Followers

పేదల పక్షపాతి సిఎం జగన్ 


పేదల పక్షపాతి సిఎం జగన్ 


ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ 


పెన్ పవర్, నర్సీపట్నం 


కష్టాల్లో ఉన్న పేదప్రజలను ఆదుకునేందుకే జగన్మోహన్ రెడ్డి ఏర్పడిందని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఇంటింటికీ వెయ్యి రూపాయలు పంపిణీ నాతవరం మండలం ములగపూడి నుండి ఆయన ప్రారంబించారు. గడపగడపకు వెళ్ళి ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు 8,24,72,000/-  పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో, పేద ప్రజల ఇబ్బందులను గుర్తించి రేషన్ డిపోల ద్వారా బియ్యం, పప్పులు అందజేశారని, ఇప్పుడు చేతి ఖర్చుల కోసం తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో 78 సచివాలయాల పరిధిలో 82,472 రేషన్ కార్డులు ఉన్నాయని, ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున 8,24,72,000/-  పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ మరికొద్ది రోజుల పాటు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని,  ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ములగపూడిలో జరిగిన కార్యక్రమంలో అంకంరెడ్డి జమ్మీలు, సుర్ల సత్యన్నారాయణ, మండల వైసిపి నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.


ఆంధ్రప్రదేశ్‌ లో ఎగుమతి, దిగుమతి దార్లకు పలు సౌకర్యాలు


విశాఖపట్నం, పెన్ పవర్


 


విశాఖ జోనల్‌ కస్టమ్స్‌ ఛీఫ్‌ కమీషనర్‌ నరేష్‌ పెనుమాక, విశాఖ కస్టమ్స్‌ ప్రిన్సిపల్‌ కమీషనర్‌ డా. డి.కె.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్‌ లో ఎగుమతి, దిగుమతి దార్లకు పలు సౌకర్యాలు 
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టులలో సౌలభ్యము కోసం  కస్టమ్స్‌ శాఖ నోడల్‌ ఆఫీసర్ల నియామకం. ఆంధ్రప్రదేశ్‌ జోన్‌లో అన్ని పోర్టుల నుండి ఎగుమతి, దిగుమతుదార్ల సౌలభ్యము కోసం కస్టమ్స్‌ నోడల్‌ ఆఫీసర్ల నియామకం. జాయింట్‌ కమీషనర్‌, జె.ఎమ్‌.కిషోర్‌ నియామకం. విశాఖపట్నం, గన్నవరం, కాకినాడ, కృష్ణపట్నంలో కొనసాగుతున్న ఎగుమతులు, దిగుమతులు . కస్టమ్స్‌ శాఖ పలు సౌకర్యాలు   . త్వరితగతిన ఎగుమతి, దిగుమతికైప్రయత్నాలు . 24/7 అందుబాటులో కస్టమ్స్‌ అధికారులు


నిబంధనలు అతిక్రమిస్తే  చట్టపరమైన చర్యలు తప్పవు.

 



నిబంధనలు అతిక్రమిస్తే  చట్టపరమైన చర్యలు తప్పవు.



  నగర పోలీస్ కమిషనర్  ఆర్కె మీనా.



స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం ( పెన్ పవర్)


కరోనా లాక్ డౌన్  లో భాగంగా ప్రభుత్వ నిబంధనలను అల్లం గీస్తే  కఠిన చర్యలు తప్పవని  విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా హెచ్చరించారు. శుక్రవారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో  నగరంలో ప్రజలు  నిబంధనలను తూచా పాటించాలని  కోరారు. కరోనా మహమ్మారి  నియంత్రణలో భాగంగా  కట్టుదిట్టమైన  చర్యలు అమలు చేస్తున్న  ప్రజలు సహకరించడం లేదని  విచారం వ్యక్తం చేశారు. నిత్యావసరాల కోసం కొంత టైం వెసులుబాటు కల్పిస్తే ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన వాపోయారు.  ఈనెల 1వ తేదీ  ఆరు గంటల నుంచి రెండవ తేదీ 6 గంటల వరకు 150 కేసులు నమోదు చేశామన్నారు.  3వందల డబ్భై ఎనిమిది మంది  అరెస్టు చేశామని తెలిపారు 206 వాహనాలను సీజ్ చేసి అపరాధ రుసుము కూడా వసూలు చేయడం జరిగిందన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. నగరంలో నిబంధనలు  అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.  జిల్లాలో కరోనా కేసులు  పెరుగుతున్నాయని  రెండు రోజుల్లోనే 14 చేరాయని   అందువల్ల  ప్రజలు  ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు ఇళ్ల కే పరిమితం కావాలని ఆర్కె మీనా సూచించారు.


కారోనా వైరస్ సోకి-చేలోనే రాలిపోతున్న పంట

 



కారోనా వైరస్ సోకి-చేలోనే రాలిపోతున్న పంట.                          


-దిక్కుతోచని స్థితిలో రైతు.                


-రైతులను కుంగదీస్తున్నా కరోనా


పెన్ పవర్ కూనవరం.


ఒక్కసారి భూదేవి తల్లిని పట్టుకొని చూడు భూదేవి తల్లి నిన్ను లాగేసుకుంటుంది, నీవు వదులుదం అనుకున్న నీవే వదలవు అని మహర్షి సినిమాలో రైతు హీరోకు దిశానిర్దేశం చేస్తాడు. వాస్తవంగా రైతు కాడే పట్టి హల్లంను దున్ని వ్యవసాయం చేస్తూ ఆరుగాలం కష్టపడి తాను పెట్టిన పెట్టుబడి రాకపోయినా తాను పట్టిన భూమిని మాత్రం వదలడు రైతు. ఎక్కడో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ వలన రైతు అష్టకష్టాలు పడవలసి పరిస్థితి ఎదురయింది. ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితి. కూనవరం, ఎటపాక రెండు మండలాల్లో  అధికంగా సాగు చేసే పంట మిర్చి. మిర్చిని కోత కోసే అందుకు రెండు మండలాలకు అధికంగా చత్తీస్ ఘడ్, ఒరిస్సా నుండి అధిక సంఖ్యలో కూలీలు వచ్చి కోత కోసి వెళతారు. వైరస్ వలన రెండు ప్రాంతాల నుండి కూలీలు రాకపోవడం, పక్క మండలాల నుండి కూలీలను రానివ్వకపోవడం, బయటకు వస్తే వైరస్ సోకుతుంది ఏమోనని స్థానికంగా ఉన్న కూలీలు. కళ్ళముందు పంట రాలిపోవడం, ఓవైపు కూలీలు రాకపోవడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక రైతు ఆరవ వెంకట రామారావును పెన్ పవర్ కలవగా కూలీలు రాకపోవడంతో చేతికి అందివచ్చిన పంటంతా చేలోనే నేల రాలుతుందని, ఇదే విధంగా కొనసాగితే కరోనా మహమ్మారి రైతులను దహించివేస్తుందని ఆవేదన వెళ్లగక్కారు. ఎకరాకు సుమారు లక్ష నుంచి లక్షా 20వేల వరకు పెట్టుబడి అవుతుందని, అంతా బాగుంది, గిట్టుబాటు ధర ఉంది అనుకునే సమయంలో  మిర్చి రైతును మహమ్మారి వైరస్ కుంగదీసిందని తెలిపారు. రైతులకు అధికారులు సహకరిస్తున్న కూలీలు రాకపోతే వారు మాత్రం ఏమి చేస్తారని అన్నారు. ఇదేవిధంగా పది రోజులు కొనసాగితే రైతు అనేవాడు ఉండని వ్యక్తం చేశారు.


రబీలో రికార్డు స్థాయిలో వరి సాగు..


 


    రబీలో రికార్డు స్థాయిలో వరి సాగు..


జిల్లా వ్యాప్తంగా 1221 కొనుగోలు కేంద్రాలు..


15 లక్షల  95 వేల741 మెట్రిక్ టన్నుల  వరి ధాన్యం  దిగుబడి అంచనా..


రైతులకు ఇబ్బందులు కలుగకుండా టోకెన్లు...


వ్యవసాయ అధికారులు ,రైతు సమన్వయంతో పని చేయాలి.


   ----: మంత్రి గంగుల కమలాకర్


కరీంనగర్, పెన్ పవర్


కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రబి లో  రికార్డు స్థాయిలో  2019 -20 కి గాను 7 లక్షల 92 వేల 576 ఎకరాలలో  వరి సాగు చేయడం జరిగిందని , సుమారు 15 లక్షల 95వేల 741 మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి రావొచ్చునని అంచనా వేయడం జరిగింది ని ,ఇందుకు గాను 1221 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ ప్రకటన లో పేర్కొన్నారు...


గత సంవత్సరo 2018-19 రబి (వేసవికాలం)లో 3లక్షల 72 వేల 842 ,ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణంలో  9 లక్షల 14 వేల 490 మెట్రిక్ టన్నుల  వరి సాగు దిగుబడి వచ్చిందని , దిగుబడి కి తగ్గట్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 933 వరిధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు...


రబీలో ధాన్యం కొనుగోళ్లు పగడ్బంధీగా చేపట్టాలని ,రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.. దిగుబడికి తగ్గట్లుగా ప్రతి గ్రామంలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేషామనిఅన్నారు..రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు...
                                                                                                                                                                       
  కరోనా వైరస్ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా లో అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేయాలని  ఆదేశించారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద  పరిశుభ్రత పాటించడం తో పాటు మంచి నీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని, కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందు అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నందున వరి ధాన్యం తడవకుండా ఉండెందుకు టార్ఫాలిన్ ను అందుబాటులో ఉంచాలని ఆయన అన్నారు.  ముఖ్యంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించే ఏర్పాట్లు చేయాలని అన్నారు... అన్ని గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే కొనుగోలు చేసి సాధ్యమైనంత వరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆయా గ్రామాల్లోనే నిలువ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని, ధాన్యం కొనుగోలు సందర్బంలో ఎక్కువ మంది వచ్చిన సందర్భంలో దూరం దూరం పాటిస్తూ రెండేసి కాంటాలు ఏర్పాటు చేసి తూకం వేయాలని ఆయన అధికారులకు సూచించారు. అంతేగాక రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం రైతుల పూర్తి వివరాలు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా రిజిష్టర్లలో నమోదు చేయాలని పేర్కొన్నారు.. రైతులకు టోకెన్ లజారి ప్రక్రియ ను వ్యవసాయ అధికారులు ,రైతు సమన్వయ సమితి సభ్యులకు అప్పగించడం జరిగిందని వారు సమన్వయం తో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు..


1400 కుటుంబాలకు కూరగాయలు, గుడ్లు, పంపిణీ చేసిన,బూరుగుపాలెం, వైఎస్ ఆర్ నాయకులు.


1400 కుటుంబాలకు కూరగాయలు, గుడ్లు, పంపిణీ చేసిన,బూరుగుపాలెం, వైఎస్ ఆర్ నాయకులు.



మాకవరపాలెం. పెన్ పవర్


 


మండలంలో బూరుగుపాలెం, అప్పన్నదొరపాలెం,తాడపాల, పంచాయతీల  పరిధిలోని   గ్రామాలలోని 1400 కుటుంబాలకు వైయస్సార్ సిపి మండల అధ్యక్షుడు రుత్తల సత్యనారాయణ, మరియు వైఎస్ ఆర్ నాయకులు తమ సొంత నిధులు రూ.లక్షా 20 వేలతో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ   లాక్ డౌన్ కారణంగా గ్రామంలోని ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తమ సొంత నిధులతో ఈ సరుకులు పంపిణీ చేస్తున్నామని, అదేవిధంగా గా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరామని తెలిపారు. ప్రజలకు ఏ విధమైన కష్టమొచ్చినా  ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సహకారంతో ఎప్పుడు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో   పంచాయితీ గ్రామ పెద్దలు వైయస్సార్ సిపి నాయకులు, భీమిరెడ్డి గోవిందరావు,రమణ,నాయుడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మాకవరపాలెంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎల్లంపల్లి వెంకటరమణ 170 మంది పేదలకు ఐదు కిలోల బియ్యం, కిలో ఉల్లిపాయలు పంపిణీ చేశారు.


పట్టాలమ్మ తల్లి కమిటీ అన్నదానం  


పట్టాలమ్మ తల్లి కమిటీ అన్నదానం    


 


పెన్ పవర్ , నర్సీపట్నం 


 


పాములవాక గ్రామం పట్టాలమ్మతల్లి ఆలయకమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం  నర్సీపట్నం వుడా   పెట్రోల్ బంక్ వద్ద అన్నదాన  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి కె.లక్ష్మీ శివ జ్యోతి, టౌన్ సిఐ స్వామి నాయుడు,  కృష్ణా ప్యాలస్ యజమాని బంగారుబాబు పాల్గొని అన్నదానం చేశారు. ఆలయ ధర్మకర్త ఎస్. వి. రమణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి పట్టాలమ్మ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు నర్సీపట్నం పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని, లాక్ డాన్ పూర్తయ్యేవరకు నర్సీపట్నం ప్రాంతంలో అన్నదానం ఏర్పాటు చేస్తామని తెలిపారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...