ఆరిలోవ . పెన్ పవర్.
ఆరిలోవ . పెన్ పవర్.
జిల్లాను గజాగజా వణికిస్తున్న కరోనా గుబులు.
నిజాముద్దీన్ యాత్రికులు రాకతో మొదలైన హైటెన్షన్.
నగరంలో 11కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు.
అనుమానితులను ఐసోలేషన్ కేంద్రాలకు తరలింపు.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం ఒక్కరోజే నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా ఉలిక్కిపడింది. ఆరు కేసులు కే పరిమితమైన కరోనా మహమ్మారి ఒక్కరోజులోనే 11కు చేరడంతో కోవిడ్ 19 గుబులు వెంటాడుతుంది. ఈనెల 19న నిజాముద్దీన్ లో జరిగిన తల్లిక్ జమాత్ మత సదస్సులో పాల్గొన్న 41 మంది విశాఖ చేరుకున్న విషయం తెలిసిందే. జమాత్ లొ పాల్గొన్న వారికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై మత యాత్రికుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. పలువురు ఆచూకీ లభించినప్పటికీ మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. జమాత్ లో పాల్గొన్న వారు నిజాముద్దీన్ ట్రైన్ లో ప్రయాణం చేశారు. వారితో పాటు ప్రయాణం చేసిన మరికొందరిని కూడా విశాఖ ఐసొలేషన్ కు తరలించారు. మాడుగుల జెడి పేట నుంచి యువకుడిని మంగళవారం రాత్రి విశాఖ తరలించారు. నర్సీపట్నం మంచి ఒక వ్యక్తిని చెట్టు పల్లి నుంచి మరో ముగ్గురిని తుమ్మపాల నుంచి ఒకర్ని ఐసొలేషన్ హోమ్ కు తరలించారు. మత సదస్సులో పాల్గొన్న వారిలో కరొనా కేసులు నమోదు కావడంతో వారితో ప్రయాణించిన ఇతర ప్రయాణికులను కూడా అనుమానిత కేసులుగా నమోదు చేస్తున్నారు. నిజాముద్దీన్ మత సదస్స యాత్రికులు జిల్లాలో ఎక్కడెక్కడ తిరిగారు ఎవరితో కలిశారు అన్నది మిస్టరీగా మారింది. ప్రస్తుతం జిల్లాలో కరోనా మహమ్మరి నివురుగప్పిన నిప్పులా మారింది. ఎక్కడ ఎలా కాల్ టు కేసులు బయట పడతాయో అన్న భయం ప్రజలను వెంటాడుతోంది. అధికారులు ప్రభుత్వం కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కరోనా తీవ్రతను ఎదుర్కోటానికి అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...