సర్పంచ్ ఆహ్వానించకుండానే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన చైర్మన్ కిషన్ రావు
బెల్లంపల్లి, పెన్ పవర్మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లింగాల గ్రామపంచాయతీ లో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రంను చైర్మన్ కిషన్ రావు మాజీ సర్పంచ్ సత్తయ్య సీ.ఈ.వో మధుకర్ సెంటర్ ఇన్ ఛార్జ్ ఓడల హనుమంతు కలసి గ్రామ అ శివార్లలో అనగా రైతులకు అనుకూలంగా కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో వడ్ల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు మంగళవారం రోజున సిపల్లి లక్ష్మి పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా లింగాల గ్రామ సర్పంచ్ మాట్లాడుతు నన్ను పిలువకుండా ప్రోటోకాల్ పాటించ కుండా నే వడ్ల కొనుగోలు కేంద్రమును ప్రారంభించారు లింగాల సర్పంచ్ దళిత మహిళా కావడంతో నే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించలేదని . ఈ పరిణామం మనోభావనీ కించపరిచే చేశారని వాపోయారు ఈ కార్యక్రమం దళితుల ను కించపరిచే విధంగా ఉందని వారి మనోభావాలు దెబ్బతినేలా నడుచుకునేల ఉన్నాయని వారు వాపోయారు. వారిపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు .అలాగే వారిపై ఎస్సీ. ఎస్టీ. అట్రాసిటీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని. రేపు అధికారుల కు కు వినతి పత్రం అందజేస్తారని ని అధికారులకు కలెక్టర్ కి ఎమ్మార్వో కు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని . ఫిర్యాదు చేస్తానని.లింగాల సర్పంచ్ లక్ష్మి కోరారు.