పరిశ్రమలు ఆపి ఆక్సిజన్ కొరత తీర్చే దమ్ము లేదా !
కరోనా వ్యాప్తికి ప్రధాని, కేంద్ర ఎన్నికల సంఘం భాద్యత వహించాలి
కోవిడ్ భాదితులకు ధైర్యం కల్పించటంలోను, అండగా నిలవటంలోను నేతలు గైరుహాజరు
రాజమహేంద్రవరంలో గల పేపర్ మిల్స్, హార్లిక్స్ ఫ్యాక్టరీల ఆక్సిజన్ కరోనా భాదితులకు సరఫరా చేయాలి. నగదు రహిత కోవిడ్ వైద్య సేవలకు ప్రభుత్వం తక్షణ ఆదేశాలు జారి చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. కరోనా మొదటి సారి వచ్చి నప్పుడు ఎదురైన అనుభవాలను గమనించి కూడా మోది సర్కార్ భద్రతా చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, రెండో దఫా అది కూడా మే నెలలో కరోనా వైరస్ ప్రమాదం ముంచుకొస్తుంది అని నిఘా వర్గాలు కచ్చితమైన అంచనాలతో కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం తెలిపినా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించటంలో మోది సర్కార్ నిర్లక్ష్యం వహించిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . ఇంత ప్రమాదకర స్థాయిలో కోవిడ్ వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికి కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యతారాహిత్యంగా దేశ వ్యాప్తంగా ఎన్నికలు, ఉప ఎన్నికలు నిర్వహించి కరోనా మరణాలకు కారకులుగా నిలిచారని,రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గి నిబంధనలు విశ్మరించి భౌతికదూరం పెడచెవిన పెట్టి నిర్లక్ష్యంగా ఎన్నికల నిర్వహణ జరిపించారని, పోలింగ్ బూత్ లలో కనీసం శానిటేజర్స్, మాస్క్ లు కూడా సరఫరా చేయలేదని, మద్యం ఏరులై పారిందని, కరోనా జాగ్రత్తలు మత్తు బాబులు గాలికి ఒదిలి ఓటు వినియోగించుకున్నారని, కనీసం బ్రీత్ ఎనలైజర్స్ ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రాగణానికి భద్రత కల్పించలేకపోయారని ఆయన తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు. మరో సారి కోవిడ్ వైరస్ ప్రమాదం ముంచుకొస్తుందని భారత నిఘా వర్గాలు హెచ్చిరికలు చేసినప్పటికి మోది సర్కార్ నిర్లక్ష్యంగా లక్షల మంది హాజరయ్యే కుంభమేళాకు, సినిమాలకు,సినిమా హాల్స్ కు, మాల్స్, పబ్ లకు, బార్ లకు, విద్యా సంస్థలకు, మార్కెట్టు లకు, ఇతర బజార్లకు, అధికార పక్ష రాజకీయ సభలు, సమావేశాలకు కనీస నిబంధనలు కూడా పాటించని విధంగా అనుమతులు జారీచేయటం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. కరోనా భాదితులను అడ్డగోలుగా కొన్ని కార్పొరేట్, ప్రయివేట్ ఆసుపత్రులు ఆర్దికంగా దోచుకుంటున్నా ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తుందని,ఆక్సిజన్ సరఫరా చేయటం లో ఘోరంగా ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందుతుందని , కరోనా బాధితులకు సరఫరా చేసే వ్యేక్సింన్లు దళారుల చేతుల్లోకి ఎలా వెళుతున్నాయనే అంశం పై ప్రభుత్వ యంత్రాంగం సమాధానం చెప్పాలని, కొన్ని కొన్ని మందులు షాపుల్లో దొరక్కుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నా సంబంధిత శాఖలు గుడ్డి వాని పాత్ర పోషిస్తు అక్రమాలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆక్సిజన్ కొరత నివారించటానికి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వున్న పరిశ్రమలను తాత్కాలికంగా నిలిపివేసి ఆ పరిశ్రమల నుండి ఆక్సిజన్ సరఫరా జరిపించే చర్యలు ఎందుకు చేపట్టలేక పోతున్నారని, ఆక్సిజన్ లేక వేల మంది చనిపోతున్నా ప్రభుత్వాలు పరిశ్రమల యాజమాన్యం తో ఆక్సిజన్ సరఫరా ఎందుకు జరిపించలేక పోతున్నారని, సామాన్య ప్రజల ప్రాణాల కన్నా కార్పొరేట్, ప్రయివేట్ సంస్థలకు మేలు చేయటమే మోది సర్కార్ ప్రధాన లక్ష్యంగా కనబడుతుందని ఆయన అసహనం వ్యక్తం చేసారు. ప్రస్తుత కరోనా కష్ట కాలములో ఓట్లు వేయించుకున్న నేతలు అజ్ఞాతంలో వుంటు కరోనా భాదితుల దోపిడిని ప్రశ్నించడం లేదని, మొక్కుబడిగా ప్రకటనలుకు పరిమితం అయ్యి దొడ్డి దారిన అక్రమ వసూళ్లు లో వాటాలు తీసుకుంటున్నారని, కరోనా బాధితులకు అధికారిక సేవలు అందించటంలో గోదాముల్లో దాంకుంటున్నారని, ఈ కష్ట కాలంలో కరోనా భాదితులకు అండగా నిలవకుండా భాదితులను దోచుకుంటున్నారని, అనాదిగా ఓటర్లు ఒక రకమైన కుత్రిమ బలహీనతలుకు బానిసలుగా మారి ఈ తరహా నేతలకు జె జె లు కొట్టడం మనుకోలేక పోతున్నారని ఆయన ఆందోళన చెందారు. కార్పొరేట్, ప్రయివేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కార్డులపై జరిగే వైద్య సేవల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని,నగదు రూపంలో లక్షలు చెల్లించటానికి సిద్దపడే కొరోనా బాధితులను మాత్రమే ఆసుపత్రిలో జాయిన్ చేసుకుంటున్నారని, ఆరోగ్య శ్రీ పై తూ తూ మంత్రం గా కరోనా వైద్యం చేస్తు పంపించేస్తున్నారని, కరోనా పేరుతొ వైద్య సేవలు చేస్తున్నట్టు రికార్డుల్లో పేర్కొని ప్రభుత్వం నుండి పెద్ద మొత్తంలో నిధులు దోచుకుంటున్నారని, కరోనా పేరుతొ మరణించిన ఘటనలపై విచారణ కు ఆదేశిస్తే అనేక నిజాలు బహిర్గతం అయితాయని ఆయన తెలిపారు. ఏపిలో గల స్థానిక పరిశ్రమల నుండి ఆక్సిజన్ సరఫరా ను కరోనా భాదితులకు మాత్రమే వినియోగించు విధంగా తక్షణమే ప్రభుత్వ ఆదేశాలు జారి చేయాలని, ఇదే విధంగా భారత్ లో గల పరిశ్రమల నుండి ఆక్సిజన్ సరఫరా కరోనా భాదితులకు మాత్రమే సరఫరా జరిగే విధంగా అత్యవసర ఆదేశాలు విడుదల చేయాలని తూ గో జిల్లాలో గల పరిశ్రమల నుండి తక్షణమే మొత్తం ఆక్సిజన్ కరోనా భాదితులకు సరఫరా జరిగే విధంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలని, రాజమండ్రి లో గల అతిపెద్ద పరిశ్రమలైన పేపర్ మిల్స్, హార్లిక్స్ ఫ్యాక్టరి ఇతర పరిశ్రమ ల నుండి ఆక్సిజన్ సరఫరా జరిగే విధంగా తక్షణ ఏర్పాట్లు చేయాలని, ఇప్పుడైనా నేతలు దాగుడు మూతలు ఆపి కరోనా వైరస్ భాదితులకు రక్షణగా నిలవాలని, నగదు రహిత వైద్య సేవలు అమలు జరిపే చర్యలకు తగు ఆదేశాలు జారి చేయాలని ఆయన కోరారు. భారతదేశం లో కరోనా వైరస్ బారిన పడి మరణించిన ప్రతి మరణం కు ప్రధాని మోది, కేంద్ర ఎన్నికల సంఘం నిర్లక్ష్యం వుందని, మోది కి ప్రజల ప్రాణాల కన్నా కార్పొరేట్, ప్రయివేట్ సంస్థల పైనే మక్కువ అని, కరోనా ముసుగులో ప్రజల నుండి దోచుకున్న సొమ్మునే కార్పొరేట్ ప్రయివేట్ దిగ్గజాలు మోదీ ఎన్నికలకు పెట్టుబడి దారులుగా నిలుస్తారని , ప్రతి మారణానికి మోది సర్కార్ సమాధానం చెప్పాలని, కేంద్ర ఎన్నికల సంఘం పై భారత అత్యున్నత న్యాయస్థానం విచారణ కు ఆదేశించాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేసారు. సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ డివిఆర్ మూర్తి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ లంక దుర్గాప్రసాద్, దోషినిషాంత్, పి ప్రసాద్, వల్లి శ్రీనివాసరావు, వల్లి వెంకటేష్, ఖండవల్లి భాస్కర్, తమ్మన సతీష్, బర్ల సతీష్, తదితరులు పాల్గొనియున్నారు.