Followers
శ్రీకాళహస్తి సంకల్పానికి ముందుకు రండి
కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం - ప్రధాన వైద్యులతో మంత్రుల సమీక్ష
కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం - ప్రధాన వైద్యులతో మంత్రుల సమీక్ష
( నెల్లూరు జిల్లా రిపోర్టర్, పెన్ పవర్ గోశాల ప్రసాద్ )
కరోనా వైరస్ పై అధికారులతో పాటూ తామూ అప్రమత్తంగా ఉన్నామని మంత్రులు డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం వారు నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు. వారితో పాటూ జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు, జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్, కోవిడ్ నోడల్ అధికారి బాపిరెడ్డి కూడా ఉన్నారు. కళాశాల పరిశీలన అనంతరం మంత్రులు ప్రధాన వైద్యులతో సమావేశమయ్యారు. కరోనా వైరస్ రోగులకు అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. ఐసోలేషన్ వార్డుల్లో సదుపాయాలను పెంచాలని సూచించారు. ఇప్పటికే 32 పాజిటివ్ కేసులు ఉన్నాయని చెబుతూ ఇంకా ఎన్ని రిపోర్టులు రావల్సి ఉందని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్షలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
లాక్ డౌన్ నేపథ్యంలో పెద్ద మనసు చాటుకున్న ఓ కళింగాంధ్ర కుటుంబం
పేదల పక్షపాతి సిఎం జగన్
పేదల పక్షపాతి సిఎం జగన్
ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
పెన్ పవర్, నర్సీపట్నం
కష్టాల్లో ఉన్న పేదప్రజలను ఆదుకునేందుకే జగన్మోహన్ రెడ్డి ఏర్పడిందని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఇంటింటికీ వెయ్యి రూపాయలు పంపిణీ నాతవరం మండలం ములగపూడి నుండి ఆయన ప్రారంబించారు. గడపగడపకు వెళ్ళి ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు 8,24,72,000/- పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో, పేద ప్రజల ఇబ్బందులను గుర్తించి రేషన్ డిపోల ద్వారా బియ్యం, పప్పులు అందజేశారని, ఇప్పుడు చేతి ఖర్చుల కోసం తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో 78 సచివాలయాల పరిధిలో 82,472 రేషన్ కార్డులు ఉన్నాయని, ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున 8,24,72,000/- పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ మరికొద్ది రోజుల పాటు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ములగపూడిలో జరిగిన కార్యక్రమంలో అంకంరెడ్డి జమ్మీలు, సుర్ల సత్యన్నారాయణ, మండల వైసిపి నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎగుమతి, దిగుమతి దార్లకు పలు సౌకర్యాలు
విశాఖపట్నం, పెన్ పవర్
విశాఖ జోనల్ కస్టమ్స్ ఛీఫ్ కమీషనర్ నరేష్ పెనుమాక, విశాఖ కస్టమ్స్ ప్రిన్సిపల్ కమీషనర్ డా. డి.కె.శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ లో ఎగుమతి, దిగుమతి దార్లకు పలు సౌకర్యాలు
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టులలో సౌలభ్యము కోసం కస్టమ్స్ శాఖ నోడల్ ఆఫీసర్ల నియామకం. ఆంధ్రప్రదేశ్ జోన్‌లో అన్ని పోర్టుల నుండి ఎగుమతి, దిగుమతుదార్ల సౌలభ్యము కోసం కస్టమ్స్ నోడల్ ఆఫీసర్ల నియామకం. జాయింట్ కమీషనర్, జె.ఎమ్.కిషోర్ నియామకం. విశాఖపట్నం, గన్నవరం, కాకినాడ, కృష్ణపట్నంలో కొనసాగుతున్న ఎగుమతులు, దిగుమతులు . కస్టమ్స్ శాఖ పలు సౌకర్యాలు . త్వరితగతిన ఎగుమతి, దిగుమతికైప్రయత్నాలు . 24/7 అందుబాటులో కస్టమ్స్ అధికారులు
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
నగర పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం ( పెన్ పవర్)
కరోనా లాక్ డౌన్ లో భాగంగా ప్రభుత్వ నిబంధనలను అల్లం గీస్తే కఠిన చర్యలు తప్పవని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా హెచ్చరించారు. శుక్రవారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో నగరంలో ప్రజలు నిబంధనలను తూచా పాటించాలని కోరారు. కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తున్న ప్రజలు సహకరించడం లేదని విచారం వ్యక్తం చేశారు. నిత్యావసరాల కోసం కొంత టైం వెసులుబాటు కల్పిస్తే ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన వాపోయారు. ఈనెల 1వ తేదీ ఆరు గంటల నుంచి రెండవ తేదీ 6 గంటల వరకు 150 కేసులు నమోదు చేశామన్నారు. 3వందల డబ్భై ఎనిమిది మంది అరెస్టు చేశామని తెలిపారు 206 వాహనాలను సీజ్ చేసి అపరాధ రుసుము కూడా వసూలు చేయడం జరిగిందన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. నగరంలో నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని రెండు రోజుల్లోనే 14 చేరాయని అందువల్ల ప్రజలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు ఇళ్ల కే పరిమితం కావాలని ఆర్కె మీనా సూచించారు.
కారోనా వైరస్ సోకి-చేలోనే రాలిపోతున్న పంట
కారోనా వైరస్ సోకి-చేలోనే రాలిపోతున్న పంట.
-దిక్కుతోచని స్థితిలో రైతు.
-రైతులను కుంగదీస్తున్నా కరోనా
పెన్ పవర్ కూనవరం.
ఒక్కసారి భూదేవి తల్లిని పట్టుకొని చూడు భూదేవి తల్లి నిన్ను లాగేసుకుంటుంది, నీవు వదులుదం అనుకున్న నీవే వదలవు అని మహర్షి సినిమాలో రైతు హీరోకు దిశానిర్దేశం చేస్తాడు. వాస్తవంగా రైతు కాడే పట్టి హల్లంను దున్ని వ్యవసాయం చేస్తూ ఆరుగాలం కష్టపడి తాను పెట్టిన పెట్టుబడి రాకపోయినా తాను పట్టిన భూమిని మాత్రం వదలడు రైతు. ఎక్కడో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ వలన రైతు అష్టకష్టాలు పడవలసి పరిస్థితి ఎదురయింది. ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి. కూనవరం, ఎటపాక రెండు మండలాల్లో అధికంగా సాగు చేసే పంట మిర్చి. మిర్చిని కోత కోసే అందుకు రెండు మండలాలకు అధికంగా చత్తీస్ ఘడ్, ఒరిస్సా నుండి అధిక సంఖ్యలో కూలీలు వచ్చి కోత కోసి వెళతారు. వైరస్ వలన రెండు ప్రాంతాల నుండి కూలీలు రాకపోవడం, పక్క మండలాల నుండి కూలీలను రానివ్వకపోవడం, బయటకు వస్తే వైరస్ సోకుతుంది ఏమోనని స్థానికంగా ఉన్న కూలీలు. కళ్ళముందు పంట రాలిపోవడం, ఓవైపు కూలీలు రాకపోవడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక రైతు ఆరవ వెంకట రామారావును పెన్ పవర్ కలవగా కూలీలు రాకపోవడంతో చేతికి అందివచ్చిన పంటంతా చేలోనే నేల రాలుతుందని, ఇదే విధంగా కొనసాగితే కరోనా మహమ్మారి రైతులను దహించివేస్తుందని ఆవేదన వెళ్లగక్కారు. ఎకరాకు సుమారు లక్ష నుంచి లక్షా 20వేల వరకు పెట్టుబడి అవుతుందని, అంతా బాగుంది, గిట్టుబాటు ధర ఉంది అనుకునే సమయంలో మిర్చి రైతును మహమ్మారి వైరస్ కుంగదీసిందని తెలిపారు. రైతులకు అధికారులు సహకరిస్తున్న కూలీలు రాకపోతే వారు మాత్రం ఏమి చేస్తారని అన్నారు. ఇదేవిధంగా పది రోజులు కొనసాగితే రైతు అనేవాడు ఉండని వ్యక్తం చేశారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...