Followers

"అభాగ్యులు" పెన్ పవర్ వార్తకు స్పందన


పెన్ పవర్ వార్త కు స్పందన...


 ఏప్రిల్1,2020 న పెన్ పవర్ ఉత్తరాంధ్ర జిల్లా ఎడిషన్ లో ప్రచురణ అయిన అభాగ్యులు... స్టోరీ పై వివరణ


(బ్యూరో రిపోర్ట్ విజయనగరం, పెన్ పవర్)


  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం కోవిడ్ 19 నివారణ, నియంత్రణ చర్యలలో భాగంగా కొనసాగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలు, వలస కూలీలు, నిరాశ్రయులు,బిచ్చగాళ్ళు,మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చి నగరంలో ఉండిపోయిన వారి సౌకర్యార్థం ప్రత్యేక వసతి గృహాలను ఈ క్రింది ప్రాంతాలలో ఏర్పాటు చేయడమైనదని నగర పాలక సంస్థ కమీషనర్ ఎస్.ఎస్.వర్మ ఓ ప్రకటన లో తెలిపారు. ఇట్టి వసతిగృహాలలో ప్రతి ఒక్కరికి వసతి మరియు భోజన సదుపాయం కల్పించడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలసిందిగా తెలియజేయడమైనదన్నారు. 
వసతిమరియుభోజన సదుపాయాల కేంద్రాల వివరాలు :
1) పట్టణం నిరాశ్రయుల పునరావాస కేంద్రం, అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎదురుగా, విజయనగరం .
2) పైడితల్లి అమ్మవారి దేవస్థానం,విజయనగరం.


ఆకలితో అలమటిస్తున్న అనాధలను ఆదుకోండి


రెక్కాడితే గానీ డొక్కాడని..ఆకలితో అలమటిస్తున్న అనాధలను ఆదుకోండి... మాల యువత కన్వీనర్ దాసరి రంగనాథ్ .


విజయవాడ, పెన్ పవర్


  పెనమలూరు మండలం  కామయ్యతోపులో  శుక్రవారం లాక్ డౌన్ సందర్భంగా ఇంట్లో నుండి బయట పనులకు వెళ్లలేని పరిస్థితిలో , రెక్కాడితే డొక్కాడని నిరుపేదలకు పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో సామాజిక కార్యకర్త మాల యువత కన్వీనర్ దాసరి రంగనాథ్ గ్రామ నాయకులు కలుపుకుని నిరుపేదలైన వాళ్ల దగ్గరికి వెళ్లి ఆహార పొట్లాలను అందించాము. 


ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నెరవేర్చాలని కోరారు . నిలువ నీడలేని ఇలాంటి అనాధలను ప్రభుత్వం ఆదుకొని , వారిని కరోనా వైరస్ నుంచి విముక్తి కలిగించి పౌష్టిక ఆహారము అందించాలని దాతలు కూడా ఈ సమయంలో ముందుకు రావాలని కొనియాడారు .


ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ నూతలపాటి శివ , టిడిపి నాయకులు కోండ్రు కోటేశ్వరావు , దళిత నాయకులు కొక్కిరిగడ్డ శ్యామ్ , రజిక నాయకులు రాచకొండ రాము తదితరులు పాల్గొన్నారు .


విశాఖ మన్యంలో ఐదేళ్ల చిన్నారిపై అమానుషం

విశాఖ మన్యంలో ఐదేళ్ల చిన్నారిపై అమానుషం.


 
పాడేరు, (పెన్ పవర్):


అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై విశాఖ మన్యంలో సభ్య సమాజం తలదింతుకునే అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రశాంతతకు నిలయం అయిన మన్యంలో మానవ మృగాల సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. హుకుంపేట మండలం మాసాడ గ్రామ సమీపంలో గల గొందువలస గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై కొండబాబు(50) అనే మానవ మృగం కాటేశాడు. తినుబండారాలు ఆశ చూపి సమీపంలోగల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచార ప్రయత్నం చేసాడు. పాప కనిపించకపోవడంతో వెతుకుతున్న తల్లికి పొదల చాటున ఏడుస్తూ కూతురు కనిపించింది.
 దీంతో అక్కడి చేరుకున్న తల్లికి మానవ మృగం అయినా 
కొండ బాబు కూతురుపై వెకిలి చేష్టలు చేస్తూ ఉండటం గమనించిన తల్లి
 కొండబాబు కు దేహశుద్ధి చేయడంతో పారిపోయాడు. కూతురు ఎంతకీ ఏడుపు ఆగకపోవడంతో ఏమైందని గమనించిన తల్లికి 
 పాపకు రక్తస్రావం అవడం గమనించి... తల్లి లబోదిబోమంటూ ఏడూస్తుంటే 
ఏమైంది అంటూ వచ్చిన గ్రామస్తులకు విషయం తెలియ పరిచింది. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు ఈ మానవ మృగాన్ని వెతికి పట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న ఎస్సై అప్పలనాయుడు ఎం డి ఓ  ఇమ్మానియేల్ వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా మనీషా వైద్య పరీక్షల నిమిత్తం ఎస్సై అప్పలనాయుడు ఆంబులెన్స్ రప్పించి. పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై మనిషా తల్లి మాట్లాడుతూ తన కూతురు కి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.అలాగే మానవ హక్కుల పరిరక్షణ ప్రతినిధి 
తపుల కృష్ణారావు మాట్లాడుతూ మన్యం లో ఇలాంటి మానవ మృగల సంఘటనలు జరగటం బాధాకరమని. తక్షణమే ఈ మానవ మృగాన్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.


దాతృత్వం చాటుకున్న సీఐ


ఎస్.కోట, పెన్ పవర్


విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం నిమ్మలపాడు శిఖర గ్రామం నుండి కొంత మంది గిరిజన మహిళలు విశాఖపట్నం వెళ్లేందుకు గాను చంటి పిల్లల తో రోడ్డు మార్గం గుండా తే. 03-04-2020 దిన ఎస్. కోట మీదుగా కాలి నడకన  వెళుతుండగా విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వారికి ఎస్.కోట  సిఐ శ్రీనివాసరావు  ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి, మాస్క్ లు అందించి, భోజన, వాహన సౌకర్యాలను కల్పించి, వారిని విశాఖపట్నంలో దింపేందుకుగాను వాహనాన్ని సమకూర్చి పంపారు.


ఏప్రిల్ 5న రాత్రి 9 గంట‌ల‌కు దీపాలు వెలిగించండి :  ప్ర‌ధాని మోదీ


ఏప్రిల్ 5న రాత్రి 9 గంట‌ల‌కు దీపాలు వెలిగించండి :  ప్ర‌ధాని మోదీ


న్యూస్ డెస్క్, పెన్ పవర్


ప్ర‌ధాని మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు.  130 కోట్ల మంది ప్ర‌జ‌ల సామూహిక శ‌క్తి.. ప్ర‌తి ఒక్క‌రిలో క‌నిపించింద‌న్నారు. దేశ‌మంతా ఒక్క‌టై క‌రోనాపై పోరాటం చేసింద‌న్నారు.  ప్ర‌జ‌లు ఈశ్వ‌ర స్వ‌రూప మ‌న్నారు.  కోట్లాది మంది ప్ర‌జ‌లు ఇండ్ల‌ల్లో ఉన్నార‌న్నారు.  క‌రోనాతో ఏర్ప‌డిన నిరాశ నుంచి ఆశ వైపు ప్ర‌జ‌ల్ని తీసుకువెళ్లాల‌న్నారు.  క‌రోనాతో ఏర్ప‌డిన అంధ‌కారాన్ని పోగొట్టేందుకు దివ్య వెలుగుల్ని ప్ర‌స‌రింప‌చేయాల‌న్నారు.  ఏప్రిల్ 5వ తేదీన‌.. 130 కోట్ల మంది ప్ర‌జ‌లు మ‌హాశ‌క్తి జాగ‌ర‌ణ చేయాల‌న్నారు.  దేశ ప్ర‌జ‌లు మ‌హాసంక‌ల్పాన్ని ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఇంట్లో లైట్లు బంద్ చేసి.. దీపాల‌ను వెలిగించాల‌న్నారు. కేవ‌లం 9 నిమిషాల స‌మ‌యాన్ని కేటాయించాల‌న్నారు. టార్చ్‌లైట్ అయినా.. దీపం అయినా వెలిగించాల‌న్నారు.  ఆ ప్ర‌కాశంతో అంధ‌కారాన్ని పార‌ద్రోలాల‌న్నారు.  మేం ఒంట‌రిగా లేమ‌న్న సందేశాన్ని వినిపించాల‌న్నారు.  ఎవ‌రూ కూడా రోడ్ల‌పై వెళ్ల‌కూడ‌ద‌న్నారు.  సామాజిక దూరాన్ని ఎప్పుడూ ఉల్లంఘించ‌కూడ‌ద‌న్నారు. క‌రోనా సైకిల్‌ను బ్రేక్ చేసేందుకు ఇదొక్క‌టే మార్గ‌మ‌ని ప్ర‌ధాని తెలిపారు.  5వ తేదీన ఒంట‌రిగా కూర్చుని మ‌హాభ‌ర‌తాన్ని గుర్తు చేసుకోండ‌న్నారు. 130 కోట్ల ప్ర‌జ‌ల సంక‌ల్పాన్ని ఆలోచించాల‌న్నారు.  గెల‌వాల‌న్న ఆత్మ‌విశ్వాసాన్ని నింపుకోవాల‌న్నారు.  మ‌న ఉత్సాహాన్ని మించిన శ‌క్తి ఏదీ లేద‌న్నారు. ఈ ప్ర‌పంచంలో మ‌న‌శ‌క్తితో జ‌యించ‌లేనిది ఏదీ లేద‌న్నారు.


ప్రజలకు శానిటైజర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి 


ప్రజలకు శానిటైజర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి 


నెల్లూరు, పెన్ పవర్


               నెల్లూరు రూరల్ నియోజక ప్రజలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శానిటైజర్లు పంపిణీ చేసారు. బుధవారం నియోజక వర్గంలోని పలు ప్రాంతాలకు వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. కూరగాయల కొనుగోలుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. అంతే కాకుండా వివిధ ప్రాంతాల్లో 5 వేల శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా సంక్షోభ సమయంలో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనవెంట AMC ఛైర్మెన్ ఎంబేటి ఏసు నాయుడు, మిద్దె మురళీ కృష్ణా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


నెల్లూరు జిల్లాలో కోరలు చాచిన కరోనా 


నెల్లూరు జిల్లాలో కోరలు చాచిన కరోనా 


తాజాగా 17 పాజిటివ్ కేసులు నమోదు 


    నెల్లూరు, పెన్ పవర్                                 


నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ కోరలు చాస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ వైరస్ తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇవాళ విడుదల చేసిన కరోనా పరీక్షల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి 17 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ 17 కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 20 కి చేరింది. 20 కేసుల్లో ఇటలీ నుండి వచ్చిన నెల్లూరు యువకుడు వైరస్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. మిగిలిన 19 మంది నెల్లూరు జీజీహెచ్ లోని ఐసోలేషన్ వార్డు లో చికిత్స పొందుతున్నారు. నిన్న వెలుగు చూసిన రెండు కేసులతో పాటూ తాజాగా వెలుగు చూసిన 17 కేసులకు సంబంధీన వారంతా డిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. 


ఇవాళ కేసులకు సంబంధించి నెల్లూరు నగరానికి చెందిన 10 మంది, నాయుడుపేటలో ముగ్గురు, కావలి లో ఇద్దరు, బుచ్చి, ఇందుకూరుపేట లో ఒక్కొక్కరు చొప్పున వైరస్ బారిన పడ్డారు. మరో వైపు ఒకే రోజు 17 కేసులు వెలుగు చూడటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ బాధిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వేకు కలెక్టర్ శేషగిరి బాబు ఆదేశాలు జారీ చేశారు. బాధితులు నివాసం ఉండే ప్రాంతాల్లో శానిటైజేషన్ పనులు చేపడుతున్నారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే రెండు డివిజన్లలో రెడ్ అలెర్ట్ ప్రకటించిన అధికారులు, మిగిలిన ప్రాంతాల్లో కూడా రెడ్ అలెర్ట్ ప్రకటించనున్నారు. పాజిటివ్ కేసుల బాధితులు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరితో సన్నిహితంగా ఉన్నారు అనే విషయాలపై ఆరా తీసే వారిని క్వారయింటెన్ సెంటర్లకు తరలిస్తున్నారు. జిల్లాకు సంబంధించి ఇంకా 213 మంది రిపోర్టులు రావల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...