Followers

Showing posts with label FILM. Show all posts
Showing posts with label FILM. Show all posts

సినీ నిర్మాత గేయరచయిత తైదల బాపు రేపు పుట్టినరోజు

 సినీ నిర్మాత గేయరచయిత తైదల బాపు రేపు పుట్టినరోజు పురస్కరించుకొని 

కోవిడ్ పరీక్షకు వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చేవారికి  పండ్లు మంచినీరు అందిస్తున్నారు


తాండూర్, పెన్ పవర్

అభినవ స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నేటి నుండి ప్రభుత్వ దవాఖానలో కోవిడ్ పరీక్షల నిమిత్తం వచ్చేవారికి , వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చేవారికి  పండ్లు మరియు మంచినీరు అందించారు , అలాగే  కరోన మహమ్మారి బారిన పడి వంటచేసుకోలేని స్థితిలో ఉన్న.  పాజిటివ్ వచ్చిన ముగ్గురి  కుటుంబాలకు భోజనాలు , బ్రెడ్ , జామ్ ,పండ్లు ఇవ్వడం జరిగింది.  ఈరోజు మొదటి రోజు ప్రముఖ సినీ గేయ రచయిత , నిర్మాత తైదల బాపు జన్మదినం  జన్మదినం రేపు ఆదివారం సందర్భంగా ఈ కార్యక్రమలు ప్రారంభించినట్లు అభినవ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తైదల బాపు సోదరులు శ్రీనివాస్ , మల్లేష్ , సేవాసంస్థ సభ్యులు పోట్లపల్లి రాజ్ కిరణ్ , లక్ష్మణ్ , నరేష్ , హరీష్ , హస్పెటల్ సిబ్బంది పద్మ ,  నవిత , నరేష్ , హకీమ్ , లక్ష్మమ్మ ,ఆరోగ్యమిత్ర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

సినీ రంగంలో దూసుకెళ్తున్న తైదల బాపు

 సినీ రంగంలో దూసుకెళ్తున్న తైదల బాపు

400 పైగా పాటల రచన

సినీ ప్రముఖులచే ప్రశంసలు

బెల్లంపల్లి , పెన్ పవర్

సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే ఎంత కష్టమో అది అందరికీ తెలుసు.అలాంటి రంగంలో తనకంటూ ముద్ర వేసుకున్నారు.మంచిర్యాల జిల్లాలోని తాండూరు లోని మాదారంకు చెందిన వెంకటి-సత్తెమ్మ కుమారుడు తైదల బాపు.చిన్ననాటి నుండే అలవాటైన పాటలను తన భవిష్యత్తుకు పునాదిగా వేసుకున్నాడు.ఉన్నత విద్యాబ్యాసం కోసం హైదరాబాద్ కు వెళ్లగా ,అక్కడే చిన్నచిన్న పాటలు వ్రాస్తూ తైదల బాపు కొన్ని సంవత్సరాలలో సుమారు 400 వందలకు పైగా పాటలను రచించాడంటే అతి శయోక్తి కాదు. అందులో గర్ల్ ఫ్రెండ్,పటాస్,శ్రీరామచంద్రులు,ప్రేమలో పావని కళ్యాణ్ లాంటి సినిమాలలో వ్రాసిన పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. అంచెలంచెలుగా ఎదుగుతున్న బాపును సినీ రచయితల సంఘం సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ఘనంగా సన్మానించారు.సినీ ప్రముఖులు చిరంజీవి,ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్,మోహన్ బాబు,పరుచూరి బ్రదర్స్, లాంటి వారు ఎందరో బాపు ను అభినందించారు.ఓ వైపు పాటలను రచిస్తూనే,నిర్మాత గా అడుగుపెట్టాడు.ఇటీవల తను పుట్టిన ప్రాంతంలో సినిమా తీయాలనే ఉద్దేశంతో హీరో సంపూర్ణేష్ బాబు,ఆమని, కవిత,షియాజి షిండే,లాంటి వారితో బెల్లంపల్లి లో సినిమా షూటింగ్ ను ప్రారభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,రామగుండం సీపీ సత్యనారాయణ లు పాల్గొని,పుట్టిన ఊరిలో సినిమా తీయడం నిజంగా అభినందనీయం అన్నారు.తైదల బాపు ముందునుంచి జానపద పాటలంటే ఎంతో ఇష్టాంగా వ్రాస్తూ వుండే వాడు. గర్ల్ ఫ్రెండ్ చిత్రం తర్వాత తన బాణీని మార్చి ఇటు క్లాస్ కు, అటు మాస్ కు తనదయిన శైలిలో పాటలను వ్రాస్తూ ముందుకెళ్తున్నారు. తన జీవితంలో ఈ స్థాయికి రావడానికి తన మిత్రులు ఎంతో సహాయం చేసారని. మొదట్లో హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యేవి, వాటిని భరిస్తూ ముందుకు వెళ్లానని అన్నారు.ఇదే నా మొదటి ప్రేమలేఖ సినిమాకు బాపు వ్రాసిన చెలియా నువ్వే నాయెదలో దాగింది అనే పాట విని సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రత్యేకంగా ప్రశంసించారని బాపు చెపుతుంటారు. దాదాపు 260 చిత్రాలలో 430 పాటలు వ్రాశానని. కెరీర్ పరంగా మాత్రం పటాస్ సినిమా నన్ను మరో స్థాయికి చేర్చిందని అన్నారు. అందులో వ్రాసిన టప్పు టపప్పోమ్ పోరి అనే పాటకు మంచి గుర్తింపు తెచ్చిందని అన్నారు . మంచిర్యాల జిల్లావాసి సినీరంగంలో పాటల మాంత్రికుడిగా దూసుకెళ్తున్నందుకు జిల్లా ప్రజలు బాపు పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేక శుభాకాంక్షలు  తెలుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకోవాలని మృత్యంజయహోమం

 పవన్ కళ్యాణ్ కరోనా నుంచి కోలుకోవాలని   మృత్యంజయహోమం 

విజయనగరం, పెన్ పవర్

 జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు ప్రజలంతా కరోనా నుంచి సుభిక్షంగా కోలుకోవాలని  జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణరావు(బాలు) 42వ డివిజన్ కామాక్షి నగర్ లో ఉన్న  శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో మృత్యం జయహోమాన్ని నిర్వహించారు. ముందుగా రుద్రాభిషేకం ను త్యాడ రామకృష్ణరావు(బాలు)దంపతులచే చేసిన అనంతరం మృత్యంజయహోమాన్ని  నిర్వహించారు. ఈసందర్భంగా బాలు మాట్లాడుతూ మా ఆరాధ్యదైవం పవన్ కళ్యాణ్ ప్రజల యోగక్షేమాలు కోరుకునే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన జననేత అని, అందుకే పవన్ కళ్యాణ్ మరియు ప్రజలందరూ యోగక్షేమాలతో ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఈసందర్భంగా హాజరైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ మహమ్మారి కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అందరూ మాస్కులు తప్పనిసరిగా వాడాలని,అందరూ వేడినీరు తాగి,వ్యాధినిరోధక శక్తినిపెంచే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో జనసేనపార్టీ ఝాన్సీ వీరమహిళ త్యాడ కనకమహాలక్ష్మి, దంతులూరి రమేష్ రాజు, పిడుగు సతీష్,కొయ్యాన లక్ష్మణ్ యాదవ్,లోపింటి కళ్యాణ్, బూర్లీ వాసు,చందు పాల్గొన్నారు.

జనసేనాని కోలుకోవాలి దేవుడా..

 జనసేనాని కోలుకోవాలి దేవుడా..

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు ఉమాసహిత కైలాసనాధ ఆలయంలోని శివునికి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న తరుణంలో ఆయన కరోనాని జయించి పూర్తి ఆరోగ్యముతో ప్రజాసేవలో పాల్గొనాలని శివున్ని ప్రార్ధించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కడ్రక. మల్లేష్, కొనిస.రాజా,అధికారి.అనీల్,ధర్మ, విజయ్ పాల్గొన్నారు.

16 న చార్లి చాప్లిన్ 132 వ జయంతి...వైజాగ్ ఫిల్మ్ సొసైటీ

 16 న చార్లి చాప్లిన్ 132 వ జయంతి...వైజాగ్ ఫిల్మ్ సొసైటీ

మహారాణి పేట, పెన్ పవర్

ఈ నెల 16 న ప్రపంచ ప్రముఖ హాస్య నటుడు దివంగత చార్లి చాప్లిన్ 132 వ జయంతిని నిర్వహించాలని వైజాగ్ ఫిల్మ్ సొసైటీ  అధ్యక్షులు ఆచార్య ఎన్.ఎ.డి పాల్ మరియు కార్యదర్శి నరవ ప్రకాశరావు ఏ. యు. హెచ్.ఆర్.డి. సెంటర్ లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ప్రపంచ సినీ జగత్తులో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న చాప్లిన్ జీవితం నేటి తరానికి ఆదర్శం కాగలదని నమ్మకం తో వైజాగ్ ఫిల్మ్ సొసైటీ గత 10 ఏళ్ల గ చాప్లిన్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమం లో చాప్లిన్ మొదటిసారిగా పూర్తి నిడివి గల మూఖి చిత్రం ధి కిడ్ ప్రదర్సిస్తారు. ఈచిత్రము విడుదలయి నేటికీ 100 సంవత్సరాలు పూర్తి ఐయ్యింది .ఈ ఉత్సవం 16 న (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు  ఏ.యు. హెచ్.ఆర్.డి లో జరుగుతుంది ఏయు విసి మరియు ఆచార్య ఎన్.ఎ.డి.పాల్,నటుడు ఏస్.కె.మిశ్రో, తదితరులు పాల్గొంటారు.  ప్రవేసము ఉచితము. వివరాలకు నరవ ప్రకాశరావు 9032477463 సంప్రదించగలరు.

రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు ప్తె హర్షం వ్యక్తం చేసిన...వైజాగ్ ఫిల్మ్ సొసైటీ

 రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు ప్తె హర్షం వ్యక్తం చేసిన...వైజాగ్ ఫిల్మ్ సొసైటీ

మహారాణి పేట, పెన్ పవర్

భారత దేశ చిత్ర ప్రపంచములో ప్రతిస్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కె అవార్డుకు తమిలుడు అయినా, తెలుగు వారికి కూడా అభిమాన నటుడు అయిన 71 ఏల్ల వయసు గల రజనీకాంత్ ఎంపిక అవ్వడం పట్ల వైజాగ్ ఫిల్మ్ సొసైటీ హార్షాన్ని  వ్యక్తం చేశారు. ఈ అవార్డుకు రజని పుర్తి అర్హుడు అని రజని సినిమా ఎలా ఉన్న రజని కనబడితే చాలు అని సినీ ప్రియులు బావిస్తారు అని నరవప్రకాసరావు  కార్యదర్శి తెలిపారు.

వైజాగ్ ఫిల్మ్ సొసైటీ గౌరవ అద్యక్షునిగా ఎన్.ఏ.డి.పాల్

 వైజాగ్ ఫిల్మ్ సొసైటీ గౌరవ అద్యక్షునిగా ఎన్.ఏ.డి.పాల్ 

మహారాణి పేట, పెన్ పవర్

ఇటీవల ఏ.యు హెచ్.ఆర్.డి. సెంటర్ సంచాలకులు గా నియమితులైన అచార్య పాల్  వైజాగ్ ఫిల్మ్ సొసైటీ( వి.ఎఫ్.ఏస్) గౌరవ అధ్యక్షులుగా నియమితులయ్యరు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఏ.యు, హెచ్.ఆర్.డి సెంటర్ లో కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేసి వైజాగ్ ఫిల్మ్ సొసైటీ సభ్యులు పాల్ ను కలసి అబినందనలు తెలిపారు. పాల్ మాట్లాడుతూ  సొసైటీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. సొసైటీ ద్వారా మంచి సినిమాలు ప్రదర్శించడంతో పాటు చిత్ర పరిశ్రమ ప్రగతికి సమంతర సినిమాలు నిర్మాణాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఎయు విసి  ప్రధాన పొషకులుగా  వ్యవహరిస్తున్నరు. పాల్ ను కలిసిని వారిలో నరవ ప్రకాశరావు, పివి.రమణ,జి.సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.

వైల్డ్ డాగ్ చిత్రం విజయోత్సవ వేడుకలు

వైల్డ్ డాగ్ చిత్రం విజయోత్సవ వేడుకలు

అనకాపల్లి,పెన్ పవర్

నేడు అనకాపల్లి పట్టణంలో షిరిడి సాయి పర్తిసాయి థియేటర్లో కింగ్ అక్కినేని నాగార్జున గారు నటించిన వైల్డ్ డాగ్ చిత్రం అద్భుత విజయం సాధించిన సందర్భంగా  ఉత్తరాంధ్ర కింగ్ నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షుడు మళ్ళ సురేంద్ర ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.ముందుగా కేక్ కట్ చేసి  ఏ పాత్ర అయినా సరే న్యాయం చేయగల వ్యక్తి అక్కినేని నాగార్జున గారు అని ఇంత వయసులో కూడా ఒక (పోలీస్) నేషనల్ ఇన్విటేషన్ ఏజెంట్ అధికారిగా నాగార్జున గారి అద్భుతమైన పాత్రలో నటించి దేశపతి నేపథ్యంలో సాగిన చిత్రం ప్రజల దోచుకున్నారు అని తెలియజేశారు.

ఈ సందర్భంగా థియేటర్ లో ఉన్న ప్రేక్షకులకు అందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో  అక్కినేని అభిమానులు సిహెచ్ అవతార్ (అవ్వ), గోల్డ్ వాసు, యల్లపు శ్రీనివాస్, జొన్నాడ సురేష్, నీలకంఠం, మనో శీను, ఎస్, భాను చందర్ అఖి, దీపు, చందు, బండి రాజా, రాంబిల్లి బాలాజీ, రాంబిల్లి మురళి, నీలగిరి శీను,  చంటి తేజ,ఆది, రవి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

డబ్బు – ప్రేమ ఏది గొప్పది

 డబ్బు – ప్రేమ ఏది గొప్పది

కమృనిషా  ప్రొడక్షన్స్  బేనర్  పై  లఘు చిత్రం...

విశాఖ, పెన్ పవర్ 

 విజయనగరం  కు  చెందిన  ఒక షార్ట్  ఫిల్మ్  మేకర్స్  బృందం   “ కమృనిషా  ప్రొడక్షన్స్ “ బేనర్  పై  “ హార్ట్ బీట్  “  ( రెండు హృదయాల కధ )  అనే లఘు  చిత్రాన్ని   నిర్మాణం చేస్తున్నారు. ప్రపంచంలో  రెండక్షరాల పదాలైన డబ్బు – ప్రేమ అనే అంశాలలో ఏది ముఖ్యం అనే అంశం  పైనే  కథ అంతా నడుస్తుందని. యువతరానికి ఆయా అంశాలపై ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యం తో  ఈ చిత్రాన్ని తీస్తున్నామని ఇది పూర్తిగా ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే ప్రేమ కధా చిత్రమని ,  విజయనగరం , వైజాగ్ , అరుకు  ప్రాంతాలలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నమని  , ఇందులో హీరో గా అబ్దుల్ రెహమాన్ , హీరోయిన్ గా  ఇన్స్టాగ్రాం  హారిక తేజు , సహా నటులుగా ఇప్పిలి , కావ్య , సతీష్  లు నటిస్తున్నారని , కెమెరామెన్ గా వెంకి , సహా దర్శకులు గా  గంటా మహేష్ , నాగార్జున  లు వ్యహరిస్తున్నారని    చిత్ర దర్శకుడు జవ్వాది రాజు తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...