Followers

Showing posts with label FILM AND SPORTS. Show all posts
Showing posts with label FILM AND SPORTS. Show all posts

కళా తపస్వి 'కళా'దరుడికి ఘన సత్కారం

కళా తపస్వి 'కళా'దరుడికి ఘన సత్కారం 

ప్రపంచరంగస్థలంరోజునవండర్ బుక్ అఫ్ ఇంటర్నేషనల్ అవార్డు బహుకరణ.



నెల్లికుదురు, పెన్ పవర్

ప్రపంచ రంగస్థలదినాన్ని పురస్కరించుకొని మూడు రోజులుగా హైదరాబాద్ రవీంద్రబారతి లో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న కళా సంస్కృతిక ఉత్సవాలలో భాగంగా శుక్రవారం నాటక అకాడమీ  చైర్మన్ శివకుమార్ మరియు సీనియర్ కళాకారిణి రోజారమణి చేతులమీదుగా వండర్ బుక్ అఫ్ రికార్డు అవార్డు అందుకోవడం జరిగిందని మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి చెందిన డాక్టర్ ఆదూరి కళాదర్ రాజు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన విలేకరుల తో మాట్లాడుతూ గత యాబై సంవత్సరాలనుండి తాను పౌరాణిక, జానపద కళలను ప్రోత్సహించడం వలన ముఖ్యంగా తాను అల్లూరిసీతారామరాజు నాటకంలో నటించిన అల్లూరిసీతారామరాజు క్యారెక్టర్ ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడం వలన నాకు ఈ ఆరుదైన గౌరవం దక్కిందని ఈ విదంగా గ్రామీణ ప్రాంతాలలోని కళాకారులను గర్తించి వారిని ఒకే వేదిక మీదికి తెచ్చి సన్మానించడం శుభపరిణామమని తెలంగాణ సంగీత నాటక అకాడమీని కొనియాడారు. మరియు నాకు ఈ గుర్తింపు లభించడానికి దొహదపడిన వర్ధన్నపేట భరతీయ నాటక కళాసమితికి శ్రీరామగిరి వివేకానంద సంస్కృతిక సమితికి కళలను ఆప్యాయతతో ఆదరించిన శ్రీరామగిరి గ్రామ ప్రజలకు కళాసుమాంజలులు తెలియజేస్తున్నానన్నారు.

వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ..చార్లి చాప్లిన్ " ది కిడ్ "సినిమా ఉచిత ప్రదర్సనలు

 వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ..చార్లి చాప్లిన్ " ది కిడ్ "సినిమా ఉచిత ప్రదర్సనలు ....

మహారాణి పేట, పెన్ పవర్

ప్రముఖ హాలీవుడ్ నటుడు చార్లీ చాప్లిన్ తొలిసారిగా పూర్తి నిడివి గల మూఖి చిత్రం " ది కిడ్ " నిర్మించి దర్శకత్వం వహించి నటించారు.1921 ఫిబ్రవరి లో అమెరికా లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంటే నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది .ఈ చిత్రాన్ని ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని వైజాగ్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు ఆచార్య పి.విశ్వనాథం,  కార్యదర్శి నరవ ప్రకాష్ రావ్  ఎయు హెచ్.ఆర్.డి, సెంటర్ లో తెలిపారు. స్కూల్స్, కాలేజీ యాజమాన్యలు 9032477463 సెల్ లో సంప్రదించాలని  నరవప్రకాష్ రావ్ కార్యదర్శి తెలియజేశారు.

నేషనల్ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులు రాజి చేసుకోవాలి

నేషనల్ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులు రాజి చేసుకోవాలి

పెన్ పవర్, కొవ్వూరు

 వచ్చేనెల 10-04-2021 వ తేదీన జరగబోవు నేషనల్ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులు రాజీ చేసుకోవాలని  కొవ్వూరు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీ ఆర్ శరత్ బాబు గారు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఈరోజు అనగా మార్చి 20వ తేదీన సీఐ ఎస్ఐలు కోర్టు కానిస్టేబుల్స్ ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించి కాంపౌండబుల్  పెండింగ్ కేసుల రాజీ కి మార్గాలను నిర్దేశించారు. ఏప్రిల్ పదవ తేదీన నేషనల్ లోక్ అదాలత్ ను కక్షి దారులు వినియోగించుకోవాలని పెండింగ్ కేసులు రాజి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పోలీస్, ఎక్సైజ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మరియు ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీ కె వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ జి ధర్మారావు, శ్రీమతి కె మాధవి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీమతి కె శారదాంబ పాల్గొన్నారు.

ఊరొచ్చేస్తుంది



ఊరొచ్చేస్తుంది

 

పొదిలి, పెన్ పవర్

 

 

 

ఉన్న ఊరునొదిలి పట్నం బాట పట్టిన ఇద్ధరు రైతులు కరోనా కాలంలో ఎదుర్కొన్న కథనంతో .." ఊరొచ్చేస్తాంది" అనే సామాజిక  ప్రేరణతో కూడిన షార్ట్ ఫిల్మ్ షూటింగ్... పొదిలి పరిసర ప్రాంతాల్లోని పొలాలలో మేదరమెట్ల హైవే పై శని, ఆదివారాలు జరిగింది.. పొదిలి సిఐ శ్రీరాం మొదటి షాట్ కి దర్శకత్వం  వహించి షూటింగ్ ప్రారంభమైనట్లు ప్రకటించారు... లాక్ డౌన్ పరిస్థితులలో రైతుబిడ్డల మరోకోణం ఈ సామాజిక అవగాహన కల్పించే కథ కూర్పు బావుందన్న శ్రీరాం.... తెరపై మరి కొందరిలో మార్పు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరూ మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించగా.... కేవలం రెండు నిముషాలు జరిగిన ఈ ప్రారంభోత్సవంలో   ఎస్ ఐ సురేష్ తదితరులు కూడా పాల్గొని షార్ట్ ఫిల్మ్  టీమ్ ని అభినందించారు..షూటింగ్ సమయంలో తీసుకోవలసిన కరోనా జాగ్రత్తలు సూచించారు.

 సీనియర్ జర్నలిస్టు కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ స్వీయ రచనా, దర్శకత్వం లో ఈ బుల్లిచిత్రం రూపుదిద్దుకుంది.  కరణం శ్యాంశరణ్, కోనూరు నాగరాజు లు మరో రెండు ప్రధాన పాత్రలను పోషించారు. విశ్వనాథ్, శ్రీనివాస్ తదితరులు నటించగా

 సినిమాటోగ్రఫీ  సుమంత్ వ్యవహరించారు

శివుని పాత్ర లో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ





గాజువాకలో మళ్లీ మొదలైన జైమోదకొండమ్మ  చిత్రం.
   శివుని పాత్ర లో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ.
  తాంత్రిక శక్తులు  దైవం మధ్య పోరాటమే చిత్రం.
     

విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


మన్యం  ఇలవేల్పు గిరిజనుల ఆరాధ్య దైవం జై. మోదకొండమ్మ  చిత్రం షూటింగ్  విశాఖ నగరంలో  మళ్ళీ మొదలైంది. మంగళవారం శ్రావణమాసం శుభ సందర్భంగా  గాజువాకలో షూటింగ్ ప్రారంభించారు.   పరమశివుని తపోభంగం చేయటానికి వచ్చిన మాంత్రికుని మధ్య జరిగిన సన్నివేశాన్ని చిత్రీకరించారు. మన్యంలో కొలువైన  కోర్కెలు తీర్చే కల్పవల్లి  ఇతివృత్తం గా  పోలాకి శివ దర్శకత్వంలో జై  మోదకొండమ్మ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ముహూర్తపు షాట్ మాడుగుల మోదకొండమ్మ ఆలయంలో నిర్వహించారు. అనంతరం పాడేరు అరకు  మాదపల్లి  ప్రాంతాల్లో అమ్మవారి కథ సారాంశం పై  సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. తూర్పుగోదావరి పరిసరాల్లో కొన్ని షాట్లు  తీశారు. ఇంతలో కరోనా మహమ్మారి వ్యాపించడం లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ మూత పడిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సడలింపు  తర్వాత ప్రభుత్వ అనుమతితో నిబంధనల మేరకు  సినిమా షూటింగులు మొదలయ్యాయి. జై మోద కొండమ్మ  చిత్రం మిగిలిన సన్నివేశాలను చిత్రీకరణ మళ్ళీ  ప్రారంభమైంది. జై మోదకొండమ్మ చిత్రంలో  శివుని పాత్ర చోడవరం  శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ పోషిస్తున్నారు. తన స్వగృహంలో తపస్సులో  ఉన్న శివునిపై   తపో భంగానికి  వచ్చిన మాంత్రికుడు  పై  ఎదురుదాడి  సన్నివేశం చిత్రీకరించారు. విశాఖ నగరంలో పలు ప్రాంతాల్లో చిత్ర షూటింగ్ జరుగుతున్నట్లు యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి డైలాగ్   శ్రీనివాస్ లవ్ చైతన్య విభూది. ప్రొడ్యూసర్స్ చైతన్య లక్ష్మి పి ఎస్ ప్రసాద్ కో ప్రొడ్యూసర్  కడలి నిర్మల గోవిందా వ్యవహరిస్తున్నారు.

*కరణం కు  నటన అంటే ఎంతో ప్రీతి*
చోడవరం వైయస్సార్సీపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి  నటించడం అంటే ఎంతో ప్రీతి. రాజకీయాలకు ముందు నుంచి తన స్వగ్రామమైన కేజే పురం లో నాటకాల్లో పలు పాత్రలు వేసి ప్రజల మన్ననలు పొందారు.  2004లో తాను మొదటిసారి మాడుగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజధానిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో  ఆయన అన్నమయ్య పాత్రలో లీనమై అయిపోయి సీఎం మన్ననలు పొందారు. ఆ తరువాత ఎప్పుడు కలిసినా రా అన్నమయ్య అని వై ఎస్ సంబోదించేవారు. 2005లో పెద్దేరు జలాశయం ప్రారంభోత్సవానికి వచ్చిన వైయస్ ఎలా ఉన్నావ్ అన్నయ్య అని పలకరించిన తీరు శ్రీ నటన ఎంత ఆకట్టుకుందో మరి. ఆ తరువాత గిరిజనుల దురాచార సంస్కృతి నేపథ్యంలో వచ్చిన దుర్గి చిత్రంలో కొండవలస శ్యామల తో కలిసి నటించారు. జైమోదకొండమ్మ  చిత్రంలో మళ్లీ నటిస్తున్నారు. అతనితో అనుబంధం ఉన్న వారు  చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.
 

 


 




మిస్టర్ లోన్లీ సినిమా  పోస్టర్  ఆవిష్కరించిన ఎంపీ   ఎం వి వి సత్యనారాయణ.


మిస్టర్ లోన్లీ సినిమా  పోస్టర్  ఆవిష్కరించిన ఎంపీ 

             ఎం వి వి సత్యనారాయణ.

 

      విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)

 

  ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ నేతృత్వంలో రూపొందుతున్న మిస్టర్ లోన్లీ చిత్రం పోస్టర్ ను విశాఖ ఎంపీ, సినీ ప్రొడ్యూసర్ ఎం.వి.వి.సత్యనారాయణ వారం ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు.

సినీ ప్రొడ్యూసర్ కాండ్రేగుల ఆదినారాయణ, డైరెక్టర్ ముక్కి హరీష్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో  ఎంపీ  ఎం వి వి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ చిత్రం విజయం సాధించాలని, కథాంశం అందరినీ ఆకట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ యువత నేపథ్యంలో ప్రేమకథ తో సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రజలను కచ్చితంగా ఆకట్టుకుంటుంది అన్నారు.

ఈ చిత్రంలో ఫోటో గ్రఫీ ఆనంద్ గారా, నటీనటులు విక్కీ, , కియారెడ్డి , సోనాలి వర్ధమ్ లోహిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 


విశాఖ డిస్ట్రిక్ట్ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా వంశీ కృష్ణ.




విశాఖ డిస్ట్రిక్ట్ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా వంశీ కృష్ణ.

 

    విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)

 

విశాఖపట్నం జిల్లాకు  రాష్ట్రంలోనే కాకుండా  దేశంలో బ్యాడ్మింటన్ క్రీడలో  సముచితమైన గుర్తింపు తెచ్చేందుకు  కృషిచేస్తానని షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నూతన అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాస్ యాదవ్ ఇలియాస్ వంశీకృష్ణ యాదవ్ అన్నారు.శనివారం అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగాఏకగ్రీవంగా ఎన్నికైన వై ఎస్ ఆర్ సి పి నగర అధ్యక్షుడైన వంశీకృష్ణ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడలో విశాఖపట్నం మెరికల్లాంటి క్రీడాకారులను అందించిందని అదే పంధా కొనసాగించేలా సీనియర్ క్రీడాకారులు క్రీడాభిమానులు అందరిసహకారంతో  మరింతగా పేరు ప్రఖ్యాతులు తెస్తామన్నారు జిల్లా సంఘం నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడు 2011 అమలు చేస్తూ  నూతన  కార్యదర్శిగా పల్లా శ్రీనివాసరావు ని ఏకగ్రీవంగా సభ్యులంతా ఎన్నుకున్నారు వంశీకృష్ణ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడ అభివృద్ధికి  తన శాయశక్తులా కృషి చేస్తానని మేజర్టోర్నమెంట్లు నిర్వహణ క్రీడాకారులకు ప్రోత్సాహం తదితర అంశాలపై దృష్టి పెడతానని అంతేకాకుండా విశాఖపట్నంకు గతంలో ప్రభుత్వం మంజూరు చేసిఅనివార్య కారణాల వల్ల ఆగిపోయిన  బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కూడా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు ఇప్పటివరకు కార్యదర్శిగా వ్యవహరించినచుక్క శ్రీనివాసరావు పదవికి రాజీనామా చేస్తూ పల్లా శ్రీనివాస్ పేరును కార్యదర్శిగా ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పోలీస్ అధికారి అయిన చుక్క శ్రీనివాసరావు తో పాటు మరికొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ స్పోర్ట్స్ కోడ్ నిబంధనలకు అనుగుణంగా తమ రాజీనామాలు సమర్పించారు అధ్యక్షత వహించిన సర్వసభ్య సమావేశంలో చర్చించారు.



పిట్టగెడ్డ రంగురాళ్లు క్వారీలో ఆగని అక్రమ మైనింగ్‌.

 


పిట్టగెడ్డ రంగురాళ్లు క్వారీలో ఆగని అక్రమ మైనింగ్‌.


చోద్యం చూస్తున్న సిబ్బంది


స్టాఫ్‌రిఫోర్టర్‌ విశాఖపట్నం(పెన్‌పవర్‌)


జిల్లాలోని చోడవరం ఫారెస్టు రేంజ్‌ పరిధి లోని పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీలో అక్రమ మైనింగ్‌ జరుగుతుంది. స్మగ్లర్లు రాత్రి వేళ  అక్రమ తవ్వకాు చేసి విలువైన ఎలాక్స్‌ రంగురాళ్లను దోచుకుంటున్నారు. అధికారికంగా అటవీశాఖ సిబ్బంది కాపలా ఉంటున్నారు. అయినా స్మగ్లర్లు అత్తారింటికి వచ్చి  పోతున్నట్లు వ్యవహరిస్తున్నారు. మందిమార్బం సమ కూర్చుకుని కొండను కొల్ల గొడుతున్నారు. ఈ వ్యవహరంలో సిబ్బంది పాత్ర స్పష్టమౌతుంది.



 



ఏళ్ల తరబడి తవ్వకాలు జరుగుతున్న దాడులు నామ మాత్రంగా జరుగుతున్నాయి. ఈ నె లు 10వ తేది రాత్రి జరిగిన అక్రమ మైనింగే ప్రత్యేక  నిదర్శనం. నర్సీపట్నంకు చెందిన స్మగ్లర్లు ఈ  క్వారీలో అక్రమ మైనింగ్‌కు ప్పాడుతున్నారు. రంగురాళ్ల నిక్షేపాలు బండరాళ్ల సందుల్లో ఉండటంవల్ల మెషిన్‌ని ఉపయోగిస్తున్నారు. విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన వ్యక్తితో మైనింగ్‌ చేయిస్తుండగా స్దానికులు హడావిడి చూసి సిబ్బంది కొండ ఎక్కారు. అందరు పారిపోయారని మెషిన్‌ చేతిలో ఉన్న వ్యక్తిని పట్టుకుని రేంజర్‌కు అప్నగించారు, నిందితునిపై కేసు నమోదు చేయకుండా పూచీకత్తుపై విడిచి పెట్టారు. ఆయనకు ఈ ఉదారత ఏంటో మరి. గత నెలలో కూడా తవ్వకాలు చేసినట్లు తెలిసింది. బేస్‌ క్యాంపు మేస్త్రి స్మగ్లర్ల అక్రమ మైనింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నట్లు ఆరోపణలు లేక పోలేదు. పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీలో నాలు గేళ్ళుగా అక్రమ మైనింగ్‌ జరుగుతుంటే శాశ్వత గస్తీ సిబ్డంది పాత్ర తేటత్లెలం అవుతుంది. గతంలో అక్రమ మైనింగ్‌ పై అప్పటి ఇంచార్జీ రేంజర్‌ శ్రీనివాస్‌ డిఎఫ్‌ఓ ధనుంజయ్‌రావుకు లిఖిత పూర్వకంగా ఫిర్యా దు చేసిన విషయం తెలిసిందే. సెక్షన్‌ అధికారి ఎఫ్‌.బిఓను శిక్షణ నిమిత్తం పంపి ంచారు..ఇద్దరు శిక్షణ ముగించుకుని తిరిగి వస్తే ఎప్‌ బిఓను మాత్రం అనంతగిరి బదిలీ చేయడం విడ్డూరం. ఒక భాద్యత గ అధికారి అక్రమ మైనింగ్‌ పై ఫిర్యాదు చేస్తే ఉన్నతాదికార్లు చర్యలు తీసుకోక పోవడంలో ఆంతర్యం ఏమిటో మరి


 


పిట్టగెడ్డ రంగురాళ్లు కు ముగ్దుడైన ఎన్‌.టి.ఆర్‌.ఆ తరువాతే క్వారీకు వేలం.:


పిట్టగెడ్డ క్వారీలో రంగు రాయి చూసి అప్పటి తెలుగుదేశం ముఖ్య మంత్రి నంద మూరి తారక రామారావు మంత్ర ముగ్దుడయ్యారు. 1994లో జిల్లా అంతట రంగు రాళ్ల పోబియా వచ్చింది. ఎక్కడ చూసిన అక్రమ తవ్వకాలు  లక్షల కోట్లలో వ్యాపా రం జరిగింది. ఆ సమయంలో పిట్టగెడ్డలో సేకరించిన ఎలాక్స్‌ రంగు రాయిని అప్ప టి చోడవరం ఎమ్మైల్యే మిలట్రీ నాయుడు(గూనూరు ఎర్రినాయుడు)సిఎం ఎన్‌టిఆర్‌ కు ఇచ్చారు. రంగురాయిని చూసి కలర్‌స్టోన్‌ ఇంత తేజస్సా బ్రదర్‌ అంటు అవాక్కు అయ్యారు. అప్పటి రంగురాళ్ల సనామీని తెలుసుకున్న ఎన్‌.టి.ఆర్‌. రంగురాళ్లుపై అధ్యయన కమిటీని నియమించారు. హౌస్‌ కమిటీ నివేదిక ఆధారంగా జిల్లాలో చింతపాక, పెదమదిన, పప్పుశెట్టి, సెరి సకపల్లి, కరక, గున్నెం పూడి, ఏడు రంగురాళ్ల క్వారీకు  వేలం నిర్వహించారు. పిట్టగెడ్డ క్వారీ మాత్రం రిజర్వు ఫారెస్టు లో ఉండటం వల్ల వేలం నిర్వహించలేదు.అన్ని క్వారీ కంటే పిట్టగెడ్డలో రంగు రాళ్లు అత్యంత విలువైనవి. ఈ రంగురాళ్ల ఎలాక్స్‌ జాతికి చెందడం వల్ల మార్కెట్‌  లో మంచి  గిరాకీ ఉంది. దీంతో స్మగ్లర్ల కన్ను పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీపై పడింది. నాటినుంచి పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీని స్మగ్లర్లు దోచుకుంటున్నారు. నాడు రాష్ట్రాన్ని కుదిపేసిన పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీకు రక్షణ కరువైంది. అటవీశాఖ పరిదిలో అత్యంత విలువైన ఎలాక్స్‌ రంగురాళ్ల నిక్షేపాలున్న క్వారీ కొందరు శాఖ సిబ్బంది స్వార్ధం వల్ల నిరాదరణకు గురౌతుంది. స్మగ్గర్లు పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తుంటే అలాంటి తవ్వకాలు  ఏమీ లేవని ఉన్నతాధికార్లకు సంకేతాలు పంపడం విశేషం. ఎంతో ప్రాముఖ్యత సంతరిం చుకున్న పిట్టగెడ్డ క్వారీపై ఉన్నతాదికార్లు దృష్టి సారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తా యి.        


జిల్లా అటవీ శాఖ అధికారి వివరణ.: పిట్టగెడ్డ రంగురాళ్ల క్వారీలో జరుగుతన్న అక్రమ మైనింగ్‌ విషయం డిఎఫ్‌ఓ  సెల్వం దృష్టికి “పెన్ పవర్” తీసుకు పోగా విచారణ జరిపి  చర్యలు చేపడతామని తెలిపారు


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...