రబీలో రికార్డు స్థాయిలో వరి సాగు..
జిల్లా వ్యాప్తంగా 1221 కొనుగోలు కేంద్రాలు..
15 లక్షల 95 వేల741 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి అంచనా..
రైతులకు ఇబ్బందులు కలుగకుండా టోకెన్లు...
వ్యవసాయ అధికారులు ,రైతు సమన్వయంతో పని చేయాలి.
----: మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, పెన్ పవర్
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రబి లో రికార్డు స్థాయిలో 2019 -20 కి గాను 7 లక్షల 92 వేల 576 ఎకరాలలో వరి సాగు చేయడం జరిగిందని , సుమారు 15 లక్షల 95వేల 741 మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి రావొచ్చునని అంచనా వేయడం జరిగింది ని ,ఇందుకు గాను 1221 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ ప్రకటన లో పేర్కొన్నారు...
గత సంవత్సరo 2018-19 రబి (వేసవికాలం)లో 3లక్షల 72 వేల 842 ,ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణంలో 9 లక్షల 14 వేల 490 మెట్రిక్ టన్నుల వరి సాగు దిగుబడి వచ్చిందని , దిగుబడి కి తగ్గట్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 933 వరిధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు...
రబీలో ధాన్యం కొనుగోళ్లు పగడ్బంధీగా చేపట్టాలని ,రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.. దిగుబడికి తగ్గట్లుగా ప్రతి గ్రామంలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేషామనిఅన్నారు..రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు...
కరోనా వైరస్ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా లో అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిశుభ్రత పాటించడం తో పాటు మంచి నీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని, కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందు అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నందున వరి ధాన్యం తడవకుండా ఉండెందుకు టార్ఫాలిన్ ను అందుబాటులో ఉంచాలని ఆయన అన్నారు. ముఖ్యంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించే ఏర్పాట్లు చేయాలని అన్నారు... అన్ని గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే కొనుగోలు చేసి సాధ్యమైనంత వరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆయా గ్రామాల్లోనే నిలువ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని, ధాన్యం కొనుగోలు సందర్బంలో ఎక్కువ మంది వచ్చిన సందర్భంలో దూరం దూరం పాటిస్తూ రెండేసి కాంటాలు ఏర్పాటు చేసి తూకం వేయాలని ఆయన అధికారులకు సూచించారు. అంతేగాక రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం రైతుల పూర్తి వివరాలు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా రిజిష్టర్లలో నమోదు చేయాలని పేర్కొన్నారు.. రైతులకు టోకెన్ లజారి ప్రక్రియ ను వ్యవసాయ అధికారులు ,రైతు సమన్వయ సమితి సభ్యులకు అప్పగించడం జరిగిందని వారు సమన్వయం తో పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు..