతో జమ్మలమడుగు లోని వీధులన్నింటిలో ప్రజలు ,పోలీసులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి  మద్దతు గా  ఉంటారని  ప్రజలు నిరూపించారు,మరొకసారి భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు భారతదేశం సాంప్రదాయక దేశమని సాంప్రదాయ పద్ధతులలో ముఖ్యమైనది దీపారాధన ఆ దీపారాధన ద్వారా కరోనా కట్టడికి పిలుపునిచ్చిన ప్రధాని మోడీ ఆశయాన్ని ప్రజలందరూ  పాటించారని తెలుస్తుంది.


స్వచ్చందంగా రక్త దాన శిబిరం ఏర్పాటు


శ్రీకాకుళం/రాగోలు,  పెన్ పవర్ 


శ్రీకాకుళం జిల్లా రాగోలు మండలం మరియు గ్రామమునకు చెందిన మేము సైతం అసోసియేషన్ ఆద్వర్యం లో  కరోనా ప్రభావం చే ప్రభుత్వం లాక్ డౌన్ కొనసాగిస్తున్న కారణం చేత రక్తం కొరత వున్నదని పలు పత్రికల ద్వారా తెలుసుకొని రక్తం కొరత అధిగమించాలని స్వచ్చంగా దాతలను ప్రేరేపించి తేది ఆదివారం ఉదయం  రాగోలు గ్రామం లో  స్వచ్చందంగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేసి 15 మంది అసోసియేషన్ సభ్యులతో రక్త దానం చేయించినారు.  రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్ మోహన్ రావు  మాటలాడుతూ కరోనా వ్యాప్తి చెందుచున్న కారణముగా ప్రతి వ్యక్తి కనీస దూరం పాటించ వలెనని, మరియు తుమ్ము, దగ్గు వచ్చినప్పడు రుమాలు అడ్డుపెట్టు కొనవలనని, కొన్ని సూచనలు, జాగ్రతలు తెలియజేసినారు.  ఈ కార్యక్రమములో మా సైతం సభ్యులు గి.చంద్ర శేఖర్, టి.లక్ష్మణ రావు, వై.రామకృష్ణ, పి.అప్ప రావు, పి.వి.ఎస్.యన్.మూర్తి మరియు  రెడ్ క్రాస్ సిబ్బంది  డాక్టర్ యం.చిట్టిబాబు, సూర్యప్రకాష్ రావు, బాబు రావు, ఉమాశంకర్, గఫూర్  పాల్గొన్నారు.


తెదేపా ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు 


తెదేపా ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు 

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

అరుంధతి నగరంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా శాసనమండలి సభ్యులు      బుద్థ నాగ జగదీశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దిశానిర్దేశం చేసే లోక్ సభ స్పీకర్ గా ఒక దళితనేతను చేసిన పార్టీ తెలుగుదేశం అనారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ గా ఒక దళిత మహిళానేతను గౌరవించిన పార్టీ తెలుగుదేశం బడుగు, బలహీన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన పార్టీ తెలుగుదేశం అనారు. జగ్జీవన్ జ్యోతి పథకం కింద ఎస్సీల ఇళ్ళకు 100 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చాం. డప్పు కళాకారులకు ప్రతి నెలా రూ.1,500 పింఛను ఇచ్చాం. ఎస్సీల సంక్షేమానికి 4ఏళ్లలోనే రూ.40,253 కోట్ల బడ్జెట్ పెట్టాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 6.56 లక్షల మందికి జీవనోపాధులు కల్పించామనారు. ఈ కార్యక్రమంలో బోడ్డేడ జోగినాయుడు,మళ్ళ సురేంద్ర,కొణతాల జగ్గారావు నాయుడు,బోడ్డేడ మురళీ, బుద్థ శ్రీను, పెట్ల సత్యనారాయణ,పోలమరశెట్టి వేణు,దొడ్డి జగదీశ్వరరావు,కొణతాల తులసి,అరుంథతి నగర్ కాలని వాసులు పాల్గొన్నారు.

 మేము సైతం ప్రజా సేవలో



 

 


 

 

విశాఖపట్నం/అరిలోవ,  పెన్ పవర్ 
 

తూర్పు నియోజకవర్గం 12వ వార్డు, వైయస్సార్సీపి  వార్డు అధ్యక్షుడు సుబ్బారెడ్డి. ఆధ్వర్యంలో లో వార్డు కార్యకర్తలు ,నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు తో కలిసి వార్డులోని పలు ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్,ఇతర కెమెకల్ ను పిచికారి చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, ప్రజలు  ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారు సమీపంలోని హాస్పిటల్ లో సంప్రదించి  వైద్యుల సలహాల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది గా తెలిపారు.  ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా  తగు జాగ్రత్తలు తీసుకుని కరోనా బారిన పడకుండా ఉండాలని కోరారు, ఈ కార్యక్రమంలో లో చొక్కార శేఖర్. మంద  రెడ్డి. సత్యనారాయణ. తదితరులు పాల్గొన్నారు.


 

 



 

బురఖా ఉంటే నో వైద్యం


గడ్డం, టోపి ఉంటే ఆ రోగి గేటు బయటే
నిన్న గిరిజన మహిళకు - నేడు మైనార్టీ మహిళకు ఘోర అవమానం 
తీరు మార్చుకోని మార్కాపురం వైద్య సిబ్బంది
నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్న జిల్లా యంత్రాంగం



(పెన్‌పవర్‌, మార్కాపురం ఆర్‌సి ఇన్‌ఛార్జి)



ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే కుల , మతాలకు అతీతంగా చేతులెత్తి మొక్కేది ప్రధానంగా వైద్యుడినే. కానీ ఆ వైద్యుడు మాత్రం తన నరనరాల్లో కులాన్ని ఎక్కించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్నా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా ఢల్లీ జమాతేకు వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. దీంతో ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ఏరియా వైద్యశాలలో వైద్యులు  తాము వైద్యులమని మరచి కులాల పేరుతో రోగులకు నరకం చూపిస్తున్నారు. కేవాలం  బురఖా వేసుకుని వచ్చారన్న సాకుతో తొమ్మిది నెలల గర్భిణీ అని కూడా చూడకుండా గెంటేసిన వైనం ఆలస్యంగా మెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే వెనుకబడి ఉన్న పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని 12 మండలాలకు ఉపయోగపడేలా డివిజన్‌ కేంద్రమైన మార్కాపురంలో ఏరియా వైద్యశాలను నిర్మించారు. ఇటీవలనే ఈ వైద్యశాలను జిల్లా వైద్యశాలగా అప్‌గ్రేడ్‌ చేశారు. రోజుకు అయిదు వందలకు పైగా ఓపి ఉండే ఈ వైద్యశాలలో పూర్తి స్థాయి వైద్యులు  లేకపోగా, ఉన్న కొద్ది మంది వైద్యులు  వృత్తికి తగ్గ సేవను కొనసాగించకపోవడంతో ఈ వైద్యశాల  నిత్యం పత్రికలలో కెక్కుతూ ఇక్కడి వైద్యుల  పనితనం పై రకరకాల వార్త కధనాలతో ఔరా అనిపిస్తున్నారు. ఈ మధ్యనే ఈ ఆసుపత్రిలో ఓ వైద్యుడు విధులు  సక్రమంగా నిర్వర్తించకపోవడంతో జిల్లా కలెక్టర్‌ వేగంగా చర్యలు  చేపట్టి సస్పెండ్‌ చేశారు.  కాని ఓ నిండు గర్భిణీ గెంటేసిన వారిపై మాత్రం ఇంత వరకు ఏ చర్యలు  తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కల్గించకమానదు. ఈ వైద్యశాలలో పని చేసే వైద్యులు, సిబ్బందికి వృత్తి పట్ల నిబద్దత లేకపోవడం వైద్యశాలకు శాపంగా మారింది.  వైద్యో నారాయణో హరి అన్నారు.  వైద్యుడు దేవుడితో సమానమని అంటారు.  అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్నా ఈ వైద్యశాలలోని డాక్టర్లు  రోగులపట్ల చిన్నచూపు, వ్యక్తులపట్ల వివక్ష, గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం వచ్చిన వారి పట్ల చీదరింపు, అమ్మ, అయ్యా అని ప్రాథేయపడితే గెంటివేతల లాంటివి చేస్తుండడంతో రోగులు  అవమానాను ఎదుర్కోంటు ఇబ్బందు పడుతున్నారు. ఇటీవల వైద్యం కోసం వచ్చిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ సుగాలి తాండాకు చెందిన తల్లి, కూతూళ్లను ఓ వైద్యుడు బండబూతులు  తిట్టి చేయి చేసుకొని గెంటి వేశారు. ఈ సంఘటన జరిగిన పక్షం రోజుల లోనే యంఆర్‌పియస్‌ రాష్ట్ర ప్రదానకార్యదర్శి చాట్ల డానియేులు  బంధువు అయిన 68 సంవత్సరాల వృద్థురాలిని ఇన్‌ పేషెంట్‌ హాలు  నుంచి బయటికి నేట్టి, ఇది మీ అత్తగార్లిు అనుకుంటున్నావా ఇంకెన్ని రోజు ఉంటావంటూ దుర్భాషాలాడుతూ అవమానించారు. ఈ సంఘటన కూడా పత్రికలలో ప్రచురితమై రచ్చ జరిగింది. రెండు వారా క్రిందట ఓ ముస్లిం మహిళ పట్ల వైద్యు ఇలానే అనాలోచితంగా ప్రవర్తించి హేళనగా మాట్లాడగా భర్త వైద్యశాల ఆవరణలో బైఠాయించి ఆందోళన చేయడంతో ఖంగుతిన్న సిబ్బంది కొందరి ద్వారా రోగిని బుజ్జగింపజేసి సద్దు మనిగేలా చేశారు.  కాగా శుక్రవారం వైద్యశాల సూపరింటెండెంట్‌  ఓ ముస్లిం జంట పై వివక్షపూరిత వ్యాఖ్యాలు  చేసి అవమానపరచారు. పరీక్ష నిమిత్తం వచ్చిన నిండు గర్భవతిని నానా దుర్భాషలాడి వైద్యం నిరాకరించి తిరిగి పంపించడం పట్ల మరో మారు వైద్యుల  వ్యవహారం మార్కాపురంలో తీవ్ర చర్చకు దారితీసింది. పట్టణంలోని పూలసుబ్బయ్య కాలనీకి చెందిన పఠాన్‌ అజ్మతుల్లా  కార్పెంటర్‌ వృత్తి చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. నిండు గర్బిణి అయిన తన భార్య రమిజాను వైద్య పరీక్ష నిమిత్తం వైద్యశాలకు తీసుకెళ్ళాడు. సాంప్రదాయ పరంగా బురఖాలో ఉన్నా రమిజాను చూసిన వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన వైద్యుడు అసహనంతో నోరు జారడంతో పాటు గడ్డంతో ఉన్న భర్తను గేటు బయట ఉండమని ఆదేశించాడు. తొలి కాన్పు ఎక్కడా చేయించుకున్నావో, అక్కడే రెండో కాన్పు చేయించుకోవచ్చు కదా ! ఇక్కడికెందుకొచ్చావు ! గడ్డంతో ఉన్నా నీ భర్త ఢల్లీ కి వెళ్ళాడా, నిజం చెప్పు, మీ లాంటి వారికి వైద్యం చేస్తే మేము కాటికి వేళ్ళాల్సి వస్తుంది. అంటూ పలువురి ముందు మనోభావం దెబ్బతీనేలా మాట్లాడి వైద్యం చేయకుండా ఎలాంటి పరీక్షలు  నిర్వహించకుండా వైద్యశాల నుంచి తిరిగి పంపించడంతో వారు చేసేదేమిలేక కొందరి సహాయంతో స్ధానిక కందుల ఓబులరెడ్డి వైద్యశాలలో కాన్పు కోసం చేరారు.


 



 శాఖపరమైన చర్యు తీసుకోవాలి 



యంపిజె డిమాండ్‌  



వైద్య పరీక్షల కోసం వెళ్లిన ముస్లిం జంట పట్ల వివక్ష ధోరణితో వ్యవహరించిన మార్కాపురం జిల్లా వైద్యశాల వైద్యులు, సిబ్బంది పై శాఖ పరమైన చర్యలు  తీసుకోవాని మూవ్‌మెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టీస్‌ జిల్లా ప్రదాన కార్యదర్శి షేక్‌ అబ్ధుల్‌ రజాక్‌ డిమాండ్‌ చేశారు  . రాజ్యాంగానికి విరుద్దంగా వైద్యులు  రోగుల పట్ల వ్యవహరించడం సహించరానిదని, ఈ విషయాన్ని జిల్లా అధికారులతో పాటు మానవహక్కుల సంఘం దృష్టికి తీసుకెల్లనున్నట్లు తెలిపారు. వైద్యశాల తీరు మారేలా చర్యలు  తీసుకోవాని డిమాండ్‌ తో కూడిన వినతి పత్రాన్ని శనివారం యంపిజె నాయకులు  వైద్యశాల  సూపరింటెండెంట్‌ కు అందజేశారు.


రాష్ట్ర ఎన్నికల కమిషనర్  రమేశ్ కుమార్ కు కన్నా లేఖ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్  రమేశ్ కుమార్ కు కన్నా లేఖ


అమరావతి, పెన్ పవర్ 



కరోనా లాక్ డౌన్ కారణంగా  ఏపీలో 1000 రూపాయల చొప్పున పంపిణీ చేసిన సంగతి తెలసిందే. దీనిపై ఏపీ బీజేపీ అగ్రనేత కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు లేఖ రాశారు. 
పేదలకు ప్రకటించిన వెయ్యి రూపాయల ఆర్థికసాయాన్ని వైసీపీ అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారని తన లేఖలో ఆరోపించారు.
ఆ డబ్బును వైసీపీ పంపిణీ చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వైసీపీ అభ్యర్థులపై అనర్హత వేటు వేసి జైలు శిక్ష విధించాలని కోరారు.
 ఇలాంటి సంక్షోభ సమయంలో స్వార్థ రాజకీయాలు తగవని వైసీపీకి హితవు పలికారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.


పేదలకు సహాయం 





పేదలకు సహాయం 

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

పట్టణంలో పాత్రుడు కాలనీ  శ్రీ సంపత్ వినాయక ఆలయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం  పేదలకు, పోలీసులకు ఆహారాన్ని పంపిణీ చేశారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు  లాక్ డౌన్ విధించిన   నేపథ్యంలో  పూట గడవని పరిస్థితి లో ఉన్న నిరుపేదలకు , విధుల్లో  శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి ఈ ఆహారాన్ని పంపిణీ చేశారు.   కార్యక్రమంలో పీలా బాబు ' కొణతాల మహాలక్ష్మి నాయుడు,   చుక్కా సత్యనారాయణ ,  దొడ్డి సత్యనారాయణ , దొండా కన్నయ్య దొర , కంఠం రెడ్డి రాజశేఖర్ , కొణతాల ఆదిలక్ష్మి,   పెంటకోట సతీష్ కుమార్ , పి. వంశీకృష్ణ, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.


 

 



 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...