Followers

తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ 


తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ 

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

తెలుగుదేశం పార్టీ  పేదల పార్టీ అని  ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ లు పేర్కొన్నారు. పార్టీ 37 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.  పరమేశ్వరి పార్క్ జంక్షన్ లో ఎన్టీఆర్ విగ్రహంకు  పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం  జోహార్  ఎన్టీఆర్ అనే నినాదాలతో పుష్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మాభిమానాని ఢిల్లీలో చాటి చెప్పిన ఘనుడు ఎన్టీఆర్  అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించిందన్నారు. కార్యక్రమంలో సీనియర్ తెదేపా నాయకులు  కొణతాల వెంకట్రావు ,మళ్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి


ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి

 

మండల అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్

 

రావులపాలెం,పెన్ పవర్

 

ప్రతి ఒక్కరూ వ్యక్తి గత శుభ్రతతో పాటు పరిశరాలను పరిశుభ్రంగా ఉంచాలని మండల అభివృద్ధి అధికారి జి.రాజేంద్రప్రసాద్ కోరారు. ఆధివారం మండలంలోని రావులపాలెం, ఊబలంక , పొడగట్లపల్లి, ఈతకోట, దేవరపల్లి,వెదిరేశ్వరం గ్రామాలలో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించి  ఆయా గ్రామాల కార్యదర్శులకు, పారిశుధ్య కార్మికులకు తగు సూచనలు చేసారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపట్టి గ్రామాల్ని పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేయలని కోరారు. ఈసందర్భంగా ఎంపిడిఓ రాజేంద్రప్రసాద్, ఈఓపిఆర్డీ గంగుల కృష్ణలు  మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేస్తూ అందర్నీ వణికిస్తున్న మహ్మమారి కరోనా వైరస్ ను అరికట్టేందుకు  లాక్ డౌన్ పాటించాలని కోరారు. వైరస్ విజృంభిస్తున్న కారణంగా మనమంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ  ఎవరికి వారు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. మహమ్మారి నియంత్రణ కోసం బాధ్యతగా వ్యవహరించాలని,రోడ్లపై తిరగటం నిషేధించడం జరిగినందున  ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని, ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించి తీరాలన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం లో మండలంలోని  గ్రామ వాలంటరీలకు ,వైధ్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ, సచివాలయం  సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిమ్మకాయల సాయిరామ్, మహ్మద్ అన్వర్, కె.వి.వి సత్యనారాయణ, యల్. వి. దుర్గాప్రసాద్, ఎమ్. సాయి పట్టాభిరామయ్య, నిమ్మకాయల బ్రహ్మజీ, పి.ఫణి,బి.వి.ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు

బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ





ప్రజలు గుమిగూడకుండా ఎస్సై బుజ్జిబాబు పర్యవేక్షణ

 

రావులపాలెం, పెన్ పవర్

 

మండలంలోని గ్రామాల్లోని చౌక ధరల దుకాణాల్లో కారోనా నేపధ్యంలో ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా ఆదివారం నిత్యావసర సరుకులైన  బియ్యం,కందిపప్పు ఉచితంగా పంపిణీ చేశారు. వినియోగదారులు    వరుసక్రమంలో వెల్లి రేషన్ సరుకులు తీసుకున్నారు. గ్రామ సచివాలయాల సిబ్బంది, రేషన్ షాప్ డీలర్లు, వాలంటీర్లు అందరూ కలిసి పంపిణీ చేపట్టారు. ఏరియాల వారీగా  గ్రామస్థాయి, మండలస్థాయి నాయకులు ఈ పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సరుకులను పంపిణీ చేశారు. మండలస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పంపిణీపై వివరాలు సేకరిస్తూ సలహాలు సూచనలు చేశారు.ఎస్సై పి.బుజ్జి బాబు రేషన్ షాపుల వద్ద జరుగుతున్న పంపిణీ తీరు పరిశీలించారు. జనం గుముకూడకుండా మనిషికి మనిషికి మధ్య ఒకొక్క మీటర్ దూరం ఉండేలా  మార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టారు.  కరోనా వైరస్ నేపద్యంలో ఈపాస్ మిషన్ లో కార్డుదారులకు బదులుగా ఇంచార్జ్  లుగా నియమించిన గ్రామ సచివాలయ సిబ్బంది వేలిముద్రలు వేసి రేషన్ అందించారు. వినియోగదారులు కూడా లైన్లో నిలబడి రేషన్ అందుకున్నారు.

 

 



 

ఇంటింటికి బియ్యం పంపిణీకి  సర్వం సిద్ధం


 


-అన్ని గ్రామాలకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధం చేసిన తహశీల్ధార్


-వాలంటీర్లను అప్రమత్తం చేసిన అధికారులు


-నేటి నుండి బియ్యం పంపినే


వి.ఆర్.పురం, పెన్ పవర్ 


 

మండలంలో ఉచిత బియ్యం పంపిణీకి మండల తహశీల్ధార్ శ్రీధర్ రంగం సిద్ధం చేశారు. మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న చౌక దుకాణాలను ఆయన సందర్షించి సేల్స్ మెన్ లకు సూచనలు చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు చే ఈ బియ్యం పంపిణీ చెయ్యడానికి సిద్ధం చేసినట్లు తెలిపారు. చౌక దుకాణాల నుండి నేరుగా వాహనాల ద్వారా ప్రతి ఇంటికి బియ్యం పంపిణీ చేయిస్తున్నట్లు తహశీల్ధార్ శ్రీధర్ తెలిపారు. కొల్లురు, గొందూరు గ్రామాలకు పడవల ద్వారా పంపించి బియ్యం పంపిణీ  చేయనున్నట్లు తెలిపారు. జీడిగుప్ప, ఇతర గ్రామాల్లో  అక్కడి వాలంటీర్ల సూచనలు చేశామని అన్నారు. దూరం నుండి వచ్చిన వారి వివరాలను సేకరించి  ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు.అనంతరం స్థానిక ఎస్ ఐ వెంకటేష్  ఆదివారం ఐదు బండ్లు సీజ్ చేసినట్లు తెలిపారు.

హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక యేర్పాట్లు

విజయనగరం, పెన్ పవర్ 


 


 జిల్లా ఎయిడ్స్ నివారణనియంత్రణ సంస్థ జిల్లాలో  ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ (APSACS) ఆదేశముల మేరకు హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తులకు జిల్లాలో covid-19 నియంత్రణలో బాగంగా లోక్ డౌన్ (Lock Down) ఉన్న సందర్బముగా ప్రత్యేక యేర్పాట్లు చేయదమైనది.  హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తులకు నెలకు మాత్రమే ఇచ్చే మందులను మూడు నెలలకు గాను ఒక్కసారే ఇవ్వటం జరుగుతుంది.  జిల్లాలో హెచ్.ఐ.వి  భాదితులు ఏ ప్రాంతంలో ఉన్నా,  వారి దగ్గరలో ఉన్న కమ్యూనిటి హెల్త్ సెంటర్ (CHC) (చీపురుపల్లిభోగాపురంబొబ్బిలిసాలూరుబాడంగిగజపతినగరంయెస్.కోటకురుపాం) మరియు జిల్లా కేంద్ర ఆసుపత్రి (DH), విజయనగరంఏరియా ఆసుపత్రి (AH), పార్వతిపురం కు వెళ్ళి మూడు నెలల మందులను పొందవచ్చు.  యెవ్వరు ప్రత్యేకముగా వారు నమోదు చేసుకున్నా కేంద్రానికి మాత్రమే వెల్లనవసరము లేదు వారికి పైన తెలిపిన యే కేంద్రము దగ్గరగా ఉంటే ఆ కేంద్రము నందు ART మందులు పొందవచ్చు.   ఈ సమాచారమును ప్రజలకు చేరేందుకు తగు సహకారము అందించవలసినదిగా అభ్యర్ధన.  మరింత సమాచారం కోసం సంప్రందించ వలసిన ఫోన్ నంబర్లు 08922-273403 (ART  సెంటర్ విజయనగరం), 08963-220295 (ART సెంటర్ పార్వతిపురం).



ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోని భీమవరం పట్టణ వాసులు


భీమవరం, పెన్ పవర్ 

 

ఆదివారం కావడంతో ఉవ్వెత్తున రోడ్ల పైకి ఎగసి పడ్డారు భీమవరం పట్టణ వాసులు ... ఓ పక్క ప్రపంచమంతటా కరోనా వైరస్ కు ప్రజలు బయపడుతుంటే ,మరో ప్రక్క  ప్రభుత్వాలు ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా పట్టించుకున్న పాపాన పోలేదు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణ ప్రజలు . ఉదయం 6 గంటలనుండి దిరుసుమర్రు రోడ్డు చాపల మార్కెట్ వద్ద మార్కెట్ చేసుకునేవారు కనీస వసతులు కూడా పాటించకుండా గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు . అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారు. ఇదిలా కోనసాగితే  కరోనా వైరస్ ఒకరి నుండి ఒకరికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ప్రమాదం పొంచిఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి ,భీమవారం నగర వాసులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని బట్టి పట్టణ వాసులు బయటకు వెలెలా కట్టడి  చేయవలసిందిగా ప్రజలు ఆధికారులని కోరుతున్నారు..

పెన్ పవర్ కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం


 

ఆచంట, పెన్ పవర్

 

పెన్ పవర్ దిన పత్రికలో ఆచంట నియోజక వర్గ అక్వా రైతులు పై శనివారం  ప్రత్యేక కథనం ప్రచురితం కావడం తో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదివారం అక్వా రైతులపై ప్రత్యేక చర్యలు చేపట్టింది.. ఆదివారం నుండి ప్రతీ రొయ్యల, చేపల రైతుల వద్ద నుండి చేతికి అందిన రోయిహల,చేపల పంటను దళారులు ఎగుమతులు లేవని, తక్కువ ధరకు గాని కొనుగోలు చేస్తే స్థానికంగా ఉన్న ప్రభుత్వ అధికారుల కు ఫిర్యాదు చేస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని  హెచ్చరించారు. ఈ నేపద్యంలో అక్వా రైతులు కు తమ పంటను అమ్ముకోవడానికి ఎటువంటి అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా వెంటనే దగ్గర్లో ఉన్న అధికారులకు సమాచారాన్ని అందించాలి అని తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...