Followers

పేద కుటుంబాలకు ఆసరా 


పేద కుటుంబాలకు ఆసరా 


పెన్ పవర్ , నర్సీపట్నం.


నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి మూడో వార్డులో వైసీపీ నాయకుడు మామిడి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ మామిడి అరుణ దంపతులు 350 కుటుంబాలకు బియ్యం,  గుడ్లు అందజేశారు. కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో, దినసరి పనులు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తన కుమార్తె రేణుకా బార్గవి పుట్టిన రోజును పురస్కరించుకొని తన వార్డులోని 350 కుటుంబాలకు ఐదు కేజీల బియ్యం, అరడజను గుడ్లు అందజేశారు.  ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమీషనర్ చేతుల మీదుగా ప్రారంభించారు. తన కుటుంబానికి కష్టసుఖాల్లో అండగా ఉండే వార్డు ప్రజలకు ఈ కష్టకాలంలో సాయం చేయడం కనీసం ధర్మంగా భావించానని మామిడి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ సూచనలు మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు చింతకాయల వరుణ్ , చెరుకూరి సత్యనారాయణ, మళ్ళ గణేష్,  మాకిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


రేపటి నుండి ఇంటింటికీ వెయ్యి రూపాయలు


రేపటి నుండి ఇంటింటికీ వెయ్యి రూపాయలు


నర్సీపట్నంలో 8,24,72,000/- పంపిణీ


ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే గణేష్ వెల్లడి


పెన్ పవర్, నర్సీపట్నం 


నర్సీపట్నం నియోజకవర్గంలో తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు 8,24,72,000/-  పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మీడియాకు తెలిపారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో, పేద ప్రజల ఇబ్బందులను గుర్తించి తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆ హామీ నెరవేర్చే  ప్రక్రియలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలో 78 సచివాలయాల పరిధిలో 82,472 రేషన్ కార్డులు ఉన్నాయని, ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున 8,24,72,000/-  పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరికొద్ది రోజుల పాటు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని,  ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్


గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్


- కరోనా నేపథ్యంలో ఆధ్యాత్మికవేత్తలు, మతపెద్దలతో మాట్లాడి సభలు, సమావేశాలు నిర్వహించకుండా చొరవతీసుకోవాలి


- పంటకోతలు, వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాలని సూచన


- వైద్యులపై దాడులు హేయమైన చర్య.. కరోనాపై పోరాటంలో ముందుండి నడిపిస్తున్న వారిపై దాడులు జరగకుండా ప్రజలను చైతన్య పరచాలి


- వలస కూలీలకు భోజన, వసతుల ఏర్పాట్లు చేయడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి


న్యూస్ డెస్క్, పెన్ పవర్


కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆధ్యాత్మికవేత్తలు, మతపెద్దలతో మాట్లాడి.. వారి అనుచరులు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకుండా, సామాజిక దూరాన్ని పాటించేలా చొరవతీసుకోవాలని గవర్నర్లు, లెఫ్టినెంట్  గవర్నర్లకు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ.. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను అమలు చేసేలా ఆధ్యాత్మికవేత్తలు, మతపెద్దలకు సూచించాలన్నారు. గౌరవ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి ఉపరాష్ట్రపతి ఇవాళ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
ఇటీవల జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాన్ని చూపడాన్ని ఉటంకిస్తూ.. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు అప్రమత్తంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ‘మీ రాష్ట్రాల్లో ఎలాంటి ఆధ్యాత్మికపరమైన సభలు, సమావేశాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. నచ్చజెప్పండి. వినకుంటే చట్టపరమైన తక్షణ చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. ప్రజలందరు ఇళ్లలోనే ఉంటూ.. మత ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.
పంట కోతలతోపాటు వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం సేకరణ, వీటి నిల్వల కోసం ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని వారికి ఉపరాష్ట్రపతి కోరారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా.. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వ్యవసాయ యంత్రాలను సమకూర్చడంతోపాటు మిగిలిన సౌకర్యాలు కల్పించే విషయంలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు చొరవతీసుకోవాలన్నారు. 100 శాతం ధాన్యం సేకరణ జరిగేలా చూడాలన్నారు.
పలుచోట్ల డాక్టర్లపై, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను ఉపరాష్ట్రపతి ఖండించారు. దురదృష్టకరమైన ఇలాంటి ఘటనలు వైద్యుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులపై దాడులు జరగకుండా ప్రజలను చైతన్య  పరచాలన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులు అందిస్తున్న సేవలను మరువలేనివని.. వారు మనకోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారనే విషయాన్ని ప్రజలకు అవగతం చేయించాలన్నారు.
విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సులు అందించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను కూడా ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు.
వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల పరిస్థితి, ప్రజలకు అందాల్సిన నిత్యావసర వస్తువులు, మందుల పంపిణీకి సంబంధించిన వివరాలను కూడా ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. వలస కూలీల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాయశక్తులా కృషిచేస్తున్నప్పటికీ.. సమాజం కూడా వారికి భోజనం, వసతి కల్పించడాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. 
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలు సామాజిక దూరంతోపాటు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను పాటిస్తున్నారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఇకపైనా నిబంధనలను అతిక్రమించకుండా.. ఇదే స్ఫూర్తితో ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ సూచనలకు అనుగుణంగా నడచుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునందుకుని ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 35 మంది గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వారి రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వారు వివరించారు.


32 మంది జర్నలిస్టులకు బియ్యం, కందిపప్పు పంపిణీ


32 మంది జర్నలిస్టులకు బియ్యం, కందిపప్పు పంపిణీ



కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి



(పెన్‌పవర్‌, పొదిలి)



కరోనా వైరస్‌ నేపథ్యంలో అహర్నిశలు కష్టపడుతున్న జర్నలిస్టు మిత్రులకు 25 కిలోల బియ్యం, 2 కిలోల కందిపప్పును అందించే కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర నాయకులు కెవి రమణారెడ్డి, కంభం ఎఎంసి ఛైర్మన్‌ వై వెంకటేశ్వరరావు సంయుక్తంగా పూనుకున్నారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి జర్నలిస్టులకు నిత్యావసరాలు అందించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశ వ్యాప్తంగా గత 12 రోజులుగా లాక్‌డౌన్‌ కు ప్రధానమంత్రి పిలుపునిచ్చారన్నారు. గడిచిన 12 రోజులుగా ప్రింట్‌, ఎక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా, ఇతర మీడియా ప్రతినిధులు పోలీసు, వైద్యారోగ్యశాఖలతో సమానంగా తమ వంతుగా ప్రజలకు కరోనాపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారన్నారు. పొదిలి మండలంలో , పంచాయతీలో శానిటేషన్‌ సక్రమంగా అధికారులు నిర్వహించేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. ఎప్పటికప్పుడు ఏఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయో వాటిని అధికారుల దృష్టి కి తేవడంతో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రజల ప్రాణాలపై మీ స్థాయిలో ఎన్నో జాగ్రత్తలు తెలియజేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కీకపాత్ర పోషిస్తున్నారన్నారు. మీరు చూపిన సహకారం మరువలేనిదన్నారు. పాలకులు చెపుతున్న విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువ చేస్తూ వారికి మరింత అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించింది మీడియా అన్నారు. ప్రపంచంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం ద్వారా జరిగిన నష్టాన్ని, జాగ్రత్త పాటించడం వలన కలిగే లాభాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించారన్నారు. ప్రతి ఒక్కరిని జాగృతి చేసేందుకు ప్రింట్‌ మీడియా పత్రికల్లో, ఎక్ట్రానిక్‌ మీడియా డిజిటల్‌ లో ప్రజలకు చూపారన్నారు. 24 గంటలు ప్రజల ప్రాణాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారన్నారు. కోవిడ్‌ ` 19 లో మీడియా సేవ వెలకట్టలేనివి అన్నారు. ప్రజలకు, అధికారులకు మధ్య వారధులుగా మంచి పాత్ర పోషించారన్నారు. పొదిలి పంచాయతీలో ముఖ్యంగా శానిటేషన్‌ విషయంలో ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే ఆ విషయాన్ని వాట్స్‌ఆప్‌ ద్వారా అధికారులకు సమాచారం చేరవేయడం, అధికారులు వెంటనే వాటి పై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మీడియా మిత్రులు ప్రజలకు చేసిన సేవను గుర్తించిన వివేకానంద డిగ్రీ కళాశాల యాజమాన్యం మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరికి 25 కిలో బియ్యం, 2 కిలో కందిపప్పును అందించినందుకు వారికి ప్రత్యేక అభినందలను ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కెవి రమణారెడ్డి, కంభం మార్కెట్‌ యార్డ్‌ చైర్మెన్‌ ఏలం వెంకటేశ్వర రావు, వివేకానంద డిగ్రీ కళాశాల అధ్యాపకులు పోలు శ్రీనివాసరెడ్డి, భక్తవత్సల రెడ్డి, అశోక్‌, సుబ్బారెడ్డి , నాగరాజు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


పడాల సతీష్ ఆధ్వర్యంలో పేదలకు భోజనం


పడాల సతీష్ ఆధ్వర్యంలో పేదలకు భోజనం..


మండపేట,  పెన్ పవర్


గత పది రోజులుగా ఉపాథి కోల్పోయి ఇంటివద్దే లాక్ డౌన్ లో ఉండిపోయిన కొంత మంది పేదలను వైఎస్సార్సీపీ నాయకుడు పడాల సతీష్ ఆదుకున్నారు. స్థానిక రైతు బజార్ ప్రాంతంలో ఉపాథి లేక ఇబ్బంది పడుతున్న కొంత మంది ఇళ్ళకు వెళ్లి ఆయన ఆహార పొట్లాలను పంచిపెట్టారు. పేదల పట్ల సతీష్ చూపిస్తున్న దయా గుణానికి మెచ్చిన కమిషనర్ రామ్ కుమార్ అభినందించారు. పంపిణీ లో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ ఇంట్లో ఉన్నా శుభ్రత పాటించడం మంచిది అన్నారు. చేతులు తరచూ సబ్బు తో కడుక్కుంటూ ఉండాలి అన్నారు. అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసే అలవాటు మానుకోవాలి అన్నారు. ఒకవేళ తాకినా వెంటనే చేతులు కడుక్కోవాలి అన్నారు. తరచూ శుభ్రంగా ఉండటం వల్ల వైరస్ మనకు సోకే అవకాశం ఉండదు అన్నారు. ఈ కార్యక్రమంలో అలమండ సూరిబాబు, మణికంఠ, పసుపు లేటి వెంకట్రావు, కంక టాల సురేష్ , గండి విజయ్ కుమార్, పడాల సత్యేంద్ర, అడపా సాయి , పోలిశెట్టి ప్రసాద్, అవాల ప్రసాద్, సూరపురెడ్డి చిన్నారి తదితరులు పాల్గొన్నారు.


పీఎంపీ, ఆర్ ఎం పీ లు సేవలకు సిద్ధంగా ఉన్నాం


పీ ఎం పీ, ఆర్ ఎం పీ లు సేవలకు సిద్ధంగా ఉన్నాం..


 



మండపేట, పెన్ పవర్


జిల్లాలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా   గ్రామీణ వైద్యులుగా కొనసాగుతున్న పీ ఎం పీ, ఆర్ ఎం పీ లు మెడికల్ ఎమర్జెన్సీ గా  ప్రజల సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోన సత్యనారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 30 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నామని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాథమిక వైద్య అనుభవం ఉన్న తామంతా హెల్త్ ఎమర్జెన్సీ గా  ప్రజలకు అవసరమైన సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కోన  అసోసియేషన్ తరపున తెలియజేశారు.


ఎవరికి వారే వర్కర్స్


పారిశుద్ధ్య పనులు పరిశీలన...
ఎవరికి వారే వర్కర్స్...
గమనించిన ఎమ్మెల్యే...
సిబ్బంది సంఖ్య పెంచాలని ఆదేశం...


మండపేట, పెన్ పవర్


జిల్లా లో మరో నియోజకవర్గంలో లేని విధంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు నిత్యం ప్రజల ఇబ్బందులు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారంఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మండపేట పట్టణంలో సర్ధార్ వేగుళ్ళ వీర్రాజు నగర్, సంఘంపుంత రోడ్డు లో పారిశుధ్యం పనులను మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ తో కలసి పరిశీలించారు. కాలనీలో పారిశుధ్యం నిర్వహిస్తున్న యువకుల వద్దకు వెళ్ళి పారిశుధ్యం పై అరా తీశారు. తాము మున్సిపాలిటీ కార్మికులం కాదని జవాబిచ్చారు. ఈ కాలనీ వాసులమని చెప్పారు. స్వచ్చందంగా 30 మంది యువకులు కలసి కాలనీని శుభ్రపరచుకుంటూన్నామన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆశ్చర్యానికి గురియ్యారు. వారందరినీ అభినందించారు. ఎందుకు వారే ఈ పనులు చేస్తున్నారని ప్రశ్నించారు. మున్సిపాలిటీ చెయ్యటంలేదాఅని ప్రశ్నించారు. మున్సిపాలిటీ నుండి నలుగురు వర్కర్లు మాత్రమే వస్తున్నారని ఆ యువకులు చెప్పారు.దీనివలన పారిశుధ్యం పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. అందుచే వారంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు. దీనిపై శానిటేషన్ అధికారులను ప్రశ్నించారు.ఫోన్ ద్వారా మున్సిపల్ కమీషనర్ కి విషయం తెలియజేసారు. కార్మికుల సంఖ్య పెంచాలన్నారు. 


విధుల్లో పర్యటన...


కాలనీలో వీధిల్లో ఎమ్మెల్యే పర్యటించారు. పారిశుద్ధ్య పరిస్థితి పరిశీలించారు.


కాలనీ ప్రజలతో మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని కోరారు.


లాక్ డౌన్ పాటిస్తున్న అందరికీ అభినందనలు తెలియజేశారు. 


డంపింగ్ యార్డ్ పరిశీలన...


అక్కడి నుండి సంఘంపుంత రోడ్డులో గల డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్ళి అక్కడి పనులను పరిశీలించారు. అనంతరం మండపేట రైతుబజార్ ను పరిశీలించి అక్కడి కూరగాయ రేట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, మాజీ కౌన్సిలర్ మేడింటి సూర్యప్రకాష్, మున్సిపల్ అధికారులు ఇన్ ఛార్జ్ శానిటరీ ఇన్ స్పెక్టర్ ఎం.సత్తిరాజు, టిపిఎస్ కె.వీరభ్రహ్మం, సుభ్రహ్మణ్యం, డి.శ్రీనివాసు, ఎఇ కె.శ్రీనివాస్, తదితర్లు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజలు ఇబ్బందులు తెలుసుకొని అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే సేవలను ప్రజలు కొనియాడారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...