Followers

అంతర్ జిల్లాల దొంగ అరెస్టు


 

89 కాసుల బంగారం,240 గ్రాముల వెండి,

 

రెండు మోటారు సైకిళ్ళు స్వాధీనం

 

రావులపాలెం, పెన్ పవర్

 

చెడు వ్యసనాలకు బానిసై ఉభయ గోదావరి జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని రావులపాలెం పోలీసులు అరెస్టు చేశారు.  మంగళవారం రాత్రి రావులపాలెం సి.ఐ వి.కృష్ణ వివరాలు వెల్లడించారు. మల్కిపురం మండలం గుడిమెల్లంక గ్రామానికి చెందిన మామిడిశెట్టి నరేష్ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు వృత్తిగా ఎంచుకుని వరుసగా ఇంటి, మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నాడు. తాళం వేసిన ఇండ్లను ఎంచుకుని రాత్రి సమయంలో తాళాలు పగలుకొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.  గతంలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో పలుమార్లు అరెస్ట్ అయినట్లు ఆయన తెలిపారు. ఇతను వద్ద 89 కాసుల బంగారం , 240 గ్రాముల వెండి , రెండు మోటారు సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు రూ  16,31800 రూపాయలు  ఉంటుందని తెలిపారు. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన రావులపాలెం ఎస్సై పి.బుజ్జి బాబు,ఆత్రేయ పురం ఎస్సై  జి.నరేష్,పి.గన్నవరం ఎస్సై జి. హరీష్ కుమార్ లను సి.ఐ.కృష్ణ అభినందించారు. వారికి  రివార్డులు  ఇవ్వనున్నట్లు అమలాపురం డి ఎస్ పి మషూమ్ భాషా,జిల్లా ఎస్పీ అద్నాన్ నయిమ్ లు తెలిపినట్లు ఆయన తెలిపారు.

ఫొటో గ్రాఫర్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ


 





 

రావులపాలెం, పెన్ పవర్

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో  ప్రభుత్వం ప్రకటించిన  లాక్ డౌన్ పాటిస్తున్న కారణంగా ఉపాధి కోల్పోయిన  ఫోటో గ్రాఫర్లకు సి.ఐ వి.కృషి చేతులు మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. బుధవారం  యూనియన్ కార్యాలయ భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో ది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీటిని  రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల ఫోటోగ్రాఫర్స్ కి అందజేశారు. 25 కె.జీల బియ్యం ,1 కెజీ  పంచదార, కెజి గోధుమ నూక, 1 కెజి ఇడ్లీ రవ్వ, 100 గ్రా. టీ పొడిని అందజేసినట్లు యూనియన్ అధ్యక్షుడు గుబ్బల వెంకటరమణ, కార్యదర్శి మనోజ్ లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పవన్, నల్లమిల్లి రామారెడ్డి, సిరి రాము, మురళీ(ఎర్రబుజ్జి), సతీష్, మానే రాజు, పి.కె  నాగేశ్వరరావు, మాణిక్యం, రాజా, సత్యనారాయణ, ఏడుకొండలు,దొర బాబు, షైనీ రవి, బ్రహ్మం, పవన్ (రాజా), తేజ, అయ్యప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


 

 



 

గోకవరం బీజేపీ నాయకుడి ఆద్వర్యంలో  భోజనం ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం


గోకవరం బీజేపీ నాయకుడి ఆద్వర్యంలో  భోజనం ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం

........ ఐదో రోజుకు చేరింది  ,,, 

గోకవరం పెన్ పవర్

 

గోకవరం మండలం గోకవరం గ్రామంలో , దేవి చౌక్ సెంటర్ దగ్గర అరవ పేటలో, భారతీయ జనతా పార్టీ జడ్పిటిసి అభ్యర్థి, పార్టీ సీనియర్ నాయకులు కరాసు శివప్రసాద్ (అన్నదాత) ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంచిపెట్టారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ  ఆరోగ్య భారతదేశం గా మార్చాలని ఉద్దేశ్యంతో ప్రజల ఎవరు కరోనా బారిన పడకుండా ఉండాలని లాక్ డౌన్ సిస్టంలో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యాచకులు.నిరుపేదలు. ఆహారం లేకుండా ఇబ్బంది పడకుండా ఉండాలని అన్నదాత భోజనం ప్యాకెట్లు కార్యక్రమం చేపట్టానని తెలిపారు.

జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ . ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు .ఈ కార్యక్రమానికి యోగ విద్యార్థి ఎర్ర అనిల్ తల్లిదండ్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బిజెపి ముఖ్య నాయకులు పురం శెట్టి సత్య రమేష్ మరియు పి. యుగంధర్.

 ఆటో యూనియన్ నాయకులు షేక్ బాబ్జి మరియు అనుచరులు. మాగాపు రవణమ్మ, ఎస్ కె సత్తార్, ఎస్కే మస్తాన్ , కంది కట్ల బుల్లెమ్మ, మాగాపు మంగ, ఎండి ముంతాజ్, సర్వ శెట్టి సీత, షేక్ నన్నేసా, ఎస్కే రజాక్ పాల్గొన్నారు

ప్రజా శ్రేయస్సు కోరి 10 రోజులకు సరిపడా కూరగాయలు వితరణ


 


ప్రజా శ్రేయస్సు కోరి 10 రోజులకు సరిపడా కూరగాయల్ని వితరణ చేసిన మాజి సర్పంచ్ గొర్ల కనకారావు

 

           పరవాడ పెన్ పవర్

పరవాడ:మండలం లోని గొర్లివాని పాలెం గ్రామంలో తెలుగు దేశం నాయకుడు మాజీ సర్పంచ్ గొర్ల కనకారావు గ్రామం లో కల మొత్తం 750 కుటుంబాలకు సుమారు 10 రోజులకు సరిపోయే కూరగాయాల్ని ఒకొక్క రకానికి కేజీ చొప్పున 8 రకాల కూరగాయల్ని,అరడజను కోడి గుడ్లను వితరణ చేశారు.గ్రామ ప్రజలకు కష్టం వస్తే ఆకష్టం తనకష్టం గా ఫీలయ్యే నాయకుల్లో కనకారావు ఒకరు.ఈ సందర్భంగా కనకారావు గ్రామo లో ఇంటింటికి తిరుగుతూ కరోనా వైరస్ వల్ల కలిగిన నష్టాలు వివరిస్తూ ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) సోకడం వలన అనేకమంది వ్యాధి గ్రస్థులు అవడమే కాకుండా కొన్ని వేలమంది మృత్యువాత పడ్డారు అని  .షాక్షాత్తు కొన్ని దేశాల ప్రధానులు,ప్రెసిడెంట్లు ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడటంలో తాము ఏమి చేయలేక పోతున్నాము అని ఇంక భగవంతుడే దిక్కు అని చేతులు ఎత్తి ప్రాధిస్తున్నారు అని అన్నారు.కరోనా వైరస్ వల్ల వచ్చే వ్యాధి ని తగ్గించే ముందుకోసం అన్ని దేశాలు మేధో మధనం చేస్తున్న తరుణంలో మనదేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ ఒక్కటే మార్గం అని దేశ ప్రజలను అభ్యర్ధించి నెల రోజులపాటు క్వారన్టైన్(స్వీయ నిర్బంధం)విందిచి ప్రజలకు నిత్యావసర సరుకుల కు వెసులుబాటు కలిగించారు అన్నారు.ఆ వేసులుబాటును కొందరు ప్రజలు,ఆకతాయి యువకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అని కనకారావు ఆవేదన వ్యక్తం చేశారు.గత పదిహేను రోజులుగా ప్రజలు వ్యవహరిస్తున్న తీరు వల్ల వైరస్ చాలా స్పీడ్ గా వ్యాప్తి చెందుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఇప్పుడు ఈ పది,పదిహేను రోజులు వైరస్ వ్యాప్తి నివారించడానికి ఎంతో కీలకo అయినoదున ప్రజలు కూరగాయల కోసం బయటికి రాకుండా ఉండటానికి 2 లక్ష రూ పైన తన వ్యక్తిగత ధనాన్ని కర్చుచేసి ప్రతి కుటుంబానికి కూరగాయలు అందించారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలిసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.ప్రస్తుతం విశాఖపట్నం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఎటువంటి పరిస్థితులలోను ఎవ్వరూ కూడా తమ గృహల్లోంచి బయటికి రావద్దు అని అభ్యర్ధించారు.ఎవరు అయినా నిర్లక్ష్యంగా వయహరించి బయటతిరిగి  నట్లు అయితే ఎవరివల్ల అయినా కానీ బయట వస్తువు ముట్టుకోవడం వలన కానీ మీకు వైరస్ సోకి నట్లు అయితే ఆ వైరస్ ని మీరు మీ కుటుంభం లోని సబ్యులకే కాకుండా గ్రామంలో ని వారికి కూడా వైరస్ వ్యాప్తి చెoదటానికి దోహద పడినవారు అవుతారు అని హెచ్చరించారు.దయచేసి ఎవరు కూడా ఈ పదిహేను రోజులు బయటికి రాకండి అని ప్రార్ధించారు.ఇదే కాకుండా అవసరాన్ని బట్టి ఇంకొక సారి ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించే అవకాశం ఉంది అని కనకారావు మీడియా మిత్రులకు సూచన ప్రాయంగా తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గొర్ల శ్రీనివాసరావు,స్థానిక వువకులు పాల్గొన్నారు.   

దళితకులాల సంక్షేమ సేవా సంఘం సేవలు అబినందనీయం


     


పాయకరావుపేట,  పెన్ పవర్ 


 

 

లాక్ డౌన్ దృష్ట్యా బుదవారం పట్టణంలో బిచ్చగాళ్ళకు,నిరుపేదలకు దళితకులాల సంక్షేమ సేవా సంఘం  ఆహార పొట్లాలను పంపిణిచేసారు.మండల కన్వినర్ నెలపర్తి అర్జున రావు,పట్టణ అద్యక్షులు పల్లా విలియంకేరి ఆద్వర్యంలో సంఘ సభ్యులు రోడ్డు పై స్థావరాలు ఏర్పరుచుకున్న 300మంది బిచ్చగాళ్ళకు ,పేదలకు పులిహోర పొట్లాలను,మజ్జిగ ప్యాకెట్ ,వాటర్ ప్యాకెట్టులను అందజేసారు.ఈసందర్ఫంగా వారు మాట్లాడుతూ  కరోనా మహ్మారిని తరిమి కొట్టుటకు ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ లో ప్రజలు స్వచ్చందంగా అమలు చేయాలని కోరారు..అదేవిదంగా సామాజిక దూరంను పాటించి వైధ్యనిపుణుల సూచనలు సలహాలు పాటించి మానవ జాతి మనుగడను కాపాడుకుందామని అన్నారు దళిత కులాల సంక్షేమ సేవా సంఘం ఆద్వర్యంలో మండలంలో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమంలను నిర్వహింస్తామని అన్నారు..ఈకార్యక్రమంలో చిరుకూరి పేర్రాజు,తాటిపాక లోవరాజు,నెలపర్తి నాగరాజు,ఏనుగుపల్లి అప్పారావు,జక్కల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనదారులకు జరిమానా


కొత్తపేట పెన్ పవర్....


కొత్తకోట గ్రామం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొత్తకోట ఎస్సై దామోదర్ ఆద్వర్యం లో  అపరాధ రుసుము విధించారు సుమారు బుదవారం ఒక్కరోజే  20 ద్విచక్ర వాహనాలు నుంచి  30 వేల రూపాయలు ఫైన్ వేశారు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రోడ్లపైకి వస్తుండడంతో జరిమానా విధించారు.

వాలెంటీర్ల పై విమర్శలేలా 








--- ఉద్యోగ భద్రత కరువైనా

--- కరోనా సేవలు గణనీయమైనవి 

--- వారొక పార్టీ కాదు ఓ వ్యవస్థ 

--- ఇన్సూరెన్స్  ప్రకటిస్తే మేలంటున్న విశ్లేషకులు 

 

అనకాపల్లి , పెన్ పవర్ 

 

వాలంటీర్లుపై విమర్శలేలా. ఉద్యోగ భద్రత లేని వారి సేవలు గణనీయమైనవి. ప్రత్యేకించి కరోనా వ్యాధి  నియంత్రణలో అవిశ్రాంతంగా చేస్తున్న కృషి అభినందనీయమైనది అనేది క్షేత్రస్థాయిలో మాట. అయితే రాష్ట్రంలో రాజకీయం వాలెంటీర్ల చుట్టూనే తిరుగుతోందంటే ఆశ్చర్యం లేదు. ప్రభుత్వ పథకాల అమలు లొో  వాలంటీర్లె  కీలకం కావడంతో ఏ లోపం జరిగినా వాలెంటరీ వ్యవస్థనే ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు.   దీంతో వారెంతగా సేవలందిస్తున్నా చేయలేదనే భావనను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు.   నిజానికి  వాలెంటరీ అనేది ప్రస్తుతం ఓ వ్యవస్థగా రాష్ట్ర సేవల్లో నిలుస్తుంది. రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు అనేది స్పష్టం. వాలెంటరీ నియామకాల్లో రాజకీయ సంబంధం  లేని విద్యావంతులు ఉన్నారన్నది స్పష్టం. భర్తీలో అక్కడక్కడ వైకాపా నాయకుల పెత్తనం కనిపించినా అన్ని పార్టీలకు చెందిన వారు వాలంటరీగా ఉన్నారన్నది తెలిసిందే.

      నిజానికి వాలంటీర్లు క్షేత్ర స్థాయిలో చేస్తున్న పని అంతా ఇంతా కాదు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులు ఎంపిక అనర్హులకు  గుర్తించడంలో నిత్యం  నిమగ్నం అవుతూనే ఉన్నారు. పింఛన్ల పంపిణీని ఇంటింటికి వెళ్లి చేపడుతూనే ఉన్నారు. అన్నింటికీ మించి కరోనా వంటి భయంకర  పరిస్థితుల్లో ఇంటింటికి సర్వేకి వెళ్లడమనేది వెలకట్టలేనిది. ఇదంతా భద్రత కానీ ఉద్యోగాలు చేస్తూ ఇలాంటి సేవలు అభినందనీయమినదిగా పలువురు పేర్కొంటున్నారు. ఆ   డాక్టర్లు ఉద్యోగులు పోలీసులు ప్రభుత్వ ప్రతినిధులు. ఉద్యోగ భద్రత కలిగిన విధులు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగ భద్రత కానీ వలంటీర్లు సాహసాన్ని మించి చేయడం గొప్పదిగా చెబుతున్నారు.  ఈ క్రమంలో వలంటీర్లపై విమర్శలు ఎక్కుపెట్టడం సరికాదన్నది క్షేత్రస్థాయి మాట. చాలీచాలని జీతాలు ఆపై ప్రభుత్వం మారితే ఉంటారో లేదో అన్న మీమాంస. అయినా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న వాలంటీర్లలను ప్రభుత్వ వ్యవస్థగా చూడాలే తప్ప రాజకీయ పార్టీకి ప్రతినిధులుగా చూడకూడదనే వారు అధికమే. కేంద్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు  ఇన్స్యూరెన్స్  ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాలంటీర్లకు ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


 

 




 



 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...