Followers

ఇల్లు వదలకండి...." అతక బెడతారు"







 

-ప్రజలకు మండల అధికారులు హెచ్చరిక

-ఏప్రిల్ 15 వరుకు ఇంట్లో లేక పోతే మళ్ళీ మాస్క్

-పోలీసుల ఆధ్వర్యంలో కిరాణా షాపు వద్ద వినియోగ దారులకు కుర్చీలు ఏర్పాటు

-చౌక దుకాణాలను పర్యవేక్షణ చేసిన తహశీల్ధార్, ఎస్ ఐ లు

-కొండరెడ్డి గ్రామాలకు బియ్యం నిత్యావసర వస్తువులు పడవ ద్వారా రవాణా

-విధులు కట్టుదిట్టంగా నిర్వర్తిస్తున్న పోలీసులు

 

వి.అర్.పురం, పెన్ పవర్

 

మండలంలో ఉదయం 11 గంటల వరకు స్థానిక ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఎస్ ఐ లు వెంకటేష్, చంటి, తహశీల్ధార్ పర్మిషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు నిర్ణయించిన సమయానికి  కాకుండా మిగతా సమయంలో విధులకు భిన్నంగా ప్రవర్తిస్తున్న వారిపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.  ఏప్రిల్ 15 వరుకు ఇంట్లో లేక పోతే మళ్ళీ మాస్క్ వేసుకొని ఇంట్లోనే వుండే పరిస్థితి వుంటదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో  మండల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కిరాణా షాపుల వద్ద కూడా నిలుచొని ఉన్న వినియోగ దారులకు ఎస్ ఐ వెంకటేష్  ఆధ్వర్యంలో కుర్చీలు ఏర్పాటు చేయించారు. అదే విధంగా రేషన్ షాపుల వద్ద డీలర్లకు ,వాలంటీర్ల ఎస్ ఐ చంటి సూచనలు చేస్తూ వినియోగ దారులకు వాలంటీర్ల ద్వారా   బియ్యం పంపిణీ చేయించారు. మండల నలుమూలలో జరుగుతున్న విషయాలపై స్థానిక తహశీల్ధార్ శ్రీధర్ అధికారులను , మెడికల్, వాలంటీర్, వి.అర్.ఓ, వి.అర్.ఏ లను సమన్వయ పరుస్తూ ప్రభుత్వం ద్వారా అందవలసిన బియ్యం, నిత్యావసర వస్తువులు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కొండల్లో ఉన్న కొందరెడ్లకు సైతం గోదావరి నది ఉండటంతో పఫేవల ద్వారా వారికి బియ్యం అందే విధంగా చూశామని తెలిపారు. మండలంలో కొత్తవారు వచ్చినా, జ్వరాలతో, ఇతర కారణాలతో బాధపడుతున్న అనారోగ్యంతో ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రులలో మెడికల్ అధికారులు సుందర ప్రసాద్, నాగార్జున  పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది ఎలా ఉండగా స్థానిక తహశీల్ధార్ శ్రీధర్, ఎస్ ఐ వెంకటేష్,మెడికల్ అధికారి సోములగూడెం, సున్నంవారిగూడెం గ్రామాలలో పర్యవేక్షణ చేశారు. ఆ ప్రాంతంలో క్వారెంటైన్ వార్డు ఏర్పాటు చేయడానికి ఆశ్రమ పాఠశాలలో ఎలా ఉంటదని పరిశీలించారు.


 

 




 

 


 



 



గవర్నర్ తో సమావేశమైన సీఎం


అమరావతి, పెన్ పవర్


ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమావేశం


రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసకుంటున్న చర్యలను, లాక్‌డౌన్‌ పరిస్థితులను సీఎం జగన్‌  గవర్నర్‌కు వివరించారు.


కరోనా వ్యాధి , ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గవర్నర్‌ కార్యాలయంలోకి వెళ్లే ముందు శానిటైజర్‌తో తన చేతులను శుభ్రం చేసుకున్న సీఎం జగన్ ఈ సమావేశంలో సామాజిక దూరం పాటించిన గవర్నర్, సీఎం జగన్


ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులు, వైద్య శాలలు ఎప్పుడైనా స్వాధీనం


అమరావతి, పెన్ పవర్


జిల్లాల కలెక్టర్లకు అధికారాలు


 రాష్ట్రంలోని అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లకు అధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ మెడికల్ కళాశాలలు, ఆసుపత్రులు, ప్రైవేట్ వైద్యశాలలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అధికారాన్ని కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక సదుపాయాలు, సిబ్బంది సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. 


కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు ఐసోలేషన్ కోసం చర్యలు చేపట్టాని ప్రభుత్వం సూచించింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, నర్సులు, ఇతర సిబ్బంది...అందుబాటులో ఉండాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరాల మేరకు ఆసుపత్రులను ఇప్ప టికే గుర్తించిన ప్రభుత్వం... కరోనా కేసులు పెరిగితే ప్రైవేటు వైద్యశాలలు, మెడికల్ కళాశాలలు, అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.


ఎంవీపీలో నిరుపేదలకు ఆహారం, పండ్లు పంపీణీ:


ఎంవీపీలో నిరుపేదలకు ఆహారం, పండ్లు పంపీణీ: బిజెపి నాయకురాలు డి. అరుణ కుమారి

 

ఎంవీపీ కాలనీ, పెన్ పవర్ 

.

 

కరోనా మహమ్మారి  ప్రపంచం మీద విరుచుకుపడుతోంది,  లాక్ డౌన్ పేరిట అందరూ ఇళ్లకే పరిమితమైన  పరిస్థితి నెలకొంది. కూలాడితే కుండాడని పరిస్థితిలో ఉన్నవాళ్ల పరిస్థితి మరీ దయనీయం, ఏపూట కాపూట సంపాదనతో కడుపునింపుకునే వాళ్లవి మరీ దుర్భర పరిస్థితి, చేసేందుకు పనిలేక చేతిలో చిల్లిగవ్వ లేక బాధ పడేవారికి ఆపన్న హస్తం అందించేందుకు నేను సైతం అంటూ ముందుకొచ్చారు విశాఖపట్నం బీజేపీ నాయకులు ద్వారపూడి అరుణ కుమారి, ఎం.వీ.పీ కాలనీ ఫుడ్ పాత్  రోడ్ల ప్రక్కన నివసిస్తున్న అనాధాలకు ఆహరం పండ్లు మజ్జిగ   పంచిపెట్టి తన ఉదారతను చాటుకున్నారు. 

ఈ సందర్భంగా ఆమెను పలకరించిన '' పెన్ పవర్ " కు  అరుణ కుమారి చెప్పిన సమాధానం  ఆమె మాటల్లోనే...  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాటివారికి సాయపడటంలో ఉన్న ఆనందం మనల్ని మనుషులుగా మరో మెట్టు ఎక్కిస్తుందనడంలో సందేహమే లేదు. మన ఆస్థుల్ని పంచిపెట్టాల్సిన పనిలేదు, మనకున్నదాంట్లో  వేరొకరి ఆకలి తీర్చగలిగితే అంతకు మించిన ఆనందంగా 

వర్ణనాతీతం అన్నారు  ఆమె.

ఈ కార్యక్రమంలోఅరుణ కుమారి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

జిల్లాకు వచ్చి లాక్ డౌన్ లో చిక్కుకున్న వారికి భోజన వసతి సౌకర్యాలు


 


ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికీ 14 రోజుల గృహనిర్బంధం తప్పనిసరి


రేషన్ కోసం ప్రజలు గుంపులుగా రాకుండా చర్యలు చేపట్టాలి


కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు, ఉద్యోగుల సేవలు


వ్యాధి లక్షణాలు వున్నవారు దాచిపెట్టొద్దు - వైద్యులను సంప్రదించి వారి సలహాలు పొందాలి


కరోనా సహాయక చర్యలపై టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ ఆదేశాలు


విజయనగరం, పెన్ పవర్ 


జిల్లాకు ఉపాధి, విద్య, ఇతర అవసరాల నిమిత్తం వచ్చి లాక్ డౌన్ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా జిల్లాలో చిక్కుకొని బయటకు వెళ్లలేని పరిస్తితులు ఏర్పడిన నేపథ్యంలో అటువంటి వారందరికీ ప్రభుత్వం ద్వారానే వారికి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వివిధ మండలాలు, పట్టణాల్లో వున్న ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారికి ఆయా ప్రాంతాల్లోని సంక్షేమ హాస్టళ్లలో వారికి సోమవారం నుండే భోజన వసతి సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా అధికారులు, మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్ లతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.ఏం.హరిజవహర్ లాల్ ఈ మేరకు ఆయా మండలాలు, పట్టణాల్లో వున్న బి.సి., సాంఘిక, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ రెవెన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్ లను ఆదేశించారు. భోజన, వసతి సౌకర్యాలు అవసరమన వారిని గుర్తించే ప్రక్రియ ఆదివారం సాయంత్రం నాటికి పూర్తి చేసి సోమవారం నుండే వారికి అన్నీ సౌకర్యాలతో నాణ్యమైన భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇతర ప్రాంతాలకు చెందిన కూలీలు, కార్మికులు, విద్యార్దులు వంటి వారందరికీ వచ్చే 15 రోజులపాటు స్థానికంగానే వుండేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని, అటువంటి వారు జిల్లాలో ఏ ప్రాంతంలో వున్నా ఆయా మండలాల తహశీల్దార్ లు, లేదా మున్సిపల్ కమిషనర్ లను తక్షణం సంప్రదించాలని కోరారు. సంక్షేమ వసతి గృహాల్లో ఇప్పటికే అందుబాటులో వున్న సరుకులను వినియోగ్గించుకోవాలని అవసరమైతే ప్రకృతి విపత్తుల నిధుల నుండి అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. కూలీలు వసతి కలిగి వుంది భోజన సౌకర్యాల కోసం బియ్యం పప్పు వంటి సరకులు కావాలని కోరినా సమకూర్చాలని సూచించారు. దీనితో పాటు పట్టణాల్లో వుండే అనాధలు, నిరాశ్రయులకు కూడా భోజన వసతి సౌకర్యాలు సమకూర్చాలని కలెక్టర్ తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లను  ఆదేశించారు.


        జిల్లాకు లాక్ డౌన్ విధించిన తర్వాత ఇతర రాష్ట్రాల నుండి వచ్చి గ్రామాలు, పట్టణాల్లో వుంటున్న వారికి కూడా 14 రోజుల గృహ నిర్బంధం తప్పనిసరి చేయాలని వారి వల్ల కూడా ఆయా ప్రాంతాల్లోని వారికి ఈ వ్యాధి సోకే అవకాశం వున్నందున జాగ్రత్తలు అవసరమని చెప్పారు. వారం రోజుల క్రితం విదేశాల నుండి జిల్లాకు వచ్చిన వారిని వైద్య సిబ్బంది నిత్యం గమనించాలని వారిలో ఏమైనా వ్యాధి లక్షణాలు వుంటే తక్షణమే వైద్యాధికారుల వద్దకు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించాలన్నారు. జిల్లాకు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు తమలో కరోనా వ్యాధి లక్షణాలైన జలుబు, జ్వరం, పొడి దగ్గు వంటి లక్షణాలు వుంటే వాటిని దాచి పెట్టకుండా వైద్యుల సలహాలు పొందాలని కలెక్టర్ సూచించారు. తద్వారా వారికి, వారి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతం వారికి కూడా ఈ వ్యాధి సోకకుండా మేలుచేసిన వారవుతారని పేర్కొన్నారు.


        జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్ పంపిణీకి జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో రేషన్ డీలర్లు తమ డిపోల వద్ద రేషన్ కార్డు దారులు సామాజిక దూరం పాటించేలా మంచి ఏర్పాట్లు చేశారని, అయితే రేషన్ కోసం ప్రజలు గుంపులుగా వస్తున్నట్లు తెలుస్తోందని దీనిని నివారించాల్సి వుందన్నారు. రేషన్ డిపోల వద్ద తగినంత నీడ వుండేలా ఏర్పాట్లు చేయాలని అవసరమైతే టార్పాలిన్లు వంటివి వేసి ఎండలో నిల్చోకుండా చూడాలని కోరారు. ఒక్కో వాలంటీర్ పరిధిలోని కార్డు దారులకు ఒక్కో రోజున అందించేలా షెడ్యూల్ రూపొందించి ఆరోజున మాత్రమే వారు రేషన్ కోసం వచ్చేలా ముందుగానే వాలంటీర్ల ద్వారా ఆయా కార్డుదారులకు తెలియజేయాలని చెప్పారు. జిల్లాలో ఏప్రిల్ 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ జరుగుతుందనే విషయాన్ని కార్డుదారులకు తెలియజేసి వారంతా వారికి కేటాయించిన తేదీ, సమయాల్లో వచ్చేలా చూడాలన్నారు.


        పట్టణాల్లో చాలా ఇళ్ళలో పని వారు వుంటారని వారి ద్వారా కుటుంబంలోని సభ్యులకు కరోనా వ్యాధి సంక్రమించకూడా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వారు ఒకటి కంటే ఇళ్ళలో పనికి వెళ్ళే అవకాశం వున్నందున వారు వచ్చినపుడు చేతులు సబ్బుతో కడిగించడం, మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. వీలైతే ఈ వ్యాధి ప్రభావం తగ్గే వరకు ఇళ్ళలో  పనికి రాకుండా చూడాలని, తామే ఆ పనులు చేసుకోవాలని  తెలిపారు.


ఆదివారం రోజున ప్రజలు చేపలు, మాంసం దుకాణాల వద్దకు గుంపులుగా చేరి సామాజిక దూరం పాటించడం లేదని పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ లు, మండలాల్లో తహశీల్దార్ లు దీనిపై జాగ్రత్త వహించి అవసరమైతే గ్రామాలు, పట్టణాల్లో జనసమ్మర్ధం లేని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్నీ మార్కెట్ ల వద్ద, కూరగాయలు విక్రయించే ప్రాంతాల్లో మైకుల ద్వారా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.


జిల్లా ప్రజానీకానికి కరోనా వ్యాధి సంక్రమించే విధానం, పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటామన్నారు. జిల్లాలో వైద్య సిబ్బంది, కరోనా నియంత్రణ చర్యల్లో పాల్గొనే ఇతర శాఖల సిబ్బందికి అవసరమైన గ్లౌసులు, మాస్క్ లను సరఫరా చేసేందుకు డి.ఆర్.డి.ఏ., మెప్మా ప్రాజెక్ట్ డైరక్టర్ లు, పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ లతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విశాఖలోని కొన్ని పరిశ్రమల ద్వారా వీటిని తయారు చేస్తున్నారని అక్కడ నుండి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.


మండుటెండలో గ్రామ వాలంటరీ మహిళలు


పెన్ పవర్ కూనవరం.


కోవిడ్ 19 వైరస్ ప్రబలకుండా ఉండడానికి ఈనెల 29 నుండి ఏప్రిల్ 15వ తారీఖు వరకు చౌక దుకాణాల వద్దకు రాకుండా తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క ఇంటింటికి ఉచితంగా గ్రామ వాలంటరీ, వీఆర్ఏ లాచే మండలంలోని 16 పంచాయతీలకు ఆటోల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా చౌకదుకాణాల నుండి  నిత్యవసర వస్తువులను ఆదివారం నాడు పంపిణీ చేశారు. ఏప్రిల్ 15వ తారీఖు వరకు అందుబాటులో చౌక దుకాణాలుఉంటాయి కనుక ఎవరూ కూడా ఇంటి వద్ద నుండి వెళ్లకుండా ఉండాలని, వారి వారి ఇళ్ల వద్దకు గ్రామ వాలంటరీ లచే పంపిణీ చేయడం జరుగుతుందని తొందరపడి బయటకు రావద్దని  మండల తాసిల్దార్ ఏవీఎల్ నారాయణ అన్నారు. తెలియక కొంతమంది రేషన్ దుకాణాల వద్దకు వచ్చిన తిరిగి వారి ఇళ్లకు పంపించడం జరిగిందని తెలిపారు. రేషన్ షాపుల వద్ద స్టాక్  ఉన్నందున ఎవరూ కూడా భయపడవలసిన అవసరం లేదని సూచించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు తాముగా స్వీయ నిర్బంధం పాటించాలని, వైరస్ ను తరిమికొట్టే బాధ్యతలో  ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇదంతా ఇలా ఉంటే మండుటెండలో గ్రామ వాలంటరీ మహిళలు రేషన్ దుకాణాల వద్ద వారే తూకం వేయించుకొని ట్రాక్టర్, ఆటో లోకి వారే  లోడ్ చేసుకోవడం కొసమెరుపు.


వలస జనానికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు


 


 


విశాఖపట్నం, పెన్ పవర్ 


 లాక్ డౌన్ వలన జివిఎంసి పరిధిలో నిలిచిపోయిన ఇతర రాష్ట్రాల, ఇతర జిల్లాల నుండి వచ్చిన వలస జనానికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు విశాఖపట్నం, మార్చి 29 :- కరోనా వైరస్ వ్యాధి నియంత్రణలో భాగంగా ఏప్రిల్ 14 వతేది వరకు ప్రభుత్వమ లా డౌన్ ప్రకటించినందున, ఇతర రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి వచ్చిన వలసదారులు, రోడ్డు మార్గంలో చిక్కుకుపోయిన వాహన కార్మికులు మరియు బిచ్చగాళ్ళ గూర్చి తాత్కాలిక ఆశ్రయ శాలలు ఏర్పాటు చేయవలసినదిగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా, జివిఎంసి కమిషనర్ వారు ఆదేశానుసారం, నగర పోలీసు వారి సహకారంతో కార్పోరేషను పరిధిలో 5 ప్రాంతాలలో తాత్కాలిక షెల్టరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలలో జివిఎంసి తరుపున నివాసానికి అనువుగా అవసరమైన బెడ్స్, దుప్పట్లు, మంచినీటి సదుపాయాలు, మరుగుదొడ్లు, స్నానగదులు ఏర్పాట్లు, విద్యుత్ సదుపాయం, ఆహారం మొదలగు సదుపాయాలు కేంద్రాలలో ఉన్న ఆశ్రయదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించవలసినదిగా జివిఎంసిలోని ఆయా విభాగాల ఇంజనీరింగు, ప్రజారోగ్యశాఖ, యుసిడి విభాగపు ఉన్నతాధికారులకు, కమిషనరు ఆదేశాలు జారీచేశారు. 5 కేంద్రాలలో కూడా 24 గంటలు నిరంతరంగా పర్యవేక్షించేందుకు, రెండు షిప్టులలో ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు ఒక షిప్టు, సాయంత్రం 6.00 గంటల నుండి ఉదయం 6.00 వరకు రెండవ షిప్టులో పనిచేసేటట్లుగా ప్రత్యేక అధికారులను సిబ్బందిని నియమించారు. ఆశీలుమెట్ట వేమన మందిరం షెల్టరుకు ప్రత్యేక అధికారులుగా ఎ.వి.రమణారావు డిఎంసి, 9912349438 (షిఫు-ఎ), శ్రీమతి పి.వి.లక్ష్మి టి.ఇ, 7901610057 (షిప్టు-బి) సుబ్బలక్ష్మీ కళ్యాణ మండపం, న్యూకాలనీ, కె. పైడితల్లి ఎపిడి 8179288053 (షిప్టు -ఎ) పి.రమ్యకృష్ణ టి.ఇ 7729878881(షిఫ్టు-బి), వివేకానంద కళ్యాణ మండపం, నక్కవానిపాలెం జి.కుమారస్వామి డిఎమ్ సి 9848055179 (షిప్టు-ఎ), ఆర్.రమేష్, డిఎమ్ సి 9666683949(షిఫ్టు-బి), సాంఘిక సంక్షేమ హాస్టల్, ఎం.వి. కాలనీకి పుణ్యవతి, సోషల్ వర్కర్ 7729995961(షిఫ్ట -ఎ), కె.పద్మావతి సోషల్ వర్కర్ 7729995963(షిపు-బి) యూత్ ట్రయినింగ్ కేంద్రం, వేపగుంటకు బి.ప్రసాదరావు ఎపిడి 9848308835(షిప్టు-ఎ) వై.సంతోష్ కుమార్, సోషల్ వర్కర్ 7729995938 (షిప్టు-బి) లను ప్రత్యేకాధికారులుగా నియమించారు. షెల్టర్ల నోడల్ అధికారిగా పి.డి., యుసిడి వై.శ్రీనివాసరావును అత్యవసర పనులు నిమిత్తం కమిషనరు నియమించారు. లా డౌన్లో చిక్కుకున్న వలసదారులు, వాహనాల కార్మికులు మొదలగువారు ఆయా కేంద్రాలను ఉ పయోగించుకోవలసినదిగా గ్రూపు సముహాలుగా బయట తిరగకుండా లాక్ డౌన్ విధానంలో జీవనం గడపాలని, దీనివలన కరోనా వైరస్ వ్యాప్తి జరుగుకుండా ఉండేందుకు దోహదపడతారని, కమిషనరు వారు కోరారు. నగర పరిధిలో ఆశక్తి కలిగిన వ్యాపార సంస్థలుగాని, కాంట్రాక్టర్లుగాని, స్వచ్ఛంద సంస్థలుగాని, ధార్మిక సంస్థలువారు గాని ఈ కేంద్రాలలో ఫలహారం, భోజనసదుపాయలు ఏర్పాటు చేయదలచుకున్నచో జివిఎంసి యుసిడి ప్రాజెక్టు డైరక్టరు శ్రీనివాసరావును సంప్రదించవలసినదిగా ఆయన పత్రికా ప్రకటనలో కోరారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...