.
Followers
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్
ప్రకటన విడుధల చేసిన ముస్లిం మైనారిటీనాయకులు
విజయనగరం, పెన్ పవర్
ఢిల్లీలోని నిజాముద్దీన్, ప్రాంతానికి మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులను గుర్తించి ,వారిలో ఇద్దరిని కేంద్ర ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఒక వ్యక్తి హైదరాబాదులో వైద్యులు తీసుకుంటున్నట్లు సమాచారం ఉంది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కరెంట్ టైం లో ఉంటూ వైద్యం తీసుకుంటున్నట్లు సమాచారం ఉంది. ఇంకా ఎవరైనా ముస్లిం సోదరులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు ఉంటే వెంటనే దయచేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు జరిపించుకొని ఉండవలసిన అవసరం ఉంది .మీరు వైద్య పరీక్షలు చేయించుకొని మీరు ఎవరెవరితో కలిశారో ఆ వివరాలు పోలీసువారికి గాని ,వైద్యులు కానీ, తెలియపరిచిన వారు మీకు తగిన వైద్య సలహాలు కూడా ఇస్తారు. ఆరోగ్యంగా ఉన్న వారికి కరోనా లక్షణాలు బయటపడటానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోవచ్చు, అలా అని మాకు ఏమీ లేదు, అని అశ్రద్ధ చేయకుండా కరెంట్ టైం లో ఉంటూ ఎటువంటి సూచనలు బయటపడిన, వెంటనే పరీక్షలు చేయించుకోవలసిన దిగా రెండు చేతులు జోడించి ముస్లిం సోదరులకు మనవి చేస్తున్నాను. మీరు అనవసర భయాలు పోయి చెప్పకుండా ఉన్నట్లయితే, వ్యాధి సోకితే మీ దేహాన్ని చూడటానికి మీ తండ్రి కాని, తండ్రి గాని, బిడ్డ గాని ,స్నేహితులే కానీ, ఎవరు రాలేని పరిస్థితి .చివరకు నీ కర్మకాండ ఎలా జరుగుతుందో తెలియదు .ఇంత నికృష్టపు చావు మనకు అవసరమా? ఈ సమాజం కోసం, దేశం కోసం, ప్రజలను రక్షించడానికి కోసం 24 గంటలు శ్రమిస్తున్నటువంటి వైద్యులకు, ఎండనకా, వాననకా, తమ కుటుంబాన్ని వదిలి మన కోసం శ్రమిస్తున్న పోలీసు వ్యవస్థకు, రెండు చేతులెత్తి నమస్కరిస్తూ, వారికి సహకరిద్దాం రండి. దయచేసి మీ వద్ద ఏదైనా సమాచారం ఉన్న ఎడల ఈ క్రింది టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేసి సమాచారం అందించవలసినదిగా మనవి. నిజాముద్దీన్ మత ప్రార్థనలకు హాజరైన వారి కొందరు వివరాలను నిజాముద్దీన్ ప్రార్థనకు హాజరు వచ్చిన వారి వివరాలు వక్ఫ్ బోర్డు ద్వారా సేకరించి వారు విడుదల చేసినటువంటి వివరాలను జిల్లా మైనారిటీ అధికారి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి అందించడం జరిగిందని తెలిపారు.
మూతపడ్డ ఫిషింగ్ హార్బర్.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
నిత్యం రద్దీగా ఉండే ఫిషింగ్ హార్బర్ మూసి వేసినట్లు ఫిషింగ్ హార్బర్ అసోసియేషన్ ప్రకటించింది. కరొనా వైరస్ లాక్ డౌన్ వల్ల నగరం జన సంచారం లేక బోసి పోతుందని ఈ తరుణంలో చాపల మార్కెట్ వ్యాపారం స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో చాపల వేట కూడా నిలిపి వేయడం జరిగింది. మర పడవలు లంగర్ కే పరిమితం కావడంతో షిప్పింగ్ హార్బర్ నిలిచి పోయింది. పడవలు నిలిపి వేయడం వేట ఆగిపోవడంతో మార్కెట్ వెల వెల బోతుంది. మత్స్యకారులు వేట లేకపోవడంతో విలవిలలాడుతున్నరు. కరోనా మహమ్మరి ప్రభావంతో ఫిషింగ్ హార్బర్ మూతపడింది. ఫలితంగా మత్స్యకారులు, వ్యాపారులు,కూలీలతో పాటు రవాణా మొత్తం స్తంభించిపోయింది.
విశాఖ సెంట్రల్ జైలు నుండి 74 మంది ఖైదీల విడుదల.
విశాఖ సెంట్రల్ జైలు నుండి 74 మంది ఖైదీల విడుదల.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
విశాఖ కేంద్ర కారాగారం నుంచి 74 మంది ఖైదీలను విడుదల చేశా మని కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎస్ . రాహుల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం కారణంగా లాక్ డౌన్ అమలు జరుగుతున్న సందర్భంగా కారాగారంలో ఉన్న ఖైదీలను మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విడుదల చేయాలని సుప్రీం కోర్ట్ మరియు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు కారాగారంలో ఉన్న 53 మంది రిమాండ్ ఖైదీలు 21 మంది శిక్ష ఖైదీలు మొత్తం 74 మందిని మార్చి 31న విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. ఈ సందర్భంగా కారాగారంలో ఉన్న ఏడుగురు మహిళలతో 74 మంది ఖైదీలను విడుదల చేయడం జరిగిందన్నారు. విశాఖ ఏడవ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జగదీష్ కుమార్ ఆధ్వర్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఖైదీలను ఇళ్లకు పంపించామని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఖైదీలు సామాజిక దూరం వ్యక్తిగతవ శుభ్రత పాటించాలని ఎల్ల కే పరిమితం కావాలని రాహుల్ సూచనలు ఇచ్చారు.
ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలతో ప్రభుత్వ ఆదేశాలను కూడా బేఖాతర్ చేసిన మద్యం దుకాణ సిబ్బంది!
ఎక్సైజ్ శాఖ అధికారుల అండదండలతో ప్రభుత్వ ఆదేశాలను కూడా బేఖాతర్ చేసిన మద్యం దుకాణ సిబ్బంది!
పెదబయలు, పెన్ పవర్:
మండల కేంద్రంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చాటుమాటుగా అమ్మకాలు అధికారుల కనుసన్నల్లో నిర్భయంగా జరుగుతున్నాయని విమర్శలు వెల్లెవేత్తడంతో అధికారులు స్పందించారు. మంగళవారం పెదబయలు ప్రభుత్వం మద్యం దుకణాన్ని పాడేరు సర్కిల్ ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్
జి, రమణ రావు ప్రభుత్వ మద్యం దుకాణం నుు పరిశీలించగా నిబంధనల ప్రకారం దుకాణానికి అమర్చి ఉన్న సెటర్ (తలుపు)మొదటి రోజే మూడుచోట్ల తాళాలు వేయవలసి ఉండగా... అలాగే ఆ తాళాలు వేసి దానిపై లక్క మార్క్ ముద్ర శీలు వేయ చేయవలసి ఉండగా నామమాత్రంగా మధ్యలో ఒక తాళం కప్ప మాత్రమే వేసి ఉంది దానిపై తెల్లటి గుడ్డ చుట్టి వదిలివేశారు, దీనిని బట్టి చూస్తే రాత్రిపూట యధావిధిగా బయటకు అధిక రేట్లకు అమ్మి జేబులు నింపుకుంటున్నారని దీని వెనకాల అధికారుల అండదండలు ఉంటాయని పలువురు విమర్శలు చేస్తున్నారు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల సిబ్బంది ఇష్టారాజ్యం ఏలుతున్నారని దీనిని బట్టి అర్థమవుతుంది మంగళవారము టీవీ ఛానళ్లలో ప్రచారము కావటంతో పాడేరు సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్ ఎక్సైజ్ శాఖ
జి రమణ రావు హుటాహుటిన వచ్చి మొదటిసారి వేసిన తాళం పై తెల్లటి గుడ్డ చుట్టి ఎరుపు రంగు లక్క అంటించి ముద్రవేసి వెనుతిరిగారు ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా మందు కోసం వచ్చిన వారే ఈ అఘాత్యాలు చేసి శీలు పీకి పడేసి ఉంటారని సమాధానమిచ్చారు.
మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, దయచేసి బయటకు తిరగకండి,
విజయనగరం, పెన్ పవర్
మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, దయచేసి బయటకు తిరగకండి, మీ కుటుంబాలను కాపాడుకోండి, లాక్ డౌన్ పాటిస్తూ అధికారులకు సహకరించండి అంటూ విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు, పాదచారులకు అభ్యర్థించారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలో పరిస్థితి, తన వాహనం పై వెళుతూ నగరమంతా కలియతిరిగారు. బాలాజీ జంక్షన్ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వాహనదారులను ఆపి ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా దయచేసి లాక్ డౌన్ సమయంలో బయట తిరగవద్దు అని వాహనదారులను అభ్యర్థించారు. వారికి అవగాహన కల్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా మరింత జాగ్రత్త అవసరం అని వారికి నచ్చచెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, ఇంటికే పరిమితం కావాలని, నిత్యావసర సరుకులు అందుబాటులోనే ఉన్నాయి అని ఎవరు కలత చెంద వద్దని ఎమ్మెల్యే కోలగట్ల వారితో అన్నారు. అనంతరం ప్రధాన రహదారులపై నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న క్లోరిన్ పిచికారి పనులను ఎమ్మెల్యే కోలగట్ల పర్యవేక్షించారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ వద్ద ఉన్న ట్యాంకర్ల తో పాటు, ఎమ్మెల్యే కోలగట్ల వ్యక్తిగతంగా మరో ట్యాంకర్ ను కూడా తెప్పించి నగరంలో ఆయా డివిజన్లలో పిచికారి పనులకు ఉపయోగించే విధంగా చూడాలని పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. అదే సమయంలో మూడు లాంతర్ల వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారి గుడి వద్ద ఏ ఆధారం లేని నిరుపేదలకు ఆహార పొట్లాలను ఎమ్మెల్యే కోలగట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దినసరి కూలీ చేసుకున్న వారు కానీ, రేషన్ కార్డు లేని వారు కానీ కలత చెంద వద్దని అన్నారు. అన్నార్తులకు ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు ఆయా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పైడితల్లి అమ్మవారి గుడి వద్ద పగలు, రాత్రి సమయాలలో ఏ ఆధారం లేని నిరుపేదలకు ఆహారం అందించడం జరుగుతుందన్నారు. అలాగే కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద కూడా నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఎక్కడైనా పేదవారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు, ఆకలి బాధతో ఉన్న వారు ఆయా ప్రాంతాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సంప్రదించాలని, లేదా స్థానిక శాసన సభ్యునిగా తాను అందుబాటులో ఉంటానని, నాయకుల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లాక్ డౌన్ పిలుపును విజయవంతం చేస్తూ, ప్రజలందరూ ఇళ్ల వద్దే ఉంటూ, కరోనా వైరస్ ను తరిమి కొట్టాలన్నారు. ఎమ్మెల్యే కోలగట్ల వెంట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ వి వి రాజేష్, సత్త రావు శంకర్రావు తదితరులు ఉన్నారు.
"శ్రీ సిటీ సేవలు" అభినందనీయం.
"శ్రీ సిటీ సేవలు"
అభినందనీయం.
పెన్ పవర్, చిత్తూరు/ సత్యవేడు
శ్రీసిటీ ప్రముఖ పారిశ్రామికవాడలో మెండాలిజ్ చాక్ల్ టు పరిశ్రమ వారు, పోలీస్ వారు, వారి సిబంది, లాక్ డౌన్ సందర్బంగా వారు చేసుతున్నా సేవలు మరుపురానివని శ్రీసిటీ పరిశ్రమల అధికారి వారిని అభినందించారు. కరోనా -19, మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని, ప్రభుత్వం ఆదేశాలుమేరకు వారు ప్రాణాలనులెక్క చేయకుండా, సమయానికి తిండి, తిప్పలు లేకుండా ప్రతినిత్యం సేవసేస్తున్నవారికీ, మనం సహకరించక పోతే ఈ జీవితంనకు, అర్ధం, పరమార్ధం ఉండదని, పరిశ్రమల అధికారులు, ప్రతినిధులు ఈ సందర్బంగా శానిటైజేర్, మాస్కులు, బోర్నవిటా, హేల్తిడ్రింక్స్ పౌడర్లు. సుమారు 4లక్షలు రూపాయలు విలువ చేసే 400 కిట్లను శ్రీసిటీ, తడ, సూళూరుపేట,సత్యవేడు, వరదయ్యపాలెం మండలంలోని పోలీస్ అదికారులకు మరియూ వారి సిబందికి అందజేశారు.ఈ సందర్బంగా పరిశ్రమ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ యావత్ ప్రపంచం మొత్తం లాక్ డౌన్ ఉంటే పోలీసులు మాత్రం తమ ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా, ప్రజలసంక్షేమమ్ కోసంఅహరిని శలు కటపడుతున్న, వారిఆరోగ్యం కోసంఈ కిట్లును అందించారు. లాక్ డౌన్ఉన్నoత వరకు పోలీస్ వారికీ, మరియు శ్రీసిటీ సెక్యూరిటీ సిబందికి రోజుకు సుమారు 30లీటర్లు మజిగను అందజేస్తామనారు. ఈ సందర్బంగా శ్రీసిటీ డీస్పీ విమలాకుమారి, సిఐ జగదీశ్ నాయక్, వారిసేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మెండలీజ్ చాక్లెట్ పరిశ్రమ ఉద్యోగులు భాస్కర్ రావు, కేవీ సత్యనారాయణ, శ్రీ శర్మ, సుధాకర్, సంతోష్, సతీష్ తథి దరులు పాల్గొన్నారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...