Followers

మీడియాను సేవలను గుర్తించిన జనసేన బీజేపీ


మీడియాను సేవలను గుర్తించిన జనసేన బీజేపీ..


శానిటైజర్లు, మాస్కులు పంపిణీ 


 


మండపేట, పెన్ పవర్


కరోనా మహమ్మారి పై యుద్ధం ప్రకటించిన ప్పటి నుండి  ప్రభుత్వ యంత్రాంగంతో  పాటు ముఖ్య పాత్ర వహిస్తూ సమాచారాన్ని క్షణాల్లో ప్రపంచానికి చేరవేస్తున్న మీడియా పాత్ర వెలకట్టలేనిదని బీజేపీ , జనసేన నాయకులు కోన సత్యనారాయణ , శెట్టి రవి లు పేర్కొన్నారు.  శుక్రవారం జనసేన , బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో విలేఖరులకు మాస్క్ లు , శానిటైజర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్ డౌన్ ఆరంభం నుండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందిస్తున్న సేవలు ప్రతి పౌరుడు గుర్తించుకోవాలన్నారు.  కరోనా నిరోధానికి ప్రభుత్వం , రాజకీయ పార్టీలు , స్వచ్ఛంద సంస్థల తో పాటు ఇతరులు ఎవరైనా కానీ  సమాజం కోసం చేస్తున్న సేవలను చిత్రీకరించి చక్కటి కథనాల రూపంలో ప్రపంచానికి  తెలియజేస్తున్నారని అన్నారు.  ముఖ్యంగా కరోనా విషయంలో ప్రజలను చైతన్య పరిచి ప్రభుత్వానికి సహకరించడంలో మీడియా చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారు పడుతున్న కష్టానికి గుర్తించి తాము సాయం చేసినట్లు తెలిపారు. అలాగే ప్రతి రోజూ మాదిరిగా పేదలకు ఆహార పొట్లాలను పంచిపెట్టారు. వాసిరెడ్డి అర్జున్ సమకూర్చిన భోజన ప్యాకెట్ లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కోనాల చంద్రబోస్, బొమ్మన సతీష్, సన్మాల ధనరాజ్, పువ్వల  నాని, రమిశెట్టి చిన్న, బండెల ప్రసాద్, ముట్ట రామ్, వనపర్తి చిన్న, వెలగదుర్తి శ్రీను, శెట్టి అవినాష్ నాయుడు, కోనే వీరబాబు, జంగం రామ్ కుమార్, పైడిమళ్ల సతీష్, జక్కా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


లాక్ డౌన్ నిబంధనలను ఉద్యోగులు కూడా పాటించాల్సిందే


లాక్ డౌనను నిబంధనలను ఉద్యోగులు కూడా పాటించాల్సిందే
- విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి, ఐ.పి.ఎస్.,


విజయనగరం, పెన్ పవర్ 


విజయనగరం పట్టణంలో కోవిద్ - 19 వైరస్ పై పోరాటానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌను నిబంధనలను
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు, ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి
02-04-2020 ది, శుక్రవారం నాడు స్పష్టం చేసారు. 


కోవిద్ 19 వైరస్ వ్యాప్తి, కరోనా వ్యాధి ప్రబలకుం డా
ఉండేందుకే లాక్ డౌన్ ను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. లాక్ డౌన్ నిబంధనలు అందరికీ వర్తిస్తాయని, ఎవరు నిబంధనలను ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ
హెచ్చరించారు. 


లాక్ డౌన్ లో ప్రజలు ఇబ్బంది పడకూడదని, వస్తువులను కొనుగోలు చేసుకొనేందుకు సదలింపులను
ఇవ్వడం జరిగిందన్నారు. కానీ, కొంతమంది వ్యక్తులు అవసరమున్నా లేకపోయినా మోటారు సైకిళ్ళుపై ఊరు మీద
తిరుగుతున్నారన్నారు. ఇటువంటి వ్యక్తులను ఇకపై ఉపేక్షించ వద్దని, దొరికిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు
చేయాల్సిందిగా పోలీసు అధికారులును జిల్లా ఎస్పీ ఆదేశించారు.


 లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలను అందించే
శాఖలకు మినహాయింపునివ్వగా చాలా మంది అదే పనిగా ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురు తిరుగుతున్నారన్నారు.
అటువంటి వారి వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆమె అదేశించారు.


 విశాఖపట్నం, శ్రీకాకుళం,
ఒడిస్సా రాష్ట్రాల నుండి విజయనగరం జిల్లాకు వచ్చే అన్ని వాహనాలను అత్యవసర పరిస్తితుల మినహా నిలుపుదల
చేయాలన్నారు. 


అత్యవసర సమయాల్లో మోటారు సైకిల్ పై ఒక్కరు, కారులు, ఆటోల్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలన్నారు. 


చెక్ పోస్టుల వద్ద పని చేసే సిబ్బంది ఏ శాఖకు చెందిన వారైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. లాక్ డౌన్లో ప్రజలకు సేవలందించే పేరుతో చాలా మంది
అవసరం లేకపోయినా తిరుగుతున్నారని, అటువంటి వారిని కూడా నిలిపేయాలన్నారు.


ఎవరికైనా సహాయం చేయాలని,
భోజనాలు సమకూర్చాలన్న ఉద్దేశ్యం ఉంటే సంబంధిత డిఎస్సీ వద్ద ముందుగా అనుమతి పొందాలన్నారు. సంబంధిత
డిఎస్పీ అనుమతించిన సమయంలో, అనుమతించిన నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే వారు సేవా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అదే
విధంగా మోటారు సైకిలుపై ఒక్కరు మాత్రమే ప్రయాణించాల్సిందిగా ఆమె సూచించారు. 


కోవిద్ 19 గురించి అసత్య వార్తలను వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో సర్కులేట్ చేసే వారిపై కేసులు నమోదు చెయ్యాలన్నారు. ఇటువంటి
వార్తల వలన ప్రజలు మరింత భయాందోళనకు గురవుతారన్నారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించి, పోలీసు శాఖకు
సహాయపడాల్సిందిగా ప్రజలను జిల్లా ఎస్సీ కోరారు. అదే విధంగా 100శాతం లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాల్సిందిగాను, నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఆదేశించారు.


కరోనా ని జయించిన 22 ఏళ్ల రాజమండ్రి యువకుడు.


కరోనా ని జయించిన 22 ఏళ్ల రాజమండ్రి యువకుడు.



13 రోజులు చికిత్స అనంతరం కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్ గా నిర్థారణ.



ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు.


రాజమండ్రి, పెన్ పవర్



కరోనా ను జయించిన యువకుడ్ని జిల్లా కలెక్టర్ మురళీదర్ రెడ్డి, ఎస్పీ నయీంఆస్మీ, ప్రజాప్రతినిధులు అభినందించారు. కారోనా పాజిటివ్ వ్యక్తి కి వైద్య సేవలు అందించిన వైద్యులను అభినందించారు అధికారులు వైద్యులకు, అదికారులకు ధన్యవాదాలు తెలిపిన యువకుడు. సకాలంలో ఆసుపత్రి కి వస్తే కరోనాను జయించవచ్చన్న యువకుడు
కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు కోలుకోవటంతో తూర్పుగోదావరి జిల్లాలో సంతోషం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు.


ప్రజలను కాపాడేందుకు పరమేశ్వరుడు, ధన్వంతరీ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి


విజయనగరం, పెన్ పవర్


 


కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు పరమేశ్వరుడు, ధన్వంతరీ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అభిలషించారు. శుక్రవారం నాడు కొత్తగ్రహారం వేంచేసియున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన రుద్ర హోమం, రుద్రాభిషేకం తో పాటు అధర్వణ వేదంలోని ప్రధానమైన క్రిమినాశక సూక్తము, రక్షా జ్ఞ సూక్తము అనుసరించి నిర్వహించిన హోమాలలో ఎమ్మెల్యే కోలగట్ల చేతుల మీదుగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఋత్విక్కులు జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు, భయ నివారణకు ధన్వంతరి మంత్రం మానవాళికి ఎంతో అవసరమన్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా అతలాకుతలమై ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అన్నారు. కనపడే క్రిములు, కనపడని క్రిములు కూడా నాశనం చేసే శక్తి మంత్రానికి ఉందని మన పురాణాలు చెబుతున్నాయి అన్నారు. 30 కేజీల ద్రవ్యాలతో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, అభిషేకాలు ఋత్విక్కులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఉడత కాశీ, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మరియు న్యాయవాది టీవీ శ్రీనివాసరావు, ఆలయ ఈవో కె.వి.రమణ, ఋత్విక్కులు భమిడిపాటి రామ్ కుమార్ శర్మ, భమిడిపాటి రమేష్, కప్పగంతుల ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.


"అభాగ్యులు" పెన్ పవర్ వార్తకు స్పందన


పెన్ పవర్ వార్త కు స్పందన...


 ఏప్రిల్1,2020 న పెన్ పవర్ ఉత్తరాంధ్ర జిల్లా ఎడిషన్ లో ప్రచురణ అయిన అభాగ్యులు... స్టోరీ పై వివరణ


(బ్యూరో రిపోర్ట్ విజయనగరం, పెన్ పవర్)


  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం కోవిడ్ 19 నివారణ, నియంత్రణ చర్యలలో భాగంగా కొనసాగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలు, వలస కూలీలు, నిరాశ్రయులు,బిచ్చగాళ్ళు,మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చి నగరంలో ఉండిపోయిన వారి సౌకర్యార్థం ప్రత్యేక వసతి గృహాలను ఈ క్రింది ప్రాంతాలలో ఏర్పాటు చేయడమైనదని నగర పాలక సంస్థ కమీషనర్ ఎస్.ఎస్.వర్మ ఓ ప్రకటన లో తెలిపారు. ఇట్టి వసతిగృహాలలో ప్రతి ఒక్కరికి వసతి మరియు భోజన సదుపాయం కల్పించడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలసిందిగా తెలియజేయడమైనదన్నారు. 
వసతిమరియుభోజన సదుపాయాల కేంద్రాల వివరాలు :
1) పట్టణం నిరాశ్రయుల పునరావాస కేంద్రం, అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎదురుగా, విజయనగరం .
2) పైడితల్లి అమ్మవారి దేవస్థానం,విజయనగరం.


ఆకలితో అలమటిస్తున్న అనాధలను ఆదుకోండి


రెక్కాడితే గానీ డొక్కాడని..ఆకలితో అలమటిస్తున్న అనాధలను ఆదుకోండి... మాల యువత కన్వీనర్ దాసరి రంగనాథ్ .


విజయవాడ, పెన్ పవర్


  పెనమలూరు మండలం  కామయ్యతోపులో  శుక్రవారం లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లో నుండి బయట పనులకు వెళ్లలేని పరిస్థితిలో , రెక్కాడితే డొక్కాడని నిరుపేదలకు పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో సామాజిక కార్యకర్త మాల యువత కన్వీనర్ దాసరి రంగనాథ్ గ్రామ నాయకులు కలుపుకుని నిరుపేదలైన వాళ్ల దగ్గరికి వెళ్లి ఆహార పొట్లాలను అందించాము. 


ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నెరవేర్చాలని కోరారు . నిలువ నీడలేని ఇలాంటి అనాధలను ప్రభుత్వం ఆదుకొని , వారిని కరోనా వైరస్ నుంచి విముక్తి కలిగించి పౌష్టిక ఆహారము అందించాలని దాతలు కూడా ఈ సమయంలో ముందుకు రావాలని కొనియాడారు .


ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ నూతలపాటి శివ , టిడిపి నాయకులు కోండ్రు కోటేశ్వరావు , దళిత నాయకులు కొక్కిరిగడ్డ శ్యామ్ , రజిక నాయకులు రాచకొండ రాము తదితరులు పాల్గొన్నారు .


విశాఖ మన్యంలో ఐదేళ్ల చిన్నారిపై అమానుషం

విశాఖ మన్యంలో ఐదేళ్ల చిన్నారిపై అమానుషం.


 
పాడేరు, (పెన్ పవర్):


అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై విశాఖ మన్యంలో సభ్య సమాజం తలదింతుకునే అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రశాంతతకు నిలయం అయిన మన్యంలో మానవ మృగాల సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. హుకుంపేట మండలం మాసాడ గ్రామ సమీపంలో గల గొందువలస గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై కొండబాబు(50) అనే మానవ మృగం కాటేశాడు. తినుబండారాలు ఆశ చూపి సమీపంలోగల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచార ప్రయత్నం చేసాడు. పాప కనిపించకపోవడంతో వెతుకుతున్న తల్లికి పొదల చాటున ఏడుస్తూ కూతురు కనిపించింది.
 దీంతో అక్కడి చేరుకున్న తల్లికి మానవ మృగం అయినా 
కొండ బాబు కూతురుపై వెకిలి చేష్టలు చేస్తూ ఉండటం గమనించిన తల్లి
 కొండబాబు కు దేహశుద్ధి చేయడంతో పారిపోయాడు. కూతురు ఎంతకీ ఏడుపు ఆగకపోవడంతో ఏమైందని గమనించిన తల్లికి 
 పాపకు రక్తస్రావం అవడం గమనించి... తల్లి లబోదిబోమంటూ ఏడూస్తుంటే 
ఏమైంది అంటూ వచ్చిన గ్రామస్తులకు విషయం తెలియ పరిచింది. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు ఈ మానవ మృగాన్ని వెతికి పట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న ఎస్సై అప్పలనాయుడు ఎం డి ఓ  ఇమ్మానియేల్ వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా మనీషా వైద్య పరీక్షల నిమిత్తం ఎస్సై అప్పలనాయుడు ఆంబులెన్స్ రప్పించి. పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై మనిషా తల్లి మాట్లాడుతూ తన కూతురు కి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.అలాగే మానవ హక్కుల పరిరక్షణ ప్రతినిధి 
తపుల కృష్ణారావు మాట్లాడుతూ మన్యం లో ఇలాంటి మానవ మృగల సంఘటనలు జరగటం బాధాకరమని. తక్షణమే ఈ మానవ మృగాన్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...