Followers
అన్నార్తులకు చేయూత
వలస కూలీలు స్వీయ నిర్బంధం తప్పదు.
పెన్ పవర్.. వి మాడుగుల.
గ్రామాల్లోకి వస్తున్న వలస కూలీలు స్వీయ నిర్భంధం తప్పదని మాడుగుల ఎస్ ఐ పి రామారావు అన్నారు. ఆదివారం సాయంత్రం వమ్మలి గ్రామాన్నిసందర్శించారు చెన్నై నుంచి17 మంది వలస కూలీలు శనివారం ఉదయం గ్రామానికి వచ్చిన విషయం తెలుసుకున్న ఆయన వారితో మాట్లాడారు కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న తమిళ్ నాడు ప్రాంతం నుంచి గ్రామానికి చేరుకున్నారు 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఇళ్ల కే పరిమితం కావాలని సూచించారు. కరోనా వైరస్ 14రోజుల గాని దాని ప్రభావం బయటపడని ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ఇల్లు విడిచి బయటకు రావద్దని హితవు పలికారు. తోటి ప్రజలకు సమస్యలు తలెత్తకుండా వలస కూలీలు సహకరించాలని ఆయన అన్నారు. 17 మంది చెన్నై నుండి వచ్చిన వలస కూలీలు రోకలి తిరుగుతున్నట్లు వాలెంటర్ల్లు మాటలు కూడా తడ చెవిన పెట్టినట్లు వదంతులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు . ఆదివారం అయినప్పటికీ ఎస్సై వలస కూలీల తో మాట్లాడి ఇంటికే పరిమితం కావాలని హెచ్చరించారు.
జివిఎంసికి 40000 మాస్కులు వితరణ చేసిన కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
విశాఖపట్నం, పెన్ పవర్
పది లక్షలు విలువచేసే 40000 రక్షణ మాస్కులను కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ విశాఖ యూనిట్ హెడ్ మరియు వైస్ ప్రెసిడెంట్ కుమరేషన్, మానవవనరుల హెడ్ రంగ కుమార్తో కలసి జివిఎంసి అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావుకు, జివిఎంసి ప్రధాన వైద్యాధికారి డా.కె.ఎస్.ఎల్.ఎన్.జి శాస్త్రి సమక్షంలో అందజేశారు. కరోనా వైరస్ నియంత్రణలో పాలుపంచుకొని సహాయ సహకారాలు అందిస్తున్న కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యాజమాన్యానికి, అధికారులకు జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన అభినందనలు తెలిపారు.
రొయ్యల రైతులు ఆందోళన చెందవద్దు
మధ్యవర్తులు మాటలు నమ్మవద్దు
రొయ్యలును గిట్టుబాటు ధరలకు విక్రయించాలి
మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత
విజయనగరం, పెన్ పవర్
కోవిడ్ – 19 (కరోనా) ప్రభావం వలన ఆక్వా రంగం నష్ట పోకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపడుతుందని మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత తెలిపారు. అందులో భాగంగా మత్స్య శాఖ అధికారులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ, సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతిదారులు సంఘం, ఆంధ్ర ప్రదేశ్ వారు సంయుక్తంగా రొయ్యలకు ఈ క్రింది విధముగా నిర్దిష్ట ధరలును నిర్ణయించారు.
క్రమ సంఖ్య | రొయ్యల సంఖ్య (కౌంట్ ఒక కేజీకి) | ధర(రూపాయలలో) |
1 | 30 | 430 |
2 | 40 | 310 |
3 | 50 | 260 |
4 | 60 | 240 |
5 | 70 | 220 |
6 | 80 | 200 |
7 | 90 | 190 |
8 | 100 | 180 |
ధరలు ఏప్రెల్ 14వ వరకు అమలులో ఉండునని, ఈ ధరలు కాకుండా వేరే ధరలుకు అమ్మినా, కొనుగోలు చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ధరలును సంబంధిత గ్రామ సచివాలయాలనందు ప్రదర్శించడమైనదని, రొయ్యల రైతులు ఆందోళన చెందకుండా, మధ్యవర్తులు మాటలు నమ్మకుండా రొయ్యలును గిట్టుబాటు ధరలకు అమ్మకం చేపట్టవలసినదిగా కోరారు.
కరోనా సహాయ నిధికి పలువురి విరాళాలు
రూ.40 వేలు విరాళంగా ఇచ్చిన బి.సి.సంక్షేమ అధికారులు
విజయనగరం, పెన్ పవర్
జిల్లాలో కరోనా సహాయనిధికి పలువురు ఉద్యోగులు విరాళాలు అందజేశారు. జిల్లా బి.సి.సంక్షేమ శాఖలో హాస్టల్ సంక్షేమ అధికారులుగా ఎస్.కోట లో పనిచేస్తున్న ప్రకాష్ కుమార్ రూ.30 వేలు, చీపురుపల్లి లో పనిచేస్తున్న అనురాధ రూ.10 వేలు అందజేశారు. ఈ మేరకు చెక్కులను జిల్లా బి.సి.సంక్షేమ అధికారి డి.కీర్తి నేతృత్వంలో సోమవారం జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ కు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.
రాచపల్లి ఒమ్మంగి లో కరోనా కలకలం.
జిల్లాలో 5వేల పడకలతో క్వారంటైన్ సెంటర్లు
ప్రతీ మండలంలో ఒక కేంద్రం ఏర్పాటు
జాయింట్ కలెక్టర్-2 ఆర్.కూర్మనాధ్
వలస కూలీలు, అనాధలకోసం సహాయ కేంద్రాలు
జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు
తాశీల్దార్లు, ఎంపిడిఓలతో వీడియో కాన్ఫరెన్స్
విజయనగరం, పెన్ పవర్
జిల్లాలో మొత్తం ఐదువేల పడకలతో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్-2 ఆర్.కూర్మనాధ్ చెప్పారు. దీనిలో భాగంగా కనీసం వంద పడకలతో ప్రతీ మండలంలో ఒక క్వారంటైన్ కేంద్రాన్నిఏర్పాటు చేయాలని ఆదేశించారు.
తాశీల్దార్లు, ఎంపిడిఓలతో సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జెసి 2 మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నాటికి అన్ని మండలాల్లో క్వారంటైన్ కేంద్రాలను కావాల్సిన వసతులతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికోసం హాస్టల్ భవనాలు, హొటళ్లు, కల్యాణ మండపాలు ఇలా అందుబాటులో ఉన్న వాటిని గుర్తించాలని సూచించారు. ప్రతీ కేంద్రానికి ఒక నోడల్ ఆఫీసర్‌ను, అతని ఆధ్వర్యంలో పనిచేసేందుకు ఒక బృందాన్ని నియమించాలని సూచించారు. ఈ కేంద్రాల్లో వసతులకు ఎటువంటి లోటు లేకుండా, పడకలు, బాత్‌రూములు, త్రాగునీరు తదితర అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని స్పష్టం చేశారు.
జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు మాట్లాడుతూ వలస కూలీలు, విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చిక్కుకుపోయినవారు, అనాధల కోసం రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల అలాంటి వారిని గుర్తించడం జరిగిందని, వారికి తక్షణమే భోజన సదుపాయాన్ని కల్పించాలన్నారు. ఒకవేళ ఎవరైనా భోజనం చేయడానికి ఆసక్తి కనపర్చకపోతే, వారికి నిత్యావసర సరుకులను అందజేయాలని సూచించారు. వీటికోసం వసతి గృహాలను, కెజిబివి పాఠశాలలను తీసుకోవాలన్నారు. ప్రతీ కేంద్రం వద్దా బోర్డును ఏర్పాటు చేయాలని, ఆయా కేంద్రాల పరిధిలో ఉన్నవారి పేర్లతో రిజిష్టర్ తయారు చేయాలని సూచించారు. అలాగే వీరికి ఆయా హాస్టళ్లలో ఇప్పటికే స్టాక్ ఉన్న బియ్యం, పప్పులు తదితర సరుకులను వినియోగించాలని, అవికూడా చాలకపోతే ప్రక్క హాస్టల్‌లోని సరుకులను కూడా తీసుకోవాలని చెప్పారు. తీసుకున్న సరుకులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆయా హాస్టళ్లకు నగదు చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే భోజనం నాణ్యతలో ఎక్కడా తేడా రాకుండా చూడాలని, ఈ కేంద్రాలకు ఆయా వసతిగృహాల సంక్షేమాధికారులే ఇన్ఛార్జిలుగా వ్యవహరిస్తారని డిఆర్ఓ స్పష్టం చేశారు.
లీఫ్ సెంటర్స్ జిల్లా నోడల్ ఆఫీసర్, జిల్లా అటవీశాఖాధికారి లక్ష్మణ్, డిపిఓ మరియు సాంఘిక సంక్షేమశాఖ డిప్యుటీ డైరెక్టర్ కె.సునీల్‌రాజ్‌కుమార్, జిల్లా బిసి సంక్షేమాధికారి కీర్తి, జిల్లా పరిషత్ సిఇఓ టి.వెంకటేశ్వర్రావు తమ శాఖల పరంగా మాట్లాడి, తాశీల్దార్లకు, ఎంపిడిఓలకు, వసతిగృహ సంక్షేమాధికారులకు వివిధ సూచనలిచ్చారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...