Followers

ఢిల్లీ కరోనా కలకలం తో పరుగులు తీస్తున్న నాయకులు అధికారులు







                    పరవాడ, పెన్ పవర్

 

ఢిల్లీ జమాత్ కు వెళ్లి వచ్చిన రబ్బానీ అనే వ్యక్తి శుక్రవారం నాడు పరవాడ లో కల మసిద్ లో జమాత్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూడటం తో పరుగులు పెడుతున్న స్థానిక నాయకులు,అధికారులు. స్టీల్ ప్లాంట్ సెక్టార్-5 లో నివసిస్తున్న మహమ్మద్ రబ్బానీ అనే వ్యక్తి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగిగా పనిచేస్తూ హాజరత్(బోధకుడు)గా జమాత్(ప్రవచం)చేస్తూ ఉంటారు ఈయన ఢిల్లీ లో నిజాముద్దీన్ లో జరిగిన జమాత్(మతప్రార్ధనలు)కు వెళ్ళివచ్చిన విషయం, స్పెషల్ బ్రాంచికి చెందిన అధికారులు సోమవారం అదుపులోకి తీసుకుని విశాఖ చెస్ట్ హాస్పటల్ కి తరలించారు.అక్కడ ఆయనకు కోవిడ్-19 తనికికి రక్త నమూనాను సేకరించి పంపించారు.రక్త పరీక్ష యొక్క రిజల్ట్ రావలిసి ఉన్నది.రబ్బానీ ఢిల్లీ నుంచి వచ్చాక ఎక్కడ ఎక్కడ వెళ్లారు అని అడగగా పరవాడ మసిద్ లో జమాత్ కి వెళ్లినట్లు అధికారులకు తెలియ చేశారు.ఈ విషం మండల పోలీసు అధికారులకు రెవెన్యూ అధికారులకు తెలియచేయడంతో ఎమ్మార్వో గంగాధర్ హుటా హుటిన మసీదు ప్రాంతానికి వచ్చి స్థానిక ముస్లిం సోదరులను విచారణ చేస్తుండటం తో పరవాడ గ్రామం ఒక్క సారిగా ఉలిక్కి పడింది.అధికారులు రిబ్బాని జమాత్(మత ప్రార్ధన)వెళ్లిన వారి నందరిని స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలి అని ఆదేశించారు.స్థానిక మత ప్రార్థనా మందిరాల్లో ఇటువంటివి జరగక కుండా నాయకులు అంతా అధికారుల మీద వదిలి వేయకుండా తాముకుడా పట్టించుకోవాలి అని గ్రామ ప్రజలు కొరితున్నారు.



 

 


 

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపుతో దాతల ముందడుగు





 

సమకూరిన రూ.20 లక్షలు నగదుని చెక్ ల రూపంలో విశాఖ నగర సీపీ(కమిషనర్ ఆఫ్ పోలీసు ) ఆర్.కే మీనాకు అందజేత

 

విశాఖపట్నం, పెన్ పవర్ 

 

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కరోన నియంత్రణకు పలువిధాలుగా తోడ్పాటు నందిస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం తో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యం లో కరోన కట్టడికి తనవంతు సహాయంగా  రూ. 25 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా ఓ అడుగు ముందుకు వేసి ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోన నియంత్రణలో భాగంగా డాక్టర్లు, పారిశుధ్య కార్మికుల సేవలను పొగిడిన ఆయన , తాజాగా పోలీసులకు తోడ్పాటునందించారు. రాత్రనకా, పగలనకా పహారా కాస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడి, అటు కేంద్రం ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ఆదేశాలను తూ.చా తప్పకుండా విధులు నిర్వహిస్తున్న రక్షక భటుల కై నడుంబిగించారు. తన పార్లమెంట్ పరిధితో పాటు పలువురిని ఈ విషయంపై జాగృతాపరుస్తూ పోలీసులకు నిధులు సమకూర్చారు. ఫిల్మ్ నగర్ జూబ్లీ హిల్స్ లో విష్ణు కెమికల్స్ అధినేత సీ.హెచ్ కృష్ణమూర్తి రూ.10లక్షలు ,  వాల్తైర్  క్లబ్  రూ.5లక్షలు, చిరుకూరి ఎస్టేట్ అధినేత చిరుకూరి శ్రీనివాస్ రూ. 2లక్షలు, సాయనాస్ కన్స్ట్రక్షన్ నుంచి ఎల్. రామారావు , ఎస్. శ్రీనివాసులు రూ. 1లక్ష , రాక్ డేల్ హోటల్ , వెంగమాంబ స్టోన్ క్రషర్ నుంచి శ్రీనివాస్ , ఆదిశేషయ్యలు సంయుక్తం గా రూ.1 లక్ష ,హనీ గ్రూప్స్ అధినేత ముక్కా ఓబులరెడ్డి రూ.1లక్ష చొప్పున మొత్తం రూ.20 లక్షల రూపాయలను చెక్ రూపంలో  విశాఖ ఎంపీ సమక్షంలో విశాఖ నగర కమిషనర్ ఆర్.కే.మీనా కు, ఆయన కార్యాలయం లో అందజేశారు. ఈ మొత్తాన్ని పోలీసు అవసరాలకు వెచ్చించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ పోలీసు లు విధినిర్వహణలో చూపుతున్న చొరవను అభినందించారు. వారికి వెన్నుదన్నుగా నిలిచి , ఇతోధికంగా తోడ్పాటు నివ్వాలని పిలుపునిచ్చారు. నగర పరిధిలో సీపీ మీనా చేపడుతున్న కరోన నియంత్రణ చర్యలను అభినందించారు


 

 



 

గోవాడ షుగర్ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలి 


అనకాపల్లి, పెన్ పవర్ 

 

శారద నదిని కలుషితం చేసి వేలాది మంది ప్రజలు ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తూ గోవాడ సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం పై జీవీఎంసీ వారు అంటువ్యాధుల నిరోధక చట్టం ద్వారా కేసు నమోదు చేయాలని జోనల్ కమిషనర్ ను  శాసనమండలి సభ్యులు   బుద్ధ నాగ జగదీశ్వరరావు కోరారు. ప్రస్తుతం శారదా నదిలో నీటి ప్రవాహం లేదని అక్కడక్కడ మాత్రమే నీరు ఉంటుందని ఇటువంటి తరుణంలో వేలాది  గ్యాలన్ ల నీరు,విషపూరిత వ్యర్ధ జలాలను ఫ్యాక్టరీ యాజమాన్యం నదిలోకి విడిచిపెట్టి నదీ  పరివాహక ప్రాంత ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని నాగ జగదీష్ ఆగ్రహం వ్యక్తపరిచారు.

ప్రస్తుతం కరోనా వ్యాధి తీవ్రత ప్రజలను భయాందోళనకు రేకెతికిస్తున్న తరుణంలో ఫ్యాక్టరీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు జీవీఎంసీ అధికారులు అలసత్వానికి నిదర్శనమని వ్యర్థ జలాలు తాగునీటి బోర్లు వద్దకు చేరి భూగర్భ జలాల్లో చేరి డయేరియా,కలరా వంటి వ్యాధులుతో పాటు అనేక చర్మ వ్యాధులకు గురి కాక తప్పదని నదీ గర్భంలో గల మత్స్య సంపద మొత్తం చనిపోయినందున చేపల వేటపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలు కొన్ని నెలలపాటు పస్తులు ఉండక తప్పదని తెలిపారు ప్రస్తుతం నదిలో కలిసిన వ్యర్ధ జలాల యొక్క తీవ్రత తగ్గాలంటే తక్షణమే రైవాడ రిజర్వాయర్ నందు గల నీరు సర్దార్ నదిలోకి విడిచిపెట్టి తాగునీటికి పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ను కోరారు ఫ్యాక్టరీ యాజమాన్యం పై రాష్ట్ర కాలుష్య నిరోధక మండలి కేసులు నమోదుచేసి విచారణ కమిటీని వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు దీనిపై శాసన మండలి జరిగే సమయంలో చైర్మన్ దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు.

గుట్కా గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు

 


          పరవాడ పెన్ పవర్

 

పరవాడ:పరవాడలో అక్రంగా తరలిస్తున్న గుట్కా వ్యాపారి పై టాస్క్ ఫోర్స్ అధికారి కొల్లి సతీష్ ఆధ్వర్యంలో సిబ్బంది తో కలిసి మెరుపు దాడి చేశారు.పరవాడ కేంద్రంగా గుట్కా వ్యాపారం విరివిగా సాగుతోంది అన్న సమాచారం తో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎప్పటి నుంచో నిఘా వేసినట్లు తెలిపారు.గురువారం నాడు జగదీష్ అనే కిరాణా వ్యాపారి 4 లక్షల 30 వేల రూపాయల నిషేధిత గుట్కా లను ఆటోలో తరలిస్తుండ మారు వేషంలో వచ్చిన అదికారులు రైడ్ చేసి పట్టుకుని సరుకుని ఆటోని సీజ్ చేసి వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు.

గ్రామ ముఖ్య కూడలిలో క్వారంటైన్‌ ఏర్పాటుపై ద్వజం



రావులపాలెం, పెన్ పవర్ 



 నియోజక వర్గ స్థాయిలో కరోనా బాదితులు  పెరుగుతుండడంతో ఇటీవల రావులపాలెంలో బాలుర ఉన్నత పాఠశాలలో క్వారంటైన్‌ నిమిత్తం బెడ్స్‌ ఏర్పాటు చేసారు.  ఇదిలా ఉండగా పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ రూమ్‌కు అరకొర వసతులతో అసంపూర్తిగా ఉండగా కొత్తపేటకు చెందిన కొందరు అనుమానితును తీసుకురాగా గ్రామస్తులు  అడ్డుకొని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.  ఈ సందర్భముగా గ్రామస్తులు   దగ్గరలో అనేక ఆసుపత్రులు ఉన్నాయని, నియోజక వర్గానికి కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి ఉండగా ఎటువంటి సౌకర్యాలు  కల్పించకుండా రావులపాలెం గవర్నమెంటు హై స్కూల్ లో క్వారంటైన్‌ బెడ్స్‌ ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల వైరస్‌ అనుమానితును తీసుకురావద్దని, గ్రామానికి చెందిన వ్యక్తులకు ఎవరికైనా వైరస్‌ సోకితే అటువంటి వారిని చేర్చుకోడానికి దగ్గరగా ఉంటుందని, ఇతర ప్రాంతాల వారిని ఇక్కడకు తీసుకురావడంతో గ్రామస్తులు  ఒకింత భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు.  దీంతో అధికారులు  వైరస్‌ అనుమానితును భట్లపాలెం బివిసి కాలేజికి తరలించారు.  ఈ నిరసనలో గ్రామస్తు గొలుగూరి మునిరెడ్డి, డీర్‌ సత్తిరెడ్డి, కర్రి అశోక్‌రెడ్డి, పడా పరమేశ్వరరెడ్డి, కొండేపూడి రామకృష్ణ, కోనా అంబేద్కర్‌, బొక్కా ప్రసాద్‌, అంబటి గోపి, అంబటి మణికంఠ, అధిక సంఖ్యలో గ్రామస్తులు  తదితరులు పాల్గొన్నారు.


కరోనా పాజిటివ్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు పరిశీలన



 


 కరోనా పాజిటివ్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన జివిఎంసి అదనపు కమిషనర్


విశాఖపట్నం, పెన్ పవర్ 


 జివిఎంసి నాలుగవ జోన్ పరిధిలో గల వార్డు నెంబరు 32, 42 వార్డులలో వచ్చిన కరోనా పాజిటివ్ ప్రాంతాలలో అమలవుతున్న పారిశుద్ధ్య పనులను జివిఎంసి అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు ముఖ్య ప్రజారోగ్య అధికారితో కలసి పరిశీలించారు. సంబంధిత నాలుగవ జోన్ అసిస్టెంటు మెడికల్ ఆఫీసరు, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్ స్పెక్టర్లతో చర్చిస్తూ, పారిశుద్ధ్యం పనులు పై పలు సూచనలు చేశారు. దగ్గరుండి ఆయా ప్రాంతాలలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని అగ్నిమాపక వాహానం ద్వారా స్ప్లే చేయించారు. రోడ్ల మార్జిన వద్ద గల చెత్త బిన్లు నుండి చెత్తను తీసివేసిన తర్వాత, కాలువలలో చెత్తను తొలగించి, ఎత్తివేసిన తర్వాత, బ్లీచింగ్ తో కలిపిన లైమ్ పౌడరును జల్లాలని, పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతం నుండి సుమారు 5 కిలో మీటర్ల వరకు, రసాయన ద్రావణాలను రోడ్లపై వాహానంతోను, ఇరుకు ప్రాంతాలలో ట్యాంకుల ద్వారా జల్లించాలని, బ్లీచింగ్ పౌడరును తప్పనిసరిగా వేయాలని, ఆయా ప్రాంతాలలో ఏమైనా కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు గల గృహములను గుర్తించినచో వెంటనే జోనల్ ఆధికారులకు తెలియపరచాలని, ఆయా ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులు భౌతిక దూరం పాటిస్తూ, నోటికి మాస్కులు, చేతికి చొజులు వేసుకొని చాలా అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే తగు కఠినచర్యలు చేపడతామని వారికి హెచ్చరించారు. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో క్రమశిక్షణతో పనిచేసి, జివిఎంసి కమిషనర్‌కు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టాలని, పారిశుద్ధ్య విభాగపు జోనల్ స్థాయి అధికారులను, సిబ్బందిని, కార్మికులను ఆయన కోరారు. ఈ పర్యటనలో సిఎంఓహెచ్ కెఎస్ఎన్ఎ శాస్త్రి, జోనల్ కమిషనర్ సింహాచలం, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ రాజేష్, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు, వార్డు ప్రత్యేక ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.


క్వరెంటైన్ కేంద్రంలో మత్స్యకారులను పరామర్సించిన  జే.సి  



 


   జే.ఎన్..టి యు  క్వరెంటైన్ కేంద్రంలో  మత్స్యకారులను పరామర్సించిన  జే.సి   


                    దుప్పట్లు పళ్ళు, సానిటైసర్లు  పంపిణి చేసిన వై.సి.పి నేత మజ్జి శ్రినివాస రావు


విజయనగరం, పెన్ పవర్ 


కర్ణాటక నుండి వచ్చిన  విజయనగరం జిల్లకు చెండిన మత్స్యకారులను సంయుక్త కలెక్టర్ జే.సి.కిషోర్  కుమార్   బుధవారం పరామర్శించారు.  వేట నిమితం వెళ్ళిన 85 మంది మత్స్యకారులు సోమవారం రాత్రి జిల్లాకు రాగ వారికీ ప్రాధమికంగా పరీక్షలు నిర్వహించి కారోనా లక్షణాలు లేనప్పటికీ బయట నుండి వచ్చినందున  వారిని 14 రోజుల పటు  క్వరెంటైన్ లో  ఉంచడం జరిగింది.    బుధవారం జే.సి కిషోర్ కుమార్, వై.సి.ఫై నేత మజ్జి శ్రీనివాస రావు, అర్ .డి.ఓ  హేమలత  క్వరెంటైన్ లో నున్న వారిని కలిసి మాట్లాడారు.


          జే.సి మాట్లాడుతూ  ఎలాంటి వ్యాధి లక్షణాలు లేనప్పటికీ   ప్రభుత్వ నిబంధనల ననుసరించి నిర్బంధం లో ఉన్హడం జరిగిందని, ఈ నిర్బంధం మీ కోసం, మీ కుటుంభాల కోసం, సమాజం కోసమేనని  హితవు పలికారు.   మీరు ఆరోగ్యంగా మీ గ్రామాలకు వెళ్తే మిమ్మల్ని అందరు గౌరవిస్తారని, లేకుంటే అనుమనంగా చూస్తారని, 14 రోజులు ఉంది వ్యాధిని జయైంచిన గర్వంతో స్వంత వుల్లకు వెళ్ళాలని అన్నారు.


వై.సి.ఫై నేత మజ్జి శ్రీనివాస రావు బాధితులకు దుప్పట్లు, తువ్వాళ్ళు, మాస్క్ లు, శానిటైసర్లు, పళ్ళు  అందించారు.  అనంతరం అయన మాట్లాడుతూ ఏ ఏ గ్రామాలకు చాందిన వారని అడిగారు.  మత్స్యకారులు మాట్లాడుతూ  చింతపల్లి, కొనడ, తిప్పలవలస, ముక్కం గ్రామాలకు చెందినవారమని చెప్పారు.  మీకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని, మాతో సహకరించాలని శ్రీనివాసరావు  కోరారు.  అధికారులంత నిత్యం అందుబాటులో ఉంటూ మిమ్మల్ని   బంధువుల్లా చూసుకుంటారని అన్నారు.  ఎలాంటి అవసరలున్న, వైద్య సహకారం కావాలన్నా తనకు ఒక్క ఫోన్ చేస్తే అన్ని ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు.  వారి వినోదం కోసం పెద్ద టెలివిషన్ ను ఏర్పాటు చేయాలనీ జే.ఎన్.టి.యు యాజమాన్యం తో  చెప్పారు.  అలాగే  నిత్యం పారిశుధ్య పనులు జరగాలని, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు.


ఈ కార్యక్రమం లో  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాల త్రిపుర సుందరి, తహసిల్దార్  సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...