Followers
తాణాo గ్రామంలో గ్రామస్థులకు శేనిటైజర్లు పంచిన గ్రామ యువత
విశాఖ క్వారంటైన్ లో 166 మంది.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం( పెన్ పవర్)
జిల్లాలో వివిధ క్వారం టైన్ లో ఆదివారం 166 మంది చేరారని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రకటించారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో జిల్లాలో పలుచోట్ల అనుమానితులను క్వారం టైన్ లకు చేరుతున్నారు భీమిలిలో 60 గాజువాక లో 73 యలమంచిలి లో 18 నర్సీపట్నంలో 15 మంది కరోనా వైఎస్ అనుమానితులను క్వారం టైన్ లొ ఉంచామని పరీక్షల నమూనాలు వచ్చిన తర్వాత నెగిటివ్ వారిని ఇళ్లకు పంపిస్తామని వినయ్ చంద్ తెలిపారు. జిల్లాలో 6కరొనా కేసులు పాజిటివ్ రాగా మొదటి వైరస్ కేసు నెగిటివ్ కు చేరుకోవడంతో ఆ వ్యక్తిని డిస్చార్జ్ చేశామని అన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని కోరారు. రైతు బజార్లు కిరాణా షాపులు వద్దకు గుంపులు గుంపులుగా పోవద్దని చంద్ కోరారు
ఉచిత బియ్యం క్యూలో వడదెబ్బ తగిలి వృద్ధురాలు మృతి.
పెన్ పవర్ ..చోడవరం.
కరోనా వైరస్ మహమ్మారిని సమిష్టిగా తరిమికొట్టండి.
కరోనా వైరస్ మహమ్మారిని సమిష్టిగా తరిమికొట్టండి.
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి.
పెన్ పవర్... వి.మాడుగుల.
కరోనా వైరస్ మహమ్మారిని అందరు సమిష్టిగా ఎదుర్కోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస రావు అన్నారు. సోమవారం మాడుగుల మండల పరిషత్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఎంపీడీవో రెవెన్యూ పోలీస్ శాఖ ల అధికారులతో కరోనా పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలనకు అధికారులు వైద్య సిబ్బంది ప్రజలు సహకరించాలన్నారు. సామాజిక భద్రత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం తక్కువ మంది కూలీలతో వ్యక్తిగత దూరం పాటించి అయితే అమలు జరిగేలా ఎంపీడీవోలు కృషిచేయాలని ఆయన అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి తప్ప స్థానికంగా ఉండే వారి ద్వారా కాదని మంత్రి అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం తాగునీరు పై అధికారులు శ్రద్ధ చూపాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన కిట్లను సిబ్బందిని ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి పార్లమెంట్ మెంబర్ భీ శెట్టి వెంకట సత్యవతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా పై చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. అధికారులు ప్రజలు సహకారంతో వైరస్ ను దూరం చేయవచ్చని ఆమె అన్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు ఐదు లక్షల మాస్క్ లు 5000 పి పి సి కిట్లు అవసరమని వాటిని త్వరలో సరఫరా చేస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్పుబూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో కరోనా పై అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ఎప్పటికప్పుడు వివరాలు ఇస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు వలస కూలీల ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని వైద్య అధికారులకు సూచించారు . ఈ కార్యక్రమంలో అనకాపల్లి డి ఎస్ పి శ్రావణి నర్సీపట్నం డి ఎల్ పి ఓ శిరీష రాణి ఎంపీడీవో పోలినాయుడు తహసిల్దార్ రామ్ శేషు వైద్యాధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ భాపూజి పర్యవేక్షణలో చోడవరం నియోజకవర్గం
సీఎం రిలీఫ్ ఫండ్ కి గొల్లవిల్లి 50వేలు చెక్కు
పెన్ పవర్... వి.మాడుగుల.
ఏప్రెల్ 1న వై.ఎస్.ఆర్. పింఛనుకానుక
ఏప్రెల్ 1న వై.ఎస్.ఆర్. పింఛనుకానుక
పింఛనుల పంపిణీపై సూచనలు పాటించాలి
కరోనా వైరస్ కారణంగా తగు జాగ్రత్తలు
3,26,414 పించను దారులకు, రూ.77.16 కోట్లు పంపిణి
డిఆర్డిఎ ప్రాజక్టు డైరక్టరు కె. సుబ్బారావు
విజయనగరం, పెన్ పవర్
ఏప్రిల్ 1వ తేదీన వాలంటీర్లు పింఛనుదార్ల ఇంటివద్దకే వెళ్ళి పింఛనులు పంపిణీ చేయాలని డిఆర్డిఎ ప్రాజక్టు డైరక్టరు కె. సుబ్బారావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కరోన వైరస్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు లాక్ డౌన్ ప్రకటించడం వలన పింఛనుధారులు ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా ఉండుటకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏప్రిల్ 1వ తేదీన పింఛనుదారుల ఇంటికి వెళ్ళి పింఛను పంపిణీ చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఏప్రిల్ 1వ తేదీన పింఛనుల పంపిణీ చేయుటకు ముందే వాలంటీర్లు అందరూ తప్పకుండా నూతన మొబైల్ యాప్ (1.2) ను తమ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పింఛను పంపిణీ చేయుటకు వాలంటీర్లు వాళ్ళ మొబైల్ లలో లాగిన్ అయ్యి పింఛను పంపిణీ ప్రారంబించాలి. వాలంటీర్ల లాగిన్లో కనబడని పింఛనుదార్లకు పింఛను ఇచ్చుటకు యాప్ లో “సెర్చ్ ఆప్షన్” ఇవ్వడం జరిగిందని, పింఛనుదారుడి యొక్క ఐ.డి. ద్వారా సెర్చ్ చేసి వివరములు సరిచూసుకొని పింఛను పంపిణీ చేయవచ్చన్నారు.
కొవిడ్-19 లాక్ డౌను దృష్ట్యా పింఛనుదారులకు రాష్ట్ర పరిధిలో పింఛను “పోర్టబిలిటీ” ద్వారా పింఛను పంపిణీ చేయవచ్చునన్నారు. కరోనా వైరస్ ధృష్ట్యా, ఏప్రిల్ నెల పింఛను పంపిణీ ప్రక్రియలో పింఛనుదారుల వేని ముద్రలు తీసుకొనే ప్రక్రియ రద్దుచేయబడినదన్నారు. అంతేకాక పింఛను ఇచ్చేటప్పుడు అక్విటెన్స్ పై సంతకములు గానీ, వేనిముద్రలు గానీ తీసుకోనవసరం లేదని, ఇది ఇంతకుముందు ఇచ్చిన సూచనలలో మార్పుగా గమనించాలన్నారు. పింఛనుదారులకు పింఛను మొత్తం ఇచ్చిన తదుపరి, పింఛనుదారుడు నగదు తీసుకున్న తరువాత పించన్ దారుడు కనబడేలా స్పష్టముగా ఫోటో తీయాలన్నారు. తదుపరి ఫోటోను జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేయబడుతుందన్నారు. ఇంటింటికీ వెళ్ళి పింఛను పంపిణీ చేసిన సమయంలో సామాజిక దూరం (తగినంత దూరం) పాఠించాలని, పింఛనుదారులు ఇంటినుండి బయటకు రానక్కరలేదన్నారు.
పింఛనుల పంపిణీ ఎంపిడిఓ/మున్సిపల్ కమిషనర్లు లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, పింఛనుల పంపిణీ త్వరితగతిన జరిగేటట్లు చూడాలన్నారు. జిల్లాకలెక్టర్ వారు, పంపిణి సమయంలో పంపిణి దారులుకు పోలీస్ వారు ఎటువంటి ఆటంకం కలిగించకుండా వారియొక్క గుర్తింపు కార్డులను పరిగణలోనికి తీసుకొని సహకరించాలని తెలిజేసారన్నారు. పంపిణి చేయు సమయములో కరోనా వైరస్ ధృష్ట్యా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ తరచుగా చేతులు సుభ్రపరచుకొని, సామజిక దూరాన్ని పాటిస్తూ పంపిణి చేయాలని ఆదేశించారన్నారు. జిల్లాకలెక్టర్ వారు టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబందిత మండల మరియు గ్రామస్తాయి అధికారులు వరకు వివరించారన్నారు. ఏప్రిల్ 1వ తారీకున మొత్తం 3,26,414 పించను దారులకు, రూ.77.16 కోట్లు పంపిణి చేయబడుతుందని పిడి తెలిపారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...