Followers

ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా చర్య‌లు తీసుకున్నాం


ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా చర్య‌లు తీసుకున్నాం



క‌రోనాకు మందు లేదు...నివార‌ణే మార్గం



త‌ప్ప‌నిస‌రిగా వ్య‌క్తుల‌మ‌ధ్య దూరాన్ని పాటించాలి



4వ తేదీ నుంచి తెల్ల‌కార్డుదారుల‌కు రూ.వెయ్యి పంపిణీ



రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి


 (బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్,  విజ‌య‌న‌గ‌రం)


 


లాక్‌డౌన్ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు ఎటువంటి ఇబ్బందీ ప‌డ‌కుండా ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని ర‌కాల చ‌ర్య‌లనూ తీసుకున్నామ‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి అన్నారు. రైతు బ‌జార్ల వికేంద్రీక‌ర‌ణలో భాగంగా  విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని రాజీవ్ స్టేడియంలో  ఏర్పాటు చేసిన కూర‌గాయ‌ల మార్కెట్‌ను ఆమె శుక్ర‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ప్ర‌జ‌లతో మాట్లాడి కూర‌గాయ‌ల ధ‌ర‌ల‌పై వాకబు చేశారు. కూర‌గాయ‌ల విక్రేత‌ల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. స్థానికుల‌కు మాస్క్‌లు పంపిణీ చేశారు.


             అనంత‌రం ఉప ముఖ్య‌మంత్రి శ్రీ‌వాణి మీడియాతో మాట్లాడారు.  ప్ర‌జ‌లు నిత్యావ‌స‌రాల కోసం ఇబ్బంది ప‌డ‌కుండా జిల్లా యంత్రాంగం అన్ని ర‌కాల చ‌ర్య‌ల‌నూ తీసుకుంద‌ని చెప్పారు. దీనిలో భాగంగానే ప‌ట్ట‌ణంలోని రైతు బ‌జార్ల‌ను వికేంద్రీక‌రించి, ర‌ద్దీ లేకుండా కూర‌గాయాల‌ను ప‌లు ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామ‌న్నారు. అలాగే నిత్యం ధ‌ర‌ల‌ను స‌మీక్షిస్తున్నామ‌ని చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించేవిధంగా మార్కెట్ల‌లో కూడా వెదురు రింగుల‌తో త‌గిన  ఏర్పాటు చేశామ‌ని, అలాగే ర‌క్ష‌ణా చ‌ర్య‌ల‌ను కూడా తీసుకున్నామ‌ని చెప్పారు. ప్ర‌జ‌లు, విక్రేత‌లు ఇబ్బంది ప‌డ‌కుండా త్రాగునీటి సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పించామ‌న్నారు.
         
                      త‌మ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ముఖ్య‌మ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు లాక్‌డౌన్‌ను అమ‌లు చేసిన నేప‌థ్యంలో, పేద‌లు ఇబ్బంది ప‌డ‌కుండా తెల్ల రేష‌న్‌ కార్డు క‌లిగిఉన్న ప్ర‌తీ కుటుంబానికి త‌మ ప్ర‌భుత్వం రూ.1000 అంద‌జేస్తుంద‌ని, ఈ నెల 4వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపారు. ఉచితంగా రేష‌న్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని గ‌త‌నెల 29 నుంచీ ప్రారంభించామ‌ని, ఇప్ప‌టికే దాదాపు 65శాతానికి పైగా పంపిణీ పూర్త‌య్యింద‌ని తెలిపారు. అలాగే వ‌లంటీర్ల ద్వారా సామాజిక పింఛ‌న్లను ఇంటింటికీ పంపిణీ చేసే కార్య‌క్ర‌మం జిల్లాలో తొలిరోజే దాదాపు 93శాతం పూర్తి చేశామ‌ని చెప్పారు. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 3లక్ష‌ల‌, 26వేల మందికి దాదాపు రూ.77కోట్ల రూపాయ‌ల‌ను పింఛ‌న్ రూపంలో పంపిణీ చేసిన‌ట్లు మంత్రి వివ‌రించారు.


                   క‌రోనా నియంత్ర‌ణ‌కు రాష్ట్రప్ర‌భుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకుంద‌ని చెప్పారు. అయితే ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లివ‌చ్చిన వారి వ‌ల్లే రాష్ట్రంలో కూడా అనూహ్యంగా కేసుల సంఖ్య పెరిగింద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, వ్యాధి ఇత‌రుల‌కు వ్యాప్తి చెంద‌కుండా ప్ర‌భుత్వం కృతనిశ్చ‌యంతో ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. ప్ర‌జ‌లు కూడా త‌మ‌వంతుగా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. క‌రోనాకు మందులేద‌ని, నివార‌ణే ఏకైక మార్గ‌మ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. వ్య‌క్తుల‌మ‌ధ్య త‌ప్ప‌నిస‌రిగా దూరాన్ని పాటించాల‌ని, త‌ర‌చూ చేతుల‌ను స‌బ్బుతో క‌డుగుకోవాల‌ని కోరారు. లాక్‌డౌన్ సంద‌ర్భంగా ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని శ్రీ‌వాణి విజ్ఞ‌ప్తి చేశారు.


                     ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్‌కుమార్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్‌వ‌ర్మ‌, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ప్ర‌సాద‌రావు, తాశీల్దార్ జిఎస్ఎన్‌మూర్తి, మార్కెటింగ్ ఎడి శ్యామ్‌కుమార్‌, వైకాపా రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, మార్కెట్‌క‌మిటీ ఛైర్మ‌న్ జ‌మ్ము శ్రీ‌నివాస‌రావు, ఇంకా కెవి సూర్య‌నారాయ‌ణ‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.


నిత్యావసర సరుకులు పంపిణీ







 

 

రంపచోడవరం పెన్ పవర్

 

 ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి నిషాంత్ కుమార్  ఆద్వర్యంలో   రంపచోడవరం జిసిసి వారు అందజేసే నిత్యావసర సరుకులు వారు సమయానికి ప్రజలు ఇబ్బందులు పడకుండా అందజేస్తున్నారా లేదా అని సోమవారం రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామమునకు వెళ్లి తనిఖీలు నిర్వహించి, ప్రజలు ఎక్కువసమయం నిత్యావసర వస్తువులకోసం ఎదురు చూసే పరిస్థితులు రాకుండా వీలైనంత తొందరగా వారికి అందజేసి పంపించావలేనని జిసిసి డివిజనల్ మేనేజర్ కి ఆదేశాలు జారి చేసారు. అలాగే లోతట్టు ప్రాంతాలలో కూడా ఎవరి ఇబ్బందులు కలగకుండా సమయానికి అందజేయాలని ఆదేశించారు. డి.ఆర్. డిపోలకు వచ్చే ప్రజలు గుంపులుగా కాకుండా ఒక మీటరు దూరం లో నిలబడేలా మార్కింగ్ చెయ్యాలని సరుకులకోసం వచ్చిన వాళ్ళందరూ మాస్కులు దరించేల చూడాలని సూచనలిచ్చారు.  అంతే కాకుండా తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు వారి ఆదేశముల మేరకు రాజమండ్రి మరియు రంపచోడవరం డివిజనులకు కోవిడ్-19 (కరోన వైరస్) ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వారిని స్పెషల్ అధికారిగా నియమించినందున రెండు డివిజనులలో ఈ వైరస్ సోకకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందరికి అవగాహన కల్పించటంతో పాటు ఈ వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే ప్రజలు వారి ఇళ్లలోనే ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సంభందిత అధికారులకు ఆదేశాలు జారిచేశారు. జి.ఎస్.ఎల్. రాజానగరం ఆసుపత్రికి స్పెషల్ అధికారిగా నియమించినందున అక్కడ అన్ని వసతులు అందుబాటులో వున్నయలేదా ఇంకేమేనైన అవసరలున్నాయా అని విజిట్ చేసి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. అత్యవసర సేవలకు ఎటువంటి ఇబ్బందులు లేవని, కోవిడ్-19 (కరోన వైరస్) సోకిన రోగులకు అవసరమైన ఏర్పాట్లను చేయడంతో పాటు, ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేయడం జరిగిందని, వారిని చికిత్స నిమిత్తం తీసుకొని వెళ్ళే మార్గమును కూడా చేయడం జరిగిందని తెలియజేసారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజలందరూ సహకరిస్తున్నారని ఇలానే అందరు జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్ నుండి విముక్తి పొందవచ్చునని తెలిపారు. ఇక్కడ పరిస్థితులను ఏరోజుకారోజు కమిషనరు వారికి అందజేస్తూ ఎక్కడ ఎలాంటి అత్యవసర సేవలు అసరమైన తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.


 




 

 


 



 



ధర్మకర్తల ఆధ్వర్యంలో సీతా రాముల కళ్యాణం


 

 

            రావులపాలెం , పెన్ పవర్          

 

 రాష్ట్ర వ్యాప్తంగా కారోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో  రాష్ట్ర ప్రభుత్వం లాక్ డోన్ ప్రకటించడంతో భక్తులెవరు లేకుండా  ఆలయ పూజారులు,  ధర్మకర్తల  ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు.గురువారం రావులపాలెం గ్రామంలో ముసలి రామాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి ఆలయంలో స్వామి వారి కళ్యాణం భక్తులు లేకుండా ఆలయ అర్చకులు జనార్దన కేశవమూర్తి భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఐతే లాక్ డోన్ వలన  మొట్టమొదటిసారి భక్తులు లేకుండా స్వామివారి కల్యాణం నిర్వహించినట్టు ఆలయ కమిటీ చైర్మన్ పోతంశెట్టి కనికిరెడ్డి తెలిపారు.

సంప్ర‌దాయ‌బ‌ద్దంగా రామ‌తీర్ధం సీతారాముల క‌ల్యాణం



సంప్ర‌దాయ‌బ‌ద్దంగా సీతారాముల క‌ల్యాణం
ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన ఎంఎల్ఏ బ‌డ్డుకొండ దంప‌తులు



రామ‌తీర్ధం (విజ‌య‌న‌గ‌రం), పెన్ పవర్ 


 నెల్లిమ‌ర్ల మండ‌లం రామ‌తీర్ధంలోని ప్ర‌సిద్ద పుణ్య‌క్షేత్రం  శ్రీ సీతారామ‌స్వామి ఆల‌యంలో శ్రీ‌రామ న‌వ‌మి వేడుక‌లు క‌న్నుల పండువ‌గా జ‌రిగాయి. సంప్ర‌దాయబ‌ద్దంగా అభిజిత్ ల‌గ్నంలో  సీతారాముల క‌ల్యాణాన్ని చూడ‌ముచ్చ‌ట‌గా నిర్వ‌హించారు.  నెల్లిమ‌ర్ల ఎంఎల్ఏ బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు స‌తీస‌మేతంగా ఈ వేడుక‌ల్లో పాల్గొని, స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. కొద్దిమంది అధికారులు, ఆల‌య పూజారులు మిన‌హా, భ‌క్తుల‌ను వేడుక‌ల‌కు అనుమ‌తించ‌లేదు.


.        క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌టంతో అతికొద్ది మంది అతిధుల న‌డుమ రామ‌తీర్ధంలో శ్రీ‌రామ న‌వ‌మి వేడుక‌ల‌ను గురువారం నిరాడంబంరంగా నిర్వ‌హించారు. సంప్ర‌దాయ బ‌ద్దంగా ప్ర‌భుత్వం త‌ర‌పున ఎంఎల్ఏ బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు శ్రీ‌ సీతారామస్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాల‌ను, ముత్యాల త‌లంబ్రాల‌ను స‌మ‌ర్పించారు. అప్ప‌ల‌నాయుడు దంప‌తుల‌ను ఆల‌య పూజారులు ఆశీర్వ‌దించి, ప్ర‌సాదాన్ని అంద‌జేశారు.


        అనంత‌రం శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని కేవ‌లం ఆల‌య పూజారులు, దేవ‌స్థానం అధికారులు మాత్ర‌మే నిర్వ‌హించారు. స్వామివారికి ప్ర‌భుత్వం స‌మ‌ర్పించిన ప‌ట్టువ‌స్త్రాల‌ను, ముత్యాల త‌లంబ్రాల‌ను అలంక‌రించి వైభ‌వంగా క‌ల్యాణాన్ని జ‌రిపించారు. అదేవిధంగా ఆన‌వాయితీ ప్ర‌కారం సింహాచ‌లం వ‌రాహ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం నుంచి కూడా సీతారామ‌స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు, ముత్యాల త‌లంబ్రాలను దేవ‌స్థానం అధికారులు అంద‌జేశారు.  ఈ వేడుక‌ల‌ను తిల‌కించేందుకు సాధార‌ణ భ‌క్తుల‌ను అనుమ‌తించ‌న‌ప్ప‌టికీ, ఎప్ప‌టిలాగే శాస్త్రోక్తంగా, సంప్ర‌దాయానుసారం వైభ‌వంగా నిర్వ‌హించారు.


        క‌రోనామ‌హమ్మారినుంచి ప్ర‌పంచాన్ని ర‌క్షించాలి: బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, ఎంఎల్ఏ
మాన‌వాళిని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌పంచాన్ని ర‌క్షించాల‌ని ఆ శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిని ప్రార్ధించిన‌ట్లు ఎంఎల్ఏ బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు చెప్పారు. ఆల‌యం వెలుప‌ల ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, క‌రోనాపై నిర్వ‌హిస్తున్న పోరాటంలో కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌కు సీతారాములు అండ‌గా నిల‌వాల‌ని ఆకాంక్షించారు. ప్ర‌భుత్వ ఆదేశాను సారం, క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌లో భాగంగా ఈ ఏడాది అతికొద్ది మంది స‌మక్షంలో రామ‌తీర్ధంలో శ్రీ‌రామ న‌వ‌మి వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకొని భ‌క్తుల‌ను వేడుక‌ల‌కు అనుమ‌తించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, సంప్ర‌దాయానుసారం క‌ల్యాణాన్ని, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను హిందూ ధ‌ర్మాన్ని అనుస‌రించి ఆచార‌, సంప్ర‌దాయాల ప్ర‌కారం వైభ‌వంగా నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని అన్నారు.


      ఈ కార్య‌క్ర‌మంలో సీతారామ‌స్వామివారి దేవ‌స్థానం ఇఓ కిషోర్‌కుమార్‌, ఆల‌య ప్ర‌ధాన పూజారి సాయిరామాచార్యులు, ఇత‌ర ఆల‌య పూజారులు, సింహాచ‌లం దేవ‌స్థానం ఇఓ మారెళ్ల వెంక‌టేశ్వ‌ర్లు, ఆయ‌ల పూజారి గోపాల‌కృష్ణ‌మాచార్యులు, నెల్లిమ‌ర్ల ఎంపిడిఓ రాజ్‌కుమార్ తదిత‌రులు పాల్గొన్నారు.


జర్నలిస్టుల ఐక్యవేధిక ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపిణీ.





 

శ్రీకాకుళం, పెన్ పవర్ 

 

.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో అలుపెరుగని సేవలు అందిస్తున్న... పోలీసులకు...వైద్య ఆరోగ్య శాఖ మరియు మున్సిపల్ కార్మికులు... నిరుపేదలకు గురువారం శ్రీకాకుళం నగరంలో జర్నలిస్టుల ఐక్యవేధిక ఆధ్వర్యంలో ఆహారపోట్లాలు.. మంచినీరు.. మజ్జిగ అందించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లుగా పేరుగాంచిన ఏడురోడ్లు జంక్షన్, అరసవల్లి జంక్షన్.. డే అండ్ నైట్ జంక్షన్...పాతబస్ స్టాండ్ కూడళ్ళు వొద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ మరియు పారిశుద్ధ్య కార్మికులు... నిరుపేదలకు చక్కని ఆహారాన్ని అందించారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా కరోనా విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులు... సిబ్బందికి ఆహార కొరత లేకుండా చేయుటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని జర్నలిస్టుల ఐక్యవేధిక ప్రతినిధులు కొంఖ్యాన వేణుగోపాల్, శాసపు జోగినాయుడు లు చెప్పారు. ప్రతినిత్యం తాజా ఆహారాన్ని అందిస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు రౌతు సూర్యనారాయణ, సీపాన వెంకటరమణ, నేతల అప్పారావు, కొంఖ్యాన శంకర్, భేరి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

 

 



 

ప‌ట్టెడ‌న్నం అదింతే ప‌ట్ట‌నంత సంతోషం



రామ‌న్న అన్న‌దాన క్ర‌తువు లో ఐదో రోజు

యువ ఎంపీని అభినందిస్తున్న  తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు


శ్రీ‌కాకుళం , పెన్ పవర్


భ‌వానీ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ నేతృత్వాన చేప‌ట్టిన రామ‌న్న అన్న‌దాన క్ర‌తువు గురువారంతో నాల్గో రోజుకు చేరుకుం ది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాకౌట్ ప్ర‌క‌టించినందున అన్నార్తుల‌కు, రిమ్స్ రోగుల‌కు ప‌ట్టెడ‌న్నం పె ట్టేందుకు యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు నిర్ణ‌యించారు. ముఖ్యంగా రిమ్స్ రోగులకు వారి స‌హాయ‌కుల‌కు అ న్నం అందక ఆక‌లితో అలమ‌టిస్తున్న వైనం పై ఎంపీ వెనువెంట‌నే స్పందించి క‌లెక్ట‌ర్ తో చ‌ర్చించి త‌న త‌ర‌ఫున వారిని ఆదుకు నేందుకు ఈ క్ర‌తువుకు శ్రీ‌కారం దిద్దారు. రామ‌సేన స‌భ్యులు, ప్ర‌జాసద‌న్ నిర్వాహ‌కుల స‌మ‌ష్టి కృషితో గ‌డిచిన మూడు రోజులూ వీరు అందిం చిన భోజ‌న‌మే వారి ఆక‌లి తీర్చింది. ముఖ్యంగా బుధ‌వారం నుంచి రాత్రి వేళల్లో కూడా భోజ‌నం అందించేందుకు ఎంపీ రామూ నిర్ణ యించ‌డంతో ఇంకాస్త స‌మ‌స్య ప‌రిష్కారం అయింది. దీంతో రోగులూ, అన్నార్తులూ ఆనందం వ్య‌క్తం చేశారు. తమ గోడు ఎవ్వ‌రికీ ప ట్ట‌ని నేప‌థ్యాన ఎంపీ రామూ ఆదుకోవ‌డం ఎంతో అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ రామూ మాట్లా డుతూ దేశ వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోల వాతావర‌ణం  ఉన్నందున నిరాశ్ర‌యులకూ, అన్నార్తులకూ ఈ పండుగ వేళ పట్టెడ‌న్నం పెట్ట‌డం త‌న‌కెంతో ఆ నందంగా ఉంద‌ని చెప్పారు. అంద‌రికీ శ్రీ‌రామ న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు. 


 

 

కాళ్ల పోలీస్స్టేషన్లో  కరోనా కలకలం ...   


 

పెన్ పవర్, భీమవరం

 

 

భీమవరం రూరల్ పరిధిలోని కాళ్ల పోలీస్స్టేషన్లో కరోనా కలకలం రేగింది.  పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్  ఇటీవల ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి రావడంతో అతని కుమారునికి కరుణ పాజిటివ్  వచ్చింది.  దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు.  స్టేషన్ లోని 19   మంది సిబ్బందిని  హోం  క్వారెంటైన్  కు పంపారు.  మొత్తం మీద ఢిల్లీ జమాతే   ప్రార్థనలు  జిల్లా ప్రజలను భయా భ్రాంతులకు గురి చేశాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...