Followers

పడాల సతీష్ ఆధ్వర్యంలో పేదలకు భోజనం


పడాల సతీష్ ఆధ్వర్యంలో పేదలకు భోజనం..


మండపేట,  పెన్ పవర్


గత పది రోజులుగా ఉపాథి కోల్పోయి ఇంటివద్దే లాక్ డౌన్ లో ఉండిపోయిన కొంత మంది పేదలను వైఎస్సార్సీపీ నాయకుడు పడాల సతీష్ ఆదుకున్నారు. స్థానిక రైతు బజార్ ప్రాంతంలో ఉపాథి లేక ఇబ్బంది పడుతున్న కొంత మంది ఇళ్ళకు వెళ్లి ఆయన ఆహార పొట్లాలను పంచిపెట్టారు. పేదల పట్ల సతీష్ చూపిస్తున్న దయా గుణానికి మెచ్చిన కమిషనర్ రామ్ కుమార్ అభినందించారు. పంపిణీ లో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ ఇంట్లో ఉన్నా శుభ్రత పాటించడం మంచిది అన్నారు. చేతులు తరచూ సబ్బు తో కడుక్కుంటూ ఉండాలి అన్నారు. అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసే అలవాటు మానుకోవాలి అన్నారు. ఒకవేళ తాకినా వెంటనే చేతులు కడుక్కోవాలి అన్నారు. తరచూ శుభ్రంగా ఉండటం వల్ల వైరస్ మనకు సోకే అవకాశం ఉండదు అన్నారు. ఈ కార్యక్రమంలో అలమండ సూరిబాబు, మణికంఠ, పసుపు లేటి వెంకట్రావు, కంక టాల సురేష్ , గండి విజయ్ కుమార్, పడాల సత్యేంద్ర, అడపా సాయి , పోలిశెట్టి ప్రసాద్, అవాల ప్రసాద్, సూరపురెడ్డి చిన్నారి తదితరులు పాల్గొన్నారు.


పీఎంపీ, ఆర్ ఎం పీ లు సేవలకు సిద్ధంగా ఉన్నాం


పీ ఎం పీ, ఆర్ ఎం పీ లు సేవలకు సిద్ధంగా ఉన్నాం..


 



మండపేట, పెన్ పవర్


జిల్లాలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా   గ్రామీణ వైద్యులుగా కొనసాగుతున్న పీ ఎం పీ, ఆర్ ఎం పీ లు మెడికల్ ఎమర్జెన్సీ గా  ప్రజల సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోన సత్యనారాయణ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 30 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నామని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాథమిక వైద్య అనుభవం ఉన్న తామంతా హెల్త్ ఎమర్జెన్సీ గా  ప్రజలకు అవసరమైన సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కోన  అసోసియేషన్ తరపున తెలియజేశారు.


ఎవరికి వారే వర్కర్స్


పారిశుద్ధ్య పనులు పరిశీలన...
ఎవరికి వారే వర్కర్స్...
గమనించిన ఎమ్మెల్యే...
సిబ్బంది సంఖ్య పెంచాలని ఆదేశం...


మండపేట, పెన్ పవర్


జిల్లా లో మరో నియోజకవర్గంలో లేని విధంగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు నిత్యం ప్రజల ఇబ్బందులు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారంఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మండపేట పట్టణంలో సర్ధార్ వేగుళ్ళ వీర్రాజు నగర్, సంఘంపుంత రోడ్డు లో పారిశుధ్యం పనులను మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ తో కలసి పరిశీలించారు. కాలనీలో పారిశుధ్యం నిర్వహిస్తున్న యువకుల వద్దకు వెళ్ళి పారిశుధ్యం పై అరా తీశారు. తాము మున్సిపాలిటీ కార్మికులం కాదని జవాబిచ్చారు. ఈ కాలనీ వాసులమని చెప్పారు. స్వచ్చందంగా 30 మంది యువకులు కలసి కాలనీని శుభ్రపరచుకుంటూన్నామన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆశ్చర్యానికి గురియ్యారు. వారందరినీ అభినందించారు. ఎందుకు వారే ఈ పనులు చేస్తున్నారని ప్రశ్నించారు. మున్సిపాలిటీ చెయ్యటంలేదాఅని ప్రశ్నించారు. మున్సిపాలిటీ నుండి నలుగురు వర్కర్లు మాత్రమే వస్తున్నారని ఆ యువకులు చెప్పారు.దీనివలన పారిశుధ్యం పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. అందుచే వారంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు. దీనిపై శానిటేషన్ అధికారులను ప్రశ్నించారు.ఫోన్ ద్వారా మున్సిపల్ కమీషనర్ కి విషయం తెలియజేసారు. కార్మికుల సంఖ్య పెంచాలన్నారు. 


విధుల్లో పర్యటన...


కాలనీలో వీధిల్లో ఎమ్మెల్యే పర్యటించారు. పారిశుద్ధ్య పరిస్థితి పరిశీలించారు.


కాలనీ ప్రజలతో మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని కోరారు.


లాక్ డౌన్ పాటిస్తున్న అందరికీ అభినందనలు తెలియజేశారు. 


డంపింగ్ యార్డ్ పరిశీలన...


అక్కడి నుండి సంఘంపుంత రోడ్డులో గల డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్ళి అక్కడి పనులను పరిశీలించారు. అనంతరం మండపేట రైతుబజార్ ను పరిశీలించి అక్కడి కూరగాయ రేట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, మాజీ కౌన్సిలర్ మేడింటి సూర్యప్రకాష్, మున్సిపల్ అధికారులు ఇన్ ఛార్జ్ శానిటరీ ఇన్ స్పెక్టర్ ఎం.సత్తిరాజు, టిపిఎస్ కె.వీరభ్రహ్మం, సుభ్రహ్మణ్యం, డి.శ్రీనివాసు, ఎఇ కె.శ్రీనివాస్, తదితర్లు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజలు ఇబ్బందులు తెలుసుకొని అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే సేవలను ప్రజలు కొనియాడారు.


మీడియాను సేవలను గుర్తించిన జనసేన బీజేపీ


మీడియాను సేవలను గుర్తించిన జనసేన బీజేపీ..


శానిటైజర్లు, మాస్కులు పంపిణీ 


 


మండపేట, పెన్ పవర్


కరోనా మహమ్మారి పై యుద్ధం ప్రకటించిన ప్పటి నుండి  ప్రభుత్వ యంత్రాంగంతో  పాటు ముఖ్య పాత్ర వహిస్తూ సమాచారాన్ని క్షణాల్లో ప్రపంచానికి చేరవేస్తున్న మీడియా పాత్ర వెలకట్టలేనిదని బీజేపీ , జనసేన నాయకులు కోన సత్యనారాయణ , శెట్టి రవి లు పేర్కొన్నారు.  శుక్రవారం జనసేన , బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో విలేఖరులకు మాస్క్ లు , శానిటైజర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్ డౌన్ ఆరంభం నుండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందిస్తున్న సేవలు ప్రతి పౌరుడు గుర్తించుకోవాలన్నారు.  కరోనా నిరోధానికి ప్రభుత్వం , రాజకీయ పార్టీలు , స్వచ్ఛంద సంస్థల తో పాటు ఇతరులు ఎవరైనా కానీ  సమాజం కోసం చేస్తున్న సేవలను చిత్రీకరించి చక్కటి కథనాల రూపంలో ప్రపంచానికి  తెలియజేస్తున్నారని అన్నారు.  ముఖ్యంగా కరోనా విషయంలో ప్రజలను చైతన్య పరిచి ప్రభుత్వానికి సహకరించడంలో మీడియా చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారు పడుతున్న కష్టానికి గుర్తించి తాము సాయం చేసినట్లు తెలిపారు. అలాగే ప్రతి రోజూ మాదిరిగా పేదలకు ఆహార పొట్లాలను పంచిపెట్టారు. వాసిరెడ్డి అర్జున్ సమకూర్చిన భోజన ప్యాకెట్ లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కోనాల చంద్రబోస్, బొమ్మన సతీష్, సన్మాల ధనరాజ్, పువ్వల  నాని, రమిశెట్టి చిన్న, బండెల ప్రసాద్, ముట్ట రామ్, వనపర్తి చిన్న, వెలగదుర్తి శ్రీను, శెట్టి అవినాష్ నాయుడు, కోనే వీరబాబు, జంగం రామ్ కుమార్, పైడిమళ్ల సతీష్, జక్కా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


లాక్ డౌన్ నిబంధనలను ఉద్యోగులు కూడా పాటించాల్సిందే


లాక్ డౌనను నిబంధనలను ఉద్యోగులు కూడా పాటించాల్సిందే
- విజయనగరం జిల్లా ఎస్పీ బి. రాజకుమారి, ఐ.పి.ఎస్.,


విజయనగరం, పెన్ పవర్ 


విజయనగరం పట్టణంలో కోవిద్ - 19 వైరస్ పై పోరాటానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌను నిబంధనలను
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు, ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి
02-04-2020 ది, శుక్రవారం నాడు స్పష్టం చేసారు. 


కోవిద్ 19 వైరస్ వ్యాప్తి, కరోనా వ్యాధి ప్రబలకుం డా
ఉండేందుకే లాక్ డౌన్ ను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. లాక్ డౌన్ నిబంధనలు అందరికీ వర్తిస్తాయని, ఎవరు నిబంధనలను ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ
హెచ్చరించారు. 


లాక్ డౌన్ లో ప్రజలు ఇబ్బంది పడకూడదని, వస్తువులను కొనుగోలు చేసుకొనేందుకు సదలింపులను
ఇవ్వడం జరిగిందన్నారు. కానీ, కొంతమంది వ్యక్తులు అవసరమున్నా లేకపోయినా మోటారు సైకిళ్ళుపై ఊరు మీద
తిరుగుతున్నారన్నారు. ఇటువంటి వ్యక్తులను ఇకపై ఉపేక్షించ వద్దని, దొరికిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు
చేయాల్సిందిగా పోలీసు అధికారులును జిల్లా ఎస్పీ ఆదేశించారు.


 లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలను అందించే
శాఖలకు మినహాయింపునివ్వగా చాలా మంది అదే పనిగా ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురు తిరుగుతున్నారన్నారు.
అటువంటి వారి వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆమె అదేశించారు.


 విశాఖపట్నం, శ్రీకాకుళం,
ఒడిస్సా రాష్ట్రాల నుండి విజయనగరం జిల్లాకు వచ్చే అన్ని వాహనాలను అత్యవసర పరిస్తితుల మినహా నిలుపుదల
చేయాలన్నారు. 


అత్యవసర సమయాల్లో మోటారు సైకిల్ పై ఒక్కరు, కారులు, ఆటోల్లో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలన్నారు. 


చెక్ పోస్టుల వద్ద పని చేసే సిబ్బంది ఏ శాఖకు చెందిన వారైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. లాక్ డౌన్లో ప్రజలకు సేవలందించే పేరుతో చాలా మంది
అవసరం లేకపోయినా తిరుగుతున్నారని, అటువంటి వారిని కూడా నిలిపేయాలన్నారు.


ఎవరికైనా సహాయం చేయాలని,
భోజనాలు సమకూర్చాలన్న ఉద్దేశ్యం ఉంటే సంబంధిత డిఎస్సీ వద్ద ముందుగా అనుమతి పొందాలన్నారు. సంబంధిత
డిఎస్పీ అనుమతించిన సమయంలో, అనుమతించిన నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే వారు సేవా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అదే
విధంగా మోటారు సైకిలుపై ఒక్కరు మాత్రమే ప్రయాణించాల్సిందిగా ఆమె సూచించారు. 


కోవిద్ 19 గురించి అసత్య వార్తలను వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో సర్కులేట్ చేసే వారిపై కేసులు నమోదు చెయ్యాలన్నారు. ఇటువంటి
వార్తల వలన ప్రజలు మరింత భయాందోళనకు గురవుతారన్నారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించి, పోలీసు శాఖకు
సహాయపడాల్సిందిగా ప్రజలను జిల్లా ఎస్సీ కోరారు. అదే విధంగా 100శాతం లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాల్సిందిగాను, నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఆదేశించారు.


కరోనా ని జయించిన 22 ఏళ్ల రాజమండ్రి యువకుడు.


కరోనా ని జయించిన 22 ఏళ్ల రాజమండ్రి యువకుడు.



13 రోజులు చికిత్స అనంతరం కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్ గా నిర్థారణ.



ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు.


రాజమండ్రి, పెన్ పవర్



కరోనా ను జయించిన యువకుడ్ని జిల్లా కలెక్టర్ మురళీదర్ రెడ్డి, ఎస్పీ నయీంఆస్మీ, ప్రజాప్రతినిధులు అభినందించారు. కారోనా పాజిటివ్ వ్యక్తి కి వైద్య సేవలు అందించిన వైద్యులను అభినందించారు అధికారులు వైద్యులకు, అదికారులకు ధన్యవాదాలు తెలిపిన యువకుడు. సకాలంలో ఆసుపత్రి కి వస్తే కరోనాను జయించవచ్చన్న యువకుడు
కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు కోలుకోవటంతో తూర్పుగోదావరి జిల్లాలో సంతోషం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు.


ప్రజలను కాపాడేందుకు పరమేశ్వరుడు, ధన్వంతరీ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి


విజయనగరం, పెన్ పవర్


 


కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు పరమేశ్వరుడు, ధన్వంతరీ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అభిలషించారు. శుక్రవారం నాడు కొత్తగ్రహారం వేంచేసియున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన రుద్ర హోమం, రుద్రాభిషేకం తో పాటు అధర్వణ వేదంలోని ప్రధానమైన క్రిమినాశక సూక్తము, రక్షా జ్ఞ సూక్తము అనుసరించి నిర్వహించిన హోమాలలో ఎమ్మెల్యే కోలగట్ల చేతుల మీదుగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఋత్విక్కులు జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు, భయ నివారణకు ధన్వంతరి మంత్రం మానవాళికి ఎంతో అవసరమన్నారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా అతలాకుతలమై ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అన్నారు. కనపడే క్రిములు, కనపడని క్రిములు కూడా నాశనం చేసే శక్తి మంత్రానికి ఉందని మన పురాణాలు చెబుతున్నాయి అన్నారు. 30 కేజీల ద్రవ్యాలతో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, అభిషేకాలు ఋత్విక్కులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఉడత కాశీ, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మరియు న్యాయవాది టీవీ శ్రీనివాసరావు, ఆలయ ఈవో కె.వి.రమణ, ఋత్విక్కులు భమిడిపాటి రామ్ కుమార్ శర్మ, భమిడిపాటి రమేష్, కప్పగంతుల ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...