Followers

గాజువాక జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా విలేకరులకు నిత్యావసరాల పంపిణీ

 


 


 


 



 


గాజువాక, పెన్ పవర్


లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టు కుటుంబాలను ఆదుకునేందుకు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని జర్నలిస్టుల సంఘం ముందుకు వచ్చింది. దాతల నుండి  విరాళాలను సేకరించి నిత్యావసరాలను సమకూర్చింది. ఆదివారం గాజువాక వుడా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతులమీదుగా విలేకరులకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జర్నలిస్టులు పితాని సూర్యప్రసాద్, కె రాము,  పరశురాం, గిరిబాబు, శేషు, శశి, గుప్తా, కృష్ణ, ఆధ్వర్యంలో దాతల నుండి విరాళాలు సేకరించడంలో కృషి చేశారు.  ఈ కార్యక్రమంలో  తిప్పల వంశీ రెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి, దాతలు వర్మ, వారణాసి దినేష్ రాజ్, లక్కరాజు సోంబాబు, లేళ్ల కోటేశ్వర రావు, గంధం శ్రీనివాస్, మురళి దేవి, ట్వింకిల్ శ్యామ్ తదితరులు నిత్యావసరాలను అందజేశారు. సీనియర్ జర్నలిస్టులు కృష్ణ, కృష్ణ శ్రీ, కుప్పిలి సూర్యప్రసాద్, మోడేకురు సత్యనారాయణ, హెచ్ రాజశేఖర్ లకు తొలుత అందిజేశారు. సుమారు 150 మంది జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ చేశారు.


 


ప‌రీక్ష‌ల‌కు ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చేలా చైత‌న్య‌ప‌ర‌చాలి


ప‌రీక్ష‌ల‌కు ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చేలా చైత‌న్య‌ప‌ర‌చాలి


క‌మాండ్ కంట్రోల్ రూమును ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్‌



విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్


 క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో కోవిడ్‌-19పై ఏర్పాటు చేసిన జిల్లా క‌మాండ్ కంట్రోల్ రూమ్‌ను క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌, ఎస్‌పి బి.రాజ‌కుమారితో క‌లిసి ఆదివారం ప‌రిశీలించారు. అక్క‌డినుంచి నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌ను, ఏర్పాటు చేసిన విభాగాల‌ను, వాటి విధుల‌ను అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ కేత‌న్ గార్గ్ వారికి వివ‌రించారు. క్యూఐసి, క్వారంటైన్‌, స‌ర్వైలెన్స్‌, హూమ‌న్ రీసోర్స్‌, డాటా అన‌లైజింగ్ త‌దిత‌ర విభాగాల‌ను ఏర్పాటు చేశామ‌ని గార్గ్ చెప్పారు.




     ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ మాట్లాడుతూ జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, ఊపిరి పీల్చుకోవ‌డంలో ఇబ్బంది త‌దిత‌ర క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ప్ప‌డు ప‌రీక్ష‌లు చేయించుకొనేందుకు ప్ర‌జ‌లంతా స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చేలా వారిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. ఈ మేర‌కు వారికి దైర్యం, న‌మ్మ‌కం క‌ల్పించేలా క‌మాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది ప‌నిచేయాల‌ని కోరారు. వ్య‌క్తుల మ‌ధ్య భౌతిక‌ దూరాన్ని పాటించ‌డమే క‌రోనా మ‌హమ్మారిని నియంత్రించ‌డంలో కీల‌క పాత్ర అని స్ప‌ష్టం చేశారు. ఈ అంశాన్ని మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని, అదేవిధంగా త‌ర‌చూ చేతుల‌ను స‌బ్బుతో క‌డుకొనేలా చైత‌న్య ప‌ర‌చాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. క‌లెక్ట‌ర్ వెంట డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు త‌దిత‌రులు ఉన్నారు.


ఔదార్యం చాటుకుంటున్న గాజువాక యువత : పెన్ పవర్ టీమ్ 


 


 కరోనా మహామ్మారిని నుండి రక్షణ చర్యల్లో భాగంగా విధులు  
 ప్రభుత్వ సిబ్బందికి సహాకరిస్తున్న పారిశ్రామికవాసులు 
 సేవాకార్యక్రమాలకు ముందుకు వస్తున్న పలు సంస్దలు



గాజువాక , పెన్‌ పవర్‌ 



 కరోనా మహామ్మారి నుండి యావత్‌ భారత దేశ ప్రజను కాపాడటానికి దేశప్రధాని నరేంద్ర మోడీ  తీసుకున్న లాక్‌డౌన్‌ను విధిగా అందరు పాటిస్తూ దేశ జౌన్యత్యాన్ని చాటిచెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసు సిబ్బంది, పారిశుధ్య కార్మికులు , జర్నలిస్టులు  తమ భాద్యతను నేరవేర్చడానికి శాయశక్తుల  కృషి చేస్తూన్నారు. కుటుంబసభ్యుల  యోగక్షేమాలను సైతం లెక్కచేయకుండా ప్రజాక్షేమం కోరకు తమ కర్తవ్యదీక్షను నెరవేరుస్తూన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా విధులను  నిర్వహిస్తూన్న  సిబ్బందికి తమ వంతు తోడ్పాటుగా డిలిశ్యాస్  కెటరింగ్‌, కావ్యఎంటర్‌ప్రైజస్‌ సౌజన్యంతో గాజువాక పెన్‌పవర్‌ టీం,  స్దానిక యువత వాటర్‌ బాటిల్స్‌,మజ్జిగ ప్యాకెట్లు , పండ్లు  అందజేసీ తమ సేవా నిరతిని చాటుకున్నారు.  కార్యక్రమంలో పెన్ పవర్ గాజువాక  పెన్ పవర్ విలేఖర్లు బి.శ్రీనివాస్‌, ఫిరోజ్‌,నానీ, సాయి, మణికంఠ, శ్రీనివాస్‌,స్దానిక యువత తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్రంలోనే మొట్టమొదటి కారోనా వ్యాధినిరోధక ద్వారం ఏర్పాటు


విజయనగరం,  పెన్ పవర్


 


రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా విజయనగరం పట్టణంలో కరోనా వ్యాధినిరోధక ద్వారం ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆదివారం నాడు ఉదయం పట్టణంలోని రాజీవ్ క్రీడా ప్రాంగణంలో బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం ఏర్పాటుచేసిన కరోనా వ్యాధినిరోధక ద్వారాన్ని ఎమ్మెల్యే కోలగట్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ ను కట్టడి చేస్తున్న ఈ పరిస్థితులలో జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ ప్రకటించి, సామాజిక దూరంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారన్నారు. విజయనగరం జిల్లా అధికారులు పట్టుదలతో వైరస్ ను కట్టడి చేయడానికి అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు చేపడుతున్నారు అని అన్నారు. విజయనగరం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ నిరోధానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. ఇటీవల తమిళనాడులో జన సమూహం ఉన్న ప్రాంతాలలో చేతులు శుభ్రం చేసుకునే పరిస్థితిని మాధ్యమాల ద్వారా చూసి, ప్రస్తుత పరిస్థితులలో విజయనగరం ప్రజలకు తమ వంతు సహాయంగా కరోనా వైరస్ నిరోధానికి ద్వారాన్ని ఏర్పాటు చేస్తామని యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు. మున్సిపల్ అధికారులు కూడా తగిన ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో కొత్తతరం ముందుకురావడం, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల కోసం ఆలోచన చేయడం అభినందనీయమన్నారు. విజయనగరం పట్టణంలో జన సమూహాలు ఉన్న ప్రాంతాలలో కరోనా వైరస్ నిరోధక ద్వారాలు ఏర్పాటు చేస్తామన్నారు. దీనిద్వారా చేతులు శుభ్రంగా ఉండడం, కరోనా ను కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. అసోసియేషన్ ప్రతినిధి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ కరోనా నిరోధక ద్వారానికి తన సొంత నిధులను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నగరపాలక కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ కరోనా కట్టడికి యువత కూడా భాగస్వామ్యం అవ్వడం, ప్రజల వ్యక్తిగత పరిశుభ్రత దృష్టిలో ఉంచుకుని ద్వారాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం ప్రతినిధి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ పుట్టిన ఊరికి మంచి చేయాలనే ఉద్దేశ్యంతో బిజినెస్ యూత్ ఆఫ్ విజయనగరం గా ఏర్పడి గత సంవత్సర కాలంగా పలు ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో టీవీ మాధ్యమాలలో చూసిన పరిశుభ్రత ద్వారాలను విజయనగరం ప్రజలకు చేరువ చేయాలని, రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా విజయనగరం కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి సూచనలతో జన సందోహం ఉన్న ప్రాంతాలలో ఈ ద్వారాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ ప్రసాదరావు, ఏఎంసీ చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరపాలక అధ్యక్షులు ఆసాపు వేణు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సంఘం రెడ్డి బంగారు నాయుడు, నియోజకవర్గ అ యువజన విభాగం అధ్యక్షులు అల్లు చాణక్య, బిజినెస్ ఆఫ్ యూత్ విజయనగరం ప్రతినిధులు అభినాష్ గాంధీ, బాలాజీ, హరికృష్ణ, చిన్ని ప్రదీప్, కాళ్ల సునీల్, రమేష్, యస్ యస్ కంప్యూటర్స్ కిరణ్, దుర్గ, వై గేర్ ప్రసాద్, అబ్దుల్ తదితరులు ఉన్నారు...


శ్రీకాళహస్తి సంకల్పానికి ముందుకు రండి

https://mail-attachment.googleusercontent.com/attachment/u/0/?ui=2&ik=1246f92083&attid=0.1&permmsgid=msg-a:r6819613423570862587&th=171491e4c6c2d096&view=att&disp=safe&realattid=1714919afa58d662581&saddbat=ANGjdJ9OsQs3ZbX00AlZgf9FpTQqkBYBga5PvoFflnAloU4vknUapSaWCZ0AUAYOACQsIBw0VgHFDmR_tH_VFzDHI0X3eGK


 


 

శ్రీకాళహస్తి సంకల్పానికి ముందుకు రండి

 

చిత్తూరుజిల్లా... శ్రీకాళహస్తి, పెన్ పవర్ 

 

తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి  కేంద్రప్రభుత్వం వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేయమని నిధులను  ఆంధ్రప్రదేశ్ కు విడుదల చేశారని ఈరోజు గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజలకు అందుతున్న వెయ్యిరూపాయలు కేంద్రప్రభుత్వంనుంచి వచ్చినా సహాయమని  ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని కోరారు అదేవిధంగా  కరోనా వైరస్ నివారణ కోసం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గట్టి సంకల్పం చేపట్టారని,  ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు దీపాలు వెలిగించడానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. దేశాన్ని సమైక్య దిశగా నడిపిస్తూ గట్టి సంకల్పబలంతో ఆపత్కాలంలో కరోనా ఎదుర్కోడానికి ప్రధాని పిలుపు మేరకు స్పందించి ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని కోరారు. ఈ ఆపత్కాలంలో  ప్రజలందరికి  అండగా నిలవాలని ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి వైట్ రేషన్ కార్డులకు వెయ్యి రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  అలాగే రైతులకు రెండు వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారని,  నిరుపేద మహిళల జన్ దన్  ఖాతాలకు 500 చొప్పున జమ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ కష్టకాలంలో అండగా నిలిచి దేశ ప్రజలకు చేయూత ఇస్తున్నారన్నారు. మన వంతు బాధ్యతగా కరోనా  నివారణకు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సహకారం అందించాలని కోరారు.

కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం - ప్రధాన వైద్యులతో మంత్రుల సమీక్ష


కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం - ప్రధాన వైద్యులతో మంత్రుల సమీక్ష



( నెల్లూరు జిల్లా రిపోర్టర్, పెన్ పవర్ గోశాల ప్రసాద్  )  


 కరోనా వైరస్ పై అధికారులతో పాటూ తామూ అప్రమత్తంగా ఉన్నామని మంత్రులు డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం వారు నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు. వారితో పాటూ జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు, జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్, కోవిడ్ నోడల్ అధికారి బాపిరెడ్డి కూడా ఉన్నారు. కళాశాల పరిశీలన అనంతరం మంత్రులు ప్రధాన వైద్యులతో సమావేశమయ్యారు. కరోనా వైరస్ రోగులకు అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. ఐసోలేషన్ వార్డుల్లో సదుపాయాలను పెంచాలని సూచించారు. ఇప్పటికే 32 పాజిటివ్ కేసులు ఉన్నాయని చెబుతూ ఇంకా ఎన్ని రిపోర్టులు రావల్సి ఉందని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్షలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


లాక్ డౌన్ నేపథ్యంలో పెద్ద మనసు చాటుకున్న ఓ కళింగాంధ్ర కుటుంబం





 

 

సొంత ఖర్చుతో 110కుటుంబాలకు ఉచితంగా నిత్యవసర వస్తువులు పంపిణీ

 

టెక్కలి, పెన్ పవర్ 

 

టెక్కలి మండలం, శ్యామసుందరపురం గ్రామములో కళింగాంధ్ర , మిషన్ 2022 గ్రూప్ సభ్యులైన స్వర్గీయ కీ.శే  గుంట  రామారావు ఆయన సతీమణి గుంట కళావతమ్మ  కుమారులు లాక్ డౌన్ లో వున్న ప్రజల కోసం తమ వంతు సహాయసహాకారం అందజేశారు. ఆ దంపతుల కుమారులు శ్రీను, మురళి, కిషోర్ లు ప్రస్తుత  లాకడౌన్ సందర్భంగా పేద ప్రజల ఇబ్బందులు ను గ్రహించి శనివారం 110 కుటుంబాలకు సుమారు 60000 రూపాయలు విలువ చేసే 12 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి సమాజంలో మానవతా విలువలను పెంపోదించేలా సేవా ధ్రుక్పదాన్ని చాటారు.ఇదే స్ఫూర్తితో దాతలు మరో 10 మందికి సేవ చేసి, ఆదర్శంగా నిలవాలని ఆ కుటుంబం పిలుపునిచ్చింది. కష్ట కాలంలో  ప్రజలకు సాయపడాలని సంకల్పించి నేడు తమ కుటుంబం ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. వీరి సేవాస్పూర్తి పట్ల గ్రామస్థులు అభినందనలు తెలిపారు.


 

 



 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...